రాజస్థాన్‌ ఫిలిం ఫెస్టివల్‌కి మధురపూడి.. | madhurapudi gramam ane nenu movie selection rajasthan international film festival 2024 | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌ ఫిలిం ఫెస్టివల్‌కి మధురపూడి..

Published Tue, Dec 19 2023 12:50 AM | Last Updated on Tue, Dec 19 2023 12:50 AM

madhurapudi gramam ane nenu movie selection rajasthan international film festival 2024 - Sakshi

‘మధురపూడి గ్రామం అనే నేను’ సినిమా ‘రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌’ 2023కి ఎంపిక అయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ వెల్లడించింది. శివ కంఠమనేని, క్యాథలిన్‌ గౌడ జంటగా మల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి.రాంబాబు యాదవ్‌ సమర్పణలో లైట్‌ హౌస్‌ సినీ మ్యాజిక్‌పై కేఎస్‌ శంకర్‌ రావు, ఆర్‌.వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 13న విడుదలైంది.

ఈ మూవీ 10వ ‘రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌’కి ఎంపిక అయింది. 2024 జనవరిలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ‘‘మా మూవీ భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘ఈ సినిమాపై మొదటి నుండి మా టీమ్‌ చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది’’ అన్నారు మల్లి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement