
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా వెల్లడించారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం అయిన శనివారం రాష్ట్ర సచివాలయానికి సెలవు కావడంతో ముందుగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు.