Epic cards
-
కొత్త ఓటర్లకు భారత ఎన్నికల సంఘం శుభవార్త..!
Election Commission of India: 2021లో ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు భారత ఎన్నికల సంఘం శుభవార్త తెలిపింది. ఈ ఏడాది కొత్తగా జాబితాలో తమ పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డు(EPIC)లను పోస్ట్ ద్వారా పంపాలని నిర్ణయించినట్లు భారత ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు నేడు తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకునే జనవరి 25న ఈ కొత్త సేవలను ప్రారంభించనున్నట్లు అధికారి తెలిపారు. "మేము ఓటరు కార్డులను నేరుగా గ్రహీతలకు పోస్ట్ ద్వారా పంపిణీ చేయడం ప్రారంభిస్తాము. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ సేవలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు' అని ఆయన తెలిపారు. ఈ కొత్త ఓటర్లకు EPIC గుర్తింపు కార్డులతో పాటు ఒక ప్యాకెట్ కూడా పంపుతున్నట్లు అధికారి తెలిపారు. ఈ ప్యాకెట్లో ఈవీఎం, ఓటింగ్ విధానంతో సహా మొత్తం సమాచారం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే, భారత ఎన్నికల సంఘానికి చెందిన పోర్టల్ ద్వారా కూడా కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. భారత ఎన్నికల సంఘాన్ని 25 జనవరి 1950న స్థాపించడం జరిగింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎన్నికల సంఘం స్థాపన రోజున జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించేందుకు 18 ఏళ్లు నిండిన యువకులకు గుర్తింపు కార్డులను అందజేసి ప్రతి సంవత్సరం ఓటర్లను ఓటు వేయమని ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం ఓటరు దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ ఎంచుకుంటారు. ఈ ఏడాది ఓటర్ల దినోత్సవం ఇతివృత్తం 'సాధికారత, జాగరూకత, రక్షణ'. (చదవండి: మీరు ధరలు పెంచుతూ పోతే.. మేం చూస్తూ ఊరుకుంటామా ?) -
డిజిటల్ ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!
న్యూఢిల్లీ: మీకు ఓటు హక్కు ఉందా? ఓటు వేస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. మీరు మీ ఓటర్ కార్డును ఆన్లైన్లోనే సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల సంఘం కొత్తగా ఈ-ఎపిక్(ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్) సౌకర్యాన్ని ఓటర్లకు కల్పించింది. భారతదేశంలోని రాబోయే ఐదు రాష్ట్ర ఎన్నికల కోసం ఓటర్లు ఈ కొత్త డిజిటల్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ-ఎపిక్ కార్డును మీ మొబైల్ లేదా కంప్యూటర్ లో సురక్షితంగా పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: భారతీయ రైల్వే సరికొత్త రికార్డు!) కొత్త ఓటర్ కార్డు కోసం 2020 నవంబర్-డిసెంబర్ సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు 2021 జనవరి 25 నుంచి 31 మధ్య ఈ-ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర సాధారణ ఓటర్లు 2021 ఫిబ్రవరి 1 నుంచి ఈ-ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డిజిటల్ ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఓటరు పోర్టల్: http://voterportal.eci.gov.in/ లేదా https://www.nvsp.in/ అనే వెబ్‌సైట్‌కు వెళ్లి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మీకు కింది వైపు నుంచి రెండో లైన్లో కనిపించే లింకుపై క్లిక్ చేసి మీరు ఈ-ఎపిక్ ను పొందొచ్చు. మొబైల్ నెంబర్ మాత్రం కచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి. లేదంటే ఇకేవైసీపై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి. అలాగే ఓటర్ కార్డులో తప్పులు ఉన్నా, రిప్లేస్మెంట్ పొందాలన్నా మీరు మీ పూని పూర్తి చేసుకోవచ్చు. -
ఓటుకు మిగిలింది ఒక్క రోజే..
సాక్షి, చిత్తూరు : ఏప్రిల్ 11న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 15 వరకు మాత్రమే ఓటు హక్కు పొందేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని వారు ఓటుకోసం నమోదు చేసుకోవాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. ఈ ఒక్కరోజు పూర్తయితే ఓటు నమోదుకు అవకాశం ఉండదని అధికారులు విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. నమోదు కోసం ఫారం–6 2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన యువత అందరూ ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం చేయాల్సింద ల్లా ఆన్లైన్లో ఫారం–6 దరఖాస్తు చేయడమే. ఆన్లైన్లో www.ceoandhra.nic.in వెబ్సైట్లో ఫారం–6 దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఒక ఫోటో, ఆధార్‌కార్డు, వయస్సు ధ్రువీకరణపత్రం, నివాస స్థల ధ్రువీకరణపత్రాన్ని అప్లోడ్ చేయాలి. ఆ తరువాత విచారణ కోసం సంబంధిత పోలింగ్ కేంద్రం బీఎల్వో ఇంటికి వద్దకే వస్తారు అప్పుడు వారికి ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ వివరాలు, చిరునామా తప్పుగా ఉండడం, పేరు తప్పుగా ఉండడం, ఫోటో సరిగా లేకపోవడం లాంటివి ఉన్నాయి. అలాంటి వారు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందువల్ల ఓటరు జాబితాలో పేర్లకు సంబంధించి ఆక్షేపణ, తొలగించడానికి సంబంధించిన ఫారం–7 దరఖాస్తుల స్వీకరణ నిలిపివేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో ఫారం–7కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. సర్వర్ మొరాయింపు ఓటు హక్కు పొందేందుకు శుక్రవారమే చివరి రోజు కావడంతో ఆన్లైన్ సర్వర్ మొరాయిస్తోంది. చివరి రోజు ముగిస్తే ఆ తరువాత వచ్చే దరఖాస్తులను స్వీకరించలేదని, అలా దరఖాస్తు చేసుకునే వారి పేర్లు ఓటర్ల జాబితా నమోదు కావని ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. దీంతో ఓటు హక్కు లేని వారు, గతంలో ఉన్నా పలు కారణాలతో బీఎల్వోలు చేసిన తప్పిదాలకు ఓట్లు పొగొట్టుకున్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో సర్వర్ మొరాయిస్తుండడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్ సెంటర్లు, మీ–సేవ కేంద్రాల్లో ప్రయత్నిస్తుంటే ‘దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్’ అని వస్తోంది. ఓటు నమోదుకు ఆన్లైన్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మ్యానువల్‌గా దరఖాస్తులు అందించాలనుకుంటే బీఎల్వోలు అందుబాటులోలేరు. నూతన ఓటర్లకు 1,11,660 కార్డులు జిల్లాలో ఇటీవల ఓటు దరఖాస్తు చేసుకున్న వారికి నూతన ఓటరు కార్డులను అందివ్వనున్నా రు. అందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి జిల్లాకు 1,11,660 ఎపిక్ ఓటరు కార్డులు రానున్నాయి. వచ్చే ఓటరు కార్డులను తహసీల్దార్లకు చేర్చి వారి ద్వారా సంబంధిత ఓటర్లకు సరఫరా చేయనున్నారు. తంబళ్లపల్లె : 5,415 పీలేరు : 4,096 మదనపల్లె : 10,089 పుంగనూరు : 8,791 చంద్రగిరి : 13,980 తిరుపతి : 17,921 శ్రీకాళహస్తి : 8,357 సత్యవేడు : 6,039 నగరి : 6,704 జీడీనెల్లూరు : 5,537 చిత్తూరు : 8,225 పూతలపట్టు : 5,298 పలమనేరు : 7,501 కుప్పం : 3,707 -
ఎపిక్ కార్డు ఉన్నా జాబితాలో లేకపోతే ఓటు ఉండదు
విజయనగరం గంటస్తంభం: ఓటర్లు గుర్తింపు కార్డు (ఎపిక్‌కార్డు) ఉన్నా ఓటర్ల జాబితాలో పేరు లేకుంటే ఓటు వేసే అవకాశం ఉండదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిజవహర్‌లాల్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీల్లో ఓటు నమోదుకు ప్రత్యేక కార్యక్రమని, ఓటు లేని వారు నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో ఓటు వేసిన వారు, ఎపిక్ కార్డులు ఉన్న వారు ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో పేర్లు లేకుంటే వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారులు తుది ఓటర్ల జాబితాతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటారని, ఒకసారి పరిశీలించుకుని, ఓటు లేకుంటే వెంటనే నమోదు చేసుకోవచ్చుని పేర్కొన్నారు. నిరాక్షరాస్యులకు బీఎల్వోలు చదివి వినిపిస్తారని, రాజకీయ పార్టీలు బూత్ సహాయకులను నియమించాలని తెలిపారు. వారు పోలింగ్ కేంద్రాల వద్ద హాజరై ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హత ఉన్న ఓటర్ల నమోదుకు సహకరించి ఫారం–6 దరఖాస్తు చేయించాలన్నారు. ఓటు నమోదుకు ఫారం–6, తొలగింపునకు ఫారం–7, తప్పుల సవరణకు ఫారం–8, ఓటు బదిలీకి ఫారం–8ఎ దరఖాస్తులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ప్రజలకు అవగహన కల్పించేందుకు అన్ని పంచాయతీల్లో టాంటాం ద్వారా, మున్సిపాల్టీల్లో లౌడు స్పీకర్లు ద్వారా విస్తృత ప్రచారం చేస్తామన్నారు. రాజకీయ పార్టీలకు గురువారం ఉదయం సమావేశం ఏర్పాటు చేసి సహకరించాలని కోరినట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్ఓ వెంకటరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ప్రసాద్ పాత్రో, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రేపటి వరకు ఓటర్ల తుది జాబితా
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : శుక్రవారం నాటికి జిల్లా ఓటర్ల తుది జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18-19 సంవత్సరాలు గల యువత 67,716 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. 14,988 మంది బోగస్ ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. జిల్లాలో ఓటర్లందరికీ ఎపిక్ కార్డులు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో 83పోలింగ్ కేంద్రాలకు ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం లేదని, ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయిలో తొమ్మిది, ఏటూరునాగారంలో 18, గోవిందరావుపేటలో 14 గ్రామాలు, మహబూబాబాద్ నియోజకవర్గంలో 22గ్రామాలకు ఎటువంటి కమ్యూనికేషన్స్ లేనట్లు తెలిపారు. పోలీసు బందోబస్తుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, నోడల్ అధికారులను ఏర్పాటు చేశామని చెప్పారు. మేడారం జాతర దృష్ట్యా ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు ఎంపీడీవోల బదిలీలను జాతర అనంతరం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కోరగా.. ఎన్నికల కమిషనర్ అనుమతించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, కమిషనర్ పాండాదాస్, డీఆర్వో సురేందర్‌కరణ్ పాల్గొన్నారు.