జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ నెట్‌వర్క్స్ అన్నీ కూడా రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచిన తరువాత.. అందరి చూపు బీఎస్ఎన్ఎల్ వైపు పడింది. దీంతో ఇప్పటికే చాలామంది తమ నెట్‌వర్క్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కు మార్చేస్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం తక్కువ ధరలోనే అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది.
ఎక్కువమంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్న తరుణంలో సంస్థ కూడా తన నెట్‌వర్క్‌ను విస్తరించడానికి తగిన సన్నాహాలు చేస్తోంది. తమ నెట్‌వర్క్‌కు మారాలనుకునే వారికోసం బీఎస్ఎన్ఎల్ నచ్చిన నెంబర్ ఎందుకుని వెసులుబాటు కూడా కల్పించింది. ఆన్‌లైన్‌లో యూజర్ ఇప్పుడు ఫేవరేట్ నెంబర్ సెలక్ట్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో నెంబర్ ఎంచుకోవడం ఎలా?
గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్‌లో BSNL Choose Your Mobile Number అని సెర్చ్ చేయాలి.
ఇలా సెర్చ్ చేసిన వెంటనే BSNL CYMN అనేది కనిపిస్తుంది. దీనిపైనా క్లిక్ చేయగా మరో పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్ అని నాలు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీ జోన్ సెలక్ట్ చేసుకుని రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
ఇలా ఎందుకున్న తరువాత ఛాయిస్ నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. కావాల్సిన ఆప్షన్ ఎందుకున్న తరువాత నెంబర్ సెలక్ట్ చేసుకోవచ్చు.
నచ్చిన నెంబర్ ఎంచుకున్న తరువాత రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రక్రియ పూర్తయ్యాక సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసుకు వెళ్లి సీఎం తెచ్చుకోవచ్చు. ఫ్యాన్సీ నెంబర్ కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment