
అవాంఛిత ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల నుంచి యూజర్లకు ఉపశమనం కలిగేలా టెలికాం సంస్థలకు టెలికాం నియంత్రణాధికార సంస్థ (ట్రాయ్) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఫోన్ కాల్స్, మెసేజ్‌లు యూజర్లకు పంపాలంటే వారి అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం 2 నెలల్లోపు ఓ యూనిఫైడ్ డిజిటల్ వేదికను అభివృద్ధి చేయాలని సూచించింది.
ముందుగా అడ్వైర్టెజ్‌మెంట్ మొబైల్ ఫోన్ కాల్స్ అందుకోవడానికి సబ్‌స్క్రైబర్లు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుంది. సంస్థలు కస్టమర్లను సంప్రదించి వారి అంగీకారం మేరకు వాణిజ్య ప్రకటనలు పంపడం ఆరంభిస్తాయంటూ ఓ ప్రకటనలో ట్రాయ్ వివరించింది.
ప్రస్తుతం సంస్థలు ప్రమోషనల్ కాల్స్,మెసేజెస్ పంపుతున్నామని, అందుకు వినియోగదారుల అనుమతి కోరేలా ఎలాంటి వ్యవస్థ లేదు. అందుకే 2 నెలల్లో యూనిఫైడ్ డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికాం సంస్థలకు స్పష్టం చేసింది. సమ్మతి కోరుతూ పంపే సందేశాలు ‘127’తో మొదలయ్యేలా కామన్ షార్ట్ కోడ్‌ను వినియోగించాలని ఆయా సంస్థలను ట్రాయ్ ఆదేశించింది.
చదవండి👉 సూపర్, మైండ్ బ్లోయింగ్.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న టిమ్ కుక్!
Comments
Please login to add a commentAdd a comment