ట్రాయ్‌ చైర్మన్‌గా అనిల్‌ లాహోటీకి బాధ్యతలు | Ex Railway Board Chief Anil Kumar Lahoti Is New TRAI Chairman | Sakshi
Sakshi News home page

ట్రాయ్‌ చైర్మన్‌గా అనిల్‌ లాహోటీకి బాధ్యతలు

Published Wed, Jan 31 2024 11:28 AM | Last Updated on Wed, Jan 31 2024 11:53 AM

Ex railway Board Chairman Anil Kumar Lahoti Is New Trai Chairman - Sakshi

న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ కొత్త చైర్మన్‌గా అనిల్‌ లాహోటీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కాల్‌ సర్వీసుల నాణ్యత పెంచడం, కాల్‌ డ్రాప్‌ల నియంత్రణ, అన్ని సంస్థలకు సమాన స్థాయిలో అవకాశాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. 

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, టెలికం శాఖ కార్యదర్శి నీరజ్‌ మిట్టల్, ఇతర ట్రాయ్‌ అధికారులతో సమావేశమయ్యారు. పీడీ వాఘేలా పదవీ కాలం ముగిసిన తర్వాత గత నాలుగేళ్లుగా ట్రాయ్‌ చైర్మన్‌ పోస్టు ఖాళీగా ఉంది.

 కొత్త చైర్మన్‌గా రైల్వే బోర్డు మాజీ చీఫ్‌ అయిన లాహోటీ పేరును సోమవారం ప్రకటించారు. ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ ఇంజినీర్స్‌ 1984 బ్యాచ్‌కి చెందిన ఆయన రైల్వే బోర్డు చైర్మన్, సీఈవోగా 2023 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement