voters day
-
నేడు సచివాలయంలో ఓటర్ల దినోత్సవం
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా వెల్లడించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం అయిన శనివారం రాష్ట్ర సచివాలయానికి సెలవు కావడంతో ముందుగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. -
డిజిటల్ ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!
న్యూఢిల్లీ: మీకు ఓటు హక్కు ఉందా? ఓటు వేస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. మీరు మీ ఓటర్ కార్డును ఆన్లైన్లోనే సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల సంఘం కొత్తగా ఈ-ఎపిక్(ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్) సౌకర్యాన్ని ఓటర్లకు కల్పించింది. భారతదేశంలోని రాబోయే ఐదు రాష్ట్ర ఎన్నికల కోసం ఓటర్లు ఈ కొత్త డిజిటల్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ-ఎపిక్ కార్డును మీ మొబైల్ లేదా కంప్యూటర్ లో సురక్షితంగా పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: భారతీయ రైల్వే సరికొత్త రికార్డు!) కొత్త ఓటర్ కార్డు కోసం 2020 నవంబర్-డిసెంబర్ సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు 2021 జనవరి 25 నుంచి 31 మధ్య ఈ-ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర సాధారణ ఓటర్లు 2021 ఫిబ్రవరి 1 నుంచి ఈ-ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డిజిటల్ ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఓటరు పోర్టల్: http://voterportal.eci.gov.in/ లేదా https://www.nvsp.in/ అనే వెబ్‌సైట్‌కు వెళ్లి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మీకు కింది వైపు నుంచి రెండో లైన్లో కనిపించే లింకుపై క్లిక్ చేసి మీరు ఈ-ఎపిక్ ను పొందొచ్చు. మొబైల్ నెంబర్ మాత్రం కచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి. లేదంటే ఇకేవైసీపై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి. అలాగే ఓటర్ కార్డులో తప్పులు ఉన్నా, రిప్లేస్మెంట్ పొందాలన్నా మీరు మీ పూని పూర్తి చేసుకోవచ్చు. -
ఇంట్లో నుంచే ఓటరు ఐడీ డౌన్లోడ్ చేసుకోండి
న్యూఢిల్లీ: ఇక నుంచి ఓటరు గుర్తింపు కార్డును ఓటర్లు మొబైల్ ఫోన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకునే నూతన విధానాన్ని భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. తమ రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడంతో పాటు మొబైల్ ఫోన్లోనూ స్టోర్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇప్పటివరకు ఓటరు గుర్తింపు కార్డును సమీపంలోని మీ-సేవ కేంద్రాల ద్వారానే పొందాల్సి ఉండేది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఈ-ఎపిక్(ఎలక్రానిక్: ఫొటో ఐడెంటిటీ ఓటరు కార్డు) కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించబోతోంది. ఓటరు తమ రిజిస్టర్డ్ మొబైల్లోనే ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చు.(చదవండి: డయల్ 100కు బదులుగా 112) 2021 జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదైన యువ ఓటర్లకు తొలుత ఈ అవకాశం కల్పించారు. వీరు తమ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా ఈ నెల 25 నుంచి 81 వరకు ఈ-ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి ఓటర్లందరూ ఈ-ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. "ఈ-ఓటర్ హువా డిజిటల్, క్లిక్ ఫర్ ఏపిక్" అనే పేరుతో పేద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పోర్టల్: http://voterportal.eci.gov.in, NVSP: https://nsvp.in ద్వారా ఎలక్ట్రానిక్ ఓటరు గుర్తింపు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా, ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలను భాగస్వాములను చేసి కొత్త ఓటర్ల నమోదుకు విస్తృత ప్రచారం చేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది. -
‘యథా ప్రజా తథా రాజాలా ఉండాలి’
సాక్షి, విజయవాడ : కులం, మతం, డబ్బు ఓటుకు ప్రామాణికం కాకూడదని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ‘ఓటు అనేది చాలా శక్తిమంతమైనది. ప్రతీ ఒక్కరు ఎన్నికల్లో పాల్గొనాలి. సెలవు ఉన్నప్పటికీ పోలింగ్‌లో పాల్గొనకపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిది. యథా రాజా తథా ప్రజాలాగా కాకుండా.. యథా ప్రజా తథా రాజా అన్న చందంగా మారాలి. నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న యువత తప్పక ఓటింగ్‌లో పాల్గొనాలి’ అని వ్యాఖ్యానించారు. ఓటుతో మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రంలో భాగంగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువతీ యువకులకు గవర్నర్ గుర్తింపు కార్డులు అందజేశారు. ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేయడంతో పాటుగా ప్రతీ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రతిఙ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు సీఎస్ అనిల్ చంద్ పునీత, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, గుంటూరు కలెక్టర్ కోన శశిధర్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబరు 1950 పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. ఓటు అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని... అందరి సహకారంతో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఓటరు నమోదుపై సందేహాల నివృత్తికై 1950 అనే టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
ఎడ్ల బండిలో తిరుగుతున్నారా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ నుండి 25న జాతీయ ఓటర్ల దినోత్సవ ఆహ్వానం వచ్చిందని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సారి ఓటర్స్ డే థీమ్ ఒక్క ఓటర్ను వదిలిపెట్టొద్దని తనతో చెప్పారన్నారు. గత ఎన్నికల్లో లక్షలాది ఓటర్లను తొలగించామని రజత్ కుమార్ అంగీకరించారని, పార్లమెంట్ ఎన్నికల నాటికి అర్హులందర్ని ఓటరు జాబితాలో చేరుస్తామన్న హామీ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అందుకే ఈ ఓటర్స్ డేను బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రేపటి ధర్నాలో అధికార పార్టీకి తొత్తుగా ఉన్న ఎన్నికల సంఘంపై తమ వైఖరి చెబుతామన్నారు. ధర్నాకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, డీకే అరుణలతో పాటు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ఎంబీటీ నేతలను ఆహ్వానించామని తెలిపారు. విమానాలు ట్యాంపరింగ్ జరిగితే ఎడ్ల బండిలో తిరుగుతారా? అన్న రజత్ కుమార్ వ్యాఖ్యలపై శశిధర్ రెడ్డి మండిపడ్డారు. అమెరికా విమానాలను కాదని ఎడ్ల బండిలో తిరుగుతుందా, అక్కడ బ్యాలెట్‌లోనే ఎన్నికలు జరుగుతున్నాయి కదా అని ధ్వజమెత్తారు. ఈవీఎం మొట్టమొదట ప్రవేశ పెట్టిన జపాన్‌లో కూడా ఇప్పుడు బ్యాటెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా బ్యాలెట్ పేపర్లోనే ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈవీఎంలపై విశ్వాసం లేదనే వీవీ ప్యాట్ తీసుకొచ్చారని మరిచి పోవద్దన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆమె రాకతో దేశ వ్యాప్తంగా మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. -
ఓటు హక్కు ఔన్నత్యాన్ని చాటుదాం
కలెక్టర్ పీహెచ్ విజయమోహన్ పిలుపు - జాతీయ ఓటరు దినోత్సవ నిర్వహణపై సమీక్ష కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఈ నెల 25న పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాలుండాలన్నారు. శనివారం సాయంత్రం 7వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఓటు హక్కు విలువపై ప్రజలకు అవగాహన ఏర్పడేలా జూనియర్ కాలేజీ విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు పరీక్షలున్నట్లు ఆర్ఐఓ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఉదయం పూట ఉన్న పరీక్షను సాయంత్రానికి వాయిదా వేయిస్తే ర్యాలీకి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ మేరకు నోట్స్ పంపాలని, దాని ఆధారంగా ఆర్జేడీతో మాట్లాడుతానని తెలిపారు. పరీక్షలున్న కారణంగా సమావేశానికి వచ్చిన కళాశాల ప్రిన్సిపాళ్లను బయటికి పంపారు. కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సమావేశానికి గైర్హాజరు కాడంపై ఆగ్రహించిన కలెక్టర్ షోకాజ్ నోటీసు ఇవ్వాలని డీఆర్ఓను ఆదేశించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పోలింగ్ కేంద్రం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో కర్నూలు పోలీస్ పరేడ్ గ్రౌండులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ ఆకే రవికృష్ణ, జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓటు వేయడం ప్రాథమిక విధి
లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఓటు వేయడం ప్రాథమిక విధి అని లోకాయుక్త సుభాషణ్‌రెడ్డి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ సోమవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 51-ఎ లో ప్రాథమిక విధులు ఉన్నాయని, ఓటు వేయడాన్ని తప్పనిసరి చేస్తూ ఆ విధుల్లో చేర్చాలని, దీని కోసం చట్టసభల ప్రతినిధులు కృషి చేయాలన్నారు. నూరు శాతం ఓటింగ్ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం నిండుగా ఉంటుందని, ఈ దిశగా యువతను చైతన్యం చేయాలన్నారు. స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా, ప్రలోభాలకు గురికాకుండా సేవ చేసే అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. ఓటింగ్‌లో పాల్గొనేలా చైతన్యం చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అన్నారు. మంచివారిని ఎన్నుకోవాలని, ఓటింగ్ ప్రక్రియలో ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని విజ్ఞప్తి చేశారు. చదువుకున్నవారు నివసించే ప్రాంతాల్లోనే ఓటింగ్ తక్కువగా జరుగుతోందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం సమాచారంతో ఓటర్ స్లిప్పులను ఇంటింటికి అందజేస్తున్నామని, ఇప్పటికే 20 లక్షలకుపైగా స్లిప్పులను అందజేశామన్నారు. ఓటర్ స్లిప్పులను ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. మతం, జాతి, కులం, వర్గం, భాష సహా ఇతర ప్రభావాలకు లోనుకాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామంటూ రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులతో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఓటుహక్కు నమోదులో ముందు వరుసలో నిలిచిన కర్నూలు కలెక్టర్ విజయ్‌మోహన్, అప్పట్లో నిజామాబాద్ కలెక్టర్‌గా ఉన్న ప్రస్తుత మెదక్ కలెక్టర్ రోనాల్డ్రాస్తోపాటు ఇతర అధికారులను జస్టిస్ సుభాషణ్‌రెడ్డి సన్మానించారు. 1954 నుంచి క్రమం తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొంటున్న సీనియర్ సిటిజన్లు శ్రీరాములు(88), సుదర్శన్‌రాజు తదితరులను సన్మానించారు. ఇటీవల ఓటు హక్కు పొందిన యువతకు ఓటరు కార్డులను అందించారు. -
ఘనంగా ఓటరు దినోత్సవ ర్యాలీ
-
ఓటేమాతరం
ఓటర్లూ ఈ రోజు మీదే.. ఐదేళ్లకొకసారి వచ్చే ఈ రోజును వినియోగించుకోండి.. మీ సత్తా చూపండి.. మీ వద్ద ఉన్న ఓటు ఆయుధాన్ని సంధించండి.. స్వార్థ చింతన, స్వలాభం చూసుకునే నాయకులను దూరం పెట్టండి.. ఓటేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి.. డబ్బులు ఇచ్చాడనో.. మద్యం తాగించాడనో ఐదేళ్ల కాలాన్ని వారి చేతిలో పెట్టొద్దు.. మనకు ఎవరైతే న్యాయం చేస్తారో.. సమాజాన్ని బాగు చేస్తారో వారికే ఓటేసి తలరాతను మార్చుకోండి..! సాక్షి, ఒంగోలు: ఓటర్స్ డే రానే వచ్చింది. బుధవారం జిల్లాలోని 12 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ స్థానాలకు 187 మంది, లోక్‌సభ స్థానాలకు 29 మంది బరిలో వున్నారు. పోలింగ్‌కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలో ఒంగోలు, దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం(ఎస్సీ), కొండపి(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలు న్నాయి. అలాగే బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలో అద్దంకి, పర్చూరు, చీరాల, సంతనూతలపాడు అసెంబ్లీ సెగ్మెంట్లు వుండగా, జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం నెల్లూరు పార్లమెంటరీ స్థానం పరిధిలో వుంది. ఆయా స్థానాల్లో ప్రధాన పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్‌తో పాటు భారతీయ జనతా పార్టీ ఒకచోట, జై సమైక్యాంధ్ర పార్టీ, లోక్‌సత్తా, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. * జిల్లాలో మొత్తం 24,84,109 మంది ఓటర్లు వున్నారు. * 12, 34,660 మంది పురుషులు కాగా, 12,49,285 మంది మహిళా ఓటర్లు వున్నారు. * వీరంతా బుధవారం జరిగే పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. * ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. * జిల్లాలోని 1885 ప్రాంతాల్లో 2,881 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. * ఆయా కేంద్రాల వద్ద తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యంతో పాటు వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. * జిల్లాలో 1022 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా, 559 కేంద్రాలను అతిసమస్యాత్మకంగా గుర్తించారు. * తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలు 38 ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో పోలింగ్ సరళిని వీడియో తీయించేందుకు ఏర్పాట్లు చేశారు. * నిరంతరం ఎన్నికలను పర్యవేక్షించేందుకు 659 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. వీటికి అనుసంధానంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు వుంటే టోల్ ఫ్రీ నంబర్ 1077 కు ఫోన్ చేయవచ్చు. * 922 పోలింగ్ కేంద్రాల్లో పరిశీలనకు 720 సూక్ష్మపరిశీలకులను నియమించారు. మంగళవారం రాత్రికే పోలింగ్ సామగ్రి తరలింపు * జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ నిర్వహణకు 20, 041 మంది ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటున్నారు. * వీరందరికీ శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయా నియోజకవర్గాల్లోని సమీప కళాశాలల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి మాక్ పోలింగ్ నిర్వహించి శిక్షణ ఇచ్చారు. * మంగళవారం రాత్రికే ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అప్పగించారు. వారిని ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు పంపారు. * ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. అంతకు అర్ధగంట ముందుగానే రాజకీయ పార్టీల ఎన్నికల, బూత్ ఏజెంట్లు హాజరుకావాల్సి ఉంది. అందరి వద్ద సంతకాలు తీసుకున్న తర్వాత వారి సమక్షంలోనే ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎం యంత్రాల సీల్‌ను తొలగిస్తారు. * పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల పనితీరులో ఇబ్బందులు తలెత్తితే, వెంటనే మార్పు చేసేందుకు సెక్టోరల్ అధికారుల వద్ద అసెంబ్లీకి రెండు, పార్లమెంట్‌కు మరో రెండు ఈవీఎంలు రిజర్వులో ఉంచారు. * కేంద్రాల వద్ద ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 9,545 పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. * పోలింగ్ ప్రక్రియను జిల్లాప్రధాన ఎన్నికల అధికారి కలెక్టర్ విజయ్‌కుమార్, ఎస్పీ ప్రమోద్‌కుమార్ పర్యవేక్షిస్తారు. -
దుమ్ము దులపండి
సాక్షి, అనంతపురం/అనంతపురం కలెక్టరేట్ : ఓటర్ ‘డే’ రానే వచ్చింది. ఐదేళ్ల తమ భవిష్యత్‌ను నిర్దేశించే నాయకుడిని ఎన్నుకునేందుకు ఇదే మంచి తరుణం. విశ్వసనీయతకు పట్టం కట్టండి. మీ తలరాతను మార్చుకోండి. ఈవీఎంలో మీట నొక్కి దుమ్ముదులపండి. దాదాపు 25 రోజుల పాటు ప్రచారాలతో హోరెత్తించిన అభ్యర్థుల భవితవ్యాన్ని మీరే నిర్ణయించండి. సార్వత్రిక సంగ్రామం తుది ఘట్టానికి చేరుకుంది. బుధవారం జిల్లాలోని రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేలా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేసినా, ఓటు ఎవరికి వేశారని ఎవరైనా ఆరా తీసినా కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. 2009 ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదవగా ఈసారి 90 శాతం పోలింగ్ లక్ష్యంగా అధికాయ యంత్రాంగం ఇప్పటికే ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం చే సింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 71.49 శాతం, స్థానిక ఎన్నికల్లో 82.5 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే స్ఫూర్తితో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా 29,81,937 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 3,334 పోలింగ్ కేంద్రాల్లో 23,142 మంది సిబ్బందిని నియమించారు. 3,858 మంది పీఓలు, 3,870 మంది ఏపీవోలు, 15,414 మంది ఇతర పోలింగ్ అధికారులతో పాటు ఇతర సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. 1634 కేంద్రాల్లో వెబ్ కెమెరాలు, 1038 పోలింగ్ కేంద్రాల్లో వీడియో కెమెరాలు ఏర్పాటు చేశారు. అనంతపురం అర్బన్, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండేసి ఈవీఎంలు (యూనిట్లు) వినియోగిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు 453 మంది రూట్ మొబైల్స్‌ను, 24 కంపెనీల సెంట్రల్ పారా మిలటరీ ఫోర్స్, 439 మంది హెడ్‌కానిస్టేబుల్స్, 2,666 మంది కానిస్టేబుల్స్, 2,811 మంది హోంగార్డులు, 1357 ఏఆర్ కానిస్టేబుళ్లు, 14 మంది డీఎస్పీలు, 79 మంది సీఐలు, 241 మంది ఎస్ఐలు, 284 ఏఎస్ఐలను నియమించారు. ఈ ఎన్నికల్లో నోటా : మునుపెన్నడూ లేనివిధంగా కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా ఈ ఎన్నికల్లో నోటా (తిరస్కరణ) ఓటు ప్రవేశపెట్టింది. బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చక లక్షలాది మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉంటున్నారు. దీంతో తిరస్కరణ ఓటును ఎన్నికల సంఘం అమలు చేసింది. ఈవీఎంలో చివరి వరుస నంబర్‌ను నోటాగా అమర్చారు. ఈ బటన్ నొక్కితే సదరు ఓటరు బరిలో ఉన్న అభ్యర్థులందర్ని తిరస్కరిస్తున్నట్లు అందులో ఫీడ్ అవుతుంది. అభ్యర్థులు నచ్చకపోయినా ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ‘నోటా’ బటన్ నొక్కాలని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. -
సమర్థులకే ఓటు వేయండి
ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొని దేశ భవిష్యత్తును నిర్ణయించాలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా సాక్షి, హైదరాబాద్: ఓటర్లు పాలకుల సామర్థ్యాన్ని అంచనా వేసి ఓటు వేయాలని, ప్రతి పౌరుడూ తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జస్టిస్ గుప్తా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం దేశంపై ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని... పోలింగ్‌లో పాల్గొని దేశ భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు పోలింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా జరగాలని... అందుకు ప్రతి పౌరుడూ కృషి చేయాలని సూచించారు. ప్రతి సార్వత్రిక ఎన్నిక ఒక కొత్త ప్రభుత్వానికి జన్మనిస్తోందని, ఎన్నికల సంఘం ఇందుకు ప్రసూతి కేంద్రంగా పనిచేస్తోందని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. అలాగే కొత్త ఓటరు గుర్తింపు కార్డులను కొందరికి అందజేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, కంటోన్మెంట్ బోర్డు సీఈవో సుజాతాగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఎవరేమన్నారు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఎస్ మహంతి: రాష్ట్రవ్యాప్తంగా 4,800 ఈ-సేవా కేంద్రాల ద్వారా ఓటరు గుర్తింపు కార్డులు జారీచేస్తున్నాం. ఓటర్లందరికీ గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకుంటాం. ఓటరుగా నమోదైన వారు వారి పేర్లను జాబితాలో చెక్ చేసుకోవాలి. ఈ నెలాఖరు నాటికి ఓటర్ల జాబితాను ముద్రిస్తాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి: 18 ఏళ్లు నిండిన వారు ఎప్పుడైనా ఓటరుగా రిజిస్ట్రర్ చేసుకోవచ్చు, ఇందుకు ఆఖరు తేదీ ఉండదు. ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్: ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో 76 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో యువత ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 6.24 కోట్లకు చేరింది. గత ఏడాది 54 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈ ఏడాది 100 శాతం పోలింగ్ జరిగేలా అందరూ కృషి చేయాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్: జంట నగరాల పరిధిలో ఐదు లక్షల మంది కొత్తగా ఓటర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతి ఓటరు ఓటు వేసేలా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. -
ఓటు హక్కు ప్రజల చేతిలో ఆయుధం!
-
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
-
ఓటు వజ్రాయుధం
సాక్షి, మచిలీపట్నం : ప్రతి ఏటా ఓటర్ల దినోత్సవంనాడు అధికారులు, నేతలు మీటింగ్‌లు పెట్టి ఓటు గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇచ్చేస్తారు. అవన్నీ విన్న మనం తర్వాత మరిచిపోతాం.. మళ్లీ ఎన్నికల ఒక్కరోజు మాత్రమే నేతలు, ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం ఓటు ప్రాధాన్యతను గుర్తిస్తారు. శనివారం ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఓటర్ల నమోదు ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేసిన జిల్లా యంత్రాంగం తుది జాబితాను తయారుచేయడంలో మాత్రం ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం 30,34,257 ఓటర్లు ఉన్నారు. ఇటీవల ఎన్నికల సంఘం కొత్త ఓట్ల నమోదుకు అవకాశం ఇవ్వడంతో జిల్లాలో 2,01,303 మంది దరఖాస్తు చేసుకున్నారు. 14,443 మంది ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన తుది జాబితాలో 32,21,117 ఓటర్లు ఉంటారు. పాత ఓటర్ల జాబితాకు చేర్పులు మార్పులు చేసి తుది జాబితాను తయారుచేసేందుకు ఇంకా కసరత్తు సాగుతూనే ఉంది. రెండు లక్షల మంది కొత్తగా ఓటుకోసం దరఖాస్తు చేసుకోవడంతో వాటిని బూత్‌లవారీగా ఓటర్ల జాబితాలో చేర్చేందుకు జిల్లా యంత్రాంగానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. ఆ కసరత్తు పూర్తిచేసిన అనంతరమే కొత్త జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. కొత్తగా గుర్తించిన ఓటర్లకు పోలింగ్ కేంద్రాలవారీగా గుర్తింపు కార్డులు ఆదివారం జారీ చేయనున్నారు. ఓటు నమోదు నిరంతరం సాగాలి.. ఓటు గొప్పతనం గురించి అందరూ చెబుతున్నా అందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఏదో ఎన్నికల కమిషన్ ప్రత్యేక కార్యక్రమంగా ఓటర్ల నమోదుకు అవకాశం ఇస్తే తప్ప స్పందన రావడంలేదు. అందుకు ప్రజల్లో అవగాహన లేకపోవడం, ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకోకపోవడమే కారణం. ఏటా జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు పొందేలా ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆన్లైన్లోను ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇటువంటి అవకాశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో రెండు లక్షల మందికిపైగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 18 ఏళ్లు నిండిన చాలా మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోలేదని చెబుతున్నారు. ఆన్లైన్లో ఓటు నమోదుకు సాంకేతిక సమస్యలు రావడం, యువత కొంతవరకు ఆసక్తి చూపకపోవడం కారణమంటున్నారు. ఓటు నమోదుకు సమయం కేటాయించడానికి కూడా ఇబ్బందిగా భావించిన వారు ఇంకా మిగిలే ఉన్నారు. ఇటువంటి వారిపై కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ కనబరిచి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు అందించేలా కృషి చేయాలి. నేడు ఓటర్ల చైతన్య కార్యక్రమం.. ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం బందరులో శనివారం ఓటర్ల చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. లక్ష్మీ టాకీసు నుంచి విద్యార్థులతో ఉదయం 8.30 గంటలకు 2కే రన్ నిర్వహించనున్నారు. ఈ రన్‌ను డీఆర్వో ఎల్.విజయ్‌చందర్, ఆర్డీవో పి.సాయిబాబు ప్రారంభిస్తారు. అనంతరం కోనేరు సెంటర్లో విద్యార్థులు మానవహారం నిర్వహిస్తారు. నోబుల్ కాలేజీ ఎదురుగా ఉన్న ఆశీర్వాద భవన్లో ఉదయం 11గంటలకు ఓటర్ల దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జె. ప్రభాకరరావు, కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ వి.వెంకయ్య పాల్గొంటారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు ఉండాలి.. పాలకులను ఎన్నుకోవడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.. ఓటును ప్రజల భవితకు భరోసా ఇచ్చే వజ్రాయుధంగా వాడాలి... ఇవి ఓటు గురించి మనం తరచు వినే మాటలు. మరి నిజంగా అంతటి శక్తిమంతమైన ఓటును ప్రజలు సద్వినియోగం చేస్తున్నారా.. పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు ఉందా.. అనే ప్రశ్నలకు లేదనే సమాధానం వస్తోంది. -
విద్యార్థులకు ప్రేమతో బోధించండి
నల్లజర్ల, న్యూస్‌లైన్ : విద్యార్థులనుభయంతో కాకుండా ప్రేమతో చేరదీసి విద్యాబుద్ధులు నేర్పితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. శనివారం నల్లజర్ల ఏకేఆర్జీ కళాశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంపై డివిజన్లోని ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అవినీతిని తరిమి కొడదాం అంటూనే కొందరు ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని, ఇది తగదని హితవు పలికారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా విద్యను బోధించాలని ఆదేశించారు. నిర్ధిష్ట ప్రణాళికలు తయారు చేసుకుని విద్యార్థులకు బోధించాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు అంటే రిజల్ట్ కాదని, ఉత్తమంగా బోధించడమని కలెక్టర్ చెప్పారు. డీఈవో నరసింహారావు మాట్లాడుతూ దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని ప్రతి ఉపాధ్యాయుడు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమానికి డీవైఈవో తిరుమలదాస్, తహసిల్ధార్ సుబ్బారావు పాల్గొన్నారు. ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించండి ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. స్థానిక జలభవన్లో శనివారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో ఓటర్ల జాబితా సవరణ, ఫొటో ఓటరు గుర్తింపుకార్డుల జారీ అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో కొత్తగా నమోదైన ఓటర్లకు ఈ నెల 25 జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ఫొటో ఓటరు గుర్తింపుకార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.ప్రభాకరరావు, జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, ఇఆర్వోలు వై.రామకృష్ణ, నాగరాజువర్మ తదితరులు పాల్గొన్నారు.