
ఉచితంగా వస్తుందంటే.. ఎవరు మాత్రం కాదంటారు. అయితే ఫ్రీ వైఫై మాత్రం వద్దనే చెప్పాలంటూ.. ప్రభుత్వం హెచ్చరించింది. ఇంతకీ ప్రభుత్వం ఎందుకిలా అంటోంది?, కారణాలు ఏమిటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
విమానాశ్రయాలు, కాఫీ షాపులు మొదలైన పబ్లిక్ ప్రదేశాల్లో ఫ్రీ వైఫై సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇలాంటివి కనెక్ట్ చేసుకోవడం ఏ మాత్రం భద్రం కాదని ప్రభుత్వం వెల్లడించింది. స్కామర్లు, హ్యాకర్లు అమాయక ప్రజలను ట్రాప్ చేయడానికి ఏర్పాటు చేసిన ఓ ఉచ్చు కూడా కావచ్చని స్పష్టం చేసింది.
ఫ్రీ వైఫై ఉపయోగించుకోవడం వల్ల.. ప్రైవేట్ డేటా, ఆర్థిక సమాచారానికి సంబంధించిన విషయాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇటువంటి మోసాలను అరికట్టడానికి.. డిజిటల్ భద్రతా అవగాహనను మరింత పెంచడానికి CERT-In తన 'జాగ్రూక్త దివాస్' చొరవ కింద, పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ల ద్వారా లావాదేవీలు చేయకుండా పౌరులను హెచ్చరించింది.
ఇదీ చదవండి: రూ.60 లక్షల ఆదాయం.. అన్నీ సమస్యలే: పోస్ట్ వైరల్
సైబర్ నేరగాళ్లు పెరుగుతున్న సమయంలో.. మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఏదైనా తెలియని లైక్స్ మీద లేదా అటాచ్‌మెంట్ల మీద ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. ఏవైనా ఖాతాలకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఫిక్స్ చేసుకోవడం మంచిది. ఎప్పటికపుడు జాగ్రత్తగా ఉండాలని CERT-In పేర్కొంది.