Network
-
రైల్వే అంతటా ‘కవచ్’ అమలు
వచ్చే ఆరేళ్లలో మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లో ‘కవచ్’ టెక్నాలజీని అమలు చేసేందుకు ప్రతిష్టాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రతను పెంచడానికి, స్టేషన్ సామర్థ్యాలను విస్తరించడానికి, సురక్షితమైన రైల్వే వ్యవస్థను నిర్ధారించడానికి తోడ్పడుతుందని చెప్పారు. రైల్వే రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని (పీపీపీ) ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అయితే మౌలిక సదుపాయాల యాజమాన్యం మాత్రం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.రెండు రైళ్లు ఒకే ట్రాక్‌మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీకొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా కవచ్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. రైల్వే భద్రత కోసం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థనే కవచ్‌గా పిలుస్తారు. పదేళ్ల పరీక్షలు, ట్రయల్స్ అనంతరం దాన్ని వినియోగించేందుకు రైల్వే బోర్డు గతంలో అనుమతించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2024 నాటికి దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే అంతటా 1,548 కిలోమీటర్లకు పైగా కవచ్‌ను విస్తరించారు. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా వంటి అధిక ప్రాధాన్యత గల మార్గాల్లో అదనంగా 3,000 కిలోమీటర్లను కవర్ చేయాలని గతంలో ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇదీ చదవండి: యూఎస్ సుంకాలపై నిర్మలా సీతారామన్ స్పందనప్రయాణికుల భద్రత, స్టేషన్ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైల్వేకు రూ.2.52 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రి చెప్పారు. అందులో భద్రతకు రూ.1.16 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ నిధుల వినియోగంలో భాగంగా కవచ్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 10,000 లోకోమోటివ్ల ఏర్పాటు, ప్రతి స్టేషన్, బ్లాక్ సెక్షన్ వద్ద కవచ్ వ్యవస్థలను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. చాలాచోట్ల వ్యవస్థలో లోపం వల్ల రైల్వే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు తాత్కాలిక ఉపశమనం కింద ఆర్థిక, వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ఇది శాశ్వత పరిష్కారం కాదనేది వాస్తవం. ప్రమాదాల మూలాలను గమనించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
మెరుగైన నెట్‌వర్క్‌లో వొడాఫోన్‌ఐడియాకు గుర్తింపు
తెలుగు రాష్ట్రాల్లో వొడాఫోన్ఐడియా 4జీ నెట్వర్క్ అత్యుత్తమ నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందినట్లు కంపెనీ తెలిపింది. నవంబర్ నెలలో కంపెనీ మెరుగైన నెట్వర్క్ అందించినట్లు ఓపెన్‌సిగ్నల్ 4జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4జీ డౌన్లోడ్ స్పీడ్, వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియో ప్రసారం, 4జీ వాయిస్ వంటి సర్వీసుల్లో పటిష్ట సేవలు అందిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇటీవల బ్యాండ్‌విడ్త్ అప్‌గ్రేడ్ చేయడం, 8700 పైగా లొకేషన్లను తమ నెటవర్క్ పరిధిలోకి తీసుకురావడం వంటి తదితర అంశాలు ఇందుకు ఎంతో తోడ్పడ్డాయని ఏపీ, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ తెలిపారు.‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యుత్తమ 4జీ నెట్వర్క్ అందిస్తున్నందుకుగాను మాకు గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. మా నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠ పరిచేందుకు, నిరాంటకంగా కనెక్టివిటీ ఉండేలా చూసేందుకు మేము చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ప్రతిఫలమే ఈ గుర్తింపులు. వినియోగదారులకు ఆటంకంలేని అత్యుత్తమ కనెక్టివిటీని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని ఆనంద్ దానీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంఓపెన్సిగ్నల్ 4జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ ప్రకారం..కంపెనీ వినియోగదారులు నవంబర్ నెలలో వేగవంతమైన 4జీ సేవలను ఉపయోగించుకున్నారు.యూజర్లు 17.4 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని, 4.7 ఎంబీపీఎస్ అప్లోడ్ వేగాన్ని అనుభవించారు.వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియోకు సంబంధించి వినియోగదారులకు మెరుగైన సర్వీసు లభించింది.యూజర్లు స్థిరంగా ఈ నాణ్యమైన సేవలను అనుభవించారు.కంపెనీ ఈ గుర్తింపు సాధించేందుకు 2500 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను రెట్టింపు స్థాయిలో అప్‌గ్రేడ్ చేసింది.ఫలితంగా 5,000కు పైగా లొకేషన్లలో కంపెనీ 4జీ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంది.2000కు పైగా పట్టణాలు, 60 జిల్లాలవ్యాప్తంగా వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందించే దిశగా ప్రయత్నాలు చేసింది. -
నెట్వర్క్ సమస్యకు చెక్.. టెలికాం సంస్థలకు ట్రాయ్ ఆదేశాలు
ఏ సిమ్ కార్డు తీసుకున్నా.. దేశంలోని ఏదో ఒక మూల తప్పకుండా నెట్వర్క్ సమస్య అనేది తెలెత్తుతుంది. దీనిని నివారించడానికి టెలికాం కంపెనీలకు 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) కీలక ఆదేశాలను జారీ చేసింది.టెలికాం సంస్థలు తమ వెబ్సైట్లలో తప్పకుండా.. జియో స్పేషియల్ కవరేజ్ మ్యాప్‌లను చూపించాలని ట్రాయ్ ఆదేశించింది. అంటే తమ నెట్వర్క్ ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉందనేది ఈ మ్యాప్ ద్వారా తెలుస్తుంది. దీన్ని బట్టి యూజర్ ఏ సిమ్ కొనుగోలు చేయాలనేది నిర్ణయించుకుంటాడు. దీని వల్ల యూజర్లు నెట్వర్క్ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా పోతుంది.కొత్త నిబంధనల ప్రకారం.. టెలికాం సంస్థలకు సంబంధించిన 2జీ, 3జీ, 4జీ, 5జీ సర్వీసులు కూడా వెబ్సైట్లలో వెల్లడించాల్సి ఉంది. దీంతో వినియోగదారుడు ఏ సర్వీస్ ఎంచుకోవాలి.. తాను ఏ సర్వీస్ పరిధిలో ఉన్నాడు, అంతరాయం లేకుండా మొబైల్ ఉపయోగించడానికి ఉత్తమమైన నెట్వర్క్ ఏది అనే అన్ని వివరాలను సిమ్ కొనుగోలు చేయడానికి ముందే తెలుసుకోవచ్చు.ట్రాయ్ ఆదేశించిన ఈ కొత్త మార్గదర్శకాలు యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మెరుగైన నెట్వర్క్ కవరేజీని అందించే ప్రొవైడర్లను వినియోగదారుడు ముందుగానే ఎంచుకోవచ్చు. నెట్వర్క్ సమస్యల వల్ల కస్టమర్ అసంతృప్తిని తగ్గించవచ్చు. టెలికాం కంపెనీలు ఈ మ్యాప్‌లను ప్రచురించే ఫార్మాట్.. ఇన్పుట్ వంటి వాటిని సమర్పించడానికి కొంత సమయం తీసుకున్నట్లు సమాచారం. -
వొడాఫోన్ ఐడియా గుడ్‌న్యూస్.. ఇక వేగవంతమైన నెట్వర్క్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఇండోర్ నెట్‌వర్క్‌ను 20కిపైగా జిల్లాల్లో మెరుగుపర్చినట్టు తెలిపింది. 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌తో 3,450కిపైగా టవర్లను అప్‌గ్రేడ్ చేసినట్లు వివరించింది.తద్వారా కస్టమర్లకు మెరుగైన నెట్వర్క్ లభిస్తుందని తెలిపింది. రూ.691 కోట్లతో 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 2.4 మెగాహెట్జ్ కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. 5,000లకుపైగా సైట్స్‌లో నెట్వర్క్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ను 10 మెగాహెట్జ్ నుండి 20 మెగాహెట్జ్‌కి అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపింది. తద్వారా వినియోగదార్లు వేగవంతమైన డేటాను అందుకోవచ్చని వివరించింది.ఇదీ చదవండి: మొబైల్ రీచార్జ్ ధరలు మరోసారి పెరుగుతాయా? -
ట్రంప్, వాన్స్ లక్ష్యంగాచైనా సైబర్ దాడి
వాషింగ్టన్: చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు , మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్‌లు వాడే ఫోన్లు, నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ట్రంప్–వాన్స్‌ల ఎన్నికల ప్రచార బృందాన్ని అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, ఆమె రన్నింగ్ మేట్ వాల్జ్ ఎన్నికల ప్రచారాన్ని కూడా చైనా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారని బీబీసీ పేర్కొంది. అదే నిజమైతే, ఏ మేరకు సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కి ఉంటుందనే విషయం స్పష్టత రాలేదు. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు సైబర్ నేరగాళ్లకు లక్ష్యమయ్యారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్‌బీఐలు నిరాకరిస్తున్నాయి. చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు దేశంలోని వాణిజ్య టెలీకమ్యూనికేషన్స్ వ్యవస్థల్లోకి దొంగచాటుగా ప్రవేశించిన విషయమై అమెరికా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని ఎఫ్‌బీఐ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఐఎస్ఏ) ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. అయితే, నేరగాళ్లు చేసిన ప్రయత్నాలను తాము గుర్తించామని తెలిపాయి. ఆ వెంటనే సంబంధిత సంస్థలను అప్రమత్తం చేయడంతోపాటు ఇతర బాధితులను అలెర్ట్ చేసి, అవసరమైన సహాయ సహకారాలు అందించామని ఆ ప్రకటనలో వివరించాయి. కమర్షియల్ కమ్యూనికేషన్స్ రంగంలో సైబర్ రక్షణలను బలోపేతం చేసేందుకు, దాడులను ఎదుర్కొనేందుకు సంబంధిత విభాగాలను సమన్వయం చేస్తున్నామని ఎఫ్‌బీఐ, సీఐఎస్ఏ తెలిపాయి. అయితే, దీనిని ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసేలా సైబర్ దాడికి జరిగిన యత్నంగా కాకుండా, గూఢచర్యంగాభావిస్తున్నామని న్యాయ విభాగం తెలిపింది.ఈ పరిణామంపై ట్రంప్ ప్రచార బృందం తీవ్రంగా స్పందించింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవకుండా చేసే కుట్రగా అభివర్ణించింది. ఈ నెల మొదట్లో కూడా హ్యాకర్లు ట్రంప్, వాన్స్‌లే లక్ష్యంగా సైబర్ దాడికి పాల్పడ్డారని సంబంధిత వెరిజోన్ అనే టెలీ కమ్యూనికేషన్ సంస్థ ఆరోపించింది. సెపె్టంబర్లో ఇరాన్‌కు చెందిన ముగ్గురు హ్యాకర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోక్యం చేసుకునేందుకు ప్రయతి్నంచినట్లు అమెరికా ప్రభుత్వం ఆరోపించడం తెలిసిందే. -
రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయం
దేశీయంలో టెలికాం సంస్థల వార్షిక ఆదాయం వచ్చే రెండేళ్లలో రూ.ఐదు లక్షల కోట్లకు చేరుతుందని భారత టెలికా విభాగం(డాట్) తెలిపింది. ప్రభుత్వం గతంలో తీసుకున్న సులభతర వాణిజ్య చర్యల వల్ల ఇది సాధ్యమవుతుందని డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ సభ్యుడు మనీశ్ సిన్హా అంచనా వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే రెండేళ్లలో టెలికాం కంపెనీల వార్షికాదాయాలు రూ.5 లక్షల కోట్లకు చేరవచ్చు. ప్రభుత్వం కొంతకాలంగా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా సులభతర వ్యాపార చర్యలను అనుసరిస్తున్నారు. దాంతో ఈ రంగం వృద్ధి బాటలో పయనిస్తోంది. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపు విషయంలో మాత్రం ప్రస్తుత పద్ధతులను సమీక్షించుకోవాలి. స్పెక్ట్రమ్‌ను ప్రస్తుతం పది లేదా ఇరవై ఏళ్లకు కేటాయిస్తున్నారు. ఈ కాలపరిమితి మార్చాల్సి ఉంది. తక్కువ గడువుకు స్పెక్ట్రమ్‌ను మంజూరు చేయాలి. స్పెక్ట్రమ్ వినియోగం, సామర్థ్యం, ఆర్థిక విలువల విషయంలో సమస్యలున్నాయి. నిత్యం కంపెనీల వృద్ధి పెరుగుతోంది. అందుకు భిన్నంగా పదేళ్లు, ఇరవై ఏళ్ల వరకు స్పెక్ట్రమ్ అనుమతులుండడంపై చర్చించాలి’ అన్నారు.ఇదీ చదవండి: రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె!టెలికాం నియత్రణ సంస్థ ట్రాయ్ నివేదిక ప్రకారం.. 2023-24లో టెలికాం నెట్వర్క్ కంపెనీలు రూ.3.36 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేశాయి. ఈ ఏడాది వీటి ఆదాయం రూ.4 లక్షల కోట్లకు చేరుతుందని సిన్హా అంచనా వేశారు. ఇదిలాఉండగా, టెలికాం కంపెనీలు తమకు తోచినట్లుగా టారిఫ్‌ను పెంచుతూ పోతున్నాయనే వాదనలున్నాయి. జులైలో జియో, ఎయిర్టెల్ వంటి ప్రముఖ సంస్థలు గతంలో కంటే 20 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. చేసేదేమిలేక వినియోగదారులు దాన్ని చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్ఎన్ఎల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అన్ని ప్రదేశాల్లో 4జీ, 5జీ సేవలందిస్తే మరింత మేలు జరుగుతుందని కస్టమర్లు భావిస్తున్నారు. -
5జీ నెట్‌వర్క్‌లో నెంబర్ వన్: తెలుగు రాష్ట్రాల్లో జియో హవా..
5జీ నెట్వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో రిలయన్స్ జియో నెంబర్ వన్‌గా అవతరించింది. 5జీ నెట్వర్క్ కవరేజ్‌లో మాత్రమే కాకుండా , లభ్యతలో కూడా జియో అద్భుతమైన పనితీరును ప్రదర్శిచింది. తాజాగా ఓపెన్ సిగ్నల్ విడుదల చేసిన నివేదికలో.. ఆంధ్రప్రదేశ్ టెలికామ్ సర్కిల్ (ఆంధ్ర, తెలంగాణ) జియో అసాధారణమైన పనితీరును కనపరిచినట్లు వెల్లడించింది.ఓపెన్ సిగ్నల్ నివేదిక ప్రకారం.. జియో 5జీ కవరేజ్ టవర్లు 66.7 శాతం నెట్వర్క్ లభ్యత స్కోర్‌తో దాని ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని జియో వినియోగదారులు మూడింట రెండు వంతులు 5జీ సేవలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద విస్తృతమైన, స్థిరమైన 5జీ కనెక్టివిటీని అందించడంలో జియో ముందంజలో ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.5జీ కవరేజ్ ఎక్స్‌పీరియన్స్‌లో జియో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలలో ముందుంది. 10 పాయింట్ల స్కేల్‌పై జియో 9.0 పాయింట్ల స్కోర్‌తో.. దాని ప్రధాన ప్రత్యర్థి ఎయిర్టెల్ (7.1 స్కోర్) కంటే ముందు వరసలో ఉంది. జియో ఎప్పటికప్పుడు నిరంతరాయ సేవలను అందిస్తూ ముందుకు సాగుతుండటంతో వినియోగదారులు ఈ సర్వీస్ ఎక్కువగా ఉపయోగించడానికి సుముఖత చూపుతున్నారు.జియో, ఎయిర్టెల్ తరువాత వోడాఫోన్ ఐడియా 3.7 పాయింట్ల స్కోర్, బీఎస్ఎన్ఎల్ 1.2 పాయింట్ల స్కోర్స్ సాధించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో 5G కవరేజీని విస్తరించడంలో బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియాకు సవాలుగా మారింది. అయితే ప్రస్తుతం వినియోగదారులు జియో 5జీ ద్వారా స్పీడ్ డౌన్లోడ్ పొందుతూ మెరుగైన నెట్వర్క్ అనుభవం పొందుతున్నారని సమాచారం. -
జియో స్పీడ్ ఎక్కువే: ఓపెన్ సిగ్నల్!
వేగంగా నెట్వర్క్ సేవలందించడంలో జియో దూసుకుపోతుంది. నెట్వర్క్ స్పీడ్, కవరేజ్, స్థిరమైన సర్వీసులు అందించడంలో జియో మరింత మెరుగుపడిందని ఓపెన్ సిగ్నల్ నివేదించింది. దేశంలోని టెలికాం కంపెనీలతో పోలిస్తే జియో అధికంగా 89.5 ఎంబీపీఎస్ స్పీడ్ నెట్‌వర్క్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. ‘ఇండియా మొబైల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో భారత టెలికాం నెట్వర్క్ కంపెనీల సేవలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది.నివేదికలోని వివరాల ప్రకారం..రిలయన్స్ జియో గరిష్ఠంగా 89.5 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్ కలిగిన నెట్‌వర్క్‌ను అందిస్తుంది. ఎయిర్టెల్ 44.2 ఎంబీపీఎస్, వొడాఫోన్ ఐడియా 16.9 ఎంబీపీఎస్‌తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. జియో నెట్వర్క్ స్పీడ్ ఎయిర్టెల్ కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. ఇది స్ట్రీమింగ్, గేమింగ్, ఇతర డేటా సేవలను మరింత మెరుగ్గా అందించే అవకాశం ఉంది. జియో నెట్వర్క్ సేవలు చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించాయి. ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..దేశీయంగా టెలికాం నెట్వర్క్ సేవలకు సంబంధించి కస్టమర్ల అంచనాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్ గేమ్‌లు, వీడియో స్ట్రీమింగ్, ఇతర డేటా అవసరాల కోసం వేగంగా నెట్వర్క్ ఉండాలనుకుంటున్నారు. అదే సమయంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరుతుతోంది. దాంతో సంస్థలు మెరుగైన సర్వీసులు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలో జియోతోపాటు ఇతర కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దాంతో కస్టమర్ల అట్రిషన్ రేటు(నెట్వర్క్ మారడం) పెరగడంతో జియో విభిన్న మార్గాలు అనుసరిస్తోంది. టారిఫ్ రేట్లను పెంచినప్పటి నుంచి నెట్వర్క్ స్పీడ్ తగ్గిపోయిందనే అభిప్రాయాలున్నాయి. కాబట్టి క్రమంగా నెట్వర్క్ స్పీడ్ పెంచుతున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. -
ప్రపంచంలో రెండో స్థానానికి భారత్
అమెరికాను వెనక్కి నెట్టి భారత్ తొలిసారిగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మొబైల్ మార్కెట్‌గా అవతరించింది. గ్లోబల్‌గా 5జీ మొబైళ్ల వాడకంలో గతేడాదితో పోలిస్తే 2024 మొదటి అర్ధ భాగంలో 20 శాతం పెరిగిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. 5జీ ఫోన్లలో యాపిల్ మొబైళ్లను ఎక్కువగా వాడుతున్నారని పేర్కొంది.కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 5జీ మొబైళ్లు వాడుతున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న చైనాను వెనక్కి నెట్టి భారత్ ఒక స్థానం ముందుకు చేరింది. 5జీ ఫోన్లలో ఎక్కువగా యాపిల్ మొబైళ్లను వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కేటగిరీలో 25 శాతం కంటే ఎక్కువ వాటా యాపిల్ సొంతం చేసుకుంది. ఐఫోన్ 15, 14 సిరీస్‌ల్లో ఈ సాంకేతికతను ఎక్కువగా వాడుతున్నారు.బడ్జెట్ విభాగంలో ఎక్కువగా షావోమీ, వివో, శామ్సంగ్ ఇతర బ్రాండ్లకు చెందిన మొబైళ్లను వాడుతున్నారు. 5జీ వాడుతున్నవారిలో 21 శాతం మంది శామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్, ఎస్24 సిరీస్‌లను ఉపయోగిస్తునారు. ఇప్పటికే ఈ టెక్నాలజీ కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నా పూర్తిస్థాయిలో ఇంకా దాన్ని వినియోగించట్లేదు. 4జీ కంటే కొన్ని రెట్ల వేగంతో ఇంటర్నెట్ పనిచేస్తుంది. 4జీలో ఒక సినిమా డౌన్లోడ్ కావాలంటే కొన్ని నిమిషాలు పడితే.. ఇందులో రెప్పపాటులోనే అల్ట్రా హెచ్డీ సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: అమెరికాకు కమల్ హాసన్: ఆ కోర్సు నేర్చుకోవడానికే.. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే వీఆర్, ఏఆర్ సాంకేతికతలో వేగం పెరగనుంది. భద్రతతో కూడిన రవాణా వ్యవస్థ, రిమోట్ ప్రాంతాలకు ఆరోగ్యసేవలు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, సరకు రవాణాలో డిజిటల్ సేవలు వంటి ఎన్నో అంశాల్లో 5జీ కీలకం కానుంది. రిమోట్ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
అతిపెద్ద ల్యాబ్ ఏర్పాటు చేస్తున్న నోకియా
ఫిక్స్డ్ నెట్వర్క్ సాంకేతికతలో ఆవిష్కరణల కోసం నోకియా అతిపెద్ద గ్లోబల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. అందుకోసం భారత్‌లోని చెన్నైలో రూ.450 కోట్ల పెట్టుబడికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా నెట్వర్క్ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు నోకియా, చెన్నై రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఫిన్లాండ్కు చెందిన నోకియా దేశంలో ఫిక్స్డ్ నెట్వర్క్ సాంకేతికతలో ఆవిష్కరణలు చేసేందుకు వీలుగా రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాన్ని చెన్నైలో ఏర్పాటు చేయలనే ఉద్దేశంతో రూ.450 కోట్లు కేటాయించబోతున్నట్లు తెలిపింది. ఈ ల్యాబ్‌లో రానున్న రోజుల్లో 10జీ, 25జీ, 50జీ, 100 జీ(జీపొన్-గిగాబిట్ ప్యాసివ్ ఆప్టికల్ నెట్వర్క్) నెట్‌వర్క్‌పై పరిశోధనలు చేస్తామని నోకియా ఆసియా పసిఫిక్ ఫిక్స్డ్ నెట్‌వర్క్‌ల హెడ్ విమల్ కుమార్ కోదండరామన్ తెలిపారు. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా అడ్వాన్స్డ్ నెట్వర్క్ టెక్నాలజీ సేవలందించేలా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అతిపెద్ద ఫిక్స్డ్ నెట్‌వర్క్‌ల ల్యాబ్ చెన్నైలో ఏర్పాటు చేయడంవల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని తమిళనాడు పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా తెలిపారు.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఒక్క నిమిషం.. -
బీఎస్ఎన్ఎల్కు మారుతున్నారా?.. నచ్చిన నెంబర్ ఎంచుకోండిలా
జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ నెట్వర్క్స్ అన్నీ కూడా రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచిన తరువాత.. అందరి చూపు బీఎస్ఎన్ఎల్ వైపు పడింది. దీంతో ఇప్పటికే చాలామంది తమ నెట్‌వర్క్‌ను బీఎస్ఎన్ఎల్కు మార్చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం తక్కువ ధరలోనే అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది.ఎక్కువమంది బీఎస్ఎన్ఎల్కు మారుతున్న తరుణంలో సంస్థ కూడా తన నెట్‌వర్క్‌ను విస్తరించడానికి తగిన సన్నాహాలు చేస్తోంది. తమ నెట్‌వర్క్‌కు మారాలనుకునే వారికోసం బీఎస్ఎన్ఎల్ నచ్చిన నెంబర్ ఎందుకుని వెసులుబాటు కూడా కల్పించింది. ఆన్లైన్లో యూజర్ ఇప్పుడు ఫేవరేట్ నెంబర్ సెలక్ట్ చేసుకోవచ్చు.ఆన్లైన్లో నెంబర్ ఎంచుకోవడం ఎలా?గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్‌లో BSNL Choose Your Mobile Number అని సెర్చ్ చేయాలి.ఇలా సెర్చ్ చేసిన వెంటనే BSNL CYMN అనేది కనిపిస్తుంది. దీనిపైనా క్లిక్ చేయగా మరో పేజీ ఓపెన్ అవుతుంది.ఇక్కడ ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్ అని నాలు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీ జోన్ సెలక్ట్ చేసుకుని రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.ఇలా ఎందుకున్న తరువాత ఛాయిస్ నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. కావాల్సిన ఆప్షన్ ఎందుకున్న తరువాత నెంబర్ సెలక్ట్ చేసుకోవచ్చు.నచ్చిన నెంబర్ ఎంచుకున్న తరువాత రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.ప్రక్రియ పూర్తయ్యాక సమీపంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లి సీఎం తెచ్చుకోవచ్చు. ఫ్యాన్సీ నెంబర్ కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. -
మైక్రోసాఫ్ట్‌లో సమస్య: టచ్‌లో ఉన్నామంటూ మంత్రి ట్వీట్
మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య పలు రంగాల్లో తీవ్ర అంతరాయాలను కలిగిస్తోంది. వినియోగదారులకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అనే మెసేజ్ వస్తోంది. ఇలా మెసేజ్ వచ్చిన తరువాత రీస్టార్ట్ అవుతున్నాయని పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపైన కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.యూఎస్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం టచ్‌లో ఉందని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యను గుర్తించారని, దాన్ని పరిష్కరిస్తున్నారని.. ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) వంటి వాటిని ప్రభావితం చేయదని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు సేవలను అందించే పాన్-ఇండియా కమ్యూనికేషన్ నెట్వర్క్.మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) ఒక సాంకేతిక సలహాను జారీ చేసింది. ఇందులో క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సార్లకు సంబంధించిన విండోస్ హోస్ట్‌లు.. ఇటీవలి అప్డేట్ల కారణంగా అంతరాయాలను ఎదుర్కొంటున్నాయని, క్రాష్ అవుతున్నాయని పేర్కొన్నారు.MEITY is in touch with Microsoft and its associates regarding the global outage. The reason for this outage has been identified and updates have been released to resolve the issue. CERT is issuing a technical advisory.NIC network is not affected.— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 19, 2024 -
సైన్యానికి సేవలందించే చిప్ ఆధారిత 4జీ బేస్ స్టేషన్
భారత సైన్యం తొలిసారిగా స్వదేశీ చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్‌ను ప్రవేశపెట్టింది. బెంగుళూరుకు చెందిన ‘సిగ్నల్‌ట్రాన్’ అనే సంస్థ దీన్ని తయారుచేసింది. ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా బిడ్‌ను దక్కించుకుని దీన్ని రూపొందించినట్లు సిగ్నల్‌ట్రాన్ తెలిపింది. ఈ ‘సహ్యాద్రి’ ఎల్టీఈ బేస్ స్టేషన్లో ఉపయోగించే చిప్‌ను కంపెనీ ఆధ్వర్యంలోని ‘సిగ్నల్ చిప్’ బృంద్రం అభివృద్ధి చేసిందని సంస్థ వ్యవస్థాపకుడు హిమాంషు ఖాస్నిస్ తెలిపారు.హిమాంషు, తన బృందం 2010లో 4జీ, 5జీ నెట్వర్క్ చిప్‌లను తయారు చేయడానికి ఈ కంపెనీను స్థాపించారు. ఈ సందర్భంగా హిమాంషు మాట్లాడుతూ..‘దేశంలోనే మొదటిసారి చిప్ ఆధారిత 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం ప్రత్యేక వ్యవస్థను తయారుచేశాం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించాం. సంక్లిష్ట కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం దేశీయ చిప్ ఆధారిత నెట్‌వర్క్‌ను భారతీయ సైన్యంలోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతేడాది 4జీ ఎల్టీఈ నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్(ఎన్ఐటీ) సాంకేతికత కోసం భారతీయ సైన్యం గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్‌లో బిడ్లను పోస్ట్ చేసింది. దాంతో సిగ్నల్‌ట్రాన్ ఈ బిడ్‌ను దక్కించుకుంది. కేవలం 7 కిలోల బరువున్న ఈ సహ్యాద్రి నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్ (ఎన్ఐబీ) వ్యవస్థ అధిక నాణ్యత కలిగిన వైర్లెస్ కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఆడియో, వీడియో, డేటా అప్లికేషన్ల సరఫరాలో సమర్థంగా పనిచేస్తుంది. సైనికులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారితో కమ్యూనికేషన్ చేయడానికి వీలవుతుంది. భారత్ సైన్యానికి కంపెనీ 20 యూనిట్లను సరఫరా చేసింది’ అని చెప్పారు.‘ఈ బేస్ స్టేషన్లను ఎప్పుడు, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనే దానిపై సైన్యం నిర్ణయం తీసుకుంటుంది. అవి తేలికపాటి, మొబైల్ యూనిట్లు కాబట్టి వారి అవసరాలకు అనుగుణంగా ఎక్కడికైనా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. దేశంలోని బేస్ స్టేషన్లల్లో ఎక్కువ భాగం స్థానికంగా తయారు చేసినవికావు. కొన్నింటిలో స్వదేశీ చిప్‌లు కూడా లేవు. ప్రస్తుతం ఆధునిక సెమీకండక్టర్ చిప్‌ల తయారీకి దేశంలో ఫ్యాబ్రికేషన్ సౌకర్యం లేదు. ఎన్విడియా, క్వాల్కామ్, మీడియాటెక్ వంటి ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీలకు సమానమైన మోడల్లో సిగ్నల్‌చిప్ ఈ టెక్నాలజీని రూపొందించింది. 2029 నాటికి భారతీయ బేస్ స్టేషన్ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా’ అని ఖాస్నిస్ వివరించారు. -
6.8లక్షల మొబైల్ నంబర్లను ధ్రువీకరించాలన్నటెలికాంశాఖ
ఉపయోగంలోలేని, నకిలీ ధ్రువపత్రాలతో తీసుకున్న 6.8 లక్షల మొబైల్ కనెక్షన్లను ధ్రువీకరించాలని టెలికాం శాఖ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొబైల్ నంబర్లను 60 రోజుల్లోపు గుర్తించి వెంటనే రీ-వెరిఫికేషన్ చేయాలని తెలిపింది. లేదంటే వాటిని డిస్కనెక్ట్ చేస్తామని హెచ్చరించింది.నకిలీ ఫోన్ నంబర్లు, ఉపయోగంలోలేని కనెక్షన్లను గుర్తించడానికి టెలికాంశాఖ అధునాతన ఏఐను వినియోగించినట్లు ప్రకటనలో చెప్పింది. ఏఐ విశ్లేషణలో భాగంగా ఉపయోగంలోలేనివి, నకిలీ ఐడీ ప్రూఫ్‌లతో ఉన్న దాదాపు 6.8 లక్షల మొబైల్ కనెక్షన్లు గుర్తించినట్లు తెలిపింది. వెంటనే నెట్వర్క్ ఆపరేటర్లు వాటిని ధ్రువీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ 60 రోజుల్లోపు పూర్తి చేయాలని చెప్పింది.ఇదీ చదవండి: అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండిఒకవేళ ఆపరేటర్లు ముందుగా విధించిన గడువులోపు మొబైల్ నంబర్లను ధ్రువీకరించకపోతే వాటిని డిస్కనెక్ట్ చేస్తామని హెచ్చరించింది. అవసరమైతే కొందరు ఆపరేటర్లు ఈ తంతును మళ్లీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2024 ఏప్రిల్‌లో టెలికాంశాఖ 10,834 మొబైల్ నంబర్లపై అనుమానం వ్యక్తంచేస్తూ వీటిని రీవెరిఫికేషన్ చేయాలని తెలిపింది. వీటిలో 8,272 కనెక్షన్లు ధ్రువీకరణలో విఫలమవడంతో డిస్కనెక్ట్ చేసినట్లు పేర్కొంది. -
కుటుంబాలకు మరిన్ని రుణాలు!
కోల్‌కతా: కుటుంబాల రుణ అవసరాల పరంగా మరింత విస్తరించి, తమ పంపిణీల పోర్ట్‌ఫోలియోను వృద్ధి చేసుకోడానికి సూక్ష్మ ఆర్థిక సంస్థలు (ఎంఎఫ్ఐలు) దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎంఎఫ్ఐఎన్) సీఈఓ, డైరెక్టర్ అలోక్ మిశ్రా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 7.3 కోట్ల తక్కువ ఆదాయ రుణగ్రహీతలు ఉన్నారని, వీరు నాలుగు లక్షల కోట్ల రూపాయల బకాయి ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎంఎఫ్ఐ రంగానికి రూ. 13 లక్షల కోట్ల పోర్ట్‌ఫోలియో విస్తరణ సామర్థ్యం ఉందని ఆయన పేర్కొంటూ, ఈ నేపథ్యంలో వృద్ధికి భారీ అవకాశం ఉందని అన్నారు. ఒక్క పశి్చమ బెంగాల్లో 65 లక్షల మంది రుణగ్రహీతలకు సంబంధించి మొత్తం రూ. 35,000 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయని అన్నారు. మొత్తం పోర్ట్‌ఫోలియోలో తొమ్మిది శాతం పశ్చిమ బెంగాల్‌కు చెందినవేనని చెప్పారు. లఘు ఎంఎఫ్ఐలకు రీఫైనాన్సింగ్ కోసం మాత్రమే ఉద్దేశించిన ఒక ప్రత్యేక ఆర్థిక సంస్థ ఏర్పాటును ఈ రంగం కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఏఎంఎఫ్ఐ)పశి్చమ బెంగాల్ విభాగం ఈ నెల 22వ నిర్వహించనున్న 8వ ఈస్టర్న్ ఇండియా మైక్రోఫైనాన్స్ సమ్మిట్ సందర్భంగా అలోక్ మిశ్రా ఎంఎఫ్ఐ రంగానికి సంబంధించి ఈ కీలక అంశాలను వెల్లడించారు. ఈ రంగానికి చెందిన మరికొందరు చెబుతున్న అంశాలు ఇవీ... ► ప్రస్తుతం దేశంలో ఎంఎఫ్ఐ కవరేజీ తక్కువగా ఉందని ఆరోహన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఎండీ మనోజ్ నంబియార్ తెలిపారు.ఈ రంగం మరింత విస్తరించాల్సి ఉందని పేర్కొన్నారు. ► చారిత్రాత్మకంగా ఎంఎఫ్ఐ రంగంలో మొండిబకాయిల (ఎన్పీఏ) సగటు స్థాయిలు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని వీఎఫ్ఎస్ క్యాపిటల్ ఎండీ కులదీప్ మైథీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిలో ఎంఎఫ్ఐలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మైథీ చెప్పారు. -
నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ప్రారంభించనున్న సీఎం జగన్
-
రూ. 1,127 కోట్ల ఆర్డర్.. పెద్ద ప్రయత్నమే చేస్తున్న బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్రయత్నమే చేస్తోంది. తమ ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ (OTN) ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా మార్చేయబోతోంది. ఇందుకోసం హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్ (HFCL) అనే కంపెనీకి భారీ ఆర్డర్ ఇచ్చింది. ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ మార్పు కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నుంచి రూ. 1,127 కోట్ల ఆర్డర్‌ను పొందినట్లు హెచ్ఎఫ్సీఎల్ తాజాగా తెలిపింది. ఈ సంస్థ చేపట్టే సమగ్ర నెట్వర్క్ అప్‌గ్రేడ్ కేవలం కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ సేవల అవసరాలను తీర్చడమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో మెరుగైన 4జీ సేవలను అందించడంతోపాటు 5జీ సర్వీస్‌పైనా దృష్టి పెట్టే స్థాయిలో బీఎస్ఎన్ఎల్ను నిలుపుతుందని భావిస్తున్నారు. సంక్లిష్ట వ్యవస్థలను ఏకీకృతం చేయడంలో తమ అసమానమైన నైపుణ్యంతో అత్యాధునిక ఆప్టికల్ టెక్నాలజీని అమలు చేయడానికి నోకియా (NOKIA) నెట్‌వర్క్‌తో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు హెచ్ఎఫ్సీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
10 కోట్ల మంది 5జీ యూజర్లు..
-
సూక్ష్మ రుణాల్లో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్‌ఐల ప్రధాన పాత్ర
కోల్‌కతా: దేశంలో సూక్ష్మ రుణాల పంపిణీలో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. 2022–23 సంవత్సరానికి సూక్ష్మ రుణ పరిశ్రమకు (ఎంఎఫ్ఐలు) సంబంధించి నివేదికను రూపొందించి విడుదల చేసింది. 2023 మార్చి 31 నాటికి రూ.1,38,310 కోట్ల రుణాలను ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు అందించాయి. మొత్తం సూక్ష్మ రుణాల్లో ఇది 39.7 శాతానికి సమానం. సూక్ష్మ రుణాల్లో బ్యాంక్‌ల వాటా 34.2 శాతంగా ఉంది. ఇవి రూ.1,19,133 కోట్ల రుణాలను సమకూర్చాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు అందించిన సూక్ష్మ రుణాలు రూ.57,828 కోట్లుగా (16.6 శాతం వాటా) ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఎంఎఫ్‌ఐల మొత్తం పోర్ట్‌ఫోలియో (రుణాలు) రూ.3,48,339 కోట్లుగా ఉంది. ఎంఎఫ్ఐ రంగానికి అపార వృద్ధి అవకాశాలు ఉన్నాయని, 2024 మార్చి నాటికి సూక్ష్మ రుణ పరిశ్రమ పరిమాణం రూ.13 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. నూతన నియంత్రణలు సూక్ష్మ రుణ సంస్థల కార్యకలాపాలను బలోపేతం చేస్తాయని అభిప్రాయపడింది. కరోనా తర్వాత నిధుల వితరణ, పోర్ట్‌ఫోలియో నాణ్యత, క్లయింట్ల చేరికలో ఎంఎఫ్ఐ పరిశ్రమ బలంగా పుంజుకున్నట్టు తెలిపింది. -
అంతరిక్షంలో చెత్త వదిలినందుకు రూ.1.24 కోట్ల జరిమానా
వాషింగ్టన్: అంతరిక్షంలో చెత్తను వదిలేసినందుకు డిష్ నెట్వర్క్ కంపెనీకి అమెరికా ప్రభుత్వానికి చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(ఎఫ్‌సీసీ) 1,50,000 డాలర్ల(రూ.1.24 కోట్లు) జరిమానా విధించింది. అంతరిక్షంలో ప్రమాదకరమైన చెత్త వదిలినందుకు ఇలా జరిమానా విధించడం అమెరికాలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. డిష్ నెట్వర్క్ కంపెనీ 2002లో ఎకోస్టార్–7 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేరుకున్న ఈ ఉపగ్రహం కాలపరిమితి 2022లో ముగిసింది. నిరుపయోగంగా మారిన ఉపగ్రహాన్ని కక్ష్య నుంచి 299 కిలోమీటర్ల దూరం పంపించాల్సి ఉంది. 122 కిలోమీటర్లు వెళ్లాక ఇంధనం నిండుకోవడంతో అక్కడే ఆగిపోయింది. ప్రస్తుతం భూమిచుట్టూ పరిభ్రమిస్తోంది. ఇతర ఉపగ్రహాలకు ప్రమాదకరంగా మారింది. అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాలను చెత్తగానే పరిగణిస్తారు. 1957 నుంచి ఇప్పటిదాకా 10 వేలకుపైగా శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించారు. వీటిలో సగం శాటిలైట్లు పనిచేయడం లేదు. -
ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా ఇండిగో
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే అద్భుతమైన, అధిక పోటీతో కూడిన ఏవియేషన్ మార్కెట్ అని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. ఇండిగో మరింత పెద్ద, మెరుగైన, ప్రపంచ స్థాయి సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించారు. తనకంటూ సొంతంగా అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను నిర్మించుకుంటున్నట్టు, ఇతర ఎయిర్‌లైన్ సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లోని పట్టణాల నుంచి విదేశీ గమ్యస్థానాలకు మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఎల్బర్స్ తెలిపారు. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ 320కు పైగా విమానాలతో 1,900 రోజువారీ సరీ్వసులు నిర్వహిస్తోంది. దేశీ విమానయాన మార్కెట్లో ఈ సంస్థకు 63 శాతం వాటా ఉంది. 32 అంతర్జాతీయ, 81 దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. అయితే ఇటీవల పీఅండ్‌డబ్ల్యూ ఇంజన్లలో సమస్యల కారణంగా కొన్ని ఏ320 విమానాలను నిలిపివేయాల్సి వచి్చంది. దీన్ని అధిగమించేందుకు సంస్థ కొన్ని విమానాలను వెట్‌లీజ్ తీసుకుంది. టికెట్ ధరలు కీలకం.. విమానాల నిర్వహణ వ్యయాలు, టికెట్ ధరల మధ్య సహ సంబంధం ఉండాలని, లేకపోతే విమానయాన సంస్థలు మనుగడ సాగించలేవని ఎల్బర్స్ అభిప్రాయపడ్డారు. ఇండిగో అందుబాటు ధరలపైనే దృష్టి సారించినట్టు చెబుతూ, సీజన్ డిమాండ్‌కు అనుగుణంగా ఇవి పెరుగుతూ, తరుగుతూ ఉంటాయని వెల్లడించారు. ఇండిగో వృద్ధి దశలో ఉందన్నారు. అదే సమయంలో దేశంలో ఏవియేషన్ హబ్‌ల అవసరాన్ని ప్రస్తావించారు. సొంతంగా నెట్వర్క్ నిర్మించుకోవడంతోపాటు, ప్రస్తుత పట్టణాలను నూతన మార్గాలతో (భువనేశ్వర్–సింగపూర్ తరహా) అనుసంధానిస్తున్నట్టు పీటర్ ఎల్బర్స్ తెలిపారు. అలాగే, ఇతర ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యాలను కూడా పెంచుకుంటున్నట్టు వివరించారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో కోడ్õÙర్ భాగస్వామ్యాన్ని ఈ నెలలోనే ఇండిగో కుదుర్చుకోవడం గమనార్హం. -
ఓటీటీలు డబ్బు కట్టకుండా 5జీని వాడుకుంటున్నాయ్
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 5జీ నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాయని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఆరోపించారు. వాటిని వాడుకుంటున్నందుకు గాను ఆయా సంస్థలు తమకు వచ్చే లాభాల్లో కొంతైనా టెల్కోలకు చెల్లించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘టెల్కోలు తమ వాయిస్, డేటా ట్రాఫిక్ కోసం నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తాయి. అయితే, ఓటీటీ సంస్థలు మాత్రం భారీ డేటా చేరవేత కోసం ఈ నెట్‌వర్క్‌లపై పెను భారం మోపుతున్నాయి. కంటెంట్ ప్రొవైడర్స్ నుంచి తీసుకున్న డేటాను తమ ప్లాట్‌ఫాం ద్వారా యూజర్లకు చేరవేస్తాయి. ఈ ప్రక్రియలో ఉపయోగించుకునే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన సంస్థలకు మాత్రం పైసా చెల్లించడం లేదు‘ అని కొచర్ చెప్పారు. ఓవైపున 5జీ వంటి అధునాతన టెక్నాలజీ నెట్‌వర్క్‌ల ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెట్టలేక టెల్కోలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మాత్రం వాటితో లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్నందుకు గాను టెల్కోలకు ఓటీటీలు తమకు వచ్చే లాభాల్లో సముచిత వాటాను ఇవ్వాలని కొచర్ పేర్కొన్నారు. నెట్‌వర్క్‌లు, డిజిటల్ కనెక్టివిటీ, స్మార్ట్ఫోన్ల వినియోగం మెరుగుపడిన నేపథ్యంలో భారత్‌లో వీడియో ఓటీటీ మార్కెట్ 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలైవ్ వంటి ఓటీటీ సంస్థలకు భారత్‌లో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు. -
చంద్రయాన్–3లో ఈసీఐఎల్ కీలక భూమిక
కుషాయిగూడ (హైదరాబాద్): చంద్రయాన్–3లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కీలక భూమిక పోషించింది. చంద్రయాన్ కమ్యూనికేషన్‌కు కీలకమైన 32 మీటర్ డీప్ స్పేస్ నెట్వర్క్ (డీఎస్ఎన్) యాంటెన్నాను సరఫరా చేసిందని సంస్థ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. 300 టన్నుల ఈ యాంటెన్నా వ్యవస్థను బాబా అటామిక్ రీసెర్చ్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, ఐఎస్టీఆర్ఏసీలతో కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై 0.3 మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన వాటినీ క్షుణ్ణంగా చూపించేలా వీల్ అండ్ ట్రాక్ మౌంట్, బీమ్ వేవ్ గైడ్, ఫీడ్ సిస్టమ్‌తో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యాంటెన్నాలో అమర్చినట్లు చెప్పాయి. చంద్రుడిపై తీసే చిత్రాలు, డేటాను స్వాదీనం చేసుకోవడంలోనూ ఈ యాంటెన్నా కీలక పాత్ర పోషిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన యాంటెన్నా సిస్టమ్‌తో పాటుగా సేఫ్ అండ్ సెక్యూర్ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్ (పీఎల్సీ)ని అందిస్తూ ఇస్రోతో ఈసీఐఎల్ సన్నిహితంగా పనిచేస్తోందని ఆ వర్గాలు చెప్పాయి. రాబోయే ఆదిత్య, గగన్‌యాన్, మంగళ్యాన్–2 మిషన్లకు కూడా ఈసీఐఎల్ పనిచేస్తుందని పేర్కొన్నాయి. -
నాసా వ్యోమనౌక నుంచి సిగ్నల్స్ కట్, వోయేజర్–2కు మళ్లీ జీవం!
ఇతర గ్రహాలపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పశోధనా సంస్థ 46 ఏళ్ల క్రితం ప్రయోగించిన వోయేజర్–2 వ్యోమనౌక మళ్లీ యథాతథంగా పనిచేయడం ప్రారంభించింది. ఒకరకంగా చెప్పాలంటే కీలకమైన ఈ స్పేస్‌క్రాఫ్ట్ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈ వ్యోమనౌక ప్రస్తుతం భూమికి దాదాపు 12 బిలియన్ల మైళ్ల (దాదాపు 2,000 కోట్ల కిలోమీటర్లు) దూరంలో ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థలో చోటుచేసుకున్న పొరపాటు వల్ల గత నెల 21 తేదీన వోయేజర్–2 నుంచి భూమికి సంకేతాలు ఆగిపోయాయి. కంట్రోలర్లు పొరపాటున తప్పుడు కమాండ్ పంపించడమే కారణమని సమాచారం. ఫలితంగా వోయేజర్–2 యాంటెనా స్వల్పంగా పక్కకు జరిగింది. దాంతో సంకేతాలు నిలిచిపోయాయి. నాసా సైంటిస్టులు వెంటనే రంగంలో దిగారు. సంకేతాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. భారీ రేడియో యాంటెనాలతో కూడిన డీస్ స్పేస్ నెట్వర్క్ ద్వారా కమాండ్ పంపించారు. దీనికి వోయేజర్–2 స్పందించి 18 గంటల తర్వాత భూమిపైకి సంకేతాలను పంపించింది. నాసా శాస్త్రవేత్తలు వోయేజర్–2 యాంటెనాను సరిచేసే పనిలో విజయం సాధించారు. ఇందుకోసం కమాండ్‌ను పంపించారు. స్పేస్‌క్రాఫ్ట్‌తో కమ్యూనికేషన్‌ను దాదాపు పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. వోయేజర్–2 ఎప్పటిలాగే పనిచేస్తోందని, యధావిధిగా సేవలు అందిస్తోందని హర్షం వ్యక్తం చేసింది. ఏమిటీ వోయేజర్–2? అంతరిక్షంలో భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిగ్రహం, కుజ గ్రహం, బృహస్పతి, గురుగ్రహంపై పరిశోధనల కోసం ‘నాసా’ 1977 సెప్టెంబర్ 5న వోయేజర్–1, 1977 ఆగస్టు 20న వోయేజర్–2 వ్యోమనౌకలను పంపించింది. కాలిఫోర్నియాలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో వీటిని రూపొందించారు. భూమికి సంబంధించిన శబ్ధాలు, చిత్రాలు, సందేశాలను ఇందులో చేర్చారు. గత 36 ఏళ్లుగా నిరి్వరామంగా పనిచేస్తున్నాయి. ఇతర గ్రహాల సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తున్నాయి. 2012 ఆగస్టులో వోయేజర్–1 ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది. అంటే అంతరిక్షంలో లక్షల కోట్ల ఏళ్ల క్రితం కొన్ని నక్షత్రాలు అంతరించిపోవడం వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశంలోకి చేరుకుంది. ఆ తర్వాత వోయేజర్–2 కూడా ఈ స్పేస్‌లోకి ప్రవేశించింది. వోయేజర్–2 1986లో యురేనస్ గ్రహం సమీపానికి వచి్చంది. దాని ఉపగ్రహాలను గుర్తించింది. గురు, శనిగ్రహాలకి సంబంధించిన యూరోపా, ఎన్సిలాడస్ అనే ఉపగ్రహాలపై మంచు కింద సముద్రాల ఆనవాళ్లు ఉన్నట్లు కనిపెట్టింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కార్డు నెట్‌వర్క్‌ను ఎంచుకునేందుకు కస్టమర్‌కు ఆప్షన్
న్యూఢిల్లీ: బ్యాంకులు, బ్యాంక్‌యేతర సంస్థలు జారీ చేసే కార్డులకు సంబంధించి అదీకృత నెట్‌వర్క్‌లను ఎంచుకునే వెసులుబాటును కస్టమర్‌కు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. ప్రస్తుతం కార్డ్ నెట్‌వర్క్‌లు, కార్డ్‌లు జారీ చేసే సంస్థల (బ్యాంకులు, నాన్–బ్యాంకులు) మధ్య ఉన్న ఒప్పందాలు.. కస్టమర్లకు తగినన్ని ఆప్షన్లను అందుబాటులో ఉంచేలా లేవని సర్క్యులర్ ముసాయిదాలో అభిప్రాయపడింది. కార్డును జారీ చేసేటప్పుడు గానీ లేదా ఆ తర్వాత గానీ అర్హత కలిగిన కస్టమర్లు.. బహుళ కార్డు నెట్‌వర్క్‌ల నుంచి ఏదో ఒకదాన్ని ఎంచుకునేందుకు అవకాశం కలి్పంచాలని పేర్కొంది. కార్డు ఇష్యూయర్లు ఒకటికి మించి నెట్‌వర్క్‌లతో కార్డులను జారీ చేయాలని తెలిపింది. సంబంధిత వర్గాలు ఆగస్టు 4 వరకు ఈ ముసాయిదా సర్క్యులర్‌పై ఆర్బీఐకి తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీసా, రూపే, మాస్టర్‌కార్డ్ మొదలైన కార్డ్ నెట్‌వర్క్‌లు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటితో భాగస్వామ్యం ద్వారా బ్యాంకులు, నాన్–బ్యాంకులు తమ డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులు మొదలైన వాటిని జారీ చేస్తున్నాయి. -
డిజిటల్ ఇండియా ఇక నుండి 5G ఇండియా
-
24న స్టార్టప్‌ల ‘డీ2సీ అన్లాక్డ్’ సమావేశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మర్చంట్ ఫస్ట్ చెకవుట్ నెట్వర్క్ సంస్థ సింపుల్, టీ–హబ్ సంయుక్తంగా జూన్ 24న హైదరాబాద్‌లో కమ్యూనిటీ ఆధారిత స్టార్టప్ వ్యవస్థాపకుల సమావేశం డీ2సీ అన్లాక్డ్ను నిర్వహించనున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా తొమ్మిది ఎడిషన్లు నిర్వహించగా ఇది పదోది. ఇందులో డీ2సీ సంస్థల వ్యవస్థాపకులు.. బ్రాండ్లకు గుర్తింపు, డిజిటల్ మార్కెటింగ్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి, సింపుల్ సహ వ్యవస్థాపకులు నిత్యా శర్మతో పాటు హైదరాబాదీ బ్రాండ్లయిన స్కిపీ ఐసాపాప్స్ సహ వ్యవస్థాపకులు రవి కాబ్రా, గేర్ హెడ్ మోటర్స్ వ్యవస్థాపకుడు నిఖిల్ గుండా, పిప్స్ సీఈవో ప్రశాంత్ గౌరిరాజు తదితరు పాల్గొంటారు. డీ2సీ బ్రాండ్లను నిర్మించడం, అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశ్రమలోని తోటి వారితో సమావేశమయ్యేందుకు కూడా ఇది ఉపయోగకరంగా ఉండగలదని నిత్యా శర్మ తెలిపారు. -
ఇలా అయితే వొడాఫోన్ ఐడియా కథ కంచికే..
భారతదేశంలో అతి పెద్ద టెలికం సంస్థలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్(Airtel) గత మార్చి నెలలో భారీ సంఖ్యలో కొత్త సబ్స్క్రైబర్లను పొందింది. అయితే వొడాఫోన్ ఐడియా మాత్రమే రోజు రోజుకి తన యూజర్లను కోల్పోతూనే ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 మార్చి నెలలో రిలయన్స్ జియోకు 30.5లక్షల మంది కొత్త మొబైల్ యూజర్లు యాడ్ అయ్యారు. దీంతో జియో యూజర్ల సంఖ్య ఏకంగా 43 కోట్లు దాటింది. 2023 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 42.71 లక్షలుగా నమోదైంది. ఎయిర్టెల్ కూడా మార్చి నెలలో 10.37లక్షల కొత్త సబ్స్క్రైబర్లను పొందింది. ఈ కొత్త సబ్స్క్రైబర్ల సంఖ్యతో మొత్తం యూజర్ల సంఖ్య 37.09 కోట్లకు చేరింది. అంతకు ముందు ఫిబ్రవరిలో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 36.98 కోట్లుగా ఉండేది. ఈ రెండు సంస్థలు మార్చిలో మంచి వృద్ధిని నమోదు చేసుకోగలిగాయి. ఇక వొడాఫోన్ ఐడియా విషయానికి వస్తే, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ యూజర్లు క్రమంగా తగ్గుతున్నారు. ఈ ఏడాది మార్చిలో 12.12 లక్షల మంది యూజర్లను కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో వొడాఫోన్ ఐడియా సబ్స్కైబర్ల సంఖ్య 23.67 కోట్లకు పడిపోయింది. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 23.79 కోట్లుగా ఉండేది. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!) మరింత మంచి వృద్ధిని పెంచుకోవడానికి, ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను ఆకర్షించడానికి జియో, ఎయిర్టెల్ రెండూ 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాయి. అంతే కాకుండా రూ.239 అంతకన్నా ఎక్కువ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 5జీ ఉన్న ప్రాంతాల్లో 5జీ నెట్‌వర్క్‌పై ఉచితంగా అన్లిమిడెట్ డేటా అందిస్తున్నాయి. (ఇదీ చదవండి: మళ్ళీ ఇండియాకు రానున్న చైనా బ్రాండ్ ఇదే - ఇషా అంబానీ అంటే మినిమమ్ ఉంటది!) జియో, ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పరుగులు పెడుతుంటే వొడాఫోన్ ఐడియా మాత్రం ఇంకా 5జీ నెట్వర్క్ లాంచ్ చేయనేలేదు. 5జీ నెట్వర్క్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. పైగా ఉన్న యూజర్లను కూడా కంపెనీ కోల్పోతోంది. ఇవన్నీ రానున్న రోజుల్లో వొడాఫోన్ ఐడియాకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. -
భారీ పెట్టుబడితో 4జీ నెట్వర్క్ - గ్రామాలపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కనెక్టివిటీ లేని అన్ని గ్రామాలకు 2024 కల్లా 4జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ చెప్పారు. ‘4జీ విస్తరణ ప్రాజెక్టు గురించి మాట్లాడితే.. దాదాపు 38,000 - 40,000 గ్రామాలకు సిగ్నల్స్ లేవు. ప్రతి ఇంటికీ చేరే దిశగా.. 2024 నాటికల్లా 4జీ పూర్తి స్థాయిలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని ’మన్ కీ బాత్’ కార్యక్రమం 100వ ఎపిసోడ్ ప్రసారం సందర్భంగా చౌహాన్ మాట్లాడారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, సేవలను మరింతగా ప్రజలందరి వద్దకు చేర్చేలా ప్రధాని ప్రోత్సహిస్తారని ఆయన పేర్కొన్నారు. కనెక్టివిటీ లేని గ్రామాలకు కూడా 4జీ నెట్‌వర్క్‌ను విస్తరించడం వల్ల సామాజిక - ఆర్థిక పరివర్తన సాధ్యపడుతుందని, డిజిటల్ అసమానతలను తొలగించవచ్చని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఎంత మేర జవాబుదారీతనంతో వ్యవహరిస్తోందో ప్రజలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. కవరేజీ లేని గ్రామాలన్నింటిలోనూ 4జీ మొబైల్ సర్వీసులను విస్తరించే ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ 2022 జూలైలో ఆమోదించింది. దీని మొత్తం వ్యయం రూ. 26,316 కోట్లు. దీనితో చేరుకోవడం కష్టతరంగా ఉండే 24,680 పైచిలుకు మారుమూల గ్రామాల్లో 4జీ మొబైల్ సేవలను అందుబాటులోకి తేనున్నారు. -
పెరిగోపోతున్న డేటా ట్రాఫిక్.. ఒక్కొక్కరు నెలకు 19.5 జీబీ వాడేస్తున్నారు..!
సాక్షి, అమరావతి: దేశంలో డేటా ట్రాఫిక్ పెరుగుతోంది. మొబైల్ వినియోగంలో భారీ పెరుగుదల నమోదవుతోంది. గడచిన ఐదేళ్లలో ఏకంగా 3.2 రెట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం సగటున ఒక వ్యక్తి నెలకు 19.5 జీబీ డేటా ఖర్చు చేస్తుండగా.. 2027 నాటికి 46 జీబీకి చేరుకుంటుందని టెలికాం సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే... ఒక వ్యక్తి ద్వారా నెలలో 136 శాతం డేటా వాడకం పెరగనుంది. దేశంలో చౌకగా మొబైల్ డేటా లభిస్తుండటంతోపా టు హైస్పీడ్ 5జీ నెట్వర్క్ విస్తరణతో డేటా విస్తతిలో గణనీ య మైన మార్పులొస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ సంస్థలు వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ డేటా నెట్‌వర్క్‌ల కోసం సుమారు 240 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నాయి. 240 గంటలకు పైగా బ్రౌజింగ్ ప్రపంచ జనాభాలో దాదాపు 65.60 శాతం మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. 4.60 బిలియన్ల మంది ఇంటర్నెట్ సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు. దేశంలో అయితే 65 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 3.5 క్వింటిలియన్ బైట్ల డేటా అవసరం అవుతోంది. భారత్‌లో అయితే, ప్రస్తుతం సగటున నెలకు ఒక వ్యక్తి 240 గంటలకుపైగా ఇంటర్నెట్ను బ్రౌజ్ చేస్తున్నారు. ఈ లెక్కన దేశం మొత్తం ఒక నెలకు డేటా వినియోగం 14 ఎక్సాబైట్లకు చేరుకుంది. ఇక్కడ ఒక ఎక్సాబైట్ ఒక బిలియన్ గిగాబైట్లకు సమానం. చౌకైన డేటా! ప్రపంచ వ్యాప్తంగా చౌకైన మొబైల్ డేటా అందిస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ ఒక జీబీ డేటా కేవలం 0.04 అమెరికన్ డాలర్లుగా ఉంది. యూకే డేటా గణాంకాల వెబ్సైట్ నివేదిక ప్రకారం.. ప్రతి నలుగురిలో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు స్మార్ట్ఫోను వినియోగిస్తుండటంతో ఇది అమెరికా కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్ల వ్యాప్తిని కలిగి ఉంది. తక్కువ రేటుకు మొబైల్ డేటా అందిస్తున్న దేశాల్లో ఇటలీ (0.12 డాలర్లు) రెండవ, భారత్ (0.17 డాలర్లు) మూడవ స్థానంలో ఉన్నాయి. మరోవైపు అత్యంత ఖరీదైన డేటా ప్లాన్లు ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని మారుమూల ద్వీప దేశాల్లో ఉన్నాయి. ఫాక్లాండ్ దీవుల్లో ప్రజలు ఒక జీబీ డేటా కోసం 38.45 డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. సెయింట్ హెలెనాలో అయితే 41.06 డాలర్లుగా ఉంది. ఇక్కడ ప్రజలు ఇజ్రాయెల్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ వెచి్చంచి మొబైల్ డేటాను కొనుగోలు చేస్తున్నారు. -
లక్ష టవర్లు.. 5జీ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో దూకుడు!
5జీ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వివరాల ప్రకారం.. బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దేశంలోనే అత్యంత వేగవంతమైన 5జీ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి, అల్ట్రా-హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించడానికి దాదాపు 1 లక్ష టెలికాం టవర్లను నిర్మించింది. ఇది దాని సమీప ప్రత్యర్థి కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్! డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నేషనల్ ఈఎంఎఫ్ పోర్టల్‌లో ఉంచిన రోజువారీ స్థితి నివేదిక ప్రకారం.. జియో రెండు ఫ్రీక్వెన్సీలలో (700 MHz, 3,500 MHz) 99,897 బేస్ ట్రాన్స్సీవర్ స్టేషన్లను (బీటీఎస్) ఇన్స్టాల్ చేసింది. మరోవైపు ఎయిర్‌టెల్‌కు 22,219 బీటీఎస్ లు ఉన్నాయి. ప్రతి బేస్ స్టేషన్‌కు జియోకు 3 సెల్ సైట్లు ఉండగా ఎయిర్‌టెల్‌కు 2 మాత్రమే ఉన్నట్లు పీటీఐ వార్తా సంస్థ ఇటీవల పేర్కొంది. ఇదీ చదవండి: 5జీ అన్లిమిటెడ్ డేటా: ఎయిర్‌టెల్‌లో అదిరిపోయే ప్లాన్లు! ఇంటర్నెట్ స్పీడ్‌కు, సెల్ సైట్లు, టవర్లకు పరస్పర సంబంధం ఉంటుంది. జియో ఉత్తమ ఇంటర్నెట్ సగటు వేగం సెకనుకు 506 మెగాబైట్లు (Mbps) కాగా ఎయిర్టెల్ యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 268 Mbps అని ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ ఇన్సైట్ గ్లోబల్ లీడర్ అయిన ఊక్లా గత ఫిబ్రవరి నెలలో నివేదించింది. -
భారత డిజిటల్ నెట్వర్క్ భేష్
న్యూఢిల్లీ: భారత్‌లోని డిజిటల్ పబ్లిక్ నెట్వర్క్ భేషుగ్గా ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసించారు. దేశీయంగా విశ్వసనీయమైన, చౌకైన కనెక్టివిటీ లభిస్తుందని చెప్పారు. భారత్ అత్యంత చౌకైన 5జీ మార్కెట్ కావచ్చని ఆయన పేర్కొన్నారు. బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన జీ20 సంబంధ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గేట్స్ ఈ విషయాలు తెలిపారు. ఆధార్, చెల్లింపుల వ్యవస్థ, మరింత మందిని బ్యాంకింగ్ పరిధిలోకి తెచ్చేందుకు భారత్ సాధించిన పురోగతి తదితర అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రాథమిక ఆధార్ రూపకల్పనపై ఇన్వెస్ట్ చేయడం సహా చెల్లింపుల విధానాన్ని సులభతరం చేయడంలో భారత్ సమగ్రమైన ప్లాట్‌ఫాంను రూపొందించిందని గేట్స్ చెప్పారు. ఈ విషయంలో మిగతా దేశాలకు ఆదర్శంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వర్ధమాన దేశాలు ఇలాంటి వాటి అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. -
‘మీకో దణ్ణం! నాకు ఫోన్ చేయొద్దు’.. జెట్ ఎయిర్ వేస్ సీఈవో అసహనం!
9 ఏళ్ల నుంచి మీ నెట్ వర్క్ వినియోగిస్తున్నా. ఇక నుంచి వేరే నెట్ వర్క్‌కు మారుతున్నా. దయచేసి నాకు ఫోన్ చేయకండి అంటూ ప్రముఖ ఏవియేషన్ సంస్థ జెట్ ఎయిర్ వేస్ సీఈవో సంజీవ్ కపూర్ ఓ టెలికం కంపెనీ కస్టమర్ కేర్ నిర్వాహకంపై అసహననానికి గురయ్యారు. అందుకు ఓ కారణాన్ని ప్రస్తావిస్తూ ట్విటర్ వేదికగా చివాట్లు పెట్టారు. జెట్ ఎయిర్ వేస్ సీఈవో సంజీవ్ కపూర్ 9 ఏళ్ల నుంచి దేశీయ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ నెట్ వర్క్ పనితీరు మందగించడంతో యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తాజాగా సంజీవ్ కపూర్‌కు సైతం ఈ తరహా ఇబ్బంది తలెత్తింది. ఆదివారం నెట్ వర్క్ సరిగ్గా పనిచేయకపోవడం, అదే సమయంలో కస్టమర్ కేర్ నుంచి వరుస కాల్స్ రావడంతో ఇరిటేట్ అయ్యారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ట్విటర్ వేదికగా సదరు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఫోన్ చేయడం ఆపండి అంటూ ట్వీట్ చేశారు. ప్రియమైన @ViCustomerCare: నెట్ వర్క్ మారవద్దని నన్ను ఒప్పించేందుకు పదే పదే కాల్స్ చేస్తున్నారు. అలా కాల్ చేయడం మానేయండి. నేను 9 సంవత్సరాల తర్వాత నెట్ వర్క్ ఎందుకు మారుతున్నానో మీకు చెప్పాను. దేశంలోని కొన్ని ప్రాంతాలలో కవరేజీ తక్కువగా. కొందరికి రోమింగ్ కాల్స్ చేసుకోవడంలో ఇబ్బందికి గురవుతున్నారు. అంతే. ధన్యవాదాలు’అని ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు వీఐ కస్టమర్ కేర్ విభాగం స్పందించింది. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తాం అని రిప్లయి ఇచ్చింది. ఆ ట్వీట్‌కు సంజీవ్ రిప్లయి ఇచ్చారు. @ViCustomerCare దయచేసి నన్ను సంప్రదించేందుకు ప్రయత్నించకండి. నిన్నటి నుండి నాకు డజను కాల్స్ వచ్చాయి. ఫోన్ చేయడం ఆపండి, అంతే! అని అన్నారు. అయినా సరే వీఐ కస్టమర్ కేర్ విభాగం సంజీవ్ కపూర్‌కు మరోసారి ఫోన్ చేసి విసిగించింది. దీంతో ఏం చేయాలో పోక...మా నెట్ వర్క్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ ఫోన్ వచ్చింది. ఇది మంచి పద్దతి కాదు. ఫోన్ చేయడం ఎప్పుడు ఆపేస్తారో.. వీఐ యాజమాన్యం ఉన్నతాధికులు ట్విటర్లో ఉన్నారా? అంటూ ప్రశ్నిస్తూ మరోసారి ట్వీట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. Dear @ViCustomerCare : please stop calling me repeatedly trying to convince me not to switch carriers. I have told you why I am switching after 9 years: 1. Poor coverage in some parts of India, and 2. Inferior international roaming plans for some countries. That's all. Thanks. — Sanjiv Kapoor (@TheSanjivKapoor) February 12, 2023 Hi Sanjiv! I can understand this has caused difficulties for you. I’ve made a note of your concern. Will get in touch with you shortly - Vandana https://t.co/fuKV0H8zIF — Vi Customer Care (@ViCustomerCare) February 12, 2023 -
బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఔట్ పేషెంట్ (ఓపీడీ), ఇతర సేవలను అందించేందుకు డాక్టర్ల నెట్వర్క్ లేదా ఇతర ఆరోగ్య రంగ నిపుణులతో రిజిస్ట్రీ ఏర్పాటు చేసుకోవాలని.. బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కోరింది. ‘‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీ ‘ఆరోగ్య సంరక్షణ నిపుణుల రిజిస్ట్రీ’ (హెచ్‌పీఆర్)ని ఏర్పాటు చేసింది. ఇందులో నమోదిత డాక్టర్లు, ఇతర ఆరోగ్య రంగ నిపుణుల వివరాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆధునిక, సంప్రదాయ ఆరోగ్య సేవలను అందించేందుకు ఇది సాయపడుతుంది. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు సైతం పాలసీదారులకు ఓపీడీ, ఇతర సేవలు అందించేందుకు వీలుగా.. ఈ హెచ్‌పీఆర్ సాయంతో డాక్టర్లు/ఫిజీషియన్లు లేదా ఆరోగ్య రంగ నిపుణులతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి’’అని ఐఆర్డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది. మెడికల్ ప్రాక్టీషనర్ల గుర్తింపు, ధ్రువీకరణకు హెచ్‌పీఆర్ ఐడీని ఉపయోగించుకోవాలని సూచించింది. -
తెలుగు రాష్ట్రాల్లో వొడా ఐడియా నెట్వర్క్ అప్‌గ్రేడ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కస్టమర్లకు మరింత మెరుగైన 4జీ సర్వీసులను అందించేందుకు నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసుకున్నట్లు టెలికం సంస్థ వొడాఫోన్-ఐడియా (వీఐ) వెల్లడించింది. 1800 మెగాహెట్జ్ రేడియో తరంగాలను రెట్టింపు స్థాయిలో వినియోగంలోకి తేవడంతో డేటా డౌన్లోడ్, అప్లోడింగ్ మరింతగా వేగవంతంగా ఉంటుందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 4జీకి సంబంధించి సమర్ధమంతమైన 2500 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం ఉన్న ఏకైక ప్రైవేట్ టెల్కో తమదేనని వివరించింది. 2018 సెప్టెంబర్ నుంచి 11035 బ్రాడ్‌బ్యాండ్ టవర్లను ఏర్పాటు/అప్‌గ్రేడ్ చేసినట్లు కంపెనీ క్లస్టర్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ జైన్ చెప్పారు. -
ఫోన్ల జాబితా వచ్చేసింది, ఎయిర్టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్లు ఇవే!
టెలికం కంపెనీ ఎయిర్టెల్ నెక్ట్స్ జనరేషన్ నెట్ వర్క్ 5జీని హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. కానీ ఈ లెటెస్ట్ టెక్నాలజీ నెట్ వర్క్ ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు మరికొన్ని ఫోన్లలో పనిచేయకపోవడంతో యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్లలో మాత్రమే 5జీ పనిచేస్తుంటూ ఓ జాబితా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు 5జీ పనిచేసే ఫోన్లు ఏమిటో తెలుసుకునే ముందు టారిఫ్ ధరలతో పాటు, సిమ్ కార్డ్‌లపై ఎయిర్టెల్ అందించిన వివరాల ప్రకారం.. 4జీ ఛార్జీలకే ఎయిర్టెల్ 5జీ 5జీ నెట్ వర్క్‌ను వినియోగంలోకి తెచ్చినా ఎయిర్టెల్ టారిఫ్ ధరల్ని ప్రకటించలేదు. ఈ తరుణంలో ప్రస్తుత 4జీ ప్లాన్‌లోనే 5జీ సేవల్ని కస్టమర్లు పొందవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. 5జీ స్మార్ట్ ఫోన్ ఏదైనా కస్టమర్లు వినియోగిస్తున్న ప్రస్తుత సిమ్‌లోనే 5జీ పని చేస్తుందని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. అంతా మీ ఇష్టం 5జీ సిగ్నల్స్ అందుకున్న వినియోగదారులు 5జీకి మళ్లవచ్చు. డేటా వినియోగం ఎక్కువగా అవుతోందని భావిస్తే తిరిగి 4జీకి బదిలీ కావొచ్చు. 5జీ సర్వీసులను అందుకోవాలా వద్దా అన్నది కస్టమర్ల అభీష్టం మేరకేనని కంపెనీ పేర్కొంది. మార్చి 2024 లోపు దేశ వ్యాప్తంగా ఈ లేటెస్ట్ కనెక్టివిటీని అందిస్తామని, ప్రస్తుతానికి దశల వారీగా ఎంపిక చేసిన కస్టమర్లకు 5జీ సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్లలో 5జీ నెట్ వర్క్‌ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. మీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తుందో, లేదా అని తెలుసుకోవాలంటే కింద జాబితాను చూడండి శాంసంగ్ శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ, శాంసంగ్ ఏ33 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎం 33, శాంసంగ్ ఫ్లిప్4, శాంసంగ్ గెలాక్సీ ఎస్22, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ప్లస్, శాంసంగ్ ఫోల్డ్4 రియల్ మీ రియల్మీ 8ఎస్ 5జీ , రియల్మీ ఎక్స్ 7 మ్యాక్స్ 5జీ, రియల్ మీ నార్జో 30 ప్రో 56, రియల్ మీ ఎక్స్7 5జీ, రియల్మీ ఎక్స్ 7 ప్రో 50, రియల్ మీ 850, రియల్ మీ ఎక్స్ 50 ప్రో, రియల్ మీ జీటీ 5జీ, రియల్మీ జీటీ ఎంఈ, రియల్ మీ జీటీ నియో2, రియల్మీ 95జీ, రియల్ మీ 9ప్రో, రియల్ మీ 9 ప్రో ప్లస్, రియల్మీ నార్జో 30 5జీ, రియల్మీ 9 ఎస్ఈ, రియల్మీ జీటీ2, రియల్మీ జీటీ 21ప్రో, రియల్మీ జీటీ నియో3, రియల్మీ నార్జో 50 50, రియల్మీ నార్జో 50 ప్రో వన్ ప్లస్ వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9ప్రో, వన్‌ప్లస్ నార్డ్ సీఈ, వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ 10 ప్రో 56,వన్‌ప్లస్ నార్డ్ సీఈ లైట్2, వన్‌ప్లస్ ఎక్స్‌డీఆర్, వన్‌ప్లస్ నార్డ్ 27,వన్‌ప్లస్ 10టీ షావోమీ షావోమీ ఎంఐ10, షావోమీ ఎంఐ ఎల్ఓటీ, షావోమీ ఎంఐ 10టీప్రో, షావోమీ ఎంఐ 11 ఆల్ట్రా(కే1), షావోమీ ఎంఐ 11ఎక్స్ ప్రో, షావోమీ ఎంఐ 11ఎక్స్, షావోమీ పోకో ఎం3 ప్రో 5జీ, షావోమీ పోకో ఎఫ్3 జీటీ, షావోమీ ఎంఐ 11 లైట్ ఎన్ఈ( కే9డీ), షావోమీ కిగా రెడ్మీ నోట్ ఐఐటీఎస్జీ (Xiaomi KIGA Redmi Note IITSG), షావోమీ కే3ఎస్ షావోమీ 11టీ ప్రో, షావోమీ కే 16 షాఓమీ 111 హైపర్ ఛార్జ్, షావోమీ రెడ్మీ నోట్ 10టీ, షావోమీ కే6ఎస్ (రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్), షావోమీ పోకో ఎం4 5జీ, షావోమీ 12 ప్రో, షావోమీ 111, షావోమీ రెడ్మీ 11 ప్రైమ్ 5జీ (ఎల్ 19), షావోమీ పోకో ఎఫ్4 5జీ, షావోమీ పోకో ఎక్స్4 ప్రో, షావోమీ రెడ్మీ కే50ఐ ఒప్పో ఒప్పో రెనో5జీ ప్రో, ఒప్పో రెనో 6, ఒప్పో రెనో 6 ప్రో, ఒప్పో ఎఫ్19ప్రో ప్లస్, ఒప్పో ఏ53 ఎస్, ఒప్పో ఏ53 ఎస్, ఒప్పో ఏ74, ఒప్పో రెనో 7 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ, ఒప్పో రెనో7, ఒప్పో రెనో8, ఒప్పో రెనో 8 ప్రో, ఒప్పో ఫైండ్2, ఒప్పో కే10 5జీ, ఒప్పో ఎస్21 ప్రో 5జీ వివో వివో ఎక్స్ 50 ప్రో, వీ20 ప్రో, ఎక్స్ 60 ప్రో ప్లస్, ఎక్స్60, ఎక్స్60 ప్రో ప్లస్, ఎక్స్70 ప్రో, ఎక్స్70 ప్రోప్లస్, ఎక్స్80, ఎక్స్ 80 ఫ్లాగ్షిప్ ఫోన్స్, వి20 ప్రో, వి21 5జీ, వి21ఈ, వై72 5జీ, వీ23 5జీ, వీ23 ప్రో 5జీ, వీ23ఈ 5జీ, టీ1 5జీ, టీ1 ప్రో 5జీ,వై 75 5జీ,వీ 25, వీ25ప్రో,వై55,వై55ఎస్ చదవండి👉 ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదు -
ఆజాదీకి అమృత మహోత్సవ వేళ స్వతంత్ర భారతంలో 5G సేవలు
-
బీపీసీఎల్‌తో హీరో మోటోకార్ప్ జట్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాలను కలి్పంచే దిశగా ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), టూ వీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ జట్టు కట్టాయి. ‘మొదటి దశలో ఢిల్లీ, బెంగళూరుతో మొదలుపెట్టి తొమ్మిది నగరాల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత చార్జింగ్ స్టేషన్లను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చే దిశగా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తాం‘ అని ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రణాళిక ప్రకారం రెండు సంస్థలు.. ముందుగా బీపీసీఎల్‌కు ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థకు సంబంధించి మిగతా అంశాల్లోనూ కలిసి పనిచేయనున్నాయి. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా .. విద్యుత్ వాహనాలకు చార్జింగ్ సదుపాయం కలి్పంచడం సహా వివిధ రకాల ఇంధనాలను విక్రయించే ఇంధన కేంద్రాలుగా దాదాపు 7,000 పైచిలుకు సాంప్రదాయ పెట్రోల్ బంకులను మార్చనున్నట్లు బీపీసీఎల్ గతేడాది సెపె్టంబర్లో వెల్లడించింది. నగదురహితంగా ప్రక్రియ..: హీరో మోటోకార్ప్ త్వరలోనే రెండు నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సదుపాయాల కల్పన ప్రారంభించనుంది. ఒక్కో చార్జింగ్ స్టేషన్లో డీసీ, ఏసీ చార్జర్లు సహా పలు చార్జింగ్ పాయింట్లు ఉంటాయి. అన్ని రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఉపయోగపడతాయి. చార్జింగ్ ప్రక్రియను హీరో మోటోకార్ప్ మొబైల్ యాప్ ద్వారా నగదురహితంగా పూర్తి చేయవచ్చు. తమ భారీ నెట్‌వర్క్‌తో ఈవీ చార్జింగ్ సదుపాయాలను గణనీయంగా విస్తరించవచ్చని బీపీసీఎల్ సీఎండీ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. వాహన రంగంలో కొంగొత్త ధోరణులను అందిపుచ్చుకోవడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని హీరో మోటో చైర్మన్ పవన్ ముంజల్ పేర్కొన్నారు. -
Google: టీనేజర్ల బ్రౌజింగ్.. గూగుల్ కీలక నిర్ణయం
Google Blocks 18 Below Target Ads: ఫ్లస్ విషయంలో బ్రౌజింగ్‌కు గూగుల్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయదు. కానీ, 13 ఏళ్లలోపు వాళ్లు మాత్రం ఉపయోగించడానికి వీల్లేదని చెబుతోంది. అయినప్పటికీ అండర్‌ఏజ్‌ను గుర్తించే ఆల్గారిథమ్ లేకపోవడంతో చాలామంది తమ ఏజ్‌ను తప్పుగా చూపించి గూగుల్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాలను కట్టడి చేసేందుకు గూగుల్ కీలక నిర్ణయం ఒకటి తీసుకుంది. టీనేజర్ల విషయంలో యాడ్ టార్గెటింగ్ స్కామ్‌ను నిలువరించే ప్రయత్నం చేయనున్నట్లు ప్రకటించింది గూగుల్. ఈ మేరకు పద్దెనిమిది ఏళ్లలోపు యూజర్లపై టెక్ దిగ్గజం నిఘా వేయనుంది. సాధారణంగా వయసు, లింగ నిర్ధారణ, యూజర్ల ఆసక్తుల ఆధారంగా యాడ్ కంపెనీలు యాడ్లను డిస్ప్లే చేస్తుంటాయి. ఈ క్రమంలో మోసాలు జరుగుతుంటాయి కూడా. అయితే 18 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ల విషయంలో ఈ స్కామ్‌లు జరుగుతుండడంపై గూగుల్ ఇప్పుడు ఫోకస్ చేసింది. ఈ తరహా యాడ్లను నిలువరించేందుకు బ్లాక్ యాడ్ ఫీచర్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది గూగుల్. ఈ మేరకు యూజర్ యాడ్ ఎక్స్‌పీరియెన్స్‌ను నియంత్రించేందుకు ఈ ఏడాదిలో పలు చర్యలు చేపట్టబోతున్నాం అంటూ గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పిల్లలకు, టీనేజర్లకు సురక్షితమైన బ్రౌజింగ్ అనుభూతి కోసం, ఏజ్ సెన్సిటివిటీ యాడ్ కేటగిరీలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాం. ఇక మీద 18 ఫ్లస్ లోపు వాళ్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తాం అని సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎబౌట్ దిస్ యాడ్ లాంటి మెనూలతో పాటు ఆ యాడ్లు ఎందుకు డిస్ప్లే అవుతున్నాయో, ఎవరు దానిని ప్రదర్శిస్తున్నారో తెలియజేస్తూ ఫీచర్స్‌ను ఇప్పటికే తీసుకొచ్చింది గూగుల్. చదవండి: ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్! -
చదువు కోసం చెట్టెక్కిన విద్యార్థులు..
ముంబై: కరోనా కారణంగా స్కూళ్లు మాతపడిన విషయం తెలిసిందే. ఆన్ లైన్ క్లాస్‌లు కోసం విద్యార్ధులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. మహారాష్ట్ర లోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ సరిగా లేక విద్యార్ధులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గోండియా జిల్లాలోని మూరుమూల గ్రామానికి చెందిన విద్యార్థులు మొబైల్ సిగ్నల్ కోసం గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెట్టు వద్దకు వెళ్లి ఆ చెట్టు ఎక్కి తమ మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ క్లాసులు వింటున్నారు. మొబైల్ టవర్‌కు 200 మీటర్ల ఉన్న ఈ చెట్టును నెట్వర్క్ ట్రీగా వారు పిలుస్తారు. గత 15 నెలల్లో సుమారు 150 మంది గ్రామీణ విద్యార్థులు ఈ చెట్టు వద్దకు వచ్చి ఆన్లైన్ క్లాసులు విన్నట్లు స్థానికులు తెలిపారు.ఒక వైపు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా అడుగులు వేస్తుంటే ..మరో వైపు ఇటువంటి సంఘటనలు జరగడం మన దేశ దౌర్భాగ్యాన్నీ ప్రతిబింబిస్తోందని స్థానికులు అంటున్నారు. -
Hanuma Vihari: దాతృత్వం.. కోవిడ్ బాధితులకు అండగా
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని భారత టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి విచారం వ్యక్తం చేశాడు. విపత్కర పరిస్థితిపై కలత చెందిన అతను తనవంతుగా చేయూత అందించాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో చేయిచేయి కలిపి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాడు. పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంటకనిపెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. ఓ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో 27 ఏళ్ల విహారి మాట్లాడుతూ ‘నేను చేసింది గొప్ప దాతృత్వమో, సేవో కానే కాదు! అవసరమైన వారికి ఏదో నాకు తోచినంత సాయం మాత్రమే ఇది. మహమ్మారి ఉధృతిలో నా వంతు చేయూత అందించానంతే’ అని అన్నాడు. సామాజిక మాధ్యమాల్లో లక్షా పదివేల ఫాలోవర్లు ఉన్న విహారి చేసిన ప్రయత్నానికి చాలామంది కలిసిరావడంతో ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. ముఖ్యంగా పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా దానం, ఆక్సిజన్ అవసరమైన వారికి ప్రాణవాయువు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగానని ఇక ముందు కూడా ఇలాంటి సాయమందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారి చెప్పాడు. ఇప్పటివరకు 11 టెస్టులాడిన విహారి 624 పరుగులు చేశాడు. వార్విక్షైర్ తరఫున ఆడేందుకు విహారి గత నెలలోనే ఇంగ్లండ్ చేరాడు. అక్కడే జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం జూన్ 3న అక్కడకు చేరుకునే భారత జట్టుతో విహారి కలిసే అవకాశముంది. జట్టుకోసం ఏదైతే అది... ఇంగ్లండ్ పర్యటనపై మాట్లాడుతూ జట్టు కోసం ఏ స్థానంలో పంపించినా బ్యాటింగ్‌కు సిద్ధమేనని చెప్పాడు. ‘నా కెరీర్లో ఎన్నోసార్లు టాపార్డర్‌లో బ్యాటింగ్ చేశాను. జట్టు మేనేజ్మెంట్ కోరితే ఇప్పుడు సిద్ధమే. ఓపెనింగ్ అయినా ఓకే’ అని విహారి అన్నాడు. ముందుగా కివీస్‌తో ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్, తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు చాలా ముందుగా ఇక్కడికి రావడం తనకు కలిసివస్తుందని చెప్పాడు. పిచ్, స్థానిక వాతావరణం అలవాటైందని చెప్పుకొచ్చాడు. ఇది భారత జట్టు తరఫున మెరుగ్గా ఆడేందుకు దోహదం చేస్తుందన్నాడు. -
పల్లెలకు అపరిమిత ఇంటర్నెట్
సాక్షి, అమరావతి: ఎలాంటి అంతరాయాలు లేని నెట్వర్క్ లక్ష్యంగా రాష్ట్రంలో అన్ని గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ స్పీడ్ కనెక్షన్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని, అన్ని గ్రామాల్లో సదుపాయాలతో కూడిన డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల సొంత ఊళ్లలోనే వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కలుగుతుందన్నారు. నిర్ణీత వ్యవధిలోగా ఈ పనులన్నీ పూర్తి కావాలన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామాలకు ఇంటర్నెట్, కనెక్టివిటీ పురోగతి, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, నిర్వహణ, అమ్మ ఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లు అందచేయడంపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి బాలినేని తదితరులు పీవోపీ కోసం రూ.5,800 కోట్లు ప్రతి ఊరికి ఇంటర్నెట్ సౌలభ్యం కోసం గ్రామ స్థాయిల వరకు పీవోపీ (పాయింట్ ఆఫ్ ప్రజెన్స్) కోసం రూ.5,800 కోట్లు వ్యయం కానుంది. అదనంగా మరో రూ.2 వేల కోట్లు వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీల కోసం ఖర్చు అవుతుంది. 12,890 గ్రామాలకు కేబుళ్ల సదుపాయం కల్పించాలి. 3 వేల హామ్లెట్లకు సైతం ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. తద్వారా దాదాపు 16 వేల గ్రామాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. 2022 డిసెంబర్ నాటికి విలేజ్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో... అన్ లిమిటెడ్ కెపాసిటీతో గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం ఉండాలి. అందుకోసం అవసరమైతే కెపాసిటీని 20 జీబీ వరకు పెంచండి. అప్పుడే వర్క్ ఫ్రమ్ హోం సులభంగా ఉంటుంది. కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీలలో కూడా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలి. అంటే మరో 31 లక్షల ఇళ్లు పెరుగుతాయి. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయండి. రాష్ట్రవ్యాప్తంగా 2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తి కావాలి. తుపాను ప్రభావిత 108 గ్రామాల్లో భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయాలి. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు... రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, గ్రామ సచివాలయం ఉన్న ప్రతిచోటా వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు ఉండాలి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం గ్రామీణ లైబ్రరీల నిర్మాణం జరగాలి. అవి పూర్తయ్యే సమయానికి అవసరమైనన్ని కంప్యూటర్లు కూడా సిద్ధం చేయాలి. వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలో న్యూస్ పేపర్ స్టాండ్ కూడా ఏర్పాటు చేయాలి. ఒక్కో లైబ్రరీలో 6 సిస్టమ్స్ కోసం సదుపాయం ఉండాలి. అవసరం మేరకు 4 లేదా 6 కంప్యూటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామస్ధాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవసరమైన ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి. అమ్మ ఒడి ల్యాప్‌టాప్‌లు అమ్మ ఒడి పథకంలో ఆప్షన్ కింద ల్యాప్‌టాప్‌లు కోరుకున్న వారికి వచ్చే ఏడాది జనవరి 9న అందజేయాలి. 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌తో పాటు గ్యారెంటీ, వారంటీ కార్డు, అన్ని స్పెసిఫికేషన్స్‌తో అందచేయాలి. ల్యాప్‌టాప్‌ల సర్వీసు కూడా పక్కాగా ఉండాలి. ఎక్కడైనా ల్యాప్‌టాప్ పాడైతే గ్రామ సచివాలయం ద్వారా సర్వీస్ సెంటర్‌కు పంపి వారం రోజుల్లోగా తిరిగి తెప్పించాలి. కాబట్టి బిడ్ ఖరారు చేసేటప్పుడు గ్యారెంటీ, వారంటీ, సర్వీస్.. వీటన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతి రెవెన్యూ డివిజన్లో తప్పనిసరిగా ల్యాప్‌టాప్‌ల సర్వీస్ సెంటర్లు ఉండాలి. కొనసాగుతున్న కేబుల్ పనులు.. ► గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లకు సంబంధించి ఇప్పటికే కేబుల్ పనులు కొనసాగుతున్నాయని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా 2023 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ వెల్లడించారు. ఇప్పటివరకు 307 మండలాల్లోని 3,642 గ్రామాల్లో 14,671 కి.మీ. మేర ఏరియల్ కేబుల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ► వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలను 690 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని, ఒక్కో లైబ్రరీ అంచనా వ్యయం రూ.16 లక్షలు కాగా ప్రతి లైబ్రరీలో 20 సీట్లు ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామిణాభివృద్ధి కమిషనర్ ఎం.గిరిజాశంకర్ పేర్కొన్నారు. ► అమ్మ ఒడిలో ఆప్షన్ ప్రకారం ల్యాప్‌టాప్‌లు ఇవ్వడానికి విద్యార్థుల నుంచి ఆప్షన్లు తీసుకుంటున్నామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. రెండు మోడళ్లలో ల్యాప్‌టాప్‌లు సేకరిస్తున్నామని, ఇంజనీరింగ్ విద్యార్థులకు హైఎండ్ వర్షన్ ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని చెప్పారు. సమీక్షలో అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి, ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి, ఏపీటీఎస్ ఎండీ ఎం.నందకిషోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పీఎం,సీఎం సార్లు.. నెట్వర్క్ సదుపాయం కల్పించండి!
భువనేశ్వర్ : కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న తమకు నెట్వర్క్ సదుపాయం కల్పిఇంచాలని తొమ్మిది గ్రామాలకు చెందిన విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు లేఖలు రాశారు. మీరావలి, దుర్గాపాడు, పిప్పిలిగుడ, కారుడాయి, బొడొ అలుబడి, కూలి, బాయిసింగి, డంగలొడి, హలువ గ్రామాలకు చెందిన విద్యార్థులు పీఎం, సీఎంకు తాము రాసిన రెండు లేఖలను మంగళవారం మీరావలి పోస్టాఫీసులో పోస్ట్ చేశారు. కరోన కారణంగా విద్యాలయాలు మూతపడడంతో, విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆన్లైన్లో బోధనకు చర్యలు చేపట్టింది. అయితే, రాయగడ సమితిలోని తొమ్మిది పంచాయితీల్లో ఎటువంటి నెట్వర్క్ లేకపోవడంతో ఆయా గ్రామాల విద్యార్థులు ఆన్లైన్ పాఠాలకు దూరంగా ఉంటున్నారు. తమ ప్రాంతాల్లో నెట్వర్క్ సౌకర్యాలు కల్పించండని అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదని, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ ప్రాంత విద్యార్థులంతా లేఖల ద్వారా తమ సమస్యను ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులకు తెలియజేసే ప్రయత్నం చేశారు. జీమిడిపేట ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న రెహాన బచేలి స్వయంగా ఈ లేఖలను పోస్ట్ చేశారు. జిల్లాలొ అత్యధికంగా ఆదివాశీలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో నెట్వర్క్ లేకపొవడం వలన.. ఇటు చదువుకు గండి పడుతుండటమే కాకుండా, అత్యవసర సమయంలో వైద్యసేవలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారనే ఆశతో తామంతా పీఎం, సీఎంకు లేఖలు రాసి తమ సమస్యలను తెలియజే ప్రయత్నం చేశామని విద్యార్థులు అంటున్నారు. రానున్న పంచాయితీ ఎన్నికలు బహిష్కరిస్తాం విద్యార్థుల చదువు కోసం అవసరమైన నెట్వర్క్ సదుపాయం కల్పించకుంటే, రానున్న పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని తొమ్మిది పంచాయతీలకు చెందిన ప్రజలు విలేకర్లతో చెప్పారు. అయిదు సార్లు విజయం సాధిస్తూ వస్తున్న అధికార బీజేడీ పార్టీ ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు ఎటవంటి శ్రధ్ద వహించడం లేదని స్థానికుడైన కాంతారావు బచేలి అన్నారు. -
బీఎస్ఎన్ఎల్ నో నెట్వర్క్
కర్ణాటక,దొడ్డబళ్లాపురం: రామనగర జిల్లాలో గత నాలుగు రోజులుగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నెట్వర్క్ అందడం లేదు. ల్యాండ్‌లైన్, మొబైల్, ఇంటర్నెట్ సేవలన్నీ నిలిచిపోవడంతో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్పై శాపనార్థాలు పెడుతున్నారు. జిల్లాలోని కనకపుర తాలూకాలో కంపెనీకి చెందిన నెట్వర్క్ కేబుల్ వైర్లు తెగిపోవడంతో ఈ సమస్య తలెత్తిందని కంపెనీ అధికారులు చెబుతున్నారు. మరమ్మత్తులు జరుగుతున్నాయని త్వరలో సేవలు ప్రారంభిస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో మూడు రోజులుగా కస్టమర్లు రామనగర పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వచ్చి సిబ్బందితో గొడవపడుతున్నారు. సిబ్బంది షరా మామూలుగానే నిర్లక్ష్యంగా జవాబిస్తుండడంతో కస్టమర్లు తీవ్ర వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ కారణంగా సిబ్బంది కూడా కార్యాలయంలో ఉండకుండా వెళ్లిపోతున్నారు. రామనగర తాలూకాలో 1800 ల్యాండ్‌లైన్ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు ఉండగా,వేల సంఖ్యలో మొబైల్ సిమ్‌కార్డులు వాడుతున్నారు. అందులోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ కోసం బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకుని ఉండడంతో ప్రజలకు ప్రభుత్వపర సేవలు అందడంలేదు. ఇంతపెద్ద కంపెనీ నాలుగు రోజులుగా సేవలు నిలిపివేస్తే తమ పరిస్థితి ఏమిటని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రస్తుతం నెట్వర్క్ కష్టాల్లో ఉంది!
-
వొడాఫోన్ ఐడియా నష్టం 5,005 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్– ఐడియాకు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.5,006 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. వడ్డీ వ్యయాలు అధికంగా ఉండటం, నెట్వర్క్ ఇంటిగ్రేషన్ వ్యయాలు కూడా ఎక్కువగా ఉండటం, మొబైల్ టవర్ వ్యాపారం నుంచి నిష్క్రమించిన వ్యయాలు కూడా అధికంగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఈ రెండు కంపెనీలకు కలసి రూ.1,285 కోట్ల నష్టాలొచ్చాయి. గత ఏడాది ఆగస్టు 31న ఐడియా, వొడాఫోన్ల విలీనం పూర్తయినందువల్ల ఫలితాలను పోల్చడానికి లేదు. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర నష్టాలు మరింతగా పెరిగాయి. వడ్డీ వ్యయాలు రూ.2,824 కోట్లు... ఈ క్యూ3లో మొత్తం ఆదాయం రూ.11,983 కోట్లకు పెరిగిందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. ఈ క్యూ2లో సాధించిన మొత్తం ఆదాయం రూ.7,879 కోట్లతో పోల్చితే 52 శాతం వృద్ధి సాధించామని కంపెనీ సీఈఓ బాలేశ్ శర్మ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.6,552 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. వడ్డీ వ్యయాలు రూ.2,824 కోట్లుగా ఉన్నాయని, మొబైల్ టవర్ల వ్యాపారం నుంచి బైటకు వచ్చామని, దీనికి గాను వెండర్లకు రూ.725 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. గతేడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.1,23,660 కోట్లుగా ఉందని తెలిపారు. ఇండస్ టవర్స్‌లో 11.15 శాతం వాటాను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ వాటా విలువ రూ.4,960 కోట్లుగా ఉండొచ్చ న్నారు. అలాగే 1.58 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను విక్రయించనున్నామని, ఈ విక్రయాల ద్వారా సమకూరిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని తెలిపారు. రూ.89కు ఏఆర్పీయూ.. ఈ క్యూ3లో ఎబిటా రూ.1,137 కోట్లుగా నమోదైందని, ఈ క్యూ2లో 6 శాతంగా ఉన్న మార్జిన్ ఈ క్యూ3లో 9.7 శాతానికి పెరిగిందని బాలేశ్ శర్మ పేర్కొన్నారు. ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 1.5 శాతం పెరిగి రూ.89కు చేరిందని తెలిపారు. ఒక్కో వినియోగదారుడు వినియోగించే డేటా 5.6 జీబీనుంచి 6.2 జీబీకి పెరిగిందన్నారు. 75 కోట్ల మందికి 4జీ సర్వీసులందేలా 11,123 సైట్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ క్యూ3లో కొత్తగా 95 లక్షల 4జీ యూజర్లు జతయ్యారని, దీంతో మొత్తం 4జీ కస్టమర్ల సంఖ్య 7.53 కోట్లకు చేరిందని వివరించారు. 4జీ నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టామని బాలేశ్ శర్మ చెప్పారు. అలాగే 4జీ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకోవాలనేది లక్ష్య మన్నారు. మూలధన సమీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామని, ఈ ప్రణాళికకనుగుణంగా సమీకరించిన నిధులతో వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తాజా ఏడాది కనిష్టానికి షేరు.. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేర్ 1.6 శాతం నష్టపోయి రూ.29.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.28.80ను తాకింది. -
ఎయిర్‌టెల్‌కు పెట్టుబడుల బూస్ట్..
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ ఆఫ్రికా విభాగంలో ఆరు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇన్వెస్ట్ చేయనున్నాయి. వార్బర్గ్ పింకస్, టెమాసెక్, సింగ్టెల్, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఇంటర్నేషనల్ మొదలైన సంస్థలు సుమారు రూ.125 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు బ్రిటన్‌లో లిస్టయిన భారతి ఎయిర్టెల్ అనుబంధ సంస్థ వెల్లడించింది. పెట్టుబడుల అనంతరం ఎయిర్టెల్ ఆఫ్రికా ఐపీవోకి రానుందని, సమీకరించిన నిధులతో రుణభారం తగ్గించుకోనుందని పేర్కొంది. నెట్‌వర్క్‌ను పెంచుకోవడానికి, వివిధ మార్కెట్లలో కార్యకలాపాలు మరింతగా విస్తరించటానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడగలవని ఎయిర్టెల్ వివరించింది. ప్రతిపాదిత లావాదేవీలో ప్రస్తుత షేర్‌హోల్డర్ల వాటాల విక్రయమేమీ ఉండబోదని పేర్కొంది. తమ వ్యాపార వ్యూహాలపైనా, ఆఫ్రికా విభాగం లాభదాయకత అవకాశాలపైనా అంతర్జాతీయ దిగ్గజాలకు ఉన్న నమ్మకానికి ఈ డీల్ నిదర్శనమని భారతి ఎయిర్టెల్ ఆఫ్రికా విభాగం ఎండీ, సీఈవో రఘునాథ్ మండవ తెలిపారు. ఎయిర్టెల్ ఆఫ్రికా విభాగం కొన్నాళ్ల క్రితమే టర్న్ అరౌండ్ అయ్యింది. గత కొన్ని త్రైమాసికాలుగా భారత్‌లో టారిఫ్‌ల పరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్‌కు కొంత ఊతంగా నిలుస్తోంది. ఎయిర్టెల్ ఆఫ్రికా రుణభారం దాదాపు 5 బిలియన్ డాలర్ల మేర ఉంది. షేరు జూమ్..: ఆఫ్రికా విభాగంలో పెట్టుబడుల వార్తలతో బుధవారం దేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో భారతి ఎయిర్టెల్ షేరు దాదాపు 11 శాతం ఎగిసింది. మార్కెట్ విలువ సుమారు రూ.12,332 కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో ఎయిర్టెల్ షేరు 10.79 శాతం పెరిగి రూ. 316.75 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 15 శాతం కూడా ఎగిసి రూ. 328.75 స్థాయిని తాకింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. అటు ఎన్ఎస్ఈలో 9 శాతం పెరిగి రూ. 311.55 వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈలో 5.19 లక్షలు, ఎన్ఎస్ఈలో 1 కోటి పైగా షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,26,617.65 కోట్లకు పెరిగింది. -
రానున్న 48 గంటల్లో ఇంటర్నెట్ సేవలకు బ్రేక్
-
ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న ఇంటర్నెట్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రధాన సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగనుంది. రొటీన్ మెయింటినెన్స్‌లో భాగంగా ప్రధాన సర్వర్, దానికి సంబంధించిన కనెక్షన్లను నిలిపివేయనున్నారని.. ఫలితంగా ఇంటర్నెట్ సేవలకు కొద్దిసేపు ఆటంకం కలుగుతుందని ‘రష్యా టుడే’ వెల్లడించింది. ప్రధాన సర్వర్ నిర్వహణను ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్(ఐసీఏఎన్ఎన్) చేస్తుంది. ఇందులో భాగంగా క్రిప్టోగ్రాఫిక్ కీని మారుస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ అడ్రస్ బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్ఎస్) భద్రంగా ఉంటుంది. ఇటీవల ఎక్కువైన సైబర్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాన సర్వర్ నిర్వహణ పనులు నిర్వహణ పనులు తప్పనిసరని ఐసీఏఎన్ఎన్ పేర్కొంది. ‘సురక్షితమైన, స్థిరమైన డీఎన్ఎస్ను పొందడం కోసం కొద్దిసేపు ప్రపంచ నెట్‌వర్క్‌ను షట్‌డౌన్ చేయడం అవసరం. అందువల్ల రానున్న 48 గంటల్లో వెబ్ పేజీలను యాక్సెస్ చేయయంలో, ట్రాన్సాక్షన్స్ జరపడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంద’ని కమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ(సీఆర్ఏ) ప్రకటించింది. అవుట్‌డేటెడ్ ఐఎస్పీ(ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) వాడకందారులు ఈ అసౌకర్యాన్ని చవి చూస్తారని వెల్లడించింది. -
అమ్మో... టెలికం!!
కొందరేమో 2జీని... కుంభకోణాల ముత్తాతగా పిలుస్తారు. కాకపోతే టెలికం కంపెనీలు బిచాణా ఎత్తేయటం వెనకున్న కారణాలన్నిటికీ ఇదే ముత్తాత అని కూడా చెప్పొచ్చు. కొన్నేళ్లుగా మన టెలికం రంగంలో కంపెనీలకు ఘోరమైన దెబ్బలు తగిలాయి. అవెంత తీవ్రమైనవంటే... కొన్ని దివాలా స్థాయికి పోయాయి కూడా. సొంతగా... కొన్ని విదేశీ సంస్థలతో జతకట్టి... వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన సంస్థలు... చివరకు పెట్టుబడి కోల్పోవటమే కాక అప్పులుæ మిగుల్చుకున్నాయి. దేశీ టెలికం రంగం రూ.4.5 లక్షల కోట్ల రుణభారాన్ని మోస్తోందంటేనే పరిస్థితి ఈజీగా అర్థమయిపోతుంది. దేశంలో దిగ్గజ సంస్థలైన యూనినార్.. వీడియో కాన్, ఖైతాన్ వంటివి టెలికామ్‌లో మాత్రం అన్నీ రాంగ్ కాల్సే చేశాయి. ఇక విదేశీ దిగ్గజాలకైతే లెక్కలేదు. నార్వే దిగ్గజం టెలినార్. హాంకాంగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ హచ్. రష్యా సంస్థ సిస్టెమా టెలీ (ఎంటీఎస్), మలేసియా నంబర్–1 మ్యాక్సిస్... జపాన్ అగ్రగామి డొకోమో.. ఎమిరేట్స్‌లో జెండా ఎగరేసిన ఎటిసలాట్.. ఇవి భారతీయ మొబైల్ యూజర్‌కు చేసిన కాల్స్ కనెక్టే కాలేదు. ఫలితం... వేల కోట్ల నష్టాలు. అప్పుల కుప్పలు. ఆ కథేంటో వివరించేదే ఈ కథనం.. (సాక్షి, బిజినెస్ విభాగం) : టెలినార్ కథ ఎనిమిదేళ్లలో కంచికి చేరిపోయింది. 13 దేశాల్లో నెట్వర్క్లుండి, 29 దేశాల్లో కార్యకలాపాలున్న ఈ బహుళజాతి ప్రభుత్వ సంస్థ... యూనిటెక్‌తో జట్టుకట్టడమే కలిసిరాలేదని కొందరంటారు. 2008లో 22 సర్కిళ్లకు లైసెన్స్‌లు దక్కించుకున్న యూనిటెక్ వైర్లెస్లో 67.25 శాతం వాటాను రూ.6,500 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేయటం ద్వారా దేశంలోకి ప్రవేశించిందీ సంస్థ. రెండేళ్లు తిరక్కుండానే 3 కోట్ల సబ్స్క్రైబర్లు, 13 సర్కిళ్లకు విస్తరించింది. కాకపోతే 2జీ స్కామే దీన్ని దెబ్బతీసిందని చెప్పొచ్చు. సుప్రీంకోర్టు పలు సర్కిళ్లలో లైసెన్సుల్ని రద్దు చేసినా... మిగతా సంస్థల్లా వెనుదిరిగి వెళ్లిపోకుండా నిలబడింది యూనినార్. కాకపోతే లైసెన్సుల రద్దుతో వచ్చిన నష్టానికి గాను యూనిటెక్కు నోటీసులివ్వటం... ఇద్దరూ కోర్టుకెక్కటం కలిసిరాలేదనే చెప్పాలి. ఫలితం... నామమాత్రపు ధరకు వాటా వదిలేసి యూనిటెక్ వెళ్లిపోయింది. సొంతగా రెండో ఇన్నింగ్స్ మొదలెట్టి మరిన్ని వేల కోట్లు ఖర్చు చేసినా... వినియోగదారులు మాత్రం పెరగలేదు. రెండో ఇన్నింగ్స్ తొలి 9 నెలల్లోనే రూ.5,825 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ఇక జియో ఎంట్రీతో మనుగడ సైతం కష్టమయింది. చివరకు తన నెట్‌వర్క్‌ను భారతీ ఎయిర్‌టెల్‌కు విక్రయించేసి... కథ ముగించింది. ఈ డీల్ ద్వారా రూ.2వేల కోట్లవరకూ టెలినార్‌కు దక్కినట్లు తెలుస్తోంది. రూ.23,000 కోట్లకు రూ.420 కోట్లు.. రష్యాకు చెందిన ఎంటీఎస్ కూడా ఇండియాలో సీడీఎంఏ టెక్నాలజీనే ఎంచుకుంది. దేశవ్యాప్త నెట్‌వర్క్‌కు రూ.22,750 కోట్లు ఖర్చుచేసింది. దేశమంతా సర్వీసులు ఆరంభించినా... ఎక్కడా ప్రభావవంతమైన పనితీరు కనబరచలేకపోయింది. నష్టాలు పెరగటంతో చివరకు రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో విలీనమైంది. అది కూడా... ఆర్‌కామ్ తన సంస్థలో 10 శాతం వాటా ఇచ్చింది తప్ప నగదేమీ ఇవ్వలేదు. ప్రస్తుతం దీని విలువ దాదాపు రూ.470 కోట్లు. హచ్... లాభాలతోనే వైదొలిగింది! హాంకాంగ్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం హచిసన్... దేశంలో ఉక్కు దిగ్గజం ఎస్సార్తో జతకట్టడం ద్వారా టెలికంలోకి దిగింది. వచ్చీ రావటంతోనే భారీ ప్రచార వ్యూహానికి తెర తీసింది. త్వరగానే పలు సర్కిళ్లలో పాగా వేసింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కావటంవల్లో ఏమో!! వచ్చినంత వేగంగానే తన వాటాను 2007లో ఏకంగా 11 బిలియన్ డాలర్లకు యూకే దిగ్గజం వొడాఫోన్‌కు విక్రయించి వైదొలిగింది. 2011లో ఎస్సార్కున్న 33% వాటాను కూడా 5 బిలియన్ డాలర్లు చెల్లించి వొడాఫోన్ కొనుగోలు చేసింది. హచ్–ఎస్సార్... రెండిటిదీ సరైన ఎగ్జిట్గానే చెబుతారు నిపుణులు. మాక్సిస్ దారి ఎటు..? మలేసియా దిగ్గజం మ్యాక్సిస్ది అయోమయ పరిస్థితి. దీనికి ఎయిర్‌సెల్‌లో 74% వాటా ఉంది. భారత్‌లో ఇప్పటిదాకా రూ.47,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. జియో ప్రవేశంతో రాబడులు దారుణంగా పడిపోవటంతో భారత్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది. ఆర్‌కామ్‌తో డీల్ చేసుకున్నా... దానికి నియంత్రణ సంస్థలు మోకాలడ్డాయి. ఇప్పటికీ రూ.15,500 కోట్లకుపైగా రుణభారం మోస్తున్న ఈ సంస్థకు భవిష్యత్ అయోమయంగానే కనిపిస్తోంది. కొన్ని సర్కిళ్లలో ఇప్పటికే సేవలు నిలిపేసింది కూడా. బాటెల్కో.. తొలి బకరా? ఎస్ టెల్లో తనకున్న 42.7% వాటాను బహ్రైన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (బాటెల్కో) ఎంత ధరకు కొన్నదో అంతే ధరకు 17.5 కోట్ల డాలర్లకు విక్రయించింది. ఈ పెట్టుబడులపై వడ్డీని మాత్రమే బాటెల్కో నష్టపోయింది. భారత్ నుంచి మొదట వైదొలగిన విదేశీ కంపెనీ ఇదే. 35 లక్షల మంది వినియోగదారులతో ఆరు టెలికం సర్కిళ్లలో సేవలందించిన ఈ కంపెనీని... శివశంకరన్‌కు చెందిన శివ గ్రూప్ నిర్వహించేది. 1997–98లో ఎయిర్‌సెల్‌ను ప్రారంభించిన శివ... దీన్ని మలేషియాకు చెందిన మాక్సిస్ గ్రూప్‌కు భారీ ధరకు విక్రయించటం ద్వారా వెలుగులోకి వచ్చారు. సుప్రీంకోర్టు 2జీ లైసెన్సుల్ని రద్దు చేసిన వెంటనే బాటెల్కో తన వాటాను విక్రయించేసుకుని బయటపడింది. రెండో వికెట్... ఎటిసలాట్ ఎటిసలాట్ డీబీ.. భారత్ నుంచి నిష్క్రమించిన రెండో విదేశీ కంపెనీ. దేశీ రియల్టీ సంస్థ డీబీ కార్ప్‌తో కలిసి ఎటిసలాట్–డీబీని ఏర్పాటు చేసింది. 2జీ కేసులో సుప్రీం రద్దు చేసిన 122 లైసెన్సుల్లో ఈ కంపెనీ లైసెన్స్‌లూ ఉండటంతో ఎటిసలాట్ దుకాణం కట్టేసింది. 16.7 లక్షల మంది కస్టమర్లను... 82 కోట్ల డాలర్ల విలువైన భారత టెలికం కార్యకలాపాలను వదిలేసుకుని వెళ్లిపోయింది. లూప్ మొబైల్... కేసులు మిగిలాయి.. భారత్‌లో తొలి మొబైల్ ఆపరేటర్ లూప్. 1995లో బీపీఎల్ మొబైల్ కమ్యూనికేషన్స్ పేరిట రంగంలోకి దిగింది. దీన్లో 99% వాటాను రూ.700 కోట్లకు ఖైతాన్ గ్రూప్ 2005లో కొనుగోలు చేసింది. 2009లో కంపెనీ పేరు లూప్మొబైల్గా మారింది. 2014లో దీన్ని రూ.700 కోట్లకు కొనటానికి ఎయిర్టెల్ డీల్ కుదురినా.. అమల్లోకి రాకముందే రద్దయిపోయింది. దీం తో 2014లో కార్యకలాపాలు నిలిపేసింది. భారతీయ టెలికం రంగంలో మూలధనంపై రాబడి 1 శాతంగా ఉంది. కంపెనీలు వాటి డబ్బుల్ని ఇక్కడి టెలికం రంగంలో ఇన్వెస్ట్ చేయటం కన్నా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవటం ఉత్తమం. – గోపాల్ విట్టల్ (ఎయిర్టెల్ సీఈఓ) -
రిజిస్ట్రేషన్ల శాఖలో ‘కొత్త’ నెట్వర్క్
అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఏటా కోటిన్నర ఖర్చు సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త హంగులను సమకూర్చుకుంటోంది. రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో తరచూ ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించడం కోసం తన పోర్టల్‌ను స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ (స్వాన్) నుంచి మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ (ఎంపీఎల్ఎస్)లోకి మార్చుకుం టోంది. రెయిల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ఎంపీఎల్ఎస్ సేవలను వినియోగించుకునేందుకు అనుమతినిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం వన్‌టైమ్ చార్జీల కింద రూ.35.25 లక్షలు, ఏటా సర్వీసు చార్జీల కింద 1.58 కోట్లు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఈ ఉత్తర్వుల్లో కల్పించారు. వాస్తవానికి, ప్రస్తుతమున్న నెట్వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటకల్లో విజయవంతంగా అమలవుతున్న ఎంపీఎల్ఎస్ వీపీఎన్ నెట్వర్క్ వైపు మొగ్గుచూపామని ఆ శాఖ డీఐజీ ఎం. శ్రీనివాసులు వెల్లడించారు. -
‘నెట్వర్క్’ ప్రకటనలపై ఎయిర్‌టెల్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ‘అధికారికంగా’ అత్యంత వేగవంతమైన నెట్వర్క్ ప్రకటనల విషయంలో టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇవి తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆస్కీ ఆక్షేపించింది. ఏప్రిల్ 11లో ఈ ప్రకటనలను మార్చాలని లేదా ఉపసంహరించాలని సూచించింది. ఎయిర్టెల్ నెట్వర్క్ అత్యంత వేగవంతమైనదంటూ కన్సల్టెన్సీ సంస్థ ఊక్లా ఇచ్చిన సర్టిఫికెట్‌కు ఊతంగా సరైన ఆధారాలేమీ లేవని ఆస్కీ ఫాస్ట్ ట్రాక్ కంప్లయింట్స్ కమిటీ (ఎఫ్టీసీసీ) అభిప్రాయపడింది. ఎయిర్టెల్ ప్రకటనలపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఫిర్యాదును సమర్ధిస్తూ ఎఫ్టీసీసీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎయిర్టెల్ ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు ఎఫ్టీసీసీ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని భారతి ఎయిర్టెల్ తెలిపింది. దీనిపై అప్పీలు చేయనున్నట్లు వివరించింది. మొబైల్ స్పీడ్ టెస్టులు నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఊక్లా నిర్ధారించిన వాస్తవిక అంశాల అధారంగానే తమ ప్రకటనలు రూపొందించినట్లు, ఆ వివరాలు ఆస్కీకి కూడా సమర్పించినట్లు ఎయిర్టెల్ పేర్కొంది. -
సెరిలాక్ వయసులోనే.. సెల్ఫోన్లా!
► నెట్వర్క్, టెక్నాలజీ, సోషల్ మీడియాలతో పక్కదారి ► దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది ఆన్లైన్ వేధింపుల నిందితులు ► ‘ఆన్లైన్లో లైంగిక వేధింపుల నియంత్రణ’ సదస్సులో వక్తలు ► సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తాం: హోంమంత్రి నాయిని సాక్షి, హైదరాబాద్: సెరిలాక్ తినాల్సిన వయసులోనే సెల్ఫోన్లు పట్టుకోవడం వల్లే చిన్నారులకు ఆన్లైన్లో లైంగిక వేధింపులు మొదలయ్యాయని, నెట్వర్క్, టెక్నాలజీ, సోషల్ మీడియాతో పక్కదారి పడుతున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. సీఐడీ ఐజీ సౌమ్యా మిశ్రా నేతృత్వంలో గురువారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన ‘ఆన్లైన్లో చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణ’ సదస్సును హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారం భించారు. టెక్నాలజీ, సోషల్ మీడియాలను సరైన రీతిలో ఉపయోగించుకోకపోవడం వల్లే చిన్నారులు, మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చిన్నారు లపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, సైబర్ నేరస్థులను కట్టడి చేయడంలో సీఐడీ సఫలీకృతమవుతోందని నాయిని ప్రసంశిం చారు. ఈ సందర్భంగా సీఐడీ రూపొందించిన లైంగిక వేధింపుల నియంత్రణ మాడ్యుల్‌ను ఆవిష్కరించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలో నియంత్రణ పోలీసులు, చట్టాలు, స్వచ్ఛంద సంస్థలు.. ఇలా ఎన్ని ఉన్నా పిల్లలపై జరుగుతున్న లైం గిక వేధింపుల నియంత్రణలో కీలక పాత్ర తల్లి దండ్రులదేనని తులిర్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యారెడ్డి స్పష్టంచేశారు. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో తాము చేసిన సర్వే ప్రకారం సెక్సువల్ ఎడ్యు కేషన్ పాఠ్యాంశంగా ఉందని, అయితే దేశంలో ఇప్పుడిప్పుడే ఈ అంశంగా చేర్చే ప్రక్రియ ప్రారంభంలో ఉందన్నారు. బిహార్‌లోని పట్నా రైల్వేస్టేషన్లో ఉచితంగా వైఫై ఇవ్వడంతో చాలా మంది అశ్లీల చిత్రాలు, వీడియోలు డౌన్లోడ్ చేసినట్లు అక్కడి పోలీసుల దర్యా ప్తులో బయటపడిందన్నారు. దీంతో అక్కడ వైఫై సేవలు రద్దు చేశారన్నారు. పోర్న్ వెబ్ సైట్లు, సంబంధిత సోషల్ మీడియాను వీక్షిం చవద్దని తెచ్చే ఒత్తిడి వల్ల పిల్లల్లో మానసిక వేదన ప్రారంభమై, వాటిని చూసేలా ప్రేరేపి స్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. అలాంటి వెబ్సైట్లు వీక్షించడం వల్ల వచ్చే ప్రమాదాలను తెలపడం, అవగాహన కల్పించడం వల్ల, పిల్లల్లో స్వీయ నియంత్రణ అలవ డుతుందని తెలిపారు. ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే పిల్లలకు ఇలాంటి విషయాల్లో అవగాహన కల్పించ గలరని పేర్కొన్నారు. -
సాంకేతిక సమస్యలను పరిష్కరించండి
చిత్తూరు (కలెక్టరేట్): ప్రజాసాధికార సర్వేలో ఎదురయ్యే నెట్వర్క్, సాంకేతిక లోపాలను సరిదిద్దాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా తెలిపారు. శుక్రవారం స్థానిక జేసీ కార్యాలయ సమావేశ మందిరంలో వివిద నెట్వర్క్ ప్రతినిధులు, ఆన్లైన్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 70 శాతం మాత్రమే సర్వే పూర్తయిందని నెట్వర్క్ అందక, ఆన్లైన్ సమస్యలతో సర్వే ముందుకుసాగడంలేదని వివరించారు. సర్వే పూర్తయ్యేందుకు నెట్వర్క్ ప్రతినిధులు సహకరించాలని కోరారు. దీనిపై నెట్వర్క్ ప్రతినిధులు మాట్లాడుతూ నెట్వర్క్ కెపాసిటీ పెంచే చర్యలు చేపడుతామన్నారు. అదే విధంగా నెట్‌వర్క్‌లేని గ్రామాల్లో కొత్త టవర్లను నిర్మిస్తామని జేసీకి తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, ఏపీ స్వాన్ జిల్లా మేనేజర్ సోమసుందరం, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా, డొకోమో తదితర నెట్వర్క్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వాటిపై పోరాటానికి దిగిన సోషల్ మీడియాలు
తప్పుడు వార్తా కథనాలపై పోరాటానికి సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, ట్విట్టర్లు కూడా సన్నద్ధమయ్యాయి. 30కి పైగా న్యూస్, టెక్నాలజీ కంపెనీలతో ఏర్పడిన నెట్‌వర్క్‌తో ఈ రెండు కంపెనీలు జతకట్టాయి. సోషల్ మీడియా సమాచారంలో క్వాలిటీని మెరుగుపరచడానికి నెట్‌వర్క్‌లో చేరినట్టు ట్విట్టర్, ఫేస్బుక్ మంగళవారం వెల్లడించాయి. ఆల్ఫాబెట్ కంపెనీ గూగుల్ అండతో 2015 జూన్‌లో మొదటి డ్రాప్ట్ కూటమి ఏర్పడింది. దీనికోసం వాలంటరీ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్‌ను ఏర్పరచున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా యూజర్లలో న్యూస్ లిటరసీని పెంచనున్నారు. ప్రశ్నించదగ్గ వార్తా కథనాలను సవరించుకునే వెసులుబాటుగా ఈ ప్లాట్‌ఫామ్ లాంచ్ కానుంది. అక్టోబర్ చివరిలో ఈ ప్లాట్ఫాట్ను ఆవిష్కరించనున్నట్టు కూటమి మేనేజింగ్ డైరెక్టర్ జెనీ సర్జెంట్ తెలిపారు. ఈ గ్రూపులో న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు, బజ్‌ఫీడ్ న్యూస్, ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెసీ, సీఎన్‌ఎన్‌లు మెంబర్లుగా ఉండనున్నాయి. నెలకు 1.7 బిలియన్ యూజర్లు కలిగి ఉన్న ఫేస్బుక్ ప్రపంచంలో అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఉంది. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందని ఫేస్బుక్ ఈ మధ్యన తెగ ఆరోపణలు ఎదుర్కొంటోంది. తప్పుడు కథనాలను, తప్పుడు సమాచారాన్ని అందించడానికి పనిచేస్తుందంటూ పలువురు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ట్రెండింగ్ స్టోరీలలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. అదేవిధంగా రోజుకి 140 మిలియన్ యూజర్లు కలిగి ఉన్న ట్విట్టర్ బ్రేకింగ్ న్యూస్ అందించడంలో సోషల్ మీడియాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ కూడా తరచు హింసాత్మక ప్రచారం చేస్తుందంటూ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తప్పుడు వార్తా కథనాలపై పోరాటానికి ఈ నెట్‌వర్క్‌లో ఫేస్బుక్, ట్విట్టర్ జాయిన్ అయ్యాయి. -
నిలిచిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు
పాత శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని ఉప రవాణాశాఖ కార్యాలయంలో రెండు రోజులుగా ఆన్లైన్ సేవలు మొరాయిస్తున్నాయి. మంగళవారం కుడా సేవలు స్తంభించిపోయాయి. దీంతో వివిధ రకాల పనులపై ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. బీఎస్ఎన్ఎల్, రిలయన్స్, లీజర్లైన్ సేవలన్నీ ఒకేసారి మొరాయించడంతో ఆన్లైన్ నెట్వర్కులు ఏ ఒక్కటీ పనిచేయలేదు. డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, పర్మిట్ల ప్రక్రియ నిలిచిపోవడంతో కార్యాలయానికి వచ్చిన వారంతా గంటల కొద్దీ నిరీక్షిస్తూ నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయమై రవాణాశా«ఖాధికారులు మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కేబుల్ వైర్లు పాడయ్యాయని, వీటికి మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. -
సాధికార సర్వేపై చేతులెత్తేశారు!
90 శాతం పనిచేయని ఆన్లైన్ నెట్వర్క్ 2జీ సిమ్ కార్డులను 3జీకి మార్చని వైనం వ్యక్తిగత వివరాలు చెప్పడానికి ప్రజల విముఖత సర్వే తమవల్ల కాదంటున్న ప్రభుత్వ ఉద్యోగులు కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్లు జిల్లాలో ప్రారంభమైన ప్రజా సాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే)పై అధికారులు చేతులెత్తేశారు. ప్రజలు వివరాలు చెప్పడానికి విముఖత చూపిస్తున్నారు. అసలు వివరాలను నమోదు చేయడానికి ఆన్లైన్ నెట్వర్క్ సరిగా రావడంలేదు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే ఉన్నాయి. అంతిమంగా సాధికార సర్వే మూన్నాళ్ల ముచ్చటగా తయారవుతోంది. చిత్తూరు (అర్బన్): జిల్లాలో మూడు రోజుల క్రితమే సాధికార సర్వే ప్రారంభించారు. రాష్ట్రంలోనే చిత్తూరులోనే సర్వేను తొలిసారిగా ప్రారంభించి రికార్డు సృష్టిస్తే.. అంతే వేగంగా అది తమ వల్ల కాదని అధికారులు, సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ప్రతి కుటుంబంలోని వ్యక్తుల వివరాలను నమోదు చేయడానికి ఈనెలాఖరు వరకు తొలి విడత, వచ్చేనెల 6 నుంచి 15 వరకు రెండో విడతగా సర్వే చేయడానికి తేదీలు ఖరారు చేశారు. అయితే ఆది నుంచీ సర్వేపై సరైన అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వివరాలను నమోదు చేయడానికి 3 వేల మంది సిబ్బందిని నియమించి వారికి ఉన్నతాధికారులు ట్యాబ్‌లు, బయోమెట్రిక్ పరికరాలను అందచేశారు. జిల్లాలోని నివాసాలు, కుటుంబాల సంఖ్య ఆధారంగా 2,745 బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో 400 నుంచి 500 కుటుంబాలు ఉంటాయి. అయితే సర్వేకు నియమించిన అధికారులు, సిబ్బందిలో సగం మందికి పైగా ట్యాబ్‌లను ఎలా ఉపయోగించాలో తెలియడంలేదు. దీనికి తోడు 90 శాతం ట్యాబ్‌లకు గత మూడు రోజుల నుంచి నెట్వర్క్ రావడంలేదు. ఇక చిత్తూరు నగరంలో అయితే నిరక్షరాస్యులైన చెత్త ఊడ్చే పారిశుధ్య కార్మికుల చేతికి ట్యాబ్‌లు ఇచ్చి పంపడమే నిదర్శనం. పల్లెల్లో సర్వేకు వెళుతున్న 30 శాతం మంది వీఆర్వోలకు ట్యాబ్‌ను ఉపయోగించడం తెలియడంలేదు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. చేయాల్సిన పనులు వదిలేసి ఏజెన్సీల ద్వారా చేయించుకోవాల్సిన సర్వే పనులను తమకు అంటగట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. అన్నీ అడ్డకుంలే.. సర్వే సక్రమంగా సాగకపోవడానికి సాంకేతిక కారణాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలోని ప్రతివ్యక్తి ఫోటోను ట్యాబ్‌లో తీసి దాన్ని జియో ట్యాగింగ్ చేయాలి. దీనికి తప్పనిసరిగా 3జీ నెట్వర్క్ కావాలి. కానీ 70 శాతం ట్యాబ్‌ల్లో 2జీ నెట్వర్క్ ఉండటం వల్ల ఒక్కో కుటుంబానికి గంటల సమయం పడుతోంది. అయినా సరే నెట్వర్క్ కనెక్టుకావడంలేదు. 3జీ సిమ్‌కార్డులు అడుగుతుంటే పట్టిం చుకునే దిక్కులేదు. మరోవైపు ప్రజల ఆధార్‌కార్డు, పేర్లు, బ్యాంకు ఖాతాలు అడగడం వరకు బాగానే ఉన్నా.. ఇంట్లో ద్విచక్రవాహ నం, టీవీ, ఫ్రిడ్జ్, కారు, సెల్‌ఫోన్ లాంటి వివరాలను సైతం నమోదు చేయాల్సి ఉండటం తో ప్రజలు ఈ వివరాలను చెప్పడానికి విముఖత చూపిస్తున్నారు. అన్ని వివరాలను చెప్పే స్తే భవిష్యత్తులో సంక్షేమ పథకాలు ఎక్కడ తమకు అందవోనంటూ ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు సర్వే చేసే ఎన్యుమరేట ర్లకు శిక్షణ ఇవ్వడం కూడా తూతూ మంత్రం గానే సాగింది. ఎక్కడా ట్యాబ్‌ను అందరి ముందు తెరచి చూపిస్తూ వివరాలను నమో దు చేయడంపై శిక్షణ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఈ అవాంతరాలను అధిగమించి జిల్లాలో సాధికార సర్వే నిర్ణీత గడువులోపు పారదర్శకంగా చేయడం అసాధ్యమని అధికారులు, సిబ్బంది పెదవి విరుస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలచేత చేయించుకోవాల్సిన సర్వేని ఉద్యోగులకు చేత చేయిస్తున్నారంటూ గుర్రుగా ఉన్నారు. -
న్యూ జంగిల్ బుక్
హ్యూమర్ ఫ్లస్ వ్యాపారం వ్యాపారమే. కస్టమర్ మనిషా, జంతువా అనేది మనకు సంబంధం లేదు. మనుషులందరూ తలా రెండు సెల్ఫోన్లు కొనేశారు కాబట్టి వ్యాపార విస్తరణ కోసం సెల్‌ఫోన్ కంపెనీలు అడవిలో కూడా నెట్వర్క్ పెట్టాయి. ఆధార్ కార్డ్ లేకపోయినా జంతువులకు సెల్ఫోన్లు అమ్మసాగాయి. ఒక కోతి చచ్చీచెడీ నాలుగు బస్తాల నేరేడుపళ్లు ఇచ్చి స్మార్ట్‌ఫోన్ కొనింది. వెంటనే సెల్ఫీ తీసుకుని ఆశ్చర్యపోయింది. తాను అందంగా ఉంటానని తెలుసు కానీ, మరీ అంత అందంగా వుండడం ఊహించలేకపోయింది. ఫేస్బుక్లో పెడితే రెండొందల లైక్స్ వచ్చాయి. పక్కచెట్టుపై వున్న వదినకి ఫోన్ చేసి పేలు చూసుకుందాం రమ్మని పిలిచింది. పేలు చూచివేతని ఫోటో తీసి ‘వదినతో పేలు సీయింగ్’ అని పోస్ట్ చేస్తే ప్రముఖ హేర్ డ్రెస్సింగ్ కంపెనీ నుంచి ‘పేన్ లుకర్’ జాబ్ ఆఫర్ వచ్చింది. ఏనుగైతే తన దంతాన్నే త్యాగం చేసి ఫోన్ కొనింది. గూగుల్ సెర్చ్‌లో వెతికి ఎక్కడ చెరుకు దొరుకుతుందో కనిపెట్టి నమిలి తినేసింది. సింహాన్ని విడియోలో చూడ్డం వల్ల దానికి భయం పోయింది. సింహం కలలో కనిపిస్తే సింహస్వప్నం అని అరవడం మానేసింది. జింకల పని మరీ హాయి. గద్దల్ని వాట్సప్ గ్రూప్‌లో చేర్చుకున్నాయి. అవి పులికి ట్రాకింగ్ పెట్టాయి. పులి మైలు దూరంలో వుండగానే మెసేజ్ కొడుతున్నాయి. దాంతో జింకలు పరారీ. సమాచార విప్లవాన్ని పులులు కూడా అందిపుచ్చుకున్నాయి. అయితే వాటికి అహం ఎక్కువ కాబట్టి ఒకరి వేట గురించి ఇంకొకరు షేర్ చేసుకోవడం లేదు. ఒక మొసలికి చెడ్డ ఇబ్బందొచ్చిపడింది. ఫోన్లో డిక్షనరీ వుండడంతో అన్ని పదాలకి అర్థాలు తెలిసిపోతున్నాయి. మొసలి కన్నీరుని వెంటనే గుర్తుపడుతున్నారు. మొసలి కూడా ఫోన్ కొనింది కానీ అది ఎక్కువసేపు నీళ్లలో వుండడం వల్ల మాట్లాడ్డం కష్టంగా వుంది. గట్టుమీద చెట్టు తొర్రలో దాచింది కానీ నక్కలెత్తుకుపోతున్నాయి. ఏది కనపడినా ఎత్తుకెళ్లడం నక్కల ప్రవృత్తి. దొంగఫోన్లు వాడ్డంలో అవి ఎక్స్పర్ట్లయ్యాయి. ఎప్పుడూ ఎదుటివాళ్లకు గోతులు తీయడం వల్ల పిట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ అని కొత్త సిద్ధాంతాన్ని కూడా లేవదీశాయి. ఫోన్ చేతికొచ్చేసరికి అడవి కోళ్లలో సామాజిక చైతన్యం కాలుమోపింది. వంటల కార్యక్రమంలో తమని రకరకాలుగా వండడం చూసి అవి అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. యూట్యూబ్‌లో ఈ విడియోలన్నీ నిషేధించాలని కోళ్ల శంఖారావం అని షార్ట్‌ఫిలిం తీసి అప్లోడ్ చేశాయి. చికెన్ ప్రియులంతా కోళ్ళ హక్కుల్ని సమర్థించారు. ఎలుగుబంట్లకు ఒళ్లంతా బొచ్చు వుండడం వల్ల ఫోన్ ఎక్కడ పెట్టింది మరిచిపోయి శరీరమంతా తడుముకుంటున్నాయి. కంగారు అయితే తన పొట్టలోని పిల్లకు కూడా ఫోన్ కొనిపెట్టింది. అది ఆకలైతే ఏడ్వడం మానేసి మెసేజ్‌లు ఇస్తూ వుంది. కొండచిలువ ఒక అడుగు ముందుకేసి సెల్ఫ్ ప్రమోషన్ విడియో తీసింది. ‘కొండగాలి పిలిచింది, గుండె వూసులాడింది’ అనే పాటకి డ్యాన్స్ చేసి సర్వజీవుల రక్షణే తమ అభిమతమని, ప్రతి శనివారం సాయంత్రం తన భాషణ వుంటుందని ఆహ్వానం పంపింది. చిన్న అక్షరాలతో షరతులు వర్తిస్తాయి అని టైప్ చేసింది. ఇంతకూ షరతు ఏమిటంటే తనకు ఆకలేస్తే ఒకటి రెండు జంతువుల్ని తింటుందట! ఇదంతా చూసి సింహాల నాయకుడికి కోపమొచ్చింది. సెల్‌ఫోన్ కంపెనీల ప్రతినిధిని పిలిపించింది.‘‘సమాచారం ఉన్నా లేకపోయినా కండబలందే రాజ్యం. కానీ ఈ ఫోన్ల వల్ల వేటకి కొంత అంతరాయంగా వుంది’’ అన్నాడు. ‘‘ప్రభూ, మీరు అపార్థం చేసుకున్నారు. సాంకేతిక నైపుణ్యం వల్ల మనిషి తన వేట లక్షణాల్ని మెరుగుపరుచుకున్నాడు. ఒకప్పుడు ఉద్యోగం చేసి ఇంటికెళ్లి హాయిగా గడిపేవాడు. ఇప్పుడు ఇంట్లో కూడా వాడితో ఉద్యోగం చేయించి పిండుతున్నారు. భార్యాపిల్లలతో వున్నప్పుడు ఫోన్ మోగించి, వాడి కలల్ని కూడా వేటాడుతున్నారు. ఫోన్ వుంటే బాణం, రివాల్వర్ కంటే వేగంగా వేటాడవచ్చు. ఆలోచిస్తే సూక్ష్మం బోధపడుతుంది’’ అన్నాడు ప్రతినిధి. సింహం వెంటనే జింకల నాయకుడికి ఫోన్ చేసి, ‘‘రాత్రి డిన్నర్‌కి రెండు బలిసిన జింకల్ని పంపించు. లేదంటే మా మంద చేతిలో మీ మంద హతం’’ అని బెదిరించాడు. డిన్నర్ రెడీ అయింది. అప్పటినుంచి బలమైన జంతువులు కాలు కదపకుండా ఫోన్ ద్వారా వేటని కొనసాగించాయి. ప్రకృతి ఆవిధంగా సమతుల్యతని కాపాడుకుంది. - జి.ఆర్. మహర్షి -
హర్యానా గ్రామాల అనుసంధానం!
ఛండీగఢ్ః హర్యానా గ్రామాలు త్వరలో ఎలక్రానిక్ సేవలను అందుకోనున్నాయి. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ తో అనుసంధానం కానున్నాయి. ప్రజలకు ఎలక్ట్రానిక్ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా సర్వీస్ పాయింట్ల ఏర్పాటుకు హర్యానా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో భాగంగా ఈ కొత్త సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలుస్తోంది. హర్యానాలో సంసద్ గ్రామ యోజన పథకం ద్వారా గ్రామాలు అనుసంధానం కానున్నాయి. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ తో ప్రజలకు ప్రత్యేక సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సంసద్ గ్రామ యోజన పథకం అమలుపై జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి ఎస్ దేశాయ్ ఈ విషయాలను అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని డెలివరీ పాయింట్లతో ప్రజలకు ఈ ప్రత్యేక అందించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 105 సేవలను, 3,387 సాధారణ సేవా కేంద్రాల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్ సీఎస్ ద్వారా ప్రజలకు వీలైనంత అధిక ఇ-గవర్నెన్స్ సేవలను అందించాలని దేశాయ్ అధికారులను ఆదేశించారు. ఈ దిశలో పంచాయితీ శాఖ పురోగతిని సమీక్షించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సమన్వయ సహకారాన్ని అందిస్తాయని తెలిపారు. -
మిత్ర బేరం!
⇒వైద్యమిత్ర పోస్టులకు జోరుగా బేరసారాలు ⇒అమాత్యులను ఆశ్రయిస్తున్న ఆశావహులు ⇒నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందని వైద్య సేవలు ⇒ఆరోగ్యమిత్రల ఆందోళన పట్టని ప్రభుత్వం ⇒వైద్యమిత్రల నియామకానికి నోటిఫికేషన్ జారీ అనుకున్నట్లే జరుగుతోంది. అయినవారిని అందలం ఎక్కించడానికి.. అందినకాడికి దండుకోవడానికే కొత్త అర్హతల పేరుతో ఆరోగ్యమిత్రలకు సర్కారు ద్రోహం చేసింది. ఇప్పుడు జరుగుతున్న తంతు దీన్ని ధ్రువపరుస్తోంది. కొత్తగా వైద్యమిత్రల నియామకానికి అధికార పార్టీ నేతలు అప్పుడే బేరసారాలు మొదలు పెట్టేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో నియామకానికి లక్షల్లోనే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. విశాఖపట్నం: ఆరోగ్యమిత్రల తొలగింపుపై ఒక పక్క ఆగ్రహావేశాలు పెల్లుబుకుతుండగా.. మరోవైపు వారి స్థానంలో వైద్యమిత్రల నియామకానికి బేరసారాలు మొదలైపోయాయి. ప్రభుత్వ నిర్దేశించిన కొత్త అర్హతలున్నవారు ఈ పోస్టుల కోసం మంత్రులు, టీడీపీ అగ్రనేతలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు నేతలు ఒక్కో పోస్టుకు రూ.లక్షకుపైగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాల ఊసే లేకుండా పోయింది. దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు కొత్తగా భర్తీ చేయనున్న వైద్యమిత్ర పోస్టుల కోసం ఎగబడే పరిస్థితి తలెత్తింది. అధికార పార్టీ నేతలు డిమాండ్ చేసినంత సమర్పించుకోవడానికి చాలామంది నిరుద్యోగులు సిద్ధపడుతున్నారు. ఈ మేరకు పలుకుబడి ఉన్న వారి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం శుక్రవారం వైద్యమిత్ర నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నెల రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా క లెక్టర్లను ఆదేశించింది. దీంతో వైద్యమిత్రల నియామకానికి సంబంధించిన బేరసారాలు మరింత జోరందుకునే అవకాశం కనిపిస్తోంది. దిగజారిన వైద్యసేవలు.. ఇలావుండగా ప్రభుత్వం తమను ఉన్న పళంగా తొలగించడంతో ఆరోగ్య మిత్రలు ఆందోళన పథంలో ఉన్నారు. ఫలితంగా నెట్వర్క్ ఆస్పత్రుల్లో రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో సేవలు నిలిచిపోయాయి. ఈ ఆస్పత్రుల కు వైద్యానికొచ్చే రోగులను పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఆయా ఆస్పత్రుల్లోని సిబ్బందితోనే ఎన్టీఆర్ వైద్యసేవ అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా కార్యరూపం దాల్చడం లేదు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉన్న సిబ్బందికి ఎన్టీఆర్ వైద్య సేవల కార్డుల రిజిస్ట్రేషన్, ప్రాసెస్ ప్రక్రియపై అనుభవం లేకపోవడంతో వైద్యానికొచ్చే రోగుల్లో 10 శాతం మందికి మించి సేవలందని పరిస్థితి నెలకొంది. జిల్లాలోఎన్టీఆర్ వైద్య సేవ కోసం రోజుకు 500 మంది ఔట్ పేషెంట్లు, 300 మంది ఇన్ పేషెంట్లు వస్తుంటారు. ఇప్పుడు ఆ సంఖ్య పదో వంతు కూడా ఉండడం లేదు. కొన్ని నెట్వర్స్ ఆస్పత్రులు ఇదే అదనుగా రిజిస్ట్రేషన్లు వగైరాలకు రోగుల నుంచి వసూళ్లు మొదలు పెట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర కేసుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలను తొలగించినందున ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేర్చుకోలేమని చెబుతున్నారు. అలాంటి రోగులు విధిలేక అవే ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి చేరిపోతున్నారు. మరోవైపు ప్రస్తుతం ఆరోగ్య మిత్రల ఆందోళన నేపథ్యంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్), వర్కింగ్ జర్నలిస్టుల పథకం కార్డులను చాలా నెట్వర్క్ ఆస్పత్రులు తిరస్కరిస్తున్నాయి. ఇలాంటి వారిలో హృద్రోగులు, ఇతర ఎమర్జెన్సీ వైద్యం అందాల్సిన రోగుల కుటుంబీకులు తమ వారిని బతికించుకునేందుకు అప్పోసప్పో చేసైనా నెట్వర్క్ ఆస్పత్రుల్లో చేరుస్తున్నారు. -
ఫేస్ బుక్... యూజర్లకు కొత్త సదుపాయం
ప్రఖ్యాత సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్.. ఇప్పుడు ఖాతాదారులకు కొత్త సదుపాయాన్ని కల్పిస్తోంది. వినియోగదారుల అభిరుచులను సేకరిస్తున్న ఈ సామాజిక మాధ్యమం... యూజర్ల ఆసక్తికి అనుగుణంగా 'యాడ్ ప్రిఫరెన్సెస్' టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఫేస్ బుక్ పేజీలో వినియోగదారులకు ఇష్టమైన ప్రకటనలను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఫేస్ బుక్ పేజ్ లో యూజర్లు ఎక్కువగా చూసే విషయాల ఆధారంగా సంబంధిత మాచారాన్ని సేకరించి ఆయా ప్రకటనలకు చెందిన పూర్తి సమాచారాన్ని వారికి అందుబాటులో ఉంచుతుంది. సాధారణంగా ఏ వెబ్ పేజీ తెరచినా పక్కనే అనేక ప్రకటనలు కనిపించడం మనం చూస్తుంటాం. అయితే ఫేస్ బుక్ ఇప్పుడు వినియోగదారులకు ఇష్టమైన ప్రకటనలు అందుబాటులో ఉంచేందుకు ముందుకొచ్చింది. ప్రధానంగా మీ వయసు, ఫేస్ బుక్ వినియోగించే తీరు, ఇష్టాలను పరిగణనలోకి తీసుకొని.. మీరు క్లిక్ చేసిన బటన్స్ ను బట్టి మీకేం కావాలో అంచనా వేస్తుంది. సైట్ నుంచి మీరు లాగౌట్ అయిపోయినా సమాచారం మాత్రం సేకరించి ఉంచుతుంది. ముఖ్యంగా ఈ టూల్... ఫేస్ బుక్ పేజీ శీర్షిక ఆధారంగా మీక్కావలసిన అంశాన్ని గుర్తిస్తుంది. వైవాహిక జీవితం, రాజకీయాలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని మీ ప్రాధాన్యతను అంచనా వేస్తుంది. క్లాత్, గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ప్రకటనలను వాటికి సంబంధించిన ఫొటోలతో సహా పూర్తి సమాచారాన్ని మీ ముందుంచుతుంది. పేజీలో మీరు సబ్జెక్ట్ ను మార్చినప్పుడల్లా ఆయా విషయాలకు సంబంధించిన ప్రకటనలు పేజీలో మారుతుండటం ఈ 'యాడ్ ప్రిఫరెన్సెస్' ప్రత్యేకత. అంతేకాక ఈ సమయంలో కొత్త ప్రకటనలను వినియోగదారులకు పరిచయం చేసి ప్రోత్సహించేందుకు కూడా ఫేస్ బుక్ ప్రయత్నిస్తుంది. -
60 వేల కోట్లతో ఎయిర్టెల్ నెట్వర్క్ విస్తరణ
న్యూ ఢిల్లీ: ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్ టెల్ తన నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే 4G నెట్వర్క్ సేవలతో ముందున్న ఎయిర్ టెల్ రానున్న మూడేళ్లలో 60,000 కోట్ల రూపాయలను నెట్వర్క్ విస్తరణ కోసం కేటాయించనున్నట్లు సోమవారం ప్రకటించింది. 'ప్రాజెక్ట్ లీప్' పేరుతో చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇస్తుందని భారతీ ఎయిర్టెల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ ఆశాభావం వ్యక్తం చేశారు. నెట్వర్క్ సేవల కోసం ఇప్పటికే ఎయిర్ టెల్ 1,60,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. కాగా అదనంగా చేపడుతున్న 'ప్రాజెక్ట్ లీప్' ద్వారా ఎయిర్ టెల్ వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్ సౌకర్యాలు కల్పించడంతో పాటు కంపెనీ భవిష్యత్తు అవసరాలకు సరిపడే విధంగా నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 70,000 కేంద్రాలలో నెట్వర్క్ వ్యవస్థను విస్తరించనున్నారు. -
లాటరీ మాఫియా..!
జిల్లా కేంద్రంలో విచ్చల విడిగా సింగిల్ నంబర్ దందా నల్లగొండ టు షోలాపూర్ వరకు నెట్వర్క్ పండ్లు, పూల వ్యాపారులు, హోటల్ యజమానులే టార్గెట్ ‘కోడ్’ భాషను ఉపయోగిస్తూ సెల్ఫోన్ల ద్వారా బిజినెస్ జిల్లా కేంద్రంలో లాటరీ మాఫియా జూలువిదిల్చింది. సింగిల్ నంబర్ లాటరీ ముసుగులో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. కొంత కాలంగా చాపకింద నీరులా సాగుతున్న ఈ దందా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలన్న ఆత్రుతతో దిగువ మధ్యతరగతి కుటుంబాలు లాటరీ మాయలో పడి అప్పులపాలవుతున్నాయి. అప్పుల బాధ భరించలేక పలు సందర్భాల్లో పోలీస్స్టేషన్ల వరకు పంచాయితీలు వెళ్లిన ఘటనలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో లాటరీ టిక్కెట్ల అమ్మకాన్ని నిషేధించినప్పటికీ నల్లగొండ పట్టణంలో ఏవిధంగా సాగుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నల్లగొండ : మహారాష్ర్టలోని షోలాపూర్ నుంచి నల్లగొండ వరకు లాటరీ నెట్వర్క్ కొనసాగుతోంది. పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే ప్రకాశంబజార్, పాతబస్తీలను కేం ద్రంగా చేసుకుని లాటరీబిజినెస్ నడిపిస్తున్నారు. వీరు పూల, పండ్ల వ్యాపారులు, హోటల్స్, చెప్పుల దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నారు. షోలాపూర్‌కు చెందిన కొందరు ఏజెంట్లు నల్లగొండలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని చిరు వ్యాపారులను లాటరీ ముగ్గులోకి లాగుతున్నారు. టిక్కెట్లు విక్రయిస్తే లాటరీ బండారం బయట పడుతుందన్న భయంతో సెల్ఫోన్లను వినియోగిస్తున్నారు. లాటరీ ఎవరికి తగిలిందన్న విషయాన్ని కూడా ‘కోడ్’ భాషను ఉపయోగిస్తూ సమాచారం చేరవేస్తున్నారు. రూ.10 టికెట్.. రోజుకు నాలుగు ‘షో’లు లాటరీ టికెట్ ఖరీదు రూ.10 మాత్రమే ఉండటంతో చిరు వ్యాపారులు తొందరగా ఆకర్షితులవుతున్నారు. కాగితపు అట్టాల మీద చార్ట్‌లు గీసి 1 నుంచి 10 వరకు నంబర్లు వేస్తారు. ఆ నంబర్ల ఆధారంగా టిక్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. నల్లగొండలో ఉండే లాటరీ ఏజెంట్ నుంచి షోలాపూర్ ఏజెంట్‌కు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. 1 నుంచి 10 నంబర్ల వరకు ప్రత్యేకంగా కొన్ని గుర్తులు కేటాయించారు. ఈ గుర్తుల ఆధారంగా షోలాపూర్‌లో ఏ నంబర్‌కు లాటరీ తగిలిందనే విషయాన్ని ఇక్కడ టికెట్ కొన్న వ్యక్తులకు చేరవేస్తారు. ఈ విధంగా రోజుకు నాలుగు షో (ఆట)లు నడుస్తాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిత్యం 4 నుంచి 5 షోలు నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా ప్రకాశం బజార్, పాత బస్తీలోని కొన్ని హోటళ్లు, ప్రధాన కూడళ్లను అడ్డాలుగా చేసుకుని నడిపిస్తున్నారు. చేతులు మారుతున్న రూ. లక్షలు వంద రూపాయలు పెట్టుబడి పెడితే వెయ్యి రూపాయలు లాభం వస్తుందని ఏజెంట్లు ఆశ చూపి వ్యాపారులను లాటరీ ముగ్గులోకి దింపుతున్నారు. ఇదొక్కటే కాదు ఏ నంబర్ మీద లాటరీ కడితే వస్తుంది...లాటరీ ఏవిధంగా ఆడాలి అనే విషయాలపై ఏజెంట్లు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ శిక్షణకు వచ్చిన వారి నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. ఇలాంటి శిక్షణకు వెళ్లే వారిలో యువకులు, రిటైర్డ్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. ఈవిధంగా శిక్షణ పొందిన వారు తమకు తెలియకుండానే లాటరీ ముసుగులో పడిపోతున్నారు. ఇదీ కోడ్ భాష .. లాటరీ ఏ నంబర్‌కు తగిలిందన్న విషయాన్ని తెలియజేయడానికి కోడ్ భాషను వినియోగిస్తుంటారు. ఒకటో నంబర్ లాటరీగుర్తును గడ్డపార అని పిలుస్తారు. అదే విధంగా రెండో నంబర్‌కు బాతు, 3వ నంబర్‌కు నామాలు, 4వ నంబర్‌కు మంచం, 5వ నంబర్‌కు పచ్‌కడ్, 6కు నపూసకుడు, 7కు సత్తా, 8కి బేడీలు, 9, ఎన్టీరామారావు,10వ నంబర్‌కు లక్ష్మీ పార్వతి ఇలా కోడ్ భాషను ఉపయోగిస్తూ దందా నడిపిస్తున్నారు. -
ఎస్టీడీ కాల్ చార్జీలు తగ్గుతాయ్!
న్యూఢిల్లీ: ఎస్టీడీ కాల్ చార్జీలు తగ్గనున్నాయి. క్యారేజీ చార్జీలను ట్రాయ్ సగానికి తగ్గించడం దీనికి కారణం. నిమిషానికి 65 పైసలుగా ఉన్న క్యారేజీ చార్జీ పరిమితిని 35 పైసలకు తగ్గించింది. దీనితో ఎస్టీడీ కాల్ రేట్లు తగ్గుతాయని ట్రాయ్ కార్యదర్శి చెప్పారు. ఈ మార్పు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు. ఒక నెట్‌వర్క్‌కు చెందిన వినియోగదారుడు వేరే నెట్‌వర్క్‌కు ఎస్టీడీ కాల్చేస్తే, ఆ వేరే నెట్‌వర్క్‌కు చెల్లించే క్యారేజీ చార్జీ.. ఎస్టీడీ టారిఫ్‌ల్లో కీలకం. -
నెట్వర్క్ బలోపేతానికి రూ. 488 కోట్లు
గుర్గావ్: విద్యుత్ డిస్కం దక్షిణ హరియాణా విద్యుత్ పంపిణీ సంస్థ (డీహెచ్‌బీవీఎన్) తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడానికి రూ. 488 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఆదివారం వెల్లడించారు. ఇందులోభాగంగా ఎండాకాలంలో వచ్చే విద్యుత్ సంక్షోభాన్ని నివారించడానికి సుమారు 5,000 ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేయనుంది. ‘గుర్గావ్లో 1,980 కిలోమీటర్ల మేర హై టెన్షన్ లైన్లు, 2,460 కిలోమీటర్లు లో టెన్షన్ లైన్లు ఉన్నాయి. వీటన్నిటినీ కొనసాగించి, పాత కేబుల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం. నగరంలో 6,6 కిలోమీటర్లు 33 కేవీ లైన్లు ఉన్నాయి. వీటి సామర్థ్యాన్ని పరీక్షించి, అవసరమైనచోట కొత్తవాటిని విస్తరిస్తాం’ అని డిస్కం జనరల్ మేనేజర్ సంజీవ్ చోప్రా చెప్పారు. అంతేకాకుండా దాదాపు 4,973 పాత ట్రాన్స్ఫార్మర్లను పరీక్షించి, ట్రాన్స్మిషన్ నెట్‌వర్క్‌ను బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ‘మా ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు సమర్థంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుత ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యుత్ పరికరాలను పరీక్షించుకుంటాం. ఈ ప్రక్రియ అంతా ఈ ఏడాది ఏప్రిల్‌లోగా నిర్వహిస్తాం’ అని చోప్రా వివరించారు. -
ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు అంతరాయం
-
ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు అంతరాయం
హైదరాబాద్ : ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు శనివారం ఉదయం అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఎయిర్టెల్ నెట్ వర్క్ పనిచేయటం లేదు. దాంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఎయిర్టెల్ కస్టమర్ కేర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదు చేసినా స్పందించటం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నెట్వర్క్ పునరుద్దరణకు మరో గంట సమయం పడుతుందని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అన్ని కాలేజీలకూ వైఫై
రెండేళ్లలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: రాబోయే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో వైఫై నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. డిజిటల్ ఇండియాలో భాగంగా రెండేళ్లలో ప్రతి ఇంటికీ 15-20 ఎంబీపీఎస్, కాలేజీలకు ఒక గిగా బైట్ బ్యాండ్ విడ్త్‌తో ఫైబర్ కనెక్టివిటీ ఇస్తామని తెలిపారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో సోమవారం జరిగిన 13 జిల్లాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ప్రారంభం, యాప్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తు అంతా నాలెడ్జ్దేనని, ఈ వయసులో కొంచెం కష్టపడితే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఒక్కో ఆవిష్కరణ ప్రపంచాన్నే మార్చేస్తుందని, బిల్‌గేట్స్ తీసుకొచ్చిన ఇంటర్నెట్ ప్రపంచం మొత్తాన్ని ఒక గ్రామంగా మార్చేసిందని చెప్పారు. 600 మంది విద్యార్థులు రకరకాల యాప్‌లను అభివృద్ధి చేశారని, అందులో కొన్ని చాలా బాగున్నాయని తెలిపారు. లెర్న్, ఎర్న్, అప్లయ్, ప్రోపగేషన్ పేరుతో లీప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. యాప్‌లను అభివృద్ధి చేసిన విద్యార్థులు వాటిగురించి ఐదుగురికి శిక్షణ ఇస్తే స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటుచేసుకోవాలని, యాప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించాలని సూచించారు. రాబోయే రోజుల్లో సెక్రటేరియట్ మొత్తాన్ని ఇ-కార్యాలయంగా మారుస్తామన్నారు. భవిష్యత్తులో హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల కోర్సులను ఆన్లైన్లో ఏపీలో ప్రవేశపెడతామని చెప్పారు. కుటుంబ నియంత్రణ వద్దు గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ కావాలని చెప్పానని, కానీ మారిన పరిస్థితులను బట్టి వద్దని చెబుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో రోజూ 9 లక్షల మంది పుడుతుంటే, 9 లక్షల మంది చనిపోతున్నారని దీనివల్ల యువత లేకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పారు. అందుకే జనాభాను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ వంద ఎకరాలు ఇస్తే ఏపీకి మోడల్ ఐటీఐ మంజూరు చేస్తామని చెప్పారు. యాప్‌లు పరిశీలించిన సీఎం తొలుత సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్రంలోని 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించిన సీఎం వివిధ జిల్లాల ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు తయారుచేసిన యాప్స్‌ను పరిశీలించారు. వారిని అభినందించి పలు సూచనలు చేశారు. -
నెట్‌వర్క్‌లో సమాచారం గోప్యంగా ఉంటుందా?
ఏదైనా సమాచారం ఒక నెట్‌వర్క్‌లోకి వెళ్లిన తరువాత దాని గోప్యతకు గ్యారంటీలేదు. 100 శాతం రహస్యంగా ఉంటుందన్న నమ్మకంలేదు. అమెరికా లాంటి దేశం కూడా తన సీక్రెట్లను కాపాడుకోలేకపోయింది. వికీలీక్స్ దెబ్బకు విలవిల్లాడిపోయింది. ఈ పరిస్థితుల్లో సమాచారాన్ని రహస్యంగా ఉంచే నెట్‌వర్క్‌ను చైనా సిద్ధం చేస్తోంది. వికీలీక్స్ - ఎడ్వర్డ్ స్నోడెన్.. ఈ రెండు పేర్లు వింటే అమెరికా ప్రభుత్వానికి కోపం నషాళానికి అంటుతుంది. ప్రపంచానికి పెద్దన్నగా తనకు తానుగా ప్రకటించుకుని అమెరికా చేస్తున్న దురాగతాలను వికీలీక్స్ ద్వారా స్నోడెన్ విడుదల చేశారు. దీంతో స్నోడెన్‌ను పట్టుకునేందుకు అగ్రరాజ్యం చేయని ప్రయత్నం లేదు. రష్యాతో పాటు మరి కొన్ని దేశాలు స్నోడెన్‌కు రక్షణ కల్పిస్తున్నాయి. అమెరికా నెట్‌వర్క్‌ను స్నోడెన్ చేధించడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. స్నోడెన్నే కాదు, ఏ డెన్ వచ్చినా చేధించలేని, హ్యాక్ చేయలేని నెట్‌వర్క్‌ను కొన్ని దేశాలు డెవలప్ చేసుకునే పనిలో పడ్డాయి. ఈ విషయంలో చైనా కాస్త ముందుంది. క్వాంటమ్ నెట్‌వర్క్‌లో సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి పంపితే అందులోకి ఎవరూ చొరబడలేరు. ఈ నెట్‌వర్క్‌ను డెవలప్ చేసేందుకు 1980లలోనే ఐబీఎం ప్రయత్నించింది. గడిచిన 30 ఏళ్లుగా దీని మీద రీసెర్చ్ అంతగా ముందుకు పోలేదు. వికీలీక్స్ నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా ప్రభుత్వం క్వాంటమ్ నెట్వర్క్ పరిశోధన కోసం భారీగా నిధులు కేటాయించింది. ఒక నిర్దిష్టమైన మార్గంలో క్వాంటమ్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతారు. ఆ మార్గంలో వెళ్లే సమాచారాన్ని ఎవరైనా హ్యాక్ చేయాలని, దొంగలించాలని ప్రయత్నిస్తే సమాచారం తన రూపాన్ని మార్చుకుంటుంది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ను కాజేసినా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇంత ప్రాధాన్యం ఉన్న క్వాంటమ్ నెట్‌వర్క్‌ను మొదట బీజింగ్, షాంఘై నగరాల మధ్య ఏర్పాటు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. 2016 కల్లా ఈ రెండు నగరాల మధ్య 2 వేల కిలో మీటర్ల మేర నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. క్వాంటమ్ నెట్‌వర్క్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కూడా చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచం వ్యాప్తంగా ఇలాంటి నెట్వర్క్ వేయాలంటే శాటిలైట్ల సహకారం అవసరమని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. మొత్తం మీద ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు సేఫెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌పై దృష్టి సారించాయి. అయితే తాడిని తన్నేవాడున్నప్పుడు దాని తల దన్నే వాడు కూడా ఉంటాడని మన పెద్దలు చెబుతుంటారు. అట్లాగే క్వాంటమ్ నెట్‌వర్క్‌ను కూడా చేధించే హ్యాకర్లు పుట్టుకొచ్చే అవకాశంలేకపోలేదు. ** -
ఐడియా లాభం 57 శాతం అప్
న్యూఢల్లీ: ఐడియా సెల్యులార్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2013-14, క్యూ1)లో రూ.728 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.463 కోట్లతో పోలిస్తే.. లాభం 57 శాతం ఎగబాకింది. ప్రధానంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసుల ఆసరాతో మొబిలిటీ వ్యాపారానికి డిమాండ్ పుంజుకోవడం, నెట్వర్క్ విస్తరణ, విభిన్న స్పెక్ట్రం పోర్ట్‌ఫోలియో, తమకున్న బ్రాండ్ ఇమేజ్లే లాభాల జోరుకు దోహదం చేశాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం క్యూ1లో 16 శాతం వృద్ధితో రూ.7,485 కోట్లకు పెరిగింది. గతేడాఇ ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.6,471 కోట్లు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 1 శాతం మేర లాభంతో రూ.139.75 వద్ద స్థిరపడింది. -
ఇక పూర్తి స్థాయి నంబర్ పోర్టబిలిటీ
* పంచాయతీల్లో బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ సవరణ ప్రతిపాదనకు ఓకే * నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో టెలికం సేవల విస్తృతిపై దృష్టి * టెలికం కమిషన్ నిర్ణయాలు న్యూఢిల్లీ: దేశంలో ఏ ప్రాంతానికి వె ళ్లినా, ఆపరేటరును మార్చినా మొబైల్ నంబరును మార్చుకోవాల్సిన పని లేకుండా పూర్తి స్థాయి మొబైల్ నంబరు పోర్టబిలిటీకి (ఎంఎన్‌పీ) టెలికం కమిషన్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంఎన్‌పీ విధానం ప్రకారం ఆపరేటరు మారినా ఒకే నంబరును కొనసాగించుకునే వెసులుబాటు ఒక సర్కిల్‌కి మాత్రమే పరిమితమైంది. టెలికం కమిషన్ నిర్ణయంతో.. సర్కిల్ మారినా కూడా దేశవ్యాప్తంగా ఈ వెసులుబాటు లభిస్తుంది. పూర్తి స్థాయి ఎంఎన్‌పీ అమలు విషయంలో బ్యాంకు గ్యారంటీలు తదితర అంశాల గురించి ట్రాయ్ నుంచి మరింత అదనపు సమాచారాన్ని టెలికం కమిషన్ కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శుక్రవారం సమావేశమైన అంతర -మంత్రిత్వ శాఖల టెలికం కమిషన్.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రతిపాదనలను ఆమోదించింది. 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లో జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ (ఎన్‌వోఎఫ్‌ఎన్) ప్రాజెక్టు గడువును 2017 మార్చి దాకా పొడిగిస్తూ సవరించిన ప్రతిపాదనకు ఓకే చెప్పింది. దాదాపు రూ. 20,000 కోట్ల ఈ ప్రాజెక్టు 2015 సెప్టెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, పవర్‌గ్రిడ్, రెయిల్‌టెల్‌తో ఏర్పాటు చేసిన భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ ఇందులో సింహభాగం పనులు చేపడుతోంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో మొబైల్ టవర్లు.. తొమ్మిది నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో టెలిఫోన్ సేవలు విస్తరించేందుకు మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలన్న యోచనకు టెలికం కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో టెలికం నెట్‌వర్క్‌ను పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ. 2,900 కోట్ల వ్యయం కాగలదని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ అంచనా వేసింది. ఈ ప్రతిపాదనలను క్యాబినెట్ తుది ఆమోదానికి పంపనున్నారు. ఎన్‌వోఎఫ్‌ఎన్ ఇన్ఫ్రాను వినియోగించుకునే గవర్నమెంట్ యూజర్ నెట్వర్క్ (గన్) అనే వైఫై ప్రాజెక్టుకు కూడా టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసింది. దీనికి రూ. 25,000 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని అంచనా. అటు ప్రభుత్వోద్యోగులకు శిక్షణ కల్పించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఫైనాన్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. దీనిపై క్యాబినెట్ తుదినిర్ణయం తీసుకోనుంది. -
శివారు క‘న్నీరు’
=వారానికొకసారైనా మంచినీరందని దుస్థితి =జలమండలి నిర్లక్ష్యంతో జనం ఇక్కట్లు =పైప్లైన్ల లేమిని సాకుగా చూపుతున్న బోర్డు =సరఫరా నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ తప్పని నీటి ఇబ్బందులు సాక్షి, సిటీబ్యూరో : జలమండలి గ్రేటర్లో విలీనమైన శివారు ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తోంది. మంచినీటి కోసం ఆయా ప్రాంతాలు విలవిల్లాడుతున్నా పట్టించుకున్న జాడే లేదు. ప్రధాన నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న వాటర్ బోర్డు.. శివారు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అనువైన పైప్‌లైన్ నెట్వర్క్, స్టోరేజి రిజర్వాయర్లు లేవన్న సాకును చూపి నెట్టుకొస్తోంది. కానీ సరఫరా నెట్వర్క్ ఉన్న ఎల్బీనగర్, మల్కాజ్గిరి, కాప్రా, ఉప్పల్, అల్వాల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలోని పలు కాలనీలకు వారానికోసారైనా మంచినీరు అందించకపోవడం గమనార్హం. ఫలితంగా రోజువారీగా 340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నామని లెక్కలు చూపుతున్న జలమండలి.. శివారు ప్రాంత అవసరాలను విస్మరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి గ్రేటర్‌కు సరఫరా చేస్తున్న 340 మిలియన్ గ్యాలన్ల నీటిలో 40 శాతం మేర నీరు వృథా కావడంతో వాస్తవ సరఫరా 180 మిలియన్ గ్యాలన్లకు మించడం లేదు. దీంతో పలు శివారు కాలనీల గొంతు తడవడం లేదు. తాగునీటి వృథాను అరికట్టి శివార్ల దాహార్తిని తీర్చాలని నిపుణులు స్పష్టం చేస్తున్నా జలమండలి చెవికెక్కడం లేదు. ప్రతిపాదనలకే పరిమితం ఉపాధి అవకాశాలు, నివాస వసతులు పెరగడంతో గ్రేటర్ శివార్లు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీంతోపాటు జనాభా కూడా అనూహ్యంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కోర్‌సిటీ (ప్రధాన నగరం)లో 37 లక్షల జనాభా ఉంటే.. శివారు ప్రాంతాల్లో 40 లక్షల మేర జనాభా కేంద్రీకతమైంది. అదిప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మంచినీటికి డిమాండ్ బాగా పెరిగింది. శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 31 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక్కడి అవసరాలకు ఇదికాక మరో 105 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమన్నది బోర్డు అధికారుల అంచనా. ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నెట్వర్క్ విస్తరణ, రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.2,400 కోట్లు అవసరమని ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పైసలు విదల్చకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. సరఫరా నెట్వర్క్ ఉన్నా అదే దుస్థితి ఎల్బీనగర్, మల్కాజ్గిరి, కాప్రా, ఉప్పల్, అల్వాల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి తదిత ర శివారు ప్రాంతాల్లో పైప్‌లైన్ నెట్వర్క్, స్టోరేజి రిజర్వాయర్లున్నాయి. అయినా ఈ ప్రాంతాలకు నీటి సరఫరాలో చేయడంనూ జలమండలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సుమారు 870 కాలనీల్లో మంచినీటి ఇక్కట్లు తీవ్రంగా ఉన్నట్లు జలమండలి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయమై ఆయా ప్రాంతాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
శేషాచలం అడవుల్లో తమిళ తంబీలు
సాక్షి, తిరుపతి: ఒకప్పుడు దట్టమైన సత్యమంగళం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్, అతని ముఠా రోజుల తరబడి అడవుల్లోనే తిష్టవేసి గంధపు చెక్కలు నరికి స్మగ్లింగ్ చేసేవారు. ఇప్పుడు అదే సీన్ తిరుపతి శేషాచల అడవుల్లో తర చూ కనబడుతోంది. అటవీశాఖ, పోలీసులు, సంయుక్త టా స్క్‌ఫోర్స్ బృందాలు దాడులు చేస్తున్నా ఎర్రచందనం దొంగ లు అడవుల్లోకి యథేచ్ఛగా వెళున్నారు. రోజుల తరబడి అక్క డే ఉంటున్నారు. సరుకులు తీసుకెళ్లి అక్కడే వంట చేసుకుని తిని ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నారు. ఇటీవల అటవీ శాఖ, పోలీసులు నిర్వహించిన కూంబింగ్‌లో ఈ విషయాలు వెలుగు చూశాయి. సిబ్బంది కొరత కారణంగా అటవీ శాఖ అధికారులు వారిని ఏమీ చేయలేకపోతున్నారు. అటవీ శాఖ ఫ్లైయింగ్ స్క్వాడ్లు, స్ట్రయికింగ్ ఫోర్స్‌లు దాడులకు వెళ్లినా ఆ సమాచారం ముందుగానే స్థానిక నెట్వర్కు ద్వారా స్మగ్లర్లకు తెలిసిపోతోంది. స్థానికుల సహకారంతో తమిళ కూలీలు, స్మగ్లర్ల క్యాంపులు కొనసాగుతూనే ఉన్నాయి. వీరప్పన్‌ను తలపిస్తున్న తమిళ తంబీలు శేషాచలం కొండల్లోని 2వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎ ర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. చిత్తూరు జిల్లా, అర్బ న్ పోలీసు జిల్లాల పరిధిలో చామల, తిరుపతి, మామండూ రు ఫారెస్టు రేంజ్‌ల్లోనూ, రాజంపేట డివిజన్ శెట్టిపల్లె, బా లయపల్లె ప్రాంతాల్లోనూ ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. అం తర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం టన్ను రూ.20 లక్షల వరకు మొదటి గ్రేడ్ పలుకుతుండడంతో తమిళనాడు, కర్ణాటకకు చెందిన స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో రెచ్చిపోతున్నారు. పాపవినాశనం దాటి లోతైన లోయల్లోనూ, చామల రేంజ్లో తలకోన దాటి ఎత్తు అయిన కొండలపైన వారం, పది రోజులు ఉండే విధంగా వంట సరుకులు, బియ్యం, మంచినీళ్లు తీసుకుని వెళుతున్నారు. అక్కడే తిష్టవేసి రాత్రిపూట యథేచ్ఛగా ఎర్రచందనం చెట్లు నేలకూల్చుతున్నారు. అక్కడి నుంచి కాలిదారిలో అటవీ సమీప గ్రామాలకు తెచ్చి లారీలు, వ్యాన్లలో లోడ్ చేసి తరలిస్తున్నారు. కూంబింగ్‌లతో వెలుగులోకి అటవీ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ వచ్చాక రెండున్నర నెలలుగా దట్టమైన అడవిలోకి డీఎఫ్‌వో శ్రీనివాసులు, టాస్క్‌ఫోర్స్ చీఫ్ ఉదయ్‌కుమార్ నేతృత్వంలో చామల, మామండూరు, తిరుపతి రేం జ్‌ల్లో ఎస్వీ నేషనల్ పార్కు పరిధిలో కూంబింగ్‌లు చేపట్టా రు. అదే సమయంలో పులిబోనుకు పైన ఉన్న అటవీ ప్రాం తంలో ఆర్ముడు రిజర్వు స్పెషల్ పోలీసు పార్టీ నిరంతరాయంగా కూంబింగ్ కొనసాగిస్తోంది. చామల రేంజ్లో కడప జిల్లా సరిహద్దులోని కొండ ప్రాంతాల నుంచి ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణాకు తెస్తుండగా 30 మందిని టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. రెండు రోజుల క్రితం మామండూరు నుంచి లోపల దట్టమైన అటవీ ప్రాంతంలో కలివిలేటి కోన వద్ద మరో 30 మంది ఎర్రచందనం నరుకుతూ కనిపించినా ఏడుగురిని మాత్రమే అటవీ శాఖ అధికారులు పట్టుకోగలిగారు. 23 మంది తప్పించుకున్నారు. సరైన వ్యూహంతో వెళ్లకపోవడం కారణంగానే విఫలమవుతున్నారన్న ఆరోపణలున్నాయి. -
జలం పదిలం..... భవిత భద్రం
సాక్షి, సిటీబ్యూరో: పెరుగుతోన్న జనాభా.. తరుగుతోన్న భూగర్భ జల మట్టాలు.. వెరసి నగరంలో నీటి లభ్యత దారణంగా పడిపోతుంది. గ్రేటర్ పరిధిలో ఏటేటా భూగర్భ జలాలు అధఃపాతాళానికి పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వర్షపు నీటిలో వృథా 70 శాతానికి పైగానే ఉంటుంది. భూగర్భ జలాలను పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామమాత్రమే. మహానగర పరిధిలో 22 లక్షల నివాస సముదాయాలుంటే, అందులో ఇంకుడు గుంతలున్న భవనాలు లక్ష కూడా లేకపోవడం విశేషం. దీంతో చాలా ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతు వరకు బోరుబావులు తవ్వినా చుక్కనీరు లభించట్లేదు. ఈ నేపథ్యంలో వర్షపు నీటి సంరక్షణపై ఇంటింటికీ, నగర వ్యాప్తంగా అమలు చేయాల్సిన పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ‘గ్రేటర్ పరిధిలో వార్షిక సగటు వర్షపాతం 800 మిల్లీ మీటర్లు. ఇందులో కనీసం 400 మి.మీ. వర్షపాతాన్ని భూగర్భంలో నిల్వ చేసుకుంటే అది 270 మిలియన్ గ్యాలన్ల నీటికి సమానం. ఈ మొత్తంలో వర్షపు నీటిని నిల్వ చేస్తే నగరంలో బావురుమంటున్న బోరుబావులు జలకళ సతరించుకోవడం తథ్యం. అంతేకాదు తాగడానికి మినహా ఇతరత్రా అవసరాలకు నిరంతరం సమృద్ధిగా భూగర్భ జలం అందుబాటులో ఉంటుంది. జలమండలి సరఫరా నెట్వర్క్ లేని సుమారు 870 కాలనీల్లో నివసిస్తున్న 30 లక్షల మందికి నిత్యం క‘న్నీటి’ కష్టాలు తప్పుతాయి..’’ అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆ స్థాయి లో వర్షపు నీటిని ఒడిసిపట్టేదెలా అన్నదే మీ సందేహమా..? అయితే నగరవాసుల కోసం.. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ (ఇరిగేషన్) హనుమంతరావు డిజైన్ చేసిన ఈ నూతన నీటి నిల్వప్రక్రియ దీనికి జవాబిస్తోంది. అదెలాగో మీరే చదవండి.. ఆచరించండి.. ఇంకుడు గుంత ఇలా ఉండాలి (వంద చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇల్లయితే..) బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల పొడవు, ఒక మీటరు లోతున గుంత తీయాలి గొయ్యి లోపలి గోడలకు ఆనుకొని గ్రానైట్ రాళ్లను సిమెంటు లేకుండా మధ్య మధ్యలో ఖాళీ స్థలం విడిచి పేర్చుకోవాలి గొయ్యిపై సిమెంటు జాలీని ఏర్పాటు చేయాలి ఇంటిపై పడిన వర్షపునీరు ఇందులోకి చేరేలా చూడాలి ఉపయోగాలివి.. సంప్రదాయ పద్ధతుల్లో తవ్విన ఇంకుడు గుంతల్లో 40 ఎంఎం, 20 ఎంఎం కంకరరాళ్లు,ఇసుక ఉండడం వల్ల వర్షపునీరు ఇంకడం కష్టసాధ్యమవుతుంది. ఈ నూతన పిట్తో ఆ పరిస్థితి ఉండదు బోరుబావి త్వరగా రీచార్జి అవుతుంది. భూగర్భ జలాలు నాలుగైదు మీటర్ల మేర పెరిగే అవకాశాలుంటాయి ఖర్చు రూ.1500కు మించదు. ఇంకుడు కొలనులు (పెర్కొలేషన్ పాండ్స్) ప్రతి 20-25 కిలోమీటర్ల విస్తీర్ణానికి (కాలనీలు, బస్తీల్లో ఇంకుడు కొలను) వీటిని ఏర్పాటు చేయాలి వర్షపు నీరు తరచూ నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేస్తే మేలు సుమారు 25 మీటర్ల పొడవు, ఆరు మీటర్ల లోతున పెద్ద కొలను తవ్వాలి. సమీప ప్రాంతాల నుంచి వర్షపునీరు ఈ గొయ్యిలోకి నేరుగా చేరే ఏర్పాట్లు చేయాలి. కొలను గోడలకు గ్రానైట్ రాళ్లనుసిమెంటు లేకుండానే మధ్యలో ఖాళీస్థలం వదిలి ఒకదానిపై మరొకటి పేర్చుకోవాలి. కొలను నిండిన తరవాత వర్షపునీరు బయటికి వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి కొలను చుట్టూ రక్షణ గోడను, ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలి ఉపయోగాలివీ.. దీని వల్ల వృథాగా పోయే వర్షపునీటిలో 70 శాతం నీటిని నిల్వ చేయవచ్చు భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేలా చూడవచ్చు భూ పై పొరల్లో నిరంతరం జలం లభ్యమయ్యేలా చేసుకోవచ్చు గ్రేటర్ యంత్రాగం కింకర్తవ్యమిదే.. ఫిలడెల్ఫియాలో వర్షపునీటి నిల్వకు అమలు చేస్తున్న విధానాలపై జీహెచ్ఎంసీ, జలమండలి ఉన్నతాధికారులు అధ్యయనం చేయాలి తమ అధ్యయనంపై సాంకేతిక నివేదిక (టెక్నికల్ రిపోర్టు)ను రూపొందించాలి అధ్యయనం చేసిన విధానాలపై నగర పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేయాలి వీటి ఏర్పాటుకు ముందుకొచ్చే వ్యక్తులు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు, నగదు సహాయం అందజేయాలి సత్ఫలితాలు సాధించిన ఉదంతాలివే.. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో పై విధానాలను అమలు చేయడంతో వరదనీటి నిల్వ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లకు తగ్గింది. భూగర్భ జల మట్టాలు గణనీయంగా పెరిగాయి చైనాలోని హెబాయ్ ప్రావిన్స్ నాన్పీ ప్రాజెక్టు కూడా ఈ విధానంతో సత్ఫలితాలు సాధించింది -
బాబు ఫేస్‘బుక్క య్యారు’
సోషల్ మీడియా ఇటీవలి కాలంలో ప్రత్యామ్నాయ మీడియాగా బాగా ఎదిగిపోతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సైట్లను తమ అభిప్రాయాలు వెల్లడించడానికి అన్ని వర్గాల వాళ్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ అయితే, రాజకీయ నాయకుల మీద రక రకాల కామెంట్లకు అతిపెద్ద వేదికగా మారిపోయింది. ఈ కోవలో ఇప్పుడు ఫేస్ బుక్ చేతిలో బుక్కయిపోయిన నాయకుల జాబితాలో చంద్రబాబు నాయుడు, చిరంజీవి చేరారు. తెలంగాణ ఏర్పాటుకు అభ్యంతరంలేదంటూ లేఖ ఇచ్చి.. తీరా రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన చాలా రోజులకు తీరుబడిగా స్పందించి.. సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురై ఆత్మగౌరవ యాత్ర అంటూ బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు సమైక్యవాదుల చేతిలో ఫేస్‘బుక్కయ్యారు’. తమ నిరసన, ఆవేదన, ఆక్రోశాన్ని, అభిప్రాయాలను వెల్లడించేందుకు సమైక్య వాదులు సామాజిక నెట్‌వర్క్‌లను వేదికగా చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర విచ్ఛిన్నానికి కారకులైన వారిని తూర్పారబడుతున్న సమైక్యవాదులు తాజాగా చంద్రబాబుపైన పొలిటికల్ సెటైర్లు సంధిస్తున్నారు. విద్యావంతులు, మేథావులు ఫేస్బుక్లో బాబుపై కామెంట్లు పోస్టు చేయడం, వ్యంగ్య చిత్రలను అప్లోడ్ చేయడం కలకలం రేపుతోంది. ఫేస్బుక్ ఫ్రెండ్స్ వాటిని చూసి లైక్, కామెంట్, షేర్ చేయడంతో నవ్వుల పువ్వులు పూయించడంతోపాటు చంద్రబాబు వైఖరిని అందరికి చాటిచెబుతున్నారు. కొద్ది రోజులుగా రోజువారీ అప్డేట్స్తో పొలిటికల్ సెటైర్ పేరుతో చంద్రబాబుపై పెడుతున్న సెటైర్లు ఆలోచింపజేస్తున్నాయి. ‘సీమాంధ్రలో నిర్మించే రాజధాని బాధ్యతలు బాబూకే అప్పగించాలి. చంద్రబాబు చెప్పిన చోటే రాజధాని నిర్మించాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానిస్తే.. సీమాంధ్రలో రాజధానిని నిర్మించాలంటే కనీసం ఐదారు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పడం.. వాటిని పరిశీలించిన పాఠకుడు మాత్రం ఏమప్పా సిద్ధప్పా.. అబ్బా ఏమి చెబితిరి.. ఏం చెబితిరి.. రాజధానిని కట్టించే వ్యాపారం చేస్తే ఆ కిక్కే.. వేరప్పా’ అంటూ ముక్తాయింపు ఇచ్చినట్టు పెట్టిన సెటైర్ హల్చల్ చేస్తోంది. ‘నా పాలన చూసే శంకర్ ఒకే ఒక్కడు సినిమా తీశాడని చంద్రబాబు అంటే.. అవునులే నీలో కాంగ్రెస్ జీన్స్ చూసి జీన్స్ సినిమా తీశాడేమో’ అని సామాన్యుడు వ్యాఖ్యానిస్తున్నట్లు ఉన్న మరో సెటైర్ ఆకట్టుకుంటోంది. ‘తెలంగాణ, సమైక్యవాదం రెండు సిద్ధాంతాలకు తోడు ఇప్పుడు రాయల్ తెలంగాణ తెరపైకి రావడంతో మూడు కళ్ల సిద్ధాంతం వస్తుందంటూ’ బాబుపై వేసిన ఫేస్బుక్ సెటైర్ అందర్ని ఆలోచింపజేస్తోంది. తెలంగాణ విభజనపై బాబు ఆలస్యంగా నోరువిప్పిడం, తెలంగాణ, సమైక్యాంధ్ర రెండు పడవలపై చంద్రబాబు కాలేయడం, ఏం ఏం చేయాలో తెలియక ఆత్మగౌరవ యాత్రను చేపట్టడం, తెలంగాణకు అను కూలంగా బాబు ఇచ్చిన లేఖ, సానుభూతితో పార్టీలకు ఓటేయొద్దని బాబు ప్రకట నలు ఇవ్వడం తదితర అంశాలపై ఫేస్బుక్లో పెట్టిన పొలిటికల్ సెటైర్లు అక్షరాల తూటాలై పేలుతున్నాయి. ఇక చిరంజీవి విషయానికొస్తే, పైన చింపాంజీ బొమ్మ పెట్టి, కింద చిరంజీవి బొమ్మ పెట్టి, చింపాంజీ అడవిని వదలదు, చిరంజీవి పదవిని వదలడు. అదొక్కటే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్ అంటూ పవన్ కళ్యాణ్ డైలాగులను మార్చి సెటైర్లు పేలుస్తున్నారు.