ఏ సిమ్ కార్డు తీసుకున్నా.. దేశంలోని ఏదో ఒక మూల తప్పకుండా నెట్‌వర్క్ సమస్య అనేది తెలెత్తుతుంది. దీనిని నివారించడానికి టెలికాం కంపెనీలకు 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) కీలక ఆదేశాలను జారీ చేసింది.
టెలికాం సంస్థలు తమ వెబ్‌సైట్‌లలో తప్పకుండా.. జియో స్పేషియల్ కవరేజ్ మ్యాప్‌లను చూపించాలని ట్రాయ్ ఆదేశించింది. అంటే తమ నెట్‌వర్క్ ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉందనేది ఈ మ్యాప్ ద్వారా తెలుస్తుంది. దీన్ని బట్టి యూజర్ ఏ సిమ్ కొనుగోలు చేయాలనేది నిర్ణయించుకుంటాడు. దీని వల్ల యూజర్లు నెట్‌వర్క్ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా పోతుంది.
కొత్త నిబంధనల ప్రకారం.. టెలికాం సంస్థలకు సంబంధించిన 2జీ, 3జీ, 4జీ, 5జీ సర్వీసులు కూడా వెబ్‌సైట్‌లలో వెల్లడించాల్సి ఉంది. దీంతో వినియోగదారుడు ఏ సర్వీస్ ఎంచుకోవాలి.. తాను ఏ సర్వీస్ పరిధిలో ఉన్నాడు, అంతరాయం లేకుండా మొబైల్ ఉపయోగించడానికి ఉత్తమమైన నెట్‌వర్క్ ఏది అనే అన్ని వివరాలను సిమ్ కొనుగోలు చేయడానికి ముందే తెలుసుకోవచ్చు.
ట్రాయ్ ఆదేశించిన ఈ కొత్త మార్గదర్శకాలు యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మెరుగైన నెట్‌వర్క్ కవరేజీని అందించే ప్రొవైడర్‌లను వినియోగదారుడు ముందుగానే ఎంచుకోవచ్చు. నెట్‌వర్క్ సమస్యల వల్ల కస్టమర్ అసంతృప్తిని తగ్గించవచ్చు. టెలికాం కంపెనీలు ఈ మ్యాప్‌లను ప్రచురించే ఫార్మాట్.. ఇన్‌పుట్ వంటి వాటిని సమర్పించడానికి కొంత సమయం తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment