న్యూఢిల్లీ: మీకు ఓటు హక్కు ఉందా? ఓటు వేస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. మీరు మీ ఓటర్ కార్డును ఆన్‌లైన్‌లోనే సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల సంఘం కొత్తగా ఈ-ఎపిక్(ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్) సౌకర్యాన్ని ఓటర్లకు కల్పించింది. భారతదేశంలోని రాబోయే ఐదు రాష్ట్ర ఎన్నికల కోసం ఓటర్లు ఈ కొత్త డిజిటల్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ-ఎపిక్ కార్డును మీ మొబైల్ లేదా కంప్యూటర్ లో సురక్షితంగా పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: భారతీయ రైల్వే సరికొత్త రికార్డు!)
కొత్త ఓటర్ కార్డు కోసం 2020 నవంబర్-డిసెంబర్ సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు 2021 జనవరి 25 నుంచి 31 మధ్య ఈ-ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర సాధారణ ఓటర్లు 2021 ఫిబ్రవరి 1 నుంచి ఈ-ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డిజిటల్ ఓటర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఓటరు పోర్టల్: http://voterportal.eci.gov.in/ లేదా https://www.nvsp.in/ అనే వెబ్‌సైట్‌కు వెళ్లి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మీకు కింది వైపు నుంచి రెండో లైన్‌లో కనిపించే లింకుపై క్లిక్ చేసి మీరు ఈ-ఎపిక్ ను పొందొచ్చు. మొబైల్ నెంబర్ మాత్రం కచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి. లేదంటే ఇకేవైసీపై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి. అలాగే ఓటర్ కార్డులో తప్పులు ఉన్నా, రిప్లేస్‌మెంట్ పొందాలన్నా మీరు మీ పూని పూర్తి చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment