voter id card
-
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్‌తో
పోలింగ్ బూత్ ఎక్కడో తెలియడం లేదా? మన ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో మొబైల్ నంబర్ సాయంతో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న లోక్‌సభకు పోలింగ్ జరగనుండటం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఓటర్ ఐడీ కార్డు సాయంతో సులువుగా తెలుసుకోవచ్చు. ఓటరు ఐడీలో ఇంగిŠల్ష్ అక్షరాలు, 10 అంకెలతో కూడిన ఎపిక్ ఐడీ పోలింగ్ బూత్‌ను గుర్తించడానికి కీలకమవుతుంది. ఏ కారణంతోనైనా కార్డు అందుబాటులో లేని వారు ఆన్లైన్లోనే ఎపిక్ నంబర్ గురించి తెలుసుకోవచ్చు. ఇలా చేస్తే సరి ఎపిక్ నంబర్ కోసం ఈసీ పోర్టల్ (voters. eci.gov.in)ను సందర్శించాలి. అందులో కుడివైపు కనిపించే సర్వీసెస్ విభాగంలో ‘ఈ–ఎపిక్ డౌన్లోడ్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత వచ్చే పేజీలో సైనప్ను ఎంపిక చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి, కంటిన్యూ చేయాలి. తర్వాత పేరు నమోదు చేసి, పాస్వర్డ్ ఎంపిక చేసుకోవాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంపిక చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పటికే ఖాతా ఉన్న వారు సైనప్ చేయనవసరం లేదు. మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఖాతాలోకి లాగిన్ అవడం ద్వారా ఈ–ఎపిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఎపిక్ నంబర్ తెలిసిపోతుంది. తర్వాత సైట్ హోం పేజీలో కుడివైపున ఉన్న ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ ఎంపిక చేసుకోవాలి. వచ్చే ప్రత్యేక పేజీలో ఎపిక్ నంబర్ నమోదు చేయాలి. రాష్ట్రం ఎంపిక చేసుకుని క్యాప్చా కోడ్ నమోదు చేసి సెర్చ్ బటన్ ఓకే చేయాలి. మీ పోలింగ్ బూత్‌తో పాటు పోలింగ్ స్టేషన్ ఆఫీసర్ తదితర వివరాలు కూడా లభిస్తాయి. ఇదే పోర్టల్ నుంచి ఫిర్యాదులు సైతం దాఖలు చేయవచ్చు. ఎపిక్ నంబర్ ఉన్న వారు నేరుగా సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఆప్షన్‌కు వెళ్లవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నో వయెలెన్స్.. నో రీపోలింగ్
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో జీరో వయెలెన్స్, నో రీపోల్ ప్రధాన మంత్రాలు కావాలని.. అందుకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఎన్నికల సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం సూచించిన ఈ రెండు మంత్రాల అమల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని, బూత్ క్యాప్చరింగ్‌కు ఎటువంటి అవకాశం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసుకోవాలని సూచించారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కంట్రోల్ రూముల ద్వారా నిరంతర పర్యవేక్షణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ముఖ్యమైన ఆదేశాలు, రాజకీయ పార్టీల అనధికార ప్రకటనలు, 50% పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియ వెబ్ కాస్టింగ్, ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, రోజూ వారీ పంపాల్సిన నివేదికలు తదితర అంశాలను జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లకు ఆయన వివరించారు. గుర్తింపు కార్డుల జారీని వేగిరపర్చండి ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని మీనా ఆదేశించారు. ఓటర్ల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పోస్టల్ ద్వారానే బటా్వడా చేయాలని, ఒక్క పాడేరు ప్రాంతం మినహా మరే ఇతర ప్రాంతాల్లో మాన్యువల్‌గా పంపిణీ చేయడానికి వీలు లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. పెండింగ్ ఫారాలను సకాలంలో పరిష్కరించాలని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తదుపరి ఫారాల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతంగా అమలు పర్చాలని ఆదేశించారు. ఓటర్లను ఆకర్షించేందుకు నగదు, బహుమతులను విరివిగా పంపిణీ చేస్తున్నట్టు వార్తా పత్రికల్లో కథనాలతో పాటు ఫిర్యాదులు కూడా వస్తున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపిన సంబంధిత నివేదికలను తమకు వెంటనే పంపించాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ చేస్తున్న ఏర్పాట్లను అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎస్బీ బాగ్చీ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలుతోపాటు ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తదుపరి అమలుచేయనున్న బందోబస్తు కార్యాచరణ ప్రణాళికను ఆయన వివరించారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతోపాటు అదనపు సీఈవో ఎంఎన్ హరేందిర ప్రసాద్, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, ఎస్.మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఈసీపై పిటిషన్ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ఓటరు గుర్తింపు కార్డు అప్డేట్, కొత్త ఓటరు నమోదు దరఖాస్తుల్లో ఆధార్ సంఖ్యను జత చేయడానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పష్టమైన మార్పులను చేపట్టనందుకు ఎన్నికల సంఘం అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ వేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారించింది. ఈ విషయంలో ఈసీకి మేం డెడ్లైనేదీ పెట్టలేదని పేర్కొంది. -
రాష్ట్రపతికి కొత్త ఓటరు కార్డు
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త ఓటరు కార్డు అందుకున్నారు. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి.కృష్ణమూర్తి స్వయంగా మంగళవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్‌కు వచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కొత్త ఓటరు కార్డు అందజేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి పి.కృష్ణమూర్తి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త ఓటరు కార్డు అందుకున్నట్లు పేర్కొంది. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము గత ఏడాది జులై 25న భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆమె తన ఓటు హక్కును ఒడిశా నుంచి ఢిల్లీకి మార్చుకున్నారు. ఇందు కోసం ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి కృష్ణమూర్తి నవంబర్ 10న రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి సహకారాన్ని అందించినట్లు అధికారులు తెలిపారు. President Droupadi Murmu received her Voter ID card from Shri P. Krishnamurthy, Chief Electoral Officer of Delhi, at Rashtrapati Bhavan. pic.twitter.com/yE2tTXhzq4 — President of India (@rashtrapatibhvn) November 28, 2023 -
ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానంపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: ఎన్నికల గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోయినా ఓటర్ల జాబితాలో వారి పేరు కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అనుసంధానం పూర్తిగా ఐచ్ఛికమని పేర్కొంది. శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు బదులుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఈ మేరకు బదులిచ్చారు. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం యోచన లేదు దేశంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించాలన్న ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో లేదని మరొక ప్రశ్నకు బదులుగా రిజిజు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు -
సెక్స్ వర్కర్ల ఓటర్ ఐడీలపై నివేదికివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జీహెచ్ఎంసీతోపాటు అన్ని జిల్లాల్లో ఉన్న సెక్స్ వర్కర్లను ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు వారికి ఓటర్ ఐడీ కార్డులెన్ని ఇచ్చారన్న దానిపై నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలు, నియోజక వర్గాల వారీగా సెక్స్ వర్కర్ల నమోదు, వారికి ఓటరు కార్డుల పంపిణీపై వీలున్నంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. పీపుల్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేయండి: సీఎస్ సాక్షి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఇదే విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ పలు శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు బీఆర్కే భవన్లో ఆయన రెవెన్యూ, పౌరసరఫరాలు, రవాణా, విద్యుత్, గృహ నిర్మాణం, మున్సిపల్, కార్మిక తదితర 12 విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా స్టేక్హోల్డర్లతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించాలని సీఎస్ సూచించారు. ఈ 12 శాఖల్లోని 20 విభాగాల పరిధిలో 301 సంస్కరణలు అమలవుతున్నాయని, వీటిని మరింత సరళీకృతం చేసి యూజర్, పీపుల్స్ ఫ్రెండ్లీ విధానాలను అమల్లోకి తేవాలన్నారు. చదవండి: కూతురు ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య -
ఓటర్ ఐడీతో ఆధార్ లింక్
న్యూఢిల్లీ: దేశ ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. బోగస్ ఓట్లను తొలగించడం కోసం ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో స్వచ్ఛందంగా లింకు చేయడం, ఏడాదికి నాలుగుమార్లు కొత్త ఓటర్లకు ఓటు నమోదు అవకాశం ఇవ్వడంతో పాటు సర్వీసు ఓటర్లకు సంబంధించిన సంస్కరణలు ఈ బిల్లులో ఉన్నాయి. ఎన్నికల సంఘం చాలాకాలంగా ఈ సంస్కరణలను ప్రతిపాదిస్తూ వస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాన్‌తో ఆధార్ కార్డును లింకు చేసినట్లే ఓటర్ కార్డును కూడా ఆధార్‌తో లింక్ చేయాలని ఈసీ ప్రతిపాదించిందని గత మార్చిలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ లోక్‌సభకు చెప్పారు. ఓటర్లు అనేక ప్రాంతాల్లో ఎన్రోల్ చేయించుకోవడాన్ని నిరోధించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందన్నారు. ఇందుకోసం ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. గతంలో ఈసీ ఆధార్ నెంబర్ల సేకరణ ఆరంభించగా 2015లో సుప్రీంకోర్టు అడ్డుపడింది. చట్ట సవరణ లేకుండా ఆధార్ నెంబర్లను ఈసీ స్వీకరించకూడదని తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఓటును స్వచ్ఛందంగా ఆధార్‌తో లింక్ చేసుకునే సవరణను ప్రభుత్వం ఈ బిల్లులో తీసుకువచ్చింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు ఏ ప్రాంగణానైన్నా ఈసీ తాత్కాలికంగా స్వాధీనం చేసుకునే వీలు కల్పించే అంశాన్ని కూడా బిల్లులో పొందుపరిచారు. కొత్త కటాఫ్ డేట్లు ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేయించుకునేవారికి ఏటా నాలుగుమార్లు అవకాశం కల్పించే ప్రతిపాదనను కేంద్రం కొత్త బిల్లులో చేర్చింది. ఇంతవరకు ఒక సంవత్సరం జరిగే ఎన్నికకు ఆ ఏడాది జనవరి 1కి 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే కొత్త ఓటరు నమోదు అవకాశం ఇస్తున్నారు. అంటే జనవరి 2 తర్వాత 18 ఏళ్లు నిండిన యువత వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఓటర్‌గా నమోదు చేయించుకునే వీలుండేది కాదు. దీనివల్ల యువతలో చాలామందికి కొత్తగా ఓటర్ అయ్యే అవకాశం ఏడాది కాలం పాటు మిస్సవుతోందని ఎన్నికల సంఘం కేంద్రం దృష్టికి తెచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రాతినిధ్య చట్టం 14–బి నిబంధనకు సవరణ తెస్తూ నాలుగు కటాఫ్ డేట్ల(జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) సంస్కరణను బిల్లులో పొందుపరిచారు. అంటే ఈ డేట్లకు 18 ఏళ్లు నిండినవారు కొత్తగా ఓటర్ల జాబితాలోకెక్కవచ్చు. అలాగే ఇంతవరకు సర్వీసు ఓటర్లకు(సైన్యంలో పనిచేసేవారు) ఇబ్బందిగా మారిన ఒక అంశాన్ని సవరిస్తూ బిల్లులో సవరణను ప్రతిపాదించారు. ఇప్పటివరకు సర్వీసులో ఉన్న పురుషుడి భార్య సర్వీసు ఓటరుగా నమోదు చేసుకొనే వీలుంది. కానీ సైన్యంలోని మహిళ భర్తను సర్వీసు ఓటరు గుర్తించేవారు కాదు. ఇకపై వీరికి కూడా సర్వీసు ఓటరు గుర్తింపు కల్పించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఇందుకోసం భార్య అనే కాలమ్‌ను తొలగించి జీవిత భాగస్వామి(స్పౌజ్) అనే కాలమ్‌ను పొందుపరచాలని నిర్ణయించారు. ప్రధాన్‌మంత్రి కృషి సంచాయి యోజన గడువు పొడిగింపు ప్రధాన్‌మంత్రి కృషి సంచాయి యోజన పథకాన్ని 2026దాకా పొడిగిస్తూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు జాతీయ ప్రాజెక్టులయిన హిమాచల్ ప్రదేశ్‌లోని రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్ట్, ఉత్తరాఖండ్‌లోని లఖ్వర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌లకు 90 శాతం నిధులు మంజూరు చేసేందుకు మార్గం సుగమమైంది. దీంతో 22 లక్షల మంది రైతుల సాగు నీటి కష్టాలు తీరనున్నాయి. దీంతోపాటే యమున నది బేసిన్లో నీటి నిల్వ సాధ్యమవుతుంది. యమునా ఎగువ బేసిన్‌లోని ఆరు రాష్ట్రాలకు లబ్ధిచేకూరనుంది. హిమాచల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా ఢిల్లీకి నీటి సరఫరా బాగా మెరుగుపడుతుంది. యమునా నది పునరుజ్జీవనానికి ఇది ముందడుగు అని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. -
డిజిటల్ ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!
న్యూఢిల్లీ: మీకు ఓటు హక్కు ఉందా? ఓటు వేస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. మీరు మీ ఓటర్ కార్డును ఆన్లైన్లోనే సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల సంఘం కొత్తగా ఈ-ఎపిక్(ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్) సౌకర్యాన్ని ఓటర్లకు కల్పించింది. భారతదేశంలోని రాబోయే ఐదు రాష్ట్ర ఎన్నికల కోసం ఓటర్లు ఈ కొత్త డిజిటల్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ-ఎపిక్ కార్డును మీ మొబైల్ లేదా కంప్యూటర్ లో సురక్షితంగా పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: భారతీయ రైల్వే సరికొత్త రికార్డు!) కొత్త ఓటర్ కార్డు కోసం 2020 నవంబర్-డిసెంబర్ సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు 2021 జనవరి 25 నుంచి 31 మధ్య ఈ-ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర సాధారణ ఓటర్లు 2021 ఫిబ్రవరి 1 నుంచి ఈ-ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డిజిటల్ ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఓటరు పోర్టల్: http://voterportal.eci.gov.in/ లేదా https://www.nvsp.in/ అనే వెబ్‌సైట్‌కు వెళ్లి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మీకు కింది వైపు నుంచి రెండో లైన్లో కనిపించే లింకుపై క్లిక్ చేసి మీరు ఈ-ఎపిక్ ను పొందొచ్చు. మొబైల్ నెంబర్ మాత్రం కచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి. లేదంటే ఇకేవైసీపై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి. అలాగే ఓటర్ కార్డులో తప్పులు ఉన్నా, రిప్లేస్మెంట్ పొందాలన్నా మీరు మీ పూని పూర్తి చేసుకోవచ్చు. -
కుక్క ఫోటోతో ఓటరు గుర్తింపు కార్డు
ముర్షిదాబాద్ : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఓ వ్యక్తి ఓటర్ గుర్తింపు కారర్డులో వ్యక్తి ఫోటోకి బదులు కుక్క బొమ్మతో కార్డు జారీ చేయడం కలకలం రేపింది. ముర్షిదాబాద్‌కు చెందిన సునీల్ కర్మాకర్ పుట్టిన తేదీలో తప్పు దొర్లగా దాన్ని సరిదిద్దాలని జనవరి 8న దరఖాస్తు చేసుకున్నాడు. ఈసీ జారీ చేసిన గుర్తింపు కార్డులో తన ఫోటోకు బదులు కుక్కను ముద్రించడంపై సునీల్ కర్మాకర్ మండిపడుతున్నారు. మనిషినైన తన స్ధానంలో ఈసీ ఓ జంతువు ఫోటోను ప్రచురించడం తనను అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఓటరు కార్డును బుధవారం తనకు అందించగా తన ఫోటో స్ధానంలో కుక్క బొమ్మ ఉండటాన్ని గుర్తించానని, ఈ విషయం సదరు అధికారి గుర్తించలేదని, ఇది తన గౌరవంతో చెలగాటమాడటమేనని కర్మాకర్ వాపోయారు. తాను బీడీఓ కార్యాలయానికి వెళ్లి మరోసారి ఇలా జరగకూడదని అధికారులను కోరానని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇది పొరపాటుగా జరిగిందని ఫరక్కా బీడీఓ రాజర్షి చక్రవర్తి అంగీకరించారు. కర్మాకర్‌కు సరైన ఫోటోతో నూతన ఓటరు కార్డును త్వరలో జారీ చేస్తామని చెప్పారు. చదవండి : బ్యాలెట్‌కు వెళ్లే ప్రసక్తే లేదు: సీఈసీ -
తప్పులను సరిచేసుకోండి
మాదాపూర్: ఓటరు ఐడీ కార్డులపై ప్రతి ఒక్క రూ అవగాహన పెంపొందించుకోవాలని, పాస్‌పోర్ట్‌ల కోసం ఎలా ఆసక్తి చూపుతారో అదే విధ ంగా ఓటర్ ఐడీల కోసం కూడా ఆసక్తి చూపాలని తెలంగాణ సీఈఓ రజత్‌కుమార్, వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన అన్నారు. మాదాపూర్ లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఓటర్ ఐడీల వెరిఫికేషన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ ఐడీలో ఉన్న తప్పు ఒప్పులను ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలని, ఆన్లైన్లో తప్పు ఉన్నా పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, చిరునామాల్లో తప్పులు గుర్తిస్తే వెంటనే సరిదిద్దుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు డేటాను సరి చేసుకోవడం వల్ల ఎన్నికల సమయంలో సరైన డేటా అందుబాటులో ఉండడం వల్ల ఏలాంటి ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరం లేదన్నా రు. డోర్ టూ డోర్ వెరిఫికేషన్ సమయంలో ఇం టి యాజమానులు లేనప్పుడు ఇరుగు పొరుగు చెప్పే సమాధానాలు తప్పుగా ఉండడంతో తప్పుడు సమాచారం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కాలనీలు, గ్రామాల్లో ఓటర్ ఐడీల పై పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు. రెండు కిలో మీటర్ల దూరంలో పోలింగ్ బూత్ ఉండేలా చూసుకోవాలన్నారు. సంక్షేమ సంఘా లు, స్వచ్ఛంద సంస్థలు తమవంతు బాధ్యతగా సహకరించాలన్నారు. 1 జనవరి 2001 లోపు పుట్టినట్లయితే ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చన్నారు. www.nvrp.in లేదా నా ఓట్ యాప్‌లో చూసుకోవచ్చన్నారు. తెలుగులో కూడా వెబ్సైట్ అందుబాటులో ఉందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చునని, జాబితాలో పేరు లేకుంటే, పేరు పరిశీలించుటకు, వివరాలను సరి చేసుకోవడానికి www.nvrp.in పాస్ పోర్ట్‌లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లే దా ధృవీకరణ పత్రాలను ఆప్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 1950 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అనంతరం సంక్షేమ సంఘాలు, డ్వాక్రా సంఘాలు, సీనియర్ సిటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కార్యక్రమంలో తెలంగాణ జాయింట్ సీఈఓ రవికిరణ్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ భరణి, శ్రీనివాసులు, డిప్యూటీ కమిషనర్లు రమేష్, వెంకన్న, యాదగిరిరావు, బాలయ్య, లెట్స్ ఓటు ఆర్గనైజేషన్ నిర్వాహకులు సుబ్బ రంగయ్య, మహిళా సంఘాలు, వెల్ఫేర్ అసోసియేషన్లు, డ్వాక్రా మహిళలు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. -
ఓటరు గుర్తింపు కార్డు కాదు పెళ్లి పత్రిక
బొమ్మనహళ్లి : ఓటు హక్కుపై తమ వంతు జాగృతి కల్పించేందుకు ఓ జంట తమ పెళ్లి పత్రికను ఎన్నికల గుర్తింపు కార్డులా ప్రచురించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ధార్వాడలో బెస్కాం అధికారి మంజునాథ్ కుమారుడు సునీల్‌కు, హెస్కాంలో పనిచేస్తున్న మరో ఇంజనీర్ మహేశ్ సోదరి అన్నపూర్ణలకు వివాహం నిశ్చయించారు. ఈనెల 26న వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటు ప్రాధాన్యత, ఓటు హక్కు వినియోగం ఆవశ్యకతను తెలియజేయడానికి ఈ కాబోయే జంట తమ పెళ్లి కార్డును ఓటరు కార్డుల ముద్రించి అందరికి ఆహ్వానం పంపారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని అందులో పేర్కొన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ ఈ నూతన జంటను అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్డు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
సుహాసిని భర్త స్థానంలో తండ్రి పేరు
సాక్షి, సిటీబ్యూరో: మహాకూటమి తరఫున కూకట్పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి వెంకట సుహాసిని ఓటరు కార్డులో ఆమె భర్త స్థానంలో తండ్రి హరికృష్ణ పేరు నమోదైంది. ఆమె ఇటీవలే నాంపల్లి నియోజకవర్గం నుంచి ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే తలంపుతోనే ‘నందమూరి’ పేరు ప్రచారం కోసం కాబోలు... ఆమె చుండ్రు ఇంటి కోడలైనప్పటికీ, నందమూరి వెంకట సుహాసినిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఆమె భర్త చుండ్రు వెంకట శ్రీకాంత్. సాధారణంగా పెళ్లయ్యాక ఓటరుగా నమోదు చేయించుకునేటప్పుడు తండ్రి/భర్త స్థానం కాలమ్‌లో భర్త పేరు నమోదు చేయించుకుంటారు. అయితే సుహాసిని మాత్రం తండ్రి పేరు నమోదు చేయించుకున్నారు. కానీ పొరపాటో మరి తొందరపాటో తెలియదు గానీ.. తండ్రి పేరు కాస్తా భర్తగా నమోదైంది. ఆమె అఫిడవిట్లో హరికృష్ణను తండ్రిగానే పేర్కొన్నారు. అయితే అఫిడవిట్‌తో పాటు ఓటరుగా నమోదైనట్లు తెలియజేసేందుకు సమర్పించిన ఓటరు జాబితా సర్టిఫైడ్ కాపీలోనూ తండ్రి పేరు అని ఉన్న చోట భర్త పేరుగా హరికృష్ణ పేరుతోనే జారీ చేశారు. ‘ఫాదర్’ అని ఉండగా, కొట్టివేసి వైఫ్ ఆఫ్ అని దిద్ది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జారీ చేశారు. ఓటరు జాబితాలో ఉన్న మేరకే అలా చేశారని తెలుస్తోంది. నాంపల్లి నియోజకవర్గంలోని ఎన్నికల జాబితా పార్ట్‌నెంబర్ 48, సీరియల్ నెంబర్ 710 ఓటరుగా ఆమె పేరు నమోదైంది. ఇదే విషయాన్ని రిటర్నింగ్ అధికారి మమత దృష్టికి తీసుకెళ్లగా... ఇలాంటి స్వల్ప పొరపాట్లు జరుగుతుంటాయని, అలాంటి వాటితో నామినేషన్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేశారు. -
డబుల్ చీటింగ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని అధికార పార్టీ పూర్తిగా అభాసుపాలు చేసింది. ప్రధానంగా అధికార పార్టీకి పట్టు ఉండే గ్రామాల్లో భారీగా డబుల్ ఎంట్రీలు నమోదు చేయించి ఓట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉన్న ప్రాంతాల్లో రకరకాల కారణాలతో ఓట్లను తొలగిస్తున్నారు. 2015 నాటి జాబితాతో పోలిస్తే కొద్దినెలల కిత్రం అధికారులు ప్రకటించిన జాబితాలో జిల్లాలో 2.05 లక్షల ఓట్లు తొలగించారు. వీటిలో అత్యధిక ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన శాసనసభ్యులు ఉన్న ప్రాంతాలే కావటం గమనార్హం. డబుల్ ఎంట్రీల పేరుతో గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించిన అధికార గణం ఇప్పుడు అధికార పార్టీ నేతలు డబుల్ ఎంట్రీ ఓట్లకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. ముఖ్యంగా జిల్లాలో తాజా ఎన్నికల జాబితా ప్రకారం సుమారు ఇప్పటికే 35 వేలకు పైగా బోగస్ ఓట్లు నమోదుఅయినట్లు తెలుస్తోంది. గూడూరులోని వ్యక్తికి గూడూరు, నెల్లూరులో ఓట్లు నమోదు చేశారు. అలా ఒంగోలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని కొందరి ఓట్లు కూడా నెల్లూరు జిల్లాలో నమోదు చేసి ఉండటం విశేషం. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 2014 ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లో బోగస్ పేరుతో పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించి, వాటి స్థానంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను డబుల్ ఎంట్రీలు నమోదు చేయించారు. తద్వారా రానున్న ఎన్నికల్లో వీటి ద్వారా లబ్ధి పొందాలని బలంగా యత్నాలు సాగిస్తున్నారు. ఉదాహరణకు షేక్ సర్దార్ అనే వ్యక్తికి నెల్లూరు నగరంలో నాలుగో పోలింగ్ బూత్‌లో ఓటు హుక్కు ఉంది. ఇదే సర్దార్కు మళ్లీ కోవూరులోని 126 నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు ఉంది. అలాగే పి.వెంకటేశ్వర్లకు నెల్లూరు నగరంలోని 16వ పోలింగ్ బూత్లోనూ సర్వేపల్లిలోని 202 పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు ఉంది. పై విధంగా ఒకటి రెండు కాదు.. ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఒక్కో వ్యక్తికి సంబంధించి రెండేసి ఓట్లు చేర్చారు. గతంలో బూత్‌లెవల్ ఆఫీసర్లకు సమగ్ర అవగాహన లేకపోవటం, నగరంలో కొన్ని డోర్ నంబర్లు చిరునామాలు సక్రమంగా లేక గందరగోళంగా ఉండటం, అద్దె ఇల్లు మారే వారు ఉండటం తదితర కారణాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓటు భారీగా తొలగించారు. గతంలో బీఎల్ఓలకు కేటాయించిన ప్రాంతాలపై అవగాహన లేకపోవడంతో ఇది మా ప్రాంతం కిందకు రాదని, ఆ ప్రాంతం మా పరిధిలో లేదని ఇంటింటికీ పరిశీలన సరిగా నిర్వహించేలేదు. ప్రాంతాలపై అవగాహన లేని కారణంగా లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఇప్పుడు దీనికి భిన్నంగా నియోజకవర్గానికి చెందని వారిని కూడా తీసుకువచ్చి రెండేసి ఓట్లు నమోదు చేయిస్తున్నారు. -
ఒక్క రూపాయికే చీర
సాక్షి, బెంగళూరు, బళ్లారి: మామూలుగానైతే ఒక్క రూపాయికి ఏం వస్తుంది? పిప్పరమెంటు, చాక్లెట్టు, లేదా బిస్కెట్లో వస్తుంది. రూపాయికి విలువ లేని ఈ రోజుల్లో ఒక్కరూపాయికే చీర కావాలా?? అయితే బీదర్‌కు వెళ్లాల్సిందే. చీర కావాలంటే ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. అసలు విషయం ఏమిటంటే బీదర్‌కు చెందిన ఒక చీరల దుకాణం యజమాని చంద్రశేఖర్ జేడీఎస్ పార్టీకి వీరాభిమాని. 2018లో జరిగే శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి విజయం సాధించి తీరాలని ఆకాంక్షిస్తూ ఆయన ఈ ఒక్క రూపాయికి చీర స్కీమును ప్రారంభించాడు. ఈ ఆఫర్ కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుందని ప్రకటించడంతో మహిళలు దుకాణం ముందు క్యూ కట్టారు. తిరుమల వెంకటేశ్వరుడు కలలో చెప్పాడట : దీనిపై షాపు యజమానిని మీడియా ప్రశ్నిస్తే తన అభిమాన నాయకుడు కుమారస్వామి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే 5 లక్షల చీరలను పంచాలని కొద్దిరోజుల క్రితం తిరుమల వేంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పినట్లు చంద్రశేఖర్ తెలిపాడు. ఏడుకొండలవాని ఆదేశాల మేరకే తాను ఒక్క రూపాయికి చీర స్కీమును చేపట్టానన్నాడు. ఈసారి ఆరునూరైన తమ నాయకుడు ముఖ్యమంత్రి అయి తీరుతారని చెప్పాడు. -
ఓటర్ ఐడీగా.. ఆధార్?!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల గుర్తింపు కార్డుగా ఆధార్‌ను ఎందుకు ఉపయోగించకూడదని మాజీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి టీఎస్ కృష్ణమూర్తి మంగళవారం అన్నారు. ఎన్నికల్లో ఆధార్ కార్డును ఏకైక వ్యక్తిగత గుర్తింపు కార్డుగా ఉపయోగిస్తే.. మంచిదని ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో ఓటర్ గుర్తింపు కార్డు లేనివారికోసం అనేక ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులను ఎన్నికల సంఘః అనుమతిస్తోందని చెప్పారు. దీని వల్ల అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఓటర్ గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా ఆధార్ కార్డును ఉపయోగించుకోవడం మంచిదని ఆయన తెలిపారు. అక్రమాలుఓట జరిగే అవకాశముందని ఆయన అన్నారు. ఆధార్ కార్డును ఇప్పుడు దేశమంతా వ్యక్తిగత గుర్తింపు కార్డుగా వినియోగిస్తున్నారు. అంతేకాక పలు పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇదే పద్దతిని ఎన్నికల్లో కూడా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలోని ఓటర్లందరికీ ఓటర్ గుర్తింపు కార్డులు లేవు.. కానీ దేశంలోని 90 శాతం జనాభాకు ఆధార్ ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఓటర్ గుర్తింపు కార్డు రూపొందిచేకన్నా.. ఆధార్‌నే అందుకు వినియోగిస్తే.. సమయం, డబ్బు, శ్రమ ఆదా అవుతాయని ఆయన అన్నారు. -
ఓటుకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి
నెల్లూరు(రెవెన్యూ): ఓటర్ ఐడీకార్డులను ఆధార్‌కు అనుసంధానం చేసేందుకు వివిధ రాజకీయపార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎం. జానకి తెలిపారు. గోల్డెన్ జూబ్లీహాలులో ఓటర్ ఐడీకార్డు ఆధార్ సీడింగ్‌పై వివిధ శాఖల అధికారులు, రాజకీయపార్టీల ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఓటర్లందరూ తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో డబల్ ఎంట్రీలు, మరణించిన వారి ఓట్లు ఉన్నాయన్నారు. ఓటర్ ఐడీ ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తి అయితే బోగస్ ఓట్లు తొలగిస్తామని వెల్లడించారు. డీఆర్ఓ సుదర్శన్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు పి. రూప్‌కుమార్, టీడీపీ ప్రతినిధి భూవనేశ్వరీప్రసాద్, బీజేపీ ప్రతినిధి కాళేశ్వరరావు, సీపీఎం ప్రతినిధి పి. శ్రీరాములు, బీఎస్పీ సుధాకర్ పాల్గొన్నారు. కోర్టు కేసులపై సకాలంలో స్పందించండి.. భూములు తదితర వాటికి సంబంధించిన కోర్టు కేసులపై సకాలంలో స్పందించి వివరాలు అందజేయాలని డీఆర్వో సుదర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు. గోల్డెన్జూబ్లీహాలులో డీటీలు, డీఏవోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టరేట్ ఏవో రామకృష్ట తదితరులు పాల్గొన్నారు. -
'ఆగస్ట్ 15 కల్లా ఆధార్‌తో అనుసంధానం పూర్తి'
హైదరాబాద్: ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసే ప్రక్రియను భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మార్చి 1 నుంచి అనుసంధాన ప్రక్రియ ప్రారంభించి ఆగస్ట్ 15 కల్లా పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్ ఓట్లను నిర్మూలించవచ్చని ఆయన అన్నారు. ఇప్పటివరకు దేశంలో 74 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉందని ఆయన తెలిపారు. -
రైతు రుణాలు మింగిన నకిలీలు
నెల్లికుదురు : రైతుకు బ్యాంకు రుణం కావాలంటే పట్టాదారు పాస్‌పుస్తకం.. మీ సేవా ద్వారా తీసిన పహనీ నకల్, ఓటరు ఐడీ కార్డు తదితరాలు తప్పనిసరి ఉండాల్సిందే. ఇవన్నీ ఉన్నా కొర్రీలు పెడుతూ బ్యాంకు చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకునే బ్యాంకు అధికారులు.. సెంట్ భూమి లేనివారికి కూడా లక్షలాది రూపాయల రుణాలిచ్చారు. కేవలం తెల్లకాగితంపై భూమి ఉన్నట్లు తహసీల్దార్, వీఆర్వో రాసిస్తే ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణం మంజూరు చేశారు. ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఇలా ఏకంగా సుమారు 480 మంది బినామీలకు రుణాలిచ్చారు. దళారులు, రెవె న్యూ, బ్యాంకు అధికారులు కుమ్మక్కయి కోట్లు కొల్లగొట్టారు. మహబూబాబాద్ మండలం అమనగల్ సిండికేట్ బ్యాంకు కేంద్రంగా సాగిన ఈ దందా నెల్లికుదురు మండలంలోని నర్సింహులగూడెం, ఆలేరు, బంజర గ్రామా ల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమనగల్ సిండికేట్ బ్యాంకు అధికారు లు నర్సింహులగూడెం ఆలేరు, బంజర గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ మూడు గ్రామాలకేగాక మరికొన్ని గ్రామాలకు కలిపి 1830 మందికి సుమారు రూ.14 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఇటీవల ఈ జాబితా కూడా విడుదల చేశారు. ఏ బ్యాంకులోనైనా నిబంధనల ప్రకారం రైతులకు రుణా లు మంజూరు చేయాలంటే పట్టాదారు పాసుపుస్తకాలు, మీ సేవా ద్వారా పొందిన పహనీ నకల్, రైతుల వివరాలు సక్రమంగా ఉండాలి. రుణానికి దరఖాస్తు చేసుకున్న రైతు భూమిని బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ పరిశీలించాకే రుణం మంజూరు చేస్తారు. కానీ అమనగల్ సిండికేట్ బ్యాంకులో ఆ డాక్యుమెంట్లేవి లేకుం డానే ఇక్కడ రుణాలు మంజూరు చేశారు. దళారుల ప్రమేయంతో భూమి లేని వ్యక్తుల పేరిట రుణాలిచ్చారు. తెల్లకాగితంపై ఫలానా వ్యక్తికి ఫలానా సర్వే నంబర్లో ఇంత భూమి ఉన్నదని వీఆర్వో, తహసీల్దార్ రాసిచ్చి, సంతకాలు పెట్టి, ముద్రలు వేస్తేచాలు.. అప్పటి సిండికేట్ బ్యాంకు మేనేజర్ పులిపాక కృపాకర్ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మంజూరు చేశారు. ఇలా కేవలం వీఆర్వో, తహసీల్దార్ ధ్రువీకరించిన కాగితాల ఆధారంగా బంజర, ఆలేరు, నర్సింహులగూడెం గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో కలిసి సుమారు 480 మంది భూమి లేని వ్యక్తులకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు రుణాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఈ తతంగమంతా నెల్లికుదురు తహసీల్ కార్యాలయంలో ఇద్దరు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరిగినట్లు అనుమానాలున్నాయి. వెలుగు చూసిందిలా.. రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను ఆయా గ్రామాల్లో గ్రామసభలు పెట్టి సెప్టెంబ ర్ 5న చదివి వినిపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. బంజర గ్రామంలో 310 మంది రుణాలు తీసుకున్నట్లు జాబితా ఉండ గా.. కేవలం 56 మంది పేర్లనే బ్యాంకు అధికారులు గ్రామసభకు పంపారు. మిగతాపేర్లను నర్సింహులగూడెం గ్రామ జాబితాలోకి మార్చారు. దీంతో అసలు విషయం బయటపడింది. గ్రామసభ నిర్వహించిన బంజర సర్పంచ్ నెలకుర్తి వెంకట్‌రెడ్డి గ్రామస్తుల సమక్షంలో తమ గ్రామంలో రుణాలు తీసుకున్న వారి మొత్తం జాబితాను తమకివ్వాలని తీర్మా నం చేసి గ్రామ ప్రత్యేక అధికారి ఆర్ఐ లచ్చునాయక్ అందజేశారు. అయినా రెవె న్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై నెల్లికుదు రు తహసీల్దార్ తోట వెంకట నాగరాజును వివరణ కోరగా.. ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదని సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా అసలు మంజూరైన రుణాలను భూమి లేని రైతులైనా తీసుకున్నా రా ? లేదంటే దళారులు, అధికారులే బినామీల పేరిట కోట్లాది రూపాయలు స్వాహా చేశారా ? అనేది ఉన్నతాధికారులు విచారణ చేపడితేనే వెలుగు చూసే అవకాశముంది. -
సర్వే అధికారులకు ఈ రుజువులు చూపండి
సర్వే కోసం 19న ఇంటికి వచ్చే ఎన్యూమనేటర్లకు కుటుంబానికి సంబంధించిన వాస్తవ వివరాలు తెలియజేయడంతో పాటు వారి అనుమానాల నివృత్తికి అందుబాటులో ఉన్న కొన్ని రుజువులు చూపాల్సి ఉంటుంది. సర్వే సమయంలో ఉన్న చిరునామా కాకుండా ఇతర ప్రాంతాల చిరునామాలతో ఆ పత్రాలు ఉన్నప్పటికీ అవసరం మేరకు చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు గత సంవత్సరం అద్దె ఇంట్లో ఉండి అదే ఇంటి నంబరుతో ఆధార్‌కార్డు, వాహన రిజిస్ట్రేషన్ కార్డు పొంది ఉన్న వారు తరువాత వేరే ఇంట్లోకి మారినట్లయితే ప్రస్తుతం ఉన్న చిరునామా చెప్పడంతో పాటు పాత చిరునామాతో ఉన్న ఆధార్ కార్డు నంబరు, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ చెప్పవచ్చు. సర్వే అధికారులు అడిగితే చూపించాల్సిన మరికొన్ని పత్రాలు... * ఆధార్ కార్డు * వాహన రిజిస్ట్రేషన్ కార్డు * ఇంటి అసెస్మెంట్, ఇంటి పన్ను రసీదు కరెంట్ బిల్లు * ఎల్పీజీ కనెక్షన్ పుస్తకం * బ్యాంక్, పోస్టాఫీసు పాసు పుస్తకం * కులం, జనన ధ్రువీకరణ పత్రం * విద్యార్థులు చదువుకున్న పత్రాలు(మెమో, టీసీ వంటివి) * వికలాంగుల ధ్రువీకరణ పత్రం(సదరం సర్టిఫికెట్) * వాహనాల రిజిస్ట్రేషన్ కాపీ కార్డు * వ్యవసాయ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం * ఓటర్ ఐడీకార్డు, పాన్‌కార్డు * ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందితే ఇందిరమ్మ ఇల్లు, వంటి వాటి కేటాయింపు సర్టిఫికెట్. పెన్షనర్ల ఐడీ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి. -
సినీ నటుడు రామ్ చరణ్ పేరుతో ఓటర్ దరఖాస్తు
ధర్మవరం : ఆన్లైన్ ద్వారా ఓటరు నమోదుకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాన్ని ధర్మవరానికి చెందిన కొందరు ఆకతాయిలు దుర్వినియోగం చేశారు. కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు, సినీనటుడు రాంచరణ్ తేజను ధర్మవరం ఓటరుగా నమోదు చేయాలంటూ 27939854 ఐడీ నెంబర్‌తో చేసిన దరఖాస్తులో పేరు చరణ్, ఇంటిపేరు బండి, వయసు 53 ఏళ్లు, పుట్టిన తేదీ 8-6-1960, తండ్రి పేరు చిరు అని, పట్టణంలోని రాంనగర్‌లోని డోర్‌నెంబర్ 8-168ఎ ఇంట్లో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. రాంచరణ్ నటించిన మగధీర సినిమాలోని ఫొటోను జత చేశారు. అధికారులు ఈ విషయాన్ని ఆర్డీఓ నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన శుక్రవారం తహసీల్దార్ల సమావేశం నిర్వహించి ఓటరు నమోదు ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా అందే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే అనుమతించాలని సూచించారు. -
కౌలు రైతులకు చుక్కెదురు!
నర్సీపట్నం, న్యూస్‌లైన్: కౌలు రైతుల కోసం రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన భూ ఆధీకృత చట్టంతో జిల్లాలో ఒనగూరిన ప్రయోజనం శూన్యంగానే కనిపిస్తోంది. దీంతో భవిషత్తులో వీరంతా సాగునకు దూరమయ్యే ప్రమాదముంది. జిల్లాలో అడపా, దడపా కురుస్తున్న వర్షాలకు రైతులు ఖరీఫ్ సాగు సన్నాహాల్లో ఉండగా, కౌలు రైతులు మాత్రం నాగలి పట్టేందుకు వెనుకంజవేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కౌలు రైతులే సాగు చేస్తున్నా, ప్రభుత్వ రాయితీలు, రుణాలను హక్కుదారులు పొందుతున్నారు. ఫలితంగా కౌలు రైతులు నష్టపోతున్నారు. అనధికార అంచనా ప్రకారం జిల్లాలో కౌలు రైతులు 2.50 లక్షల వరకు ఉన్నారు. భూ అధీకృత చట్టం ప్రకారం వీరందరికీ గుర్తింపుకార్డులు ఇవ్వాల్సి ఉంది. కానీ మొదటి సంవత్సరం జిల్లాలో 15,439 మందికి మాత్రమే గుర్తింపు కార్డులిచ్చారు. వీరిలో 4,971 మందికి రూ.6.30 కోట్లు రుణాలను మంజూరు చేశారు. రెండో ఏడాది సుమారుగా ఐదు వేల మంది రైతులు గుర్తింపు కార్డులు రెన్యువల్ చేసుకున్నా వారిలో 357 మందికి రూ.68.45 లక్షల రుణాలిచ్చారు. రెండేళ్లుగా జిల్లాలో ప్రతికూల వాతావరణంతో పంటలు దెబ్బతిని, కౌలు రైతులు పూర్తిగా రుణాలు చెల్లించలేకపోయారు. రుణ చెల్లింపులను పరిగణలోనికి తీసుకున్న అధికారులు కొత్తగా గుర్తింపు కార్డులిచ్చేందుకు వెనుకంజవేశారు. దీంతో ఈ ఏడాది 2,217 మంది కౌలు రైతులకు కొత్తగా గుర్తింపుకార్డులు మంజూరు చేయగా, 1,396 మంది పాత రైతులు మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 50 మంది కౌలు రైతులకు సుమారు రూ.7 లక్షల రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. వ్యవసాయశాఖ మంజూరు చేసే అన్ని పథకాలకు కౌలు రైతుల గుర్తింపుకార్డులు తప్పనిసరి. జిల్లావ్యాప్తంగా 2.50 లక్షల మంది కౌలు రైతులు ఖరీఫ్ సాగు చేపడుతున్నా, వారిలో రెండు శాతం మందికే గుర్తింపుకార్డులు మంజూరు చేసింది. మిగిలిన 98 శాతం మంది రైతులకు గుర్తింపు కార్డులు లేక ప్రభుత్వ రాయితీలు, రుణాలకు దూరమవుతున్నారు.