mobile number
-
బ్యాంకుకు వెళ్లకుండానే.. మొబైల్ నెంబర్ అప్డేట్: ఇలా చేస్తే సింపుల్
టెక్నాలజీ విపరీతంగా పెరిగిన తరుణంలో దాదాపు ఏ పని చేయాలన్నా.. ఇంట్లో కూర్చునే చేసేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలైతే మరీ సులభమైపోయాయి. కానీ ఇంకా చాలామందికి తెలియని విషయాలు లేకపోలేదు. కాబట్టి ఈ కథనంలో 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ (Mobile Number) ఎలా మార్చుకోవాలి? ఎక్కడ మార్చుకోవాలి? అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking) ద్వారా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్➤ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న యూజర్లు లేదా కస్టమర్లు తమ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే.. ముందు ఎస్బీఐ అధికారిక నెట్ బేకింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤కుడివైపు కనిపించే కంటిన్యూ టూ లాగిన్ మీద క్లిక్ చేసి.. తరువాత యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.➤అక్కడ కనిపించే చేంజ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి.➤క్లిక్ చేసిన తరువాత మీరు మార్చాలనుకున్న మొబైల్ నెంబర్ లేదా కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.ఏటీఎం (ATM) ద్వారా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్ఏటీఎం కేవలం మీ ఖాతాలోని నగదు విత్‌డ్రా చేసుకోవడానికి, డిపాజిట్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. అవసరమైనప్పుడు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కూడా మార్చుకోవడానికి సహాయపడుతుంది.➢ముందుగా మీ సమీపంలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్ళండి.➢మీ దగ్గరున్న డెబిట్ కార్డ్‌ని ఏటీఎం మెషీన్‌లోకి చొప్పించి.. పిన్ నెంబర్ ఎంటర్ చేయండి.➢పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత స్క్రీన్ మీద కనిపించే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ సెలక్ట్ చేసుకోండి.➢తరువాత మొబైల్ నెంబర్ చేంజ్ ఆప్షన్ ఎంచుకోవాలి.➢ఆప్షన్ ఎంచుకున్న తరువాత మీ పాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. తరువాత కొత్త నెంబర్ ఎంటర్ చేయాలి. ఇలా చేసినప్పుడు మీకు ఓటీపీ నెంబర్లు వస్తాయి. వీటిని ఎంటర్ చేయడం ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది.ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా మాత్రమే కాకుండా మీరు బ్యాంకును సంప్రదించి కూడా మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. అయితే దీనికి కావలసిన డాక్యుమెంట్స్ బ్యాంకులో అందించాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంకులు వెళ్లలేని వారు పైన చెప్పిన రెండు పద్దతుల ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఎందుకుసాధారణంగా మనం డబ్బు విత్‌డ్రా చేసినా లేదా డిపాజిట్ చేసినా, ఖాతాలో ఎంత ఉండనే విషయం తెలుసుకోవాలంటే తప్పకుండా బ్యాంకుకు వెళ్లాల్సి ఉండేది. కానీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల.. మీ లావాదేవీలకు సంబంధించిన విషయాలు మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. కాబట్టి ప్రత్యేకించి మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ద్వారా బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి కూడా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు. -
మీ డాడీ దగ్గర రూ.2,000 అప్పుగా తీసుకున్నాను..
బంజారాహిల్స్: మీ డాడీ దగ్గర రూ.2,000 అప్పుగా తీసుకున్నాను..వాటిని ఇద్దామంటే ఆయన మొబైల్ నెంబర్ పోగొట్టుకున్నాను..నీ నెంబర్‌ను అప్పుడెప్పుడో ఫీడ్ చేసుకున్నాను..మీ పేరు, మీ నాన్న పేరు ఇదే కదా? అంటూ ఓ వ్యక్తి తియ్యటి మాటలతో సైబర్ వల విసిరి గృహిణికి అప్పు చెల్లించే ముసుగులో మోసం చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొత్త రకంగా చక్కటి ప్లాన్‌తో సైబర్ మోసగాడు ఆమెను నమ్మించి మాటల్లో దింపి తికమకపెట్టి రూ.35 వేలు తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1లో నివసించే స్వాగతారాయ్ అనే గృహిణికి సైబర్ మోసగాడు ఫోన్ చేసి మీ డాడి అశోక్‌కుమార్ శర్మకు తాను రూ.2000 బాకీ ఉన్నానని, వాటిని జీపే చేస్తానని ఆమెకు చెప్పాడు. తన పేరు, తండ్రి పేరు కరెక్ట్‌గానే చెబుతున్నాడు కదా అని ఆమె నమ్మి జీపే చేయమంది. వెంటనే ఆయన రూ.10,000 ఒకసారి, రూ.20,000 ఒకసారి మీ అకౌంట్‌కు పంపించాను, నీకు మెసేజ్ వచి్చంది చూసుకో అని చెప్పాడు. ఆ మేరకు ఫోన్‌కు మెసేజ్ కూడా వచ్చింది. కొద్దిసేపట్లోనే రూ.12,000 మరోసారి పంపించాడు. ఆమెకు ఆ మెసేజ్ కూడా వచ్చింది. రెండు నిమిషాల తర్వాత ఫోన్ చేసి పొరపాటున రూ.40,000 పంపాను..రెండు వేలు కట్ చేసుకుని రూ.38 వేలు తనకు తిరిగి జీపే చేయాలని ఆమెను తికమకపెట్టాడు. బాలింతరాలు అయిన ఆమె ఓ వైపు చిన్నారి ఏడుస్తుండడం, ఇంకోవైపు తన చికాకు..ఈ గొడవలోనే రూ.38 వేలు బదిలీ చేసింది.మరుక్షణంలోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.38 వేలు వెళ్లడం, తన ఖాతా జీరో అని చూపించడంతో వెంటనే ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. భర్త వెంటనే గంట వ్యవధిలోనే (గోల్డెన్ అవర్) బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. వెంటనే పోలీసులు ఇది సైబర్ మోసమని గుర్తించి ఆమెకు వచి్చనవి నకిలీ మెసేజ్‌లు అని తెలుసుకుని సైబర్ మోసగాడి ఖాతాను ఫ్రీజ్ చేశారు. గంట వ్యవధిలోనే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో సైబర్ మోసగాడి నుంచి డబ్బులు రికవరీ అయ్యే ఛాన్స్‌ను ఆమె పొందింది. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే గంట సేపట్లోనే గోల్డెన్ అవర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్కు మారుతున్నారా?.. నచ్చిన నెంబర్ ఎంచుకోండిలా
జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ నెట్వర్క్స్ అన్నీ కూడా రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచిన తరువాత.. అందరి చూపు బీఎస్ఎన్ఎల్ వైపు పడింది. దీంతో ఇప్పటికే చాలామంది తమ నెట్‌వర్క్‌ను బీఎస్ఎన్ఎల్కు మార్చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం తక్కువ ధరలోనే అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది.ఎక్కువమంది బీఎస్ఎన్ఎల్కు మారుతున్న తరుణంలో సంస్థ కూడా తన నెట్‌వర్క్‌ను విస్తరించడానికి తగిన సన్నాహాలు చేస్తోంది. తమ నెట్‌వర్క్‌కు మారాలనుకునే వారికోసం బీఎస్ఎన్ఎల్ నచ్చిన నెంబర్ ఎందుకుని వెసులుబాటు కూడా కల్పించింది. ఆన్లైన్లో యూజర్ ఇప్పుడు ఫేవరేట్ నెంబర్ సెలక్ట్ చేసుకోవచ్చు.ఆన్లైన్లో నెంబర్ ఎంచుకోవడం ఎలా?గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్‌లో BSNL Choose Your Mobile Number అని సెర్చ్ చేయాలి.ఇలా సెర్చ్ చేసిన వెంటనే BSNL CYMN అనేది కనిపిస్తుంది. దీనిపైనా క్లిక్ చేయగా మరో పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్ అని నాలు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీ జోన్ సెలక్ట్ చేసుకుని రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.ఇలా ఎందుకున్న తరువాత ఛాయిస్ నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. కావాల్సిన ఆప్షన్ ఎందుకున్న తరువాత నెంబర్ సెలక్ట్ చేసుకోవచ్చు.నచ్చిన నెంబర్ ఎంచుకున్న తరువాత రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.ప్రక్రియ పూర్తయ్యాక సమీపంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లి సీఎం తెచ్చుకోవచ్చు. ఫ్యాన్సీ నెంబర్ కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. -
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్‌తో
పోలింగ్ బూత్ ఎక్కడో తెలియడం లేదా? మన ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో మొబైల్ నంబర్ సాయంతో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న లోక్‌సభకు పోలింగ్ జరగనుండటం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఓటర్ ఐడీ కార్డు సాయంతో సులువుగా తెలుసుకోవచ్చు. ఓటరు ఐడీలో ఇంగిŠల్ష్ అక్షరాలు, 10 అంకెలతో కూడిన ఎపిక్ ఐడీ పోలింగ్ బూత్‌ను గుర్తించడానికి కీలకమవుతుంది. ఏ కారణంతోనైనా కార్డు అందుబాటులో లేని వారు ఆన్లైన్లోనే ఎపిక్ నంబర్ గురించి తెలుసుకోవచ్చు. ఇలా చేస్తే సరి ఎపిక్ నంబర్ కోసం ఈసీ పోర్టల్ (voters. eci.gov.in)ను సందర్శించాలి. అందులో కుడివైపు కనిపించే సర్వీసెస్ విభాగంలో ‘ఈ–ఎపిక్ డౌన్లోడ్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత వచ్చే పేజీలో సైనప్ను ఎంపిక చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి, కంటిన్యూ చేయాలి. తర్వాత పేరు నమోదు చేసి, పాస్వర్డ్ ఎంపిక చేసుకోవాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంపిక చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పటికే ఖాతా ఉన్న వారు సైనప్ చేయనవసరం లేదు. మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఖాతాలోకి లాగిన్ అవడం ద్వారా ఈ–ఎపిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఎపిక్ నంబర్ తెలిసిపోతుంది. తర్వాత సైట్ హోం పేజీలో కుడివైపున ఉన్న ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ ఎంపిక చేసుకోవాలి. వచ్చే ప్రత్యేక పేజీలో ఎపిక్ నంబర్ నమోదు చేయాలి. రాష్ట్రం ఎంపిక చేసుకుని క్యాప్చా కోడ్ నమోదు చేసి సెర్చ్ బటన్ ఓకే చేయాలి. మీ పోలింగ్ బూత్‌తో పాటు పోలింగ్ స్టేషన్ ఆఫీసర్ తదితర వివరాలు కూడా లభిస్తాయి. ఇదే పోర్టల్ నుంచి ఫిర్యాదులు సైతం దాఖలు చేయవచ్చు. ఎపిక్ నంబర్ ఉన్న వారు నేరుగా సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఆప్షన్‌కు వెళ్లవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ సిమ్ వేలంలో..ఏకంగా అన్ని కోట్లా..!
ప్రత్యేక సీరిస్తో కూడిన నెంబర్లతో కూడిన ఫోన్ నెంబర్లకు, నంబర్ ప్లేట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆ నెంబర్ సీరీస్‌తో కూడిన ఫోన్లు, కార్లు సొంతం చేసుకునేందుకు జనాలు ఎగబడుతుంటారు. ఎంత డభైనా ఖర్చుపెడతారు. అలానే ఓ ప్రత్యేక సిరీస్‌తో కూడిన మొబైల్ సిమ్‌ని వేలం వేయగా ఎన్ని కోట్లు పలికిందో వింటే కంగుతింటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే..ఆ ఫ్యాన్సీ నెంబర్ సిరీస్‌కి తగ్గట్టుగా ధరకు అమ్ముడుపోతే ఇది కలా నిజమా అనిపిస్తుంది. అలాంటి సన్నివేశమే ఇక్కడ చోటుచేసుకుంది. ఇది ఎక్కడ జరిగిందంటే..?దుబాయ్ ఛారిటీ వేలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ది మోస్ట్ నోబుల్ నంబర్స్ ఏడు సిరీస్‌తో ఉన్న ఉన్న సిమ్ 058-7777777 వేలంలో ఏకంగా ఏడు కోట్లకు అమ్ముడుపోయింది. ఆ సిమ్ నెంబర్ సంఖ్యలోనే ధర కూడా అనూహ్యంగా పలకడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి వేలాన్ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ రషీద్ అల్ ముక్తూమ్ ప్రారంభించారు. దీన్ని దాదాపు రూ. 100 కోట్ల మదర్స్ ఎండోమెంట్ ప్రచారానికి మద్దుతుగా ఇలా పది నెంబర్ల ఫ్యాన్సీ కార్ల నెంబర్ ప్లేట్లు, 21 ప్రత్యేకమైన మొబైల్ నెంబర్లను వేలం వేస్తున్నారు. అయితే ఇంతవరకు వేలంలో చాలా నెంబర్లు కోట్లలో అమ్ముడుపోయినా.. ఈ 7 నెంబర్ సిరీస్‌తో ఉన్న సిమ్‌పై మాత్రం తీవ్ర ఉత్కంఠ పోటీ తలెత్తింది. ప్రారంభంలోనే రూ. 22 లక్షల నుంచి మొదలై ఏకంగా చివరి రూ. 7 కోట్లకు అమ్ముడు పోడం విశేషం. అలాగే ఈ 5 సీరిస్(054-5555555) సిమ్‌పై కూడా తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ సీరిస్ కూడా వేలంలో ఏకంగా రూ. 23 కోట్ల వరకు పలకడం విశేషం. మొత్తం ఈ ఫ్యాన్సీ నెంబర్లతో కూడిన మొబైల్ నెంబర్లు వేలంలో దాదాపు రూ. 86 కోట్లు దాకా వసూలు చేశాయి. అలాగే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు కూడా ఈ వేలంలో రూ 65 కోట్లు దాక పలికాయి. గతేడాది కూడా ఇలా ఫ్యాన్సీ సిరీస్‌తో కూడిన నెంబర్ ప్లేట్లు ఏకంగా రూ. 124 కోట్లు పలికి దుబాయ్ పేరు వార్తల్లో నిలిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం సంపద బాగా ఉన్నవాళ్లే ఇలాంటి పనులకు పూనుకుంటారు. ఇదొక పిచ్చి, డబ్బు దుర్వినియోగం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. In Dubai, a sim card with a unique phone number was sold for AED 3.2 Million ($871,412) in auction pic.twitter.com/lYQoW2OxZj — Historic Vids (@historyinmemes) April 2, 2024 (చదవండి: ఇసుక లేకుండానే ఇల్లు కట్టేయొచ్చట! ఎలాగో తెలుసా..!) -
మొబల్ నంబర్ పోర్టింగ్‌కు కొత్త రూల్
-
60 వేలమందికి మొబైల్ నెంబర్ ఇచ్చిన సీఈఓ - ఎందుకంటే?
సాధారణంగా ఒక కంపెనీ సీఈఓను కలవాలన్నా.. లేదా మాట్లాడాలన్నా పర్మిషన్ / అపాయింట్మెంట్ వంటి ప్రాసెస్ ఉంటాయి. కానీ ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ అడిడాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'బిజార్న్ గుల్డెన్' (Bjorn Gulden) ఇటీవల కంపెనీలో పనిచేసే 60000 మంది ఉద్యోగులకు తన మొబైల్ నెంబర్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. 2023 జనవరిలో అడిడాస్ కంపెనీ సీఈఓగా గుల్డెన్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో సంస్థ కొన్ని ఆర్థిక నష్టాల్లో ఉండేది. అంతే కాకుండా అడిడాస్.. అమెరికన్ రాపర్ కాన్యే వెస్ట్‌తో సంబంధాలను తెంచుకుంది. అలాంటి ఒడిదుడుకులను దాటుకుంటూ కంపెనీ లాభాల్లో పయనించేలా చేసిన ఈయన పనిలో పారదర్శకతను పెంచడానికి తన మొబైల్ నెంబర్ ఇచ్చినట్లు వెల్లడించారు. గుల్డెన్ తన మొబైల్ నెంబర్ ఇచినప్పటి నుంచి 200 కాల్స్ వచ్చాయని.. వ్యాపారంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆ కాల్స్ ద్వారా వెల్లడించినట్లు తెలిపారు. 1990 తరువాత గుల్డెన్ అడిడాస్ వదిలి ప్యూమా కంపెనీలో చేరాడు. ఆ తరువాత 2023 జనవరిలో అడిడాస్‌కు తిరిగి వచ్చాడు. గుల్డెన్ తిరిగి కంపెనీయికి రావడంతో సంస్థ షేర్లు దాదాపు రెండింతలు పెరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా కంపెనీ ప్రత్యర్థి నైక్ కంటే మెరుగైన పనితీరు కనబరిచింది. ఇదీ చదవండి: టెక్ దిగ్గజాల్లో అలజడి.. నాలుగు కంపెనీలలో 50000 మంది స్వతహాగా ఫుట్‌బాల్ ఆటగాడైన గుల్డెన్.. కంపెనీలో అనేక మార్పులు చేశారు. సంస్థ ఉత్పత్తులను క్రికెట్ రంగానికి మరింత దగ్గర చేశారు. 2023లో భారత క్రికెట్ జట్టుతో బ్రాండ్ స్పాన్సర్షిప్ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, సంస్థ మూడు నెలల్లో భారతదేశంలో 6,00,00 జెర్సీలను విక్రయించింది. రాబోయే రోజుల్లో అడిడాస్ మరింత వృద్ధి సాదిస్తుందని పలువురు ఆశిస్తున్నారు. -
ఆరు గ్యారంటీలకు ఈ నంబర్‌తో లింక్
హైదరాబాద్: ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు అర్హత సాధించేందుకు ‘ఆధార్’ తప్పనిసరిగా కావడంతో కొత్తగా నమోదు, అప్డేషన్ కోసం ఉరుకులు పరుగులు ప్రారంభమయ్యాయి. ఆధార్ అనుసంధానం గుర్తింపులో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా, సులభంగా ప్రక్రియ పూర్తి అయ్యేందుకు అప్డేషన్ చేయాల్సిందే. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆధార్ కేంద్రాల ఎదుట భారీ సంఖ్య జనం బారులు తీరుతున్నారు. వివాహం కావడం, ఇంటి పేరు, కేరాఫ్, చిరునామా, ఉద్యోగ, ఉపాధి రీత్యా, నివాసం, మొబైల్ నంబర్ మారడంతో అప్డేషన్ ఆవశ్యకత ఎదురైంది. తాజాగా ఆరు గ్యారంటీల నేపథ్యంలో ఆధార్ నవీకరించుకునేందుకు పోటెత్తుతున్నారు. అన్నింటికీ ఇదే ఆధారం.. అన్నింటికీ ‘ఆధార్’ ఆధారమవుతోంది. పూరి గుడిసెల్లో నివసించే నిరుపేదల నుంచి విలాసవంతమైన భవంతుల్లో జీవించే సంపన్నుల వరకు తప్పనిసరిగా మారింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తప్పకుండా కావాల్సింది ఆధార్ కార్డు. ఎందుకంటే.. ప్రతి పౌరుడికి భారత ప్రభుత్వం కేటాయించే విశిష్ట గుర్తింపు సంఖ్య ఉంటుంది. అది బహుళ ప్రయోజనకారిగా మారి ప్రతిదానికీ ఆధారంతో పాటు అనుసంధానమవుతోంది. ప్రభుత్వ పనులైనా.. ప్రైవేటు పనులు ముందుకు సాగాలంటే ఆధార్ నంబర్ ఉండాల్సిందే.. ప్రతి కుటుంబానికి నిత్యవసరమైన వంట గ్యాస్, మొబైల్ సిమ్ కనెక్షన్ నుంచి పిల్లల స్కూల్లో అడ్మిషన్, స్థిర, చర ఆస్తుల రిజి్రస్టేషన్లు. ప్రభుత్వ పథకాలైన రేషన్ కార్డు, సామాజిక పింఛ¯న్, స్కాలర్ షిప్‌తో పాటు బ్యాంకింగ్, బీమా తదితర అన్నింటికీ ఆధార్ తప్పనిసరి. పన్నులు తదితర పనులకూ ఆధార్ అవసరమే.. అంచనా జనాభా కంటే.. విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో అంచనా జనాభా కంటే ఆధార్ నమోదు సంఖ్య దాటింది. ఇతర రాష్ట్రాలు నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న వారితో ఆధార్ నమోదు సంఖ్య ఎగబాకుతోంది. మహా నగరంలో ఏటా జనాభా వృద్ధి రేటు 8 నుంచి 12 శాతానికిపైగా పెరుగుతోంది. 2023 చివరి నాటికి అంచనా జనాభా ప్రకారం 1.50 కోట్లకు చేరగా.. దానికి మించి ఆధార్ నంబర్లు సంఖ్య జారీ అయినట్లు యూఐడీఏఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మహానగరానికి వలస వస్తున్నవారిలో సుమారు 34 శాతం ఇక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో జనాభాకు అనుగుణంగా ఆధార్ నమోదు సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది కాలంగా ఆధార్ నమోదు సంఖ్య బాగా ఎగబాకింది. ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్య పొందిన వారిలో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నట్లు యూఐడీఏఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. -
ఇక ప్రత్యేక గుర్తింపుతోనే మొబైల్ నంబర్!
సాక్షి, అమరావతి: సైబర్ వేధింపులు, ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారునికి ‘యూనిక్ ఐడీ(ప్రత్యేక గుర్తింపు) నంబర్’ కేటాయించాలని నిర్ణయించింది. ఓ వ్యక్తికి ఎన్ని మొబైల్ ఫోన్లు ఉన్నా, ఎన్ని సిమ్ కార్డులు ఉన్నా సరే.. ఐడీ నంబర్ మాత్రం ఒకటే ఉండేలా కార్యాచరణను రూపొందించింది. ఈ ఏడాది చివరినాటికే ఈ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. జనాభా కంటే సిమ్కార్డులే అధికం..! మొబైల్ టెక్నాలజీ ప్రజలకు ఎంత సౌలభ్యంగా ఉందో.. సైబర్ నేరస్తులకు అంత ఉపయోగకరంగా మారిందన్నది వాస్తవం. దేశంలో అత్యధిక ప్రాంతాల్లో జనాభా కంటే మొబైల్ ఫోన్లు/సిమ్ కార్డులే అధికంగా ఉండటం గమనార్హం. 2022 డిసెంబర్ నాటికి దేశంలో 114 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు 10.7 కోట్లుండగా.. ప్రైవేటు టెలికాం కంపెనీల కనెక్షన్లు 102 కోట్లకుపైనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న టెలికాం నిబంధనల మేరకు జమ్మూ–కశీ్మర్, ఈశాన్య రాష్ట్రాల్లో మినహా మిగిలిన చోట్ల ఒక వ్యక్తి పేరిట గరిష్టంగా 9 సిమ్ కార్డులు ఉండవచ్చు. జమ్మూ–కశీ్మర్, ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్టంగా 6 సిమ్ కార్డులు ఉండవచ్చు. కానీ ప్రైవేటు టెలికాం కంపెనీల ఫ్రాంచైజీలు కొన్ని సిమ్ కార్డుల విక్రయంలో నిబంధనలను పాటించడం లేదు. దీంతో సైబర్ నేరస్తులు వేర్వేరు పేర్లతో ఫోన్ కనెక్షన్లు, సిమ్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. 2022లో భారత్‌లో జరిగిన సైబర్ మోసాలు, వేధింపుల్లో 65 శాతం దొంగ సిమ్‌కార్డులతో చేసినవేనని నేషనల్ సైబర్ సెల్ నివేదిక వెల్లడించింది. వేర్వేరు పేర్లతో సిమ్ కార్డులు తీసుకొని ఆన్లైన్ మోసాలకు పాల్పడటంతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. 2022లో దేశంలో నమోదైన మొత్తం నేరాల్లో.. సోషల్ మీడియాకు సంబంధించినవే 12 శాతం ఉండటం గమనార్హం. 14 అంకెలతో యూనిక్ ఐడీ నంబర్.. సోషల్ మీడియా వేధింపులు, ఆన్లైన్ మోసాల కట్టడికి దేశంలో మొబైల్ ఫోన్ల కనెక్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. టెలికాం శాఖతో కలసి కార్యాచరణను రూపొందించింది. మొబైల్ వినియోగదారులు అందరికీ యూ నిక్ ఐడీ నంబర్ కేటాయించాలని నిర్ణయించింది. ఇది 14 అంకెలతో ఉండనుంది. ఓ వ్యక్తి పేరిట ఎన్ని ఫోన్ కనెక్షన్లు ఉన్నా సరే యూనిక్ ఐడీ నంబర్ మా త్రం ఒక్కటే ఉంటుంది. దేశంలో ఎక్కడ సిమ్ కార్డు కొనుగోలు చేసినా.. ఏ ప్రాంతంలో ఫోన్‌ను ఉపయోగిస్తున్నా సరే యూనిక్ ఐడీ నంబర్ మాత్రం అదే ఉంటుంది. వినియోగదారుల ఫోన్‌కు మెసేజ్ పంపించి.. ఓటీపీ ద్వారా నిర్ధారించి.. యూనిక్ ఐడీ నంబర్ కేటాయించాలని కేంద్ర టెలికాం శాఖ భావిస్తోంది. త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుంది. ‘అస్త్ర’ అప్డేట్.. సిమ్‌కార్డు మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన కేంద్ర టెలికాం శాఖకు చెందిన ‘అస్త్ర’ సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించనున్నారు. మొబైల్ కనెక్షన్ల కోసం సమర్పించిన గుర్తింపు కార్డులు, ఫొటోలు సక్రమంగా ఉన్నాయో, లేదో గుర్తించడంతోపాటు సంబంధిత దరఖాస్తుదారులకు అప్పటికే యూనిక్ ఐడీ నంబరు కేటాయించారా, లేదా అనే విషయాలను కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలించనున్నారు. తద్వారా నకిలీ సిమ్‌కార్డులు, వేర్వేరు పేర్లతో ఉన్న సెల్‌ఫోన్ కనెక్షన్లకు చెక్ పెడతాఱు. ఈ విధానం ద్వారా ఎక్కడైనా సైబర్ కేసు నమోదవ్వగానే.. నిందితులను సులభంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ సిమ్ కార్డు ఎవరి పేరుతో ఉంది.. యూనిక్ ఐడీ నంబర్‌తో సరిపోలుతోందా, లేదా అనే విషయాలను నిర్ధారించవచ్చని పేర్కొన్నారు. -
మొబైల్ నంబర్.. మీకు నచ్చినట్టు..
ఈరోజుల్లో ప్రతిఒక్కరికీ మొబైల్ ఫోన్ ఉంటుంది. ఫోన్ లేనివారు ఉండటం చాలా అరుదు. ఇప్పుడన్నీ డ్యుయల్ సిమ్ ఫోన్ కావడంతో చాలా మందికి రెండు ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. ఇంకొంత మందికి అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఏదైనా టెలికామ్ సంస్థ నుంచి కొత్తగా సిమ్ తీసుకుంటున్నప్పుడు చాలామంది తమకు నచ్చిన కస్టమైజ్డ్ మొబైల్ నంబర్లను ఇష్టపడతారు. కొంతమందికి ప్రత్యేకమైన ఇష్టమైన నంబర్లు ఉంటే, మరికొందరు కొన్ని నంబర్లను అదృష్టంగా భావిస్తారు. ఇలా మంచి నంబర్ల కలయిక కోసం శోధిస్తారు. అయితే తమకు కావలసిన నంబర్ కాంబినేషన్లను ఎంచుకునే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్‌తో సహా భారతీయ టెలికాం మార్కెట్లోని కొన్ని కంపెనీలు ఆసక్తిగల సబ్స్క్రైబర్లకు వారికి నచ్చిన మొబైల్ నంబర్ల నిర్దిష్ట అంకెలను అందిస్తున్నాయి. వీటిలో రిలయన్స్ జియో తక్కువ ధరకే ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు కావాల్సిన నిర్దిష్టమైన మొబైల్ నంబర్లను అందిస్తోంది. ఈ ఛాయిస్ నంబర్ స్కీమ్ ద్వారా కస్టమర్లు పూర్తి నంబర్‌ను ఎంచుకోలేనప్పటికీ తమ కొత్త జియో నంబర్లోని చివరి 4 నుంచి 6 అంకెలను ఎంచుకోవచ్చు. -
ది కేరళ స్టోరీ నటికి బిగ్ షాక్.. ఆ వివరాలు లీక్ చేసిన నెటిజన్!
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. తాజాగా ఇటీవల రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టిముట్టినా అవేవీ సినిమాపై పెద్దగా ప్రభావితం చూపలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. (ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్ సినిమా రికార్డ్ బ్రేక్!) తాజాగా ఆదా శర్మకు మరో షాక్ తగిలింది. సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి ఆమె వ్యక్తిగత వివరాలను లీక్ చేశారు. అదా శర్మ ఫోన్ నంబర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన తర్వాత అదా శర్మకు వేధింపులు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. అయితే ఆదా శర్మ వివరాలు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ యూజర్ అకౌంట్‌ను వెంటనే డీ యాక్టివేట్ చేశారు. అంతే కాకుండా ఆమె కొత్త కాంటాక్ట్ నంబర్‌ను లీక్ చేస్తానని బెదిరించినట్లు సమాచారం. (ఇది చదవండి: ఉపాసనకు ప్రెగ్నెన్సీ.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్!) కాగా.. ఆదా శర్మ, దర్శకుడు సుదీప్తో సేన్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ది కేరళ స్టోరీ బృందం కరీంనగర్లో జరిగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాల్సి ఉండగా.. రోడ్డు ప్రమాదం జరగడంతో విరమించుకున్నారు. ఈ విషయాన్ని ఆదా శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. -
ఏ మొబైల్ నెంబర్ ఆధార్ కి లింక్ అయ్యిందో.. ఇప్పుడు మీ మొబైల్ లోనే ఇలా చూసుకోవచ్చు
-
ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఇలా తెలుసుకోండి!
న్యూఢిల్లీ: ఆధార్‌కు లింక్ అయిన ఈమెయిల్, మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ధ్రువీకరించే సదుపాయాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (యూఐడీఏఐ) ప్రకటించింది. ఆధార్ వెబ్సైట్, మొబైల్ యాప్ నుంచే వీటి ధ్రువీకరణకు అవకాశం కల్పించినట్టు పేర్కొంది. కొంత మంది యూజర్లకు తమ మొబైల్ నంబర్లలో ఏది ఆధార్‌తో సీడ్ అయిందనే విషయమై అవగాహన ఉండడం లేదని యూఐడీఏఐ గుర్తించింది. దీంతో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆధార్ ఓటీపీ వేరొక మొబైల్ నంబర్‌కు వెళుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రకటించిన సదుపాయంతో ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ సీడ్ అయిందో తెలుసుకోవచ్చు. ఆధార్ అధికారిక వెబ్సైట్ లేదా ఎంఆధార్ యాప్‌లో ‘వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్’ను క్లిక్ చేయడం ద్వారా ఈ సదుపాయం పొందొచ్చు’’అని యూఐడీఏఐ పేర్కొంది. ఏదైనా మొబైల్ నంబర్ సీడ్ అవ్వకపోతే అదే విషయాన్ని సూచిస్తుందని, దాంతో మొబైల్ నంబర్ అప్డేషన్కు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అప్పటికే మొబైల్ నంబర్ ధ్రువీకరించి ఉంటే, అదే విషయం తెలియజేస్తుందని వెల్లడించింది. ఆధార్ తీసుకునే సమయంలో ఏ నంబర్ ఇచ్చామో గుర్తు లేనివారు, సంబంధిత మొబైల్ నంబర్ చివరి మూడు నంబర్లను నమోదు చేయడం ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ఈ మెయిల్/ మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలంటే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించొచ్చని సూచించింది. ఆధార్ ధ్రువీకరణ చేపట్టేందుకు 22 సంస్థలకు అనుమతి కాగా క్లయింట్ల ధ్రువీకరణను ఆధార్ ఆధారితంగా నిర్ధారించుకునేందుకు 22 ఆర్థిక సేవల సంస్థలకు అనుమతి లభించింది. ఈ 22 కంపెనీలు ఇప్పటికే మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రిపోర్టింగ్ ఎంటెటీలుగా (కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సమాచారం అందించేవి)గా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది. (ఇదీ చదవండి: ఒక్క హాయ్ మెసేజ్.. రూ. 10 లక్షలు లోన్ - ట్రై చేసుకోండి!) ఇవి తమ క్లయింట్ల గుర్తింపు ధ్రువీకరణను ఆధార్ సాయంతో చేపట్టేందుకు అనుమతించినట్టు ప్రకటించింది. ఇలా అనుమతులు పొందిన వాటిల్లో గోద్రేజ్ ఫైనాన్స్, అమెజాన్ పే (ఇండియా), ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్ సొల్యూషన్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. బ్యాంకులు తమ కస్టమర్ల గుర్తింపును ఆధార్ సాయంతో ధ్రువీకరించేందుకు ఇప్పటికే అనుమతి ఉంది. -
ఆధార్ ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కే వస్తోందా?
ఆధార్ కార్డులకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. కార్డుదారులు ఇప్పుడు తమ ఆధార్‌తో సీడ్ చేసిన మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను ధ్రువీకరించవచ్చు. దీంతో తమ ఆధార్ OTP వేరే మొబైల్ నంబర్‌కు వెళ్తుందన్న ఆందోళన ఇక అక్కర్లేదు! ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు! కార్డుదారులు తమ ఆధార్‌కు సీడ్ చేసిన మొబైల్ నంబర్ల గురించి కొన్ని సందర్భాల్లో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దీనివల్ల OTP వేరే మొబైల్ నంబర్‌కు వెళుతోందేమోనని ఆందోళన చెందుతుంటారు. ఈ ఇబ్బందులను గుర్తించిన యూఐడీఏఐ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఆధార్ కార్డ్ హోల్డర్లు సీడెడ్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను సులభంగా చెక్ చేసుకోవచ్చని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ఆధారంగా ఐఎఎన్ఎస్ ఈ మేరకు నివేదించింది. ఇలా వెరిఫై చేయండి కార్డుదారులు యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ (https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ ద్వారా ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. వెబ్సైట్ లేదా యాప్ లోకి వెళ్లిన తర్వాత 'వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్' ట్యాబ్‌ను క్లిక్ చేసి తమ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను ధ్రువీకరించవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీలో మార్పులు ఉంటే దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు -
వినూత్న నిర్ణయం.. పోలీసులకు శాశ్వత ఫోన్ నంబర్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పోలీసుశాఖ మరో వినూత్న నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. డిపార్ట్మెంటులో ప్రతి పోలీసు అధికారికి శాశ్వత సెల్‌ఫోన్ నెంబర్‌ను కేటాయించింది. ఇందుకోసం దాదాపు 55 వేల మంది సిమ్‌కార్డులను కొనుగోలు చేసింది. కరీంనగర్, రామగుండం, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలతోపాటు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, ఇతర వింగ్స్ ప్రధాన కార్యాలయాలకు సిమ్‌కార్డులు చేరుకున్నాయి. ఇప్పటికే సగానికిపైగా పోలీసు అధికారులు సిమ్‌కార్డులను పొందగా మిగిలిన సిబ్బందికి ఈ వారాంతంలోగా అందజేయనున్నారు. పోలీసుల విధి నిర్వహణలో ఎక్కడా కమ్యూనికేషన్లో ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతోనే పోలీసులందరికీ శాశ్వత సెల్‌ఫోన్ నంబర్లు ఇవ్వాలని డీజీపీ అంజనీకుమార్ ఇటీవల నిర్ణయించారు. ఏంటి లాభాలు? కానిస్టేబుల్ మొదలు డీజీపీ స్థాయి అధికారి దాకా అందరికీ ఇస్తున్న శాశ్వత నంబర్లను వారి హెచ్ఆర్ఎంఎస్, బ్యాంకు ఖాతా, పీఎఫ్‌లకు అనుసంధానిస్తున్నారు. ఫలితంగా ఇకపై వ్యక్తిగత నంబర్‌ను వాటికి అనుంసంధానించే బాధ తప్పుతుంది. విధుల్లో చేరిన తొలిరోజు నుంచి రిటైరయ్యే రోజు వరకు ఫోన్ నంబర్ ఉద్యోగితోనే ఉంటుంది. అదే సమయంలో ఉన్నతాధికారులు ఫలానా అధికారి ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసుకొనేందుకు అతని ఎంప్లాయ్ ఐడీ ద్వారా సులువుగా గుర్తించవచ్చు. క్షణాల్లో అతని నంబర్ ఉన్నతాధికారి సెల్‌ఫోన్‌పై ప్రత్యక్షమవుతుంది. అంటే ఏ అధికారి ఎక్కడ ఉన్నా.. వెంటనే అతనితో ఉన్నతాధికారులు సంప్రదించి ఆదేశాలు ఇచ్చే వీలుంటుంది. అదే సమయంలో వారు స్టేషన్ లేదా వింగ్, టీములు మారినప్పుడు సంబంధిత ఫోన్ నంబర్ ఎలాగూ ఉంటుంది. ఉదాహరణకు ఒక ఎస్సైకి డిపార్ట్మెంటు ఇచ్చే శాశ్వత నంబర్‌తోపాటు అతను పనిచేసే స్టేషన్లో ఎస్సైకి ఇచ్చే మరో నంబర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. మారిన నెట్వర్క్.. పోలీసులను వేగవంతమైన నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు పోలీసు శాఖ బీఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్‌టెల్‌కు మారింది. అది కూడా అత్యాధునిక 5జీ నెట్‌వర్క్‌తో. ఈ సిమ్ ఎంప్లాయి ఐడీతో వస్తుంది. ప్రతి అధికారికి రోజుకు 2 జీబీ, 100 ఉచిత ఎస్ఎంఎస్లు చేసుకునే సదుపాయం ఉంటుంది. తాము వాడే చాలా యాప్స్ డేటాను అధికంగా తీసుకుంటున్నాయని... 5జీకి మారాక యాప్స్ మరింత సమర్థంగా పనిచేస్తున్నాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసు అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో మావోయిస్టుల కదలికలను పసిగట్టే పోలీసులకు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు ఏ అధికారిని ఆదేశించాలన్నా ఈ విధానం వల్ల క్షణాల్లో సంప్రదించడం సాధ్యం కానుందని చెబుతున్నారు. -
SBI: మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.. బ్యాంకుకి వెళ్లకుండా!
ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరూ లావాదేవీలను గురించి తెలుసుకోవడానికి నేరుగా బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాతో మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. అన్ని లావాదేవీలను ట్రాక్ చేయడానికి రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్లను వారి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవాలి, ఇలా చేసుకున్నప్పుడు తమ అకౌంట్ ద్వారా జరిగే అన్ని ట్రాన్సక్షన్స్ గురించి వెంటనే సమాచారం తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుండి మొబైల్ నెంబర్ అప్డేట్: మొదట www.onlinesbi.com ఓపెన్ చేయండి. మీ మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి, పేజీ ఎడమ పానెల్లో ఉన్న 'మై అకౌంట్' విభాగంలోని ''ప్రొఫైల్ - పర్సనల్ డీటైల్స్ - చేంజ్ మొబైల్ నెంబర్'' ఎంపిక చేసుకోండి. అకౌంట్ నెంబర్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత, మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి, క్రింది స్క్రీన్‌పై సబ్మిట్పై క్లిక్ చేయండి. మీకు రిజిస్టర్డ్ నంబర్ చివరి రెండు అంకెలను కనిపిస్తాయి. మ్యాపింగ్ స్టేటస్ తెలియజేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉపయోగపడుతుంది. ఏటీఎమ్ నుండి మొబైల్ నెంబర్ అప్డేట్: మీ సమీపంలో ఉన్న SBI ATM వద్దకు వెళ్లి, అందుబాటులో ఉన్న ఎంపికల నుండి రిజిస్టర్ ఎంపికను సెలక్ట్ చేసుకోండి. మీ ఏటీఎమ్ పిన్ని టైప్ చేసుకోండి. తరువాత స్క్రీన్‌పై కనిపించే మెను ఆప్షన్స్ నుండి మొబైల్ నెంబర్ ఎంటర్ ఎంచుకోండి. స్క్రీన్‌పై ఉన్న మెను ఎంపికల నుండి, చేంజ్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోండి. గతంలో ఉపయోగిస్తున్న మీ మునుపటి మొబైల్ నెంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేసి ధృవీకరించాలి. తరువాత మీ కొత్త మొబైల్ నెంబర్‌ను నమోదు చేసి ధృవీకరించమని చెబుతుంది. కొత్త నెంబర్, పాత మొబైల్ నెంబర్ రెండింటికి వేరువేరుగా OTPలు వస్తాయి. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. -
ఉద్యోగులకు చెల్లింపుల్లో రెండంచెల భద్రత
సాక్షి, అమరావతి: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆన్లైన్ చెల్లింపుల్లో రెండంచెల భద్రతా వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎఫ్ఎంఎస్/హెర్బ్ అప్లికేషన్స్ ద్వారా చేసే లావాదేవీలకు రెండంచెల భద్రతను తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సేవలు పూర్తి సురక్షితంగా అందించేలా సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉన్న ప్రతి ఉద్యోగి, పెన్షనర్లు, వ్యక్తులు తమ సీఎఫ్ఎంఎస్ ఐడీని ఆధార్, మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. సీఎఫ్ఎంఎస్ /హెర్బ్ అప్లికేషన్స్‌లో సురక్షితంగా లాగిన్ అవడానికి ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్ ఫోన్‌కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) నమోదును తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా ప్రతి ఉద్యోగి ఈకేవైసీ, ఆధార్, మొబైల్ నంబర్ల పరిశీలనను జనవరి 20 నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖల డీటీఏలు, పీఏవో, ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈవో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్: ఈ విషయం తెలుసా మీకు?
సాక్షి,ముంబై: దేశీయ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం వినియోగదారులు యూపీఐ ద్వారా ఏ మొబైల్ నంబరుకైనా డిజిటల్ చెల్లింపు చేయవచ్చు. అంతేకాదు రిసీవర్ పేటీఎంలో రిజిస్టర్ కాక పోయినా కూడా వారి యూపీఐ ఐడీద్వారా ఏదైనా మొబైల్ నంబర్‌కు డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించ వచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రిజిస్టర్డ్ UPI IDతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సార్వత్రిక డేటాబేస్‌ను యాక్సెస్‌కు, యూపీఎల్ చెల్లింపులకు అనుమతి పొందినట్టు తెలిపింది. (వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్!) పేటీఎం యూపీఐ ద్వారా నగదు ఎలా పంపాలి ♦ Paytm యాప్‌లోని ‘UPI మనీ ట్రాన్స్ఫర్’ విభాగంలో, ‘ టూ UPI యాప్స్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ♦ ఇక్కడ మొబైల్ నంబర్‌ను నమోదు చే గ్రహీత మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ♦ నగదును నమోదు చేసి, తక్షణ నగదు బదిలీ కోసం ‘పే నౌ ’ బటన్ క్లిక్ చేయాలి. యూపీఐ నెట్ వర్క్ ఇదొక కీలక పరిణామామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపింది. ఇది తమ వినియోగదారులుమ రింత మంది వినియోగదారులు ఏదైనా UPI యాప్ ద్వారా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తుందని, అంతరాయం లేని, సురక్షితమైన చెల్లింపులకవసరమైన బలమైన మౌలిక సదుపాయాలను వినియోగదారులకు అందిస్తున్నట్టు తెలిపారు. (ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?) కాగా ఎన్పీసీఐ తాజా నివేదిక ప్రకారం, పేటీఎం లబ్ధిదారు బ్యాంకుగా PPBL 1,614 మిలియన్ లావాదేవీలను నమోదు చేసింది, రెమిటర్ బ్యాంక్‌గా, అక్టోబర్ 2022లో 362 మిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసింది.అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ UPI లావాదేవీల పరిమాణంలో అతిపెద్ద లబ్ధిదారుల బ్యాంక్‌గా టాప్‌లో ఉంది. అక్టోబర్ 2022లో 1,614 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు కంపెనీ పేర్కొంది. -
ఆధార్ కార్డ్‌లో ఆ అప్డేట్ చాలా ముఖ్యం, చేయకపోతే చిక్కులు తప్పవండోయ్!
ఆధార్ కార్డ్.. ఇటీవల ప్రజలకు ఇది గుర్తింపు కార్డ్‌లా మాత్రమే కాకుండా జీవితంలో ఓ భాగమైందనే చెప్పాలి. ఎందుకంటే బ్యాంకు అకౌంట్ తెరవడం, పర్సనల్, ఇంటి రుణాల కోసం, సంక్షేమ పథకాల కోసం, ఉద్యోగం కోసం.. ఇలా చెప్తూ పోతే పెద్ద జాబితానే ఉంది. ఆర్థిక లావాదేవీలలో ముఖ్యమైన బ్యాంక్, పాన్ కార్డ్‌లకు ఆధార్ కార్డ్‌ని అనుసంధానించిన తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. అందుకే ఈ కార్డులో ఏ తప్పులు లేకుండా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కార్డుదారులు ఆఫర్లు, సర్వీస్‌లను, లేదా మొబైల్ పోయిన తరచూ ఫోన్ నెంబర్లను మారుస్తుంటారు. ఆ తర్వాత ఏదో పనిలో పని కొత్త నెంబర్‌ను ఆధార్‌లో అప్డేట్ చేయడం మరిచిపోతుంటారు. ఆపై భవిష్యత్తులో డిజిటల్ బ్యాంక్ అకౌంట్స్, డీమ్యాట్ అకౌంట్స్ వంటితో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబందించిన వాటిలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇబ్బందులు రాకుండా ఆధార్‌లో ఫోన్ నంబర్ ఈ విధంగా ఈజీగా అప్డేట్ చేసేయండి. 1: ముందుగా, మీరు అధికారిక UIDAI వెబ్సైట్ లేదా మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని వెళ్లాల్సి ఉంటుంది. 2: ఆపై ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో అధికారిక ఎగ్జిక్యూటివ్‌ని కలిసి అతని వద్ద నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారంని తీసుకోవాలి. 3: ఎగ్జిక్యూటివ్‌కు ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారంను నింపి, సమర్పించాలి. 4: ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ సమాచారం ద్వారా మీ వివరాలను ధృవీకరిస్తారు. 5: మీ కొత్త ఫోన్ నంబర్ వివరాలు, లేదా మీరు కోరిన విధంగా మార్పులు చేస్తాడు. 6: ఈ మార్పులను ఆధార్ అధికారిక సైట్లలో అప్డేట్ చేశాక, ఈ సేవకు రుసుము చెల్లించాలి. 7: మీరు సంబంధిత అధికారి నుంచి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ పొందుతారు. ఆ స్లిప్‌లో ఒక అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఉంటుంది. దీని ద్వారా మీ ఆధార్ కార్డు రిక్వెస్ట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. చివరగా మీ ఫోన్ నంబర్ అప్డేట్ లేదా మీ వివరాలు అప్డేట్ అయిన తర్వాత, మీరు అధికారిక UIDAI వెబ్సైట్ నుంచి ఆధార్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆపై రుసుము చెల్లించి ఆధార్ కార్డ్ PVC ప్రింట్‌ను కూడా ఆర్డర్ చేయవచ్చు. చదవండి: దీపావళి కళ్లు చెదిరే అఫర్లు.. కారు కొంటే రూ.లక్ష తగ్గింపు! -
స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి!
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల అమ్మకానికి ముందే ఐఎంఈఐ నంబర్ నమోదు తప్పనిసరి చేస్తూ టెలికం శాఖ ఆదేశాలు వెలువరించింది. 2023 జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. దేశీయంగా తయారైన లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొబైల్స్‌కూ ఈ నిబంధన వర్తిస్తుంది. అమ్మకానికి ముందే టెలికం శాఖకు చెందిన ఇండియన్ కౌంటర్‌ఫీటెడ్ డివైస్ రెస్ట్రిక్షన్ పోర్టల్ నుంచి ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ ధ్రువీకరణ పొందాల్సిందే. ప్రతి మొబైల్‌కూ 15 అంకెల ఐఎంఈఐ సంఖ్య ఉంటుంది. మొబైల్ పరికరాల గుర్తింపు సంఖ్యను తారుమారు చేయడాన్ని నిరోధించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెలికం నెట్‌వర్క్‌లో ఒకే ఐఎంఈఐతో నకిలీ పరికరాలు ఉండటం వల్ల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడం సాధ్యం కావడం లేదు. కోల్పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడానికి, ట్రేస్ చేయడానికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అలాంటి హ్యాండ్సెట్ల విస్తరణను అరికట్టడానికి నకిలీ పరికరాల నియంత్రణకై ఇండియన్ కౌంటర్‌ఫీటెడ్ డివైస్ రెస్ట్రిక్షన్ వ్యవస్థను జోడించింది. దొంగిలించబడిన, పోగొట్టుకున్న మొబైల్స్‌ను నిరోధించే సౌకర్యం మాత్రమే ప్రస్తుతం పోర్టల్‌లో అందుబాటులో ఉంది. చదవండి: బ్లాక్ బస్టర్ హిట్: రికార్డు సేల్స్, నిమిషానికి వేలల్లో, ఒకే రోజున 87 లక్షలు! -
ఈ-కేవైసీ నమోదులో కొత్త సమస్యలు.. ఆధార్‌కు లింకు కాని ఫోన్ నంబర్లు
నర్వ (నారాయణ్‌పేట్ జిల్లా): రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా ఈకేవైసీని చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బోగస్ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్లలో నిధులను కాజేసిన వైనాన్ని కేంద్రం గుర్తించగా.. ఈ సీజన్లో అర్హులను గుర్తించేందుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. కాగా గడువు ఈ నెల 31 వరకే ముగుస్తున్నా జిల్లాలో ఈకేవైసీ నామమాత్రంగా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే నమోదైంది. ఈకేవైసీని పూర్తి చేసిన రైతులకు మాత్రమే ప్రస్తుతం రూ.2 వేల చొప్పున చెల్లింపులు చేయాలని లేదా నమోదు పూర్తికాకుంటే ఈ సీజన్ నుంచి నిధులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి జాన్‌సుధాకర్ తెలిపారు. చదవండి👉 ‘ఇలాంటి ఫథకం దేశంలో ఎక్కడా లేదు’ అనుసంధానం ఇలా.. రైతులు ముందుగా పీఎం కిసాన్ పథకం వివరాలిచ్చిన తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌కార్డును అనుసంధానించుకోవాలి. తదుపరి ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్‌ను అనుసంధానించాలి. అనంతరం పీఎం కిసాన్ పోర్టల్‌లో ఆధార్ ఆధారితంగా ఈకేవైసీ చేస్తున్నప్పుడు ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ సంఖ్యను తిరిగి నమోదు చేస్తేనే ఈకేవైసీ పూర్తవుతుంది. సెల్ఫోన్లో పీఎం కిసాన్ యాప్ ద్వారా లేదా కంప్యూటర్లో పోర్టల్ ద్వారా రైతులే ఈకేవైసీని చేసుకోవచ్చు. లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో సైతం ఈకేవైసీని పూర్తి చేయించాలి. ఆధార్ ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసిన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేస్తారు. బోగస్ రైతులు జాబితా నుంచి తొలగించబడతారు. 2018లో పథకం ప్రారంభించిన దగ్గర నుంచి 10 విడతలుగా నిధులను విడుదల చేయగా ప్రస్తుతం ఏప్రిల్‌లోనే 11వ విడతకు సంబంధించి ఈ దఫా నిధులు ఇవ్వాల్సి ఉండగా ఈకేవైసీతో ఈ నెలాఖరులోగా లేదా జూన్ మొదటి వారంలో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. అవగాహన కల్పించరూ.. ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ చేసుకోవడం గురించి చాలా మంది రైతులకు తెలియదు. ఇవి చేసుకోలేకనే ఎంతో మంది రైతులు ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. తాజాగా ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కానీ, క్షేతస్థ్రాయిలో ఈ విషయమే చాలా మంది రైతులకు తెలియదు. తెలిసిన వారు వెళ్లినా మీ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్‌కు ఫోన్ నంబర్ లింకు లేకపోవడం వంటి కారణాలతో మళ్లీ మళ్లీ తిరగాల్సి వస్తుంది. ప్రస్తుతం వ్యవసాయాధికారులు ధాన్యం నాణ్యత ధ్రువీకరణ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈకేవైసీని పూర్తిచేయించేందుకు రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈకేవైసీని పూర్తి చేయని రైతులకు నిధులు నిలిచిపోనున్నందున రైతులందరూ ఈకేవైసీని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చదవండి👉🏻 గడువు 31 వరకే.. ఈ–కేవైసీ తప్పనిసరి.. ఇలా నమోదు చేసుకోండి నమోదు చేసుకోండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం రైతులు ఈ నెల 31లోగా నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈకేవైసీ నమోదు చాలా తక్కువగా ఉంది. ఆయా మండలాల ఏఈఓలు నమోదును వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నాం. రైతులకు గ్రామాల్లో గడువులోగా ఈకేవైసీ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి. పీఎం కిసాన్ లబ్ధి రైతులే కాకుండా మిగిలిన రైతులు కూడా ఈకేవైసీ చేసుకుంటే మంచిది. – జాన్‌సుధాకర్, జిల్లా వ్యవసాయాధికారి ఇప్పటి వరకు రాలే.. ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రాలేదు. అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ నెల 31 వరకు గడువు ఉన్నందు వల్ల వెంటనే చేసుకుంటాను. – గోవిందరెడ్డి, రైతు, పెద్దకడ్మూర్ గ్రామం -
మీ 'ఆధార్' మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండిలా!
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) తన పోర్టల్ లో అనేక కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు యూజర్ల కోసం తీసుకొస్తుంది. యుఐడీఏఐ తీసుకొచ్చిన అలాంటి ఒక సౌకర్యం వల్ల మీ పాత ఆధార్ మొబైల్ నెంబర్ స్థానంలో సులభంగా కొత్త నెంబర్ జత చేసుకునే అవకాశం ఉంది. మీ ఆధార్ కార్డుకు మరో కొత్త మొబైల్ నెంబరు జత చేయాలని అనుకుంటే ముందుగా మీరు ఈ దశలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 'ఆధార్' మొబైల్ నెంబర్ అప్డేట్ విధానం మీ మొబైల్ నెంబరు అప్డేట్ చేయడం కొరకు యుఐడీఏఐ వెబ్ పోర్టల్(ask.uidai.gov.in)ను సందర్శించండి. ఆ తర్వాత, మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ఫోన్ నెంబరు, క్యాప్చాను సంబంధిత బాక్సుల్లో టైప్ చేయండి. 'సెండ్ ఓటీపీ' ఆప్షన్ మీద క్లిక్ చేసి, మీ ఫోన్ నంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి 'సబ్మిట్ ఓటీపీ & ప్రొసీడ్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అనంతరం ఓపెన్ అయిన డ్రాప్‌డౌన్ బాక్స్‌లో ‘అప్డేట్ ఆధార్’పై క్లిక్ చేసి ముందుకెళ్లండి. ఆపై ఆధార్ నంబర్, పూర్తి పేరు నమోదు చేసి మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ‘మొబైల్ నంబర్’ కింద ఎంచుకొని ప్రోసిడ్ అవ్వండి. మొబైల్ నెంబరు సబ్మిట్ చేసిన తర్వాత మొబైల్ నంబర్, క్యాప్చా మళ్లీ నమోదు చేసి కొత్తగా వచ్చిన ఓటీపీని సరిచూసుకోని సేవ్&ప్రోసిండ్ క్లిక్ చేయండి. దీని తర్వాత, రూ.25 ఫీజు చెల్లించడానికి అవసరమైన అదనపు సమాచారాన్ని నమోదు చేసి మీ దగ్గరల్లో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లడానికి మీరు ఆన్ లైన్ లో అపాయింట్ మెంట్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లి వివరాలు తెలియజేస్తే సరిపోతుంది. -
కోల్పోయిన ఆధార్ నెంబర్ తిరిగి పొందడం ఎలా..?
వివిద ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలు పొందాలంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. కాబట్టి భారత పౌరులు ఆధార్ కార్డును ముఖ్యమైన గుర్తింపు పత్రంగా పరిగిణిస్తారు. 12 అంకెల గల ఈ ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) జారీచేస్తుంది. అలాంటి ఆధార్ కార్డు నెంబర్ మర్చిపోతే/ ఎక్కడైన పోయిన ఏమి జరుగుతుంది అనేది ఒకసారి ఊహించుకోండి. దాని గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎవరైనా ఆధార్ కార్డు నెంబర్ మర్చిపోయిన, కార్డు ఎక్కడైనా పోయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు లేదా హెల్ప్ లైన్ నెంబరు ద్వారా ఆన్ లైన్ లో తమ ఎన్ రోల్ మెంట్ నెంబరు లేదా యుఐడీని తిరిగి పొందవచ్చు. అది ఎలా అనేది ఈ క్రింది విదంగా తెలుసుకోండి. https://uidai.gov.in అధికారిక వెబ్ సైట్ కు సందర్శించండి. హోమ్ పేజీలో 'మై ఆధార్' అనే ఆప్షన్ కింద 'ఆధార్ సర్వీసెస్' అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు 'Retrieve Lost or Forgotten EID/UID' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ పేరు, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వంటి వివరాలను నమోదు చేయాలి. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, వెరిఫికేషన్ కొరకు క్యాప్చా ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. మీ మొబైల్లో వచ్చిన ఆరు అంకెల ఓటీపీని నమోదు చేయండి. ఇప్పుడు మీకు యుఐడీ/ ఈఐడీ నెంబరు ఎస్ఎమ్ఎస్ ద్వారా మీ మొబైల్ కు వస్తుంది. ఈ నెంబర్ తో మీరు ఈ-ఆధార్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రజలు కోల్పోయిన ఆధార్ యుఐడీ/ఈఐడీ నంబర్ ను తెలుసుకోవడానికి ప్రజలు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి హెల్ప్ లైన్ నెంబరు '1947'కు డయల్ చేయాల్సి ఉంటుంది. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ. 2 లక్షలు మీ సొంతం -
నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: హీరో సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ తన పర్సనల్ మొబైల్ నంబర్ లీక్ చేసిందని ఆరోపించారు. అందువల్ల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. తమపై అత్యాచారం చేస్తామని బెదిరింపు సందేశాలు వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. ‘‘తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ నా మొబైల్ నంబర్ లీక్ చేసింది. గడిచిన 24 గంటల్లో నాకు దాదాపు 500 అసభ్య సందేశాలు వచ్చాయి. నన్ను, నా కుటుంబ సభ్యులను చంపేస్తామని.. మాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ నంబర్లంన్నింటిని రికార్డ్ చేశాను. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్ ఉన్నవి.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే ఉన్నాయి. వీట్నింటిని పోలీసులుకు అందించాను. నేను మౌనంగా ఉంటానని మాత్రం అనుకోవద్దు’’ అని తెలిపారు. My phone number was leaked by members of TN BJP and @BJPtnITcell Over 500 calls of abuse, rape and death threats to me & family for over 24 hrs. All numbers recorded (with BJP links and DPs) and handing over to Police. I will not shut up. Keep trying.@narendramodi @AmitShah — Siddharth (@Actor_Siddharth) April 29, 2021 దీంతో పాటు సిద్ధార్థ్ తనను బెదిరిస్తూ వచ్చిన మెసేజ్‌లను స్క్రీన్ షాట్ తీశారు. వాటిని తన ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ‘‘తమిళనాడు బీజేపీ నాయకులు నిన్న నా పర్సనల్ నంబర్ని లీక్ చేశారు. చాలా గ్రూపుల్లో నా నంబర్ చక్కర్లు కొట్టింది. వీరంతా నన్ను ట్రోల్ చేశారు. నేను కోవిడ్‌తో పోరాడాలా.. ఇలాంటి వారితో పోరాడాలా’’ అని వాపోయారు సిద్ధార్థ్. My phone number was leaked by members of TN BJP and @BJPtnITcell Over 500 calls of abuse, rape and death threats to me & family for over 24 hrs. All numbers recorded (with BJP links and DPs) and handing over to Police. I will not shut up. Keep trying.@narendramodi @AmitShah — Siddharth (@Actor_Siddharth) April 29, 2021 ఇక సిద్ధార్థ ట్వీట్‌పై నటి శ్రేయా ధన్వంతరీ స్పందించారు. ఇది చాలా దారుణం అంటూ ట్వీట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటంలో సిద్ధార్థ్ ముందు ఉంటారు. కొద్ది రోజుల క్రితం తన సోసల్ మీడియాలో కోవిడ్‌ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని విమర్శిస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. చదవండి: పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్ -
వైరల్: ‘ఆక్సిజన్ కావాలంటే ఈ నాయకులకు కాల్ చేయండి’
కోల్‌కతా: దేశవ్యాప్తంగా జనాలు కరోనాతో విలవిల్లాడుతుంటే.. ధైర్యం చెప్పాల్సిన రాజకీయ నాయకులు బాధ్యతరహితంగా ప్రవర్తిస్తున్న విధం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. అవును మరి ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీలు భారీ ఎత్తున జనాలను పోగు చేసి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ ఫలితం ఇప్పుడు జనాలు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నాయకులకు బుద్ది చెప్పడం కోసం పశ్చిమబెంగాల్ నెటినులు చేసిన ఓ వినూత్న ఆలోచన తాజాగా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసిన నేతలు ప్రస్తుతం ఇళ్లకే పరిమితయ్యారు. ఎన్నికల వేళ ఎలాంటి నిబంధనలు పాటించకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి వైరస్ వ్యాప్తికి కారణమయిన రాజకీయ నాయకులు ప్రసుత్తం వైరస్ విజృంభిస్తున్న వేళ ఎవరూ కనిపించడం లేదు. దాంతో నెటిజనులు సదరు నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత ఫోన్ నంబర్లున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిలో టీఎంసీ, బీజేపీ రెండు పార్టీల నేతలున్నారు. ఫోన్ నంబర్లున్న ఫోటోతో పాటు ‘‘కరోనా అంటే భయం ఎందుకు. మన దగ్గర రాజకీయ నాయకులున్నారు. జనాలకు కష్టం వచ్చిందంటే చాలు.. వారు ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ప్రజల కోసం పాటు పడతారు. మీకు ఆక్సిజన్, రక్తం, మాస్క్, శానిటైజర్, అంబులెన్స్ వంటి సేవలు కావాల్సి వస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఫోటోలోని నాయకుల నంబర్‌కు కాల్ చేయండి’’ అనే మెసేజ్ చేశారు. ఈ ఫోటోల 14 మంది బీజేపీ, టీఎంసీ నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత మొబైల్ నంబర్లు ఉన్నాయి. వీరిలో సువేందు అధికారి, బాబుల్ సుప్రియో, రాజ్ చక్రవర్తి వంటి ప్రముఖులు పేర్లు కూడా ఉండటం గమనార్హం. ఇక బెంగాల్లో ఆదివారం ఒక్కరోజన 15,889 కేసులు వెలుగు చూశాయి. చాలా ఆస్పత్రుల్లో బెడ్లు, మందులు, ఆక్సిజన్ కొరత నెలకొంది. దాంతో పలు ఆస్పత్రులు కొత్త వారిని ఎవరిని చేర్చుకోవడం లేదు. ఇక వైరస్ వ్యాప్తికి అసెంబ్లీ ఎన్నికలే కారణమని జనాలు బలంగా విశ్వసిస్తున్నారు. అన్ని పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాయి. జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. వీరిలో చాలా మంది మాస్క్ కూడా ధరించలేదని.. అందువల్లే వైరస్ వ్యాప్తి ఉధృతం అయ్యిందని సామాన్యులుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది