పోలింగ్ బూత్ ఎక్కడో తెలియడం లేదా? మన ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో మొబైల్ నంబర్ సాయంతో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న లోక్‌సభకు పోలింగ్ జరగనుండటం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఓటర్ ఐడీ కార్డు సాయంతో సులువుగా తెలుసుకోవచ్చు. ఓటరు ఐడీలో ఇంగిŠల్‌ష్ అక్షరాలు, 10 అంకెలతో కూడిన ఎపిక్ ఐడీ పోలింగ్ బూత్‌ను గుర్తించడానికి కీలకమవుతుంది. ఏ కారణంతోనైనా కార్డు అందుబాటులో లేని వారు ఆన్‌లైన్‌లోనే ఎపిక్ నంబర్ గురించి తెలుసుకోవచ్చు.
ఇలా చేస్తే సరి
ఎపిక్ నంబర్ కోసం ఈసీ పోర్టల్ (voters. eci.gov.in)ను సందర్శించాలి. అందులో కుడివైపు కనిపించే సర్వీసెస్ విభాగంలో ‘ఈ–ఎపిక్ డౌన్‌లోడ్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత వచ్చే పేజీలో సైనప్‌ను ఎంపిక చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి, కంటిన్యూ చేయాలి. తర్వాత పేరు నమోదు చేసి, పాస్‌వర్డ్ ఎంపిక చేసుకోవాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంపిక చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పటికే ఖాతా ఉన్న వారు సైనప్ చేయనవసరం లేదు.
మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఖాతాలోకి లాగిన్ అవడం ద్వారా ఈ–ఎపిక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలా ఎపిక్ నంబర్ తెలిసిపోతుంది. తర్వాత సైట్ హోం పేజీలో కుడివైపున ఉన్న ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ ఎంపిక చేసుకోవాలి. వచ్చే ప్రత్యేక పేజీలో ఎపిక్ నంబర్ నమోదు చేయాలి. రాష్ట్రం ఎంపిక చేసుకుని క్యాప్చా కోడ్ నమోదు చేసి సెర్చ్ బటన్ ఓకే చేయాలి. మీ పోలింగ్ బూత్‌తో పాటు పోలింగ్ స్టేషన్ ఆఫీసర్ తదితర వివరాలు కూడా లభిస్తాయి. ఇదే పోర్టల్ నుంచి ఫిర్యాదులు సైతం దాఖలు చేయవచ్చు. ఎపిక్ నంబర్ ఉన్న వారు నేరుగా సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఆప్షన్‌కు వెళ్లవచ్చు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment