రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంత యువతులు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము యువకులకు ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కల్పన దీనికి ఉదాహరణగా నిలిచారు.
రాజస్థాన్‌లోని ఫతేపూర్ షెఖావతి పరిధిలోని రినౌ గ్రామానికి చెందిన కల్పనా బిర్దా ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువతి. ఆమె తొలుత సీహెచ్‌ఎస్‌ఎల్‌లో క్లర్క్ ఉద్యోగం సంపాదించింది. తరువాత ఆడిటర్‌గా ఉద్యోగం దక్కించుకుంది. ఇప్పుడు సీజీఎస్‌టీలో ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం చేజిక్కించుకుంది.
కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో కల్పన పెద్దది. బనస్థలి విద్యాపీఠ్‌లో చదువు పూర్తి చేసింది. కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. కల్పన తండ్రి మహిపాల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె తల్లి పొలం పనులతో పాటు ఇంటిపనులకు కూడా చేస్తుంది. కల్పన ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికకావడంతో వారి ఇంటిలో ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
కల్పన మీడియాతో మాట్లాడుతూ తాను పోటీపరీక్షల కోసం తొలుత ఢిల్లీలో కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నానని, ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్నానని తెలిపింది. చదువుతో పాటు ఎప్పటికప్పుడు రివిజన్ కూడా చేసుకునేదానినని, ఈ రివిజన్ కారణంగానే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగానని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment