International Film Festival
-
బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కల్కి 2898 ఏడీ
ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’కి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది అక్టోబరు 2 నుంచి అక్టోబరు 11 వరకు దక్షిణ కొరియాలో 29వ బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బీఐఎఫ్‌ఎఫ్) జరగనుంది. ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న 279 చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’కి చోటు లభించింది. అక్టోబరు 8, 9 తేదీల్లో ఈ చిత్రం ‘బీఐఎఫ్‌ఎఫ్’లో ప్రదర్శితం కానుంది. ఈ విషయాన్ని ‘కల్కి 2898ఏడీ’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ‘ఎక్స్’ మాధ్యమంలో ధ్రువీకరించింది. ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న విడుదలై, సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానుంది. -
ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏలో షబానా సినీ స్వర్ణోత్సవం
బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ కెరీర్లో గోల్డెన్ ఇయర్లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఆసియా (ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ) టొరంటో’ షబానా ఆజ్మీ సినీ స్వర్ణోత్సవాన్ని జరపనుంది. 13వ ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ–టొరంటో వేడుకలు కెనడాలో ఈ ఏడాది అక్టోబరు 10 నుంచి 20 వరకు జరగనున్నాయి. 22 భాషల్లోని 120 చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమవుతాయని అలాగే సినిమా రంగానికి విశేష సేవలు అందించిన సీనియర్ నటి షబానా ఆజ్మీ స్వర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని, ‘ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ–టొరంటో ఫెస్టివల్’ నిర్వాహక అధ్యక్షుడు సన్నీ గిల్ పేర్కొన్నారు. ఇక 1950 సెప్టెంబరు 18న కైఫీ ఆజ్మీ (దివంగత ప్రముఖ గీత రచయిత), దివంగత నటి షౌకత్ కైఫీ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు షబానా ఆజ్మీ. 150పైగా చిత్రాల్లో నటించారామె. షబానా ఆజ్మీ తొలి చిత్రం ‘అంకుర్’ 1974లో విడుదలైంది. దాంతో నటిగా షబానా ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 ఏళ్ల జర్నీని పూర్తి చేసుకున్నట్లయింది. ‘అంకుర్, అర్థ్ (1982), కందార్ (1984), పార్ (1984), గాడ్ మదర్ (1999) వంటి సినిమాలకు గాను షబానా జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకున్నారు.ఇంకా ‘శత్రంజ్ కే ఖిలాడీ – 1977 (ది చెస్ ప్లేయర్స్), మండీ (1983), ఫైర్ (1996), మక్డీ (2002)’ వంటి ఎన్నో హిట్ ఫిల్మ్స్‌లో నటించారామె. అంతేకాదు... అమెరికన్ మిలటరీ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ ‘హాలో’ (2022–2024)లోనూ నటించి, హాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొందారు. సినీ రంగానికి షబానా అందించిన సేవలకుగాను 1998లో పద్మశ్రీ, 2012లో పద్మభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. -
ఇండస్ట్రీలోనే అలాంటి తొలి చిత్రం.. అవార్డ్ కైవసం!
కావ్య కీర్తి కీలక పాత్రలో నటించిన చిత్రం హలో బేబీ. ఈ మూవీ తాజాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రానికి రామ్ గోపాల్ రత్నం దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మించారు. తాజాగా ఈ అవార్డును తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో నిర్మాత ఆదినారాయణకు అందించారు. కాగా.. ఈ సినిమా ఇండస్ట్రీలోనే మొదటి హ్యాకింగ్ చిత్రంగా నిలిచింది. కేవలం సోలో క్యారెక్టర్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాల్లో 200కి పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన మేకర్స్ హిందీలో కూడా రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుని యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్ అందుకుంది. ఇండస్ట్రీలో తొలి హ్యాకింగ్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుందని సెన్సార్ అధికారులు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు సుకుమార్ పమ్మి సంగీతమందించారు. -
రాజస్థాన్ ఫిలిం ఫెస్టివల్‌కి మధురపూడి..
‘మధురపూడి గ్రామం అనే నేను’ సినిమా ‘రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ 2023కి ఎంపిక అయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ వెల్లడించింది. శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా మల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌పై కేఎస్ శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలైంది. ఈ మూవీ 10వ ‘రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’కి ఎంపిక అయింది. 2024 జనవరిలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ‘‘మా మూవీ భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘ఈ సినిమాపై మొదటి నుండి మా టీమ్ చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది’’ అన్నారు మల్లి. -
ఆర్మూర్ హీరోకు అంతర్జాతీయ అవార్డు
ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన అజయ్ వేద్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తాను హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా ‘మట్టి కథ’లో ఉత్తమ నటనకు గాను ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కై వసం చేసుకున్నాడు. ఈమేరకు సదరు సంస్థ మంగళవారం అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఇప్పటి వరకు తమిళంలో మమ్మనీతం అనే సినిమాలో స్టార్ హీరో విజయ్ సేతుపతికి, బలగం సినిమాలో ప్రియదర్శికి మాత్రమే ద క్కింది. వీరి సరసన అజయ్ వేద్ నిలవడంతో మట్టి కథ సినిమాపై అటెన్షన్ బజ్ క్రియేట్ అయింది. సినీరంగంలో ప్రవేశం ఇలా.. ఆర్మూర్‌లోని మానస హైస్కూల్ కరస్పాండెంట్ గణేష్, పద్మ కుమారుడైన అజయ్ వేద్ తన బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి రామానాయుడు స్టూడియోలో డిప్లొమా ఇన్ ఆక్టింగ్ పూర్తి చేసాడు. సినీ పరిశ్రమ లో అతనికి ఉన్న ఆసక్తితో పవన్ కడియాల దర్శకత్వంతో తెరకెక్కిన మట్టి కథ సినిమాలో హీరోగా అ వకాశం దక్కించుకున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రై లర్ ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్ర సాద్ విడుదల చేశారు. పల్లెటూరు అంటే పండు గలు, పబ్బాలకు ఇంటికి వచ్చి వెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో పల్లెటూరి కుర్రోడి ఆశ లు, ఆకాంక్షలు ఎలా ఉంటాయి, మట్టితో అనుబంధం, మట్టిలో మధురానుభూతి ఎలా ఉంటుంది అనే అంశంపై సినిమా నిర్మించారు మొదటి సినిమాలోనే అజయ్ వేద్ అంతర్జాతీయ అవార్డును కై వసం చేసుకోవడంతో తెలుగు సినిమా పరిశ్రమతో పాటు బంధువులు, తల్లిదండ్రులను అభినందిస్తున్నారు. -
‘బలగం’కి మరో రెండు అవార్డులు
ఓ కుటుంబ పెద్ద చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు, అతని సన్నిహితుల భావోద్వేగం, అనుబంధాలతో సాగే ‘బలగం’కి విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు దక్కాయి. తాజాగా ‘స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’లో ‘బలగం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహాయ నటుడుగా కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య పాత్రధారి) అవార్డులను గెలుచుకున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. -
ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న నటి గాయత్రి
తమిళ సినిమా: అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటిగా గాయత్రి అవార్డును గెలుచుకున్నారు. గ్లామర్‌కు దూరంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న నటి గాయత్రి. ఇటీవల కమలహాసన్ కథానాయకుడిగా నటించి నిర్మించిన సూపర్ హిట్ చిత్రం విక్రమ్‌లోనూ నటించారు. తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈమె మలయాళం చిత్ర పరిశ్రమలోను ప్రముఖ నటిగా రాణిస్తున్నారు. కాగా ఇటీవల నటుడు విజయ్ సేతుపతికి జంటగా నటించిన మామనిదన్ ,ఇత్రం గత ఏడాది జూన్‌లో విడుదలై మంచి చిత్రంగా సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. అనంతరం ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందింది. శీనూ రామసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డులను గెలుచుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన చెన్నై అంతర్జాతీయ చతురత్వాల్లో కూడా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకుంది. తాజాగా జైపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మామనిదన్, ఇరైవిన్ విశాల్, గార్గీ, విత్రన్ త్రాలను ప్రదర్శించారు. కాగా మామనిదన్ చిత్రంలో విజయ్ సేతుపతికి భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించిన గాయత్రి ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. దీంతో ఆమెను చిత్ర దర్శకుడు శీను రామసామితో పాటు పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. -
అమితాబ్ వ్యాఖ్యలపై.. బీజేపీ, టీఎంసీ వాగ్యుద్ధం
కోల్‌కతా: భావప్రకటన స్వేచ్ఛపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల మంటలు రేపాయి. గురువారం కోల్‌కతాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నటుడు షారూక్ ఖాన్ సమక్షంలో అమితాబ్ మాట్లాడుతూ పౌర హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై ఇంకా ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఆ వ్యాఖ్యలు మమత నిరంకుశ ధోరణికి అద్దం పట్టేలా ఉన్నాయంటూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ విమర్శించారు. టీఎంసీ ఎంపీ, నటి నస్రత్ జహాన్ వాటిని ఖండించారు. బీజేపీ పాలనతో నిజంపై అన్ని రంగాల్లోనూ నిర్బంధం కొనసాగుతోందని ఆరోపించారు. ఇదీ చదవండి: కేంద్రం మొద్దు నిద్ర: రాహుల్ -
విమర్శను ఆహ్వానించే స్ఫూర్తి లేదా?
గోవా చలన చిత్రోత్సవం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తించబడాలని మనం కోరుకుంటున్నాం. అలా జరగాలంటే ఆ చిత్రోత్సవంలో ప్రద ర్శించే సినిమాలు అత్యున్నత కళాత్మక, సౌందర్యాత్మక నాణ్యతను కలిగి ఉండేలా జాగ్రత్త పడాలి. అయినా ముతకగా, పరిణతి లేకుండా చిత్రించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ను ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు? దాని ప్రతిభ కారణంగానేనా? లేదా అది మన ప్రభుత్వం మొగ్గుచూపే సైద్ధాంతిక దృక్పథాన్ని సమర్థిస్తోందనా? ఇలాంటి సినిమాను జ్యూరీకి చూపిస్తున్నప్పుడు వాళ్లు వేరేరకంగా వ్యవహరించాలని జ్యూరీని బలవంతపెడుతున్నట్టు అని జ్యూరీ అధ్యక్షుడు నదావ్ లపీద్ సరిగ్గానే చెప్పారు. కానీ ఈ ఇజ్రాయిల్ దర్శకుడి నిజాయితీతో కూడిన విమర్శను సహించే నైతిక స్ఫూర్తి మనకు లేకపోయింది. ఇప్పుడు కాస్త సమయం గడిచిపోయింది, అలాగే భావో ద్వేగాలు కూడా కాస్త చల్లబడి ఉంటాయి. అందుకే ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఇజ్రాయిల్ చిత్ర దర్శకుడు నదావ్ లపీద్ చేసిన విమర్శ చుట్టూ రేగిన ఆగ్రహా వేశాలపై నేను స్పందించాలనుకుంటున్నాను. అది కొంత ఇబ్బంది కలిగించే, చె΄్పాలంటే ఆందోళన కలి గించే మన సమాజ ముఖచిత్రాన్ని బయటపెట్టింది. ఇదే బహుశా మనం పిలుచుకునే జాతీయ స్వభావం. మొదటగా ఇలా ప్రారంభిద్దాం. ప్రపంచ ప్రఖ్యాత చిత్ర దర్శకుల్లో ఒకరిని, లొకార్నోలో ప్రత్యేక జ్యూరీ ప్రైజ్, బెర్లిన్‌లో గోల్డెన్ బేర్‌ను గెలుచుకున్న విజేతను మన అంతర్జాతీయ చలన చిత్రోత్సవ జ్యూరీకి అధ్యక్షత వహించడానికి ఆహ్వానించాం. కానీ ఒక భారతీయ సినిమాపై ఆయన చేసిన నిజాయితీతో కూడిన విమర్శను మనం అంగీకరించలేక ΄ోయాం. దానిపై లపీద్ ఇలా అన్నారు: ‘‘చెప్పాలంటే ఒకరకంగా అది నా కర్తవ్యం, నా విధి కూడా. నేను వ్యర్థ సంభాషణ చేయడం కాకుండా నిజాయితీగా ఉండటానికే ఇక్కడికి ఆహ్వానించారు.’’ ఆ దాపరికం లేని నిష్కల్మష ప్రవర్తన మనల్ని నివ్వెరపర్చి ఉండ వచ్చు, పైగా గాయపర్చి ఉండవచ్చు కూడా. కానీ ఆయన చేసిన విమ ర్శను సంతోషంగా ఆహ్వానించే శక్తి, నైతిక స్ఫూర్తి మనకు లేవు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే– లపీద్ చెప్పినదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడాన్నే మనం ఉద్దేశపూర్వకంగా ఎంచు కున్నాం. ఆ సినిమా మార్చి నెలలో విడుదలైనప్పుడు నేను కావాలనే చూడకూడదని భావించాను. కానీ ఈ వివాదం చెలరేగిన తర్వాత ఆ సినిమాను చూడాలనుకున్నాను. ఒక విషాద ఘటన పట్ల ఆలోచనా త్మకంగానూ, సున్నితంగానూ తీయవలసిన దానికి బదులుగా ఆ సినిమా ఒక ముతక చిత్రీకరణగా నాకు కనిపించింది. ఈ చిత్రాన్ని నడిపిన తీరులో సూక్ష్మత, గాఢత లోపించాయి. నటన ఏకపక్షంగా ఉంది. ఈ సినిమాలోని ఏ ఒక్క పాత్రపట్ల కూడా మనకు సహాను భూతి కలగదు. ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ సరిగ్గా ఆ విషయాన్నే వెల్లడించారు. కానీ ఆయన వ్యాఖ్యలను మనం ఉద్దేశ పూర్వకంగానే తప్పుగా వ్యాఖ్యానించుకున్నాం. వాటిని కశ్మీర్ పండిట్లకు జరిగిన ఘటనల పట్ల తిరస్కరణగానూ, చని΄ోయిన వారి స్మృతిని అవమానించడంగానూ అర్థం చేసుకున్నాం. ఒక్క క్షణకాలం పాటు మనం ఆలోచించడం కోసం ఆగినట్లయితే, ఆయన వ్యాఖ్యలను మనం ఎంత తప్పుగా భావిం చామో మనకు తెలిసేది. కానీ మనం అలా చేయలేక ΄ోయాం. ఒక అధమ స్థాయి సినిమాను సమర్థించుకునే మార్గం అదన్నమాట! ఒకసారి లపీద్ విమర్శ మన ఆత్మాభిమానాన్ని గాయపర్చాక, ఆయన విమర్శను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించడానికి పూనుకున్నాం. పైగా అది మన జాతీయవాదంపై దాడిగానూ, ఇంకా చె΄్పాలంటే ఏకంగా మనపైనే చేసిన దాడిగానూ చూడటానికి పూనుకున్నాం. కానీ లపీద్ దీనిపై స్పష్టంగా ఆయన అభిప్రాయం వివరించారు: ‘‘ఒక సినిమాను విమర్శించడం అంటే భారతదేశాన్ని విమర్శించడం కాదు లేదా కశ్మీర్లో జరిగినదాన్ని విమర్శించడం అంతకంటే కాదు’’. నన్ను మరికాస్త ముందుకెళ్లి చెప్పనివ్వండి. గోవా చిత్రోత్సవం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తించబడాలని మనం కోరు కుంటున్నాం. అలా జరగాలంటే ఆ చిత్రోత్సవంలో ప్రదర్శించే సినిమాలు అత్యున్నత కళాత్మక, సౌందర్యాత్మక నాణ్యతను కలిగి ఉండేలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆ చిత్రో త్సవంలో ప్రదర్శించడానికి ‘కశ్మీర్ ఫైల్స్’ను ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు? దాని ప్రతిభ కారణంగానేనా? లేదా అది మన ప్రభుత్వం మొగ్గుచూపే సైద్ధాంతిక దృక్పథాన్ని సమర్థిస్తోందనా? విస్మరణకు గురైన ఒక విషాదం వైపు ప్రపంచానికి కిటికీ తెరవడానికి– ముతకగానూ, పరిణతి లేకుండానూ చిత్రించినది; ఇది మన చిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యుత్తమ సినిమా కాదు అనే వాస్తవాన్ని కూడా విస్మరించారా? నదావ్ లపీద్ దాన్ని ఇలా చూశారు: ‘‘ద కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు చిత్రోత్సవాల్లో ΄ోటీ విభా గంలో భాగం కాకూడదు. డజన్లకొద్దీ చిత్రోత్సవాల్లో నేను జ్యూరీలో భాగమయ్యాను. బెర్లిన్, కాన్, లొకార్నో, వెనిస్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా నేను ΄ాలు పంచుకున్నాను. ఏ చిత్రోత్సవంలోనూ కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాను నేను చూడలేదు. మీరు ఇలాంటి సినిమాను జ్యూరీకి చూపిస్తున్నప్పుడు వేరే రకంగా వ్యవహరించాలని జ్యూరీని బలవంత పెడు తున్నట్టు.’’ ఇదేమీ ఒప్పుకోలేని వాదన కాదు కదా! చివరగా, మీడియా గురించి నన్ను చెప్పనివ్వండి. అది మనకోసం మాట్లాడుతున్నట్లు ప్రకటించు కుంటుంది. తాను ప్రజావాణిని అని మీడియా నమ్ముతుంటుంది. కానీ ఈ సినిమాను సమర్థించడానికి అది చేస్తున్న ప్రయత్నాలు మాత్రం తెలివిలేనివి, పైగా అసమర్థమైనవి కూడా! ఈ సినిమా గురించి తనకు కలిగిన అభిప్రాయాలనే జ్యూరీ సభ్యులు కూడా పంచుకున్నారని లపీద్ చెప్పినప్పుడు దాన్ని నిరూపించాలని టెలివిజన్ యాంకర్లు సవాలు చేశారు. ఓ రకంగా ఇది ఆయన అబద్ధ మాడుతున్నాడని సూచించే వెర్రి ప్రయత్నం మాత్రమే అవుతుంది. పైగా, లపీద్కు తమ మద్దతును బహిరంగంగా నిర్ధారించేలా అది ఇతర జ్యూరీ సభ్యులను రెచ్చగొట్టింది. మరోవైపున, ఒక వార్తాపత్రిక ఏకంగా అబద్ధమాడింది. లపీద్ తన మనస్సు మార్చుకున్నారనీ, ఆ సినిమా మేధోవంతంగా ఉందనీ చె΄్పారని ఆ పత్రిక నివేదించింది. నిజానికి ఆయన తన మనస్సు మార్చుకోలేదు. ఆయన అలా చేస్తాడ నుకోవడం కూడా బుద్ధిహీనతే అనాలి. సాధారణమైన ఆలోచనతో దీన్ని ముగిస్తాను. ఫిల్మోత్సవ్ అవార్డు కార్యక్రమంలో ఒక నిర్దిష్ట సినిమాను విమర్శించే హక్కు లపీద్కు›ఉందా లేదా అనేది న్యాయమైన ప్రశ్న. ఇది చాలా చిన్న విషయం కూడా. దీనికంటే మన ప్రవర్తనే మరింత పెద్ద సమస్యగా ఉంటోంది. చిత్రోత్సవం కోసం మనం ఎంపిక చేసుకున్న సినిమా, దానికి లభించిన విమర్శకు మనం స్పందించిన తీరు మనల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. కాబట్టి ఇది ఒక విషాదకరమైన, బాధాకరమైన గాథ! కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చిత్రమా? ప్రచార విచిత్రమా?
ఉరుము లేని పిడుగు! గోవాలో 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) ముగింపు వేడుకల వేదికపై అవార్డ్ జ్యూరీ ఛైర్మన్ – ఇజ్రాయిలీ దర్శకుడు నదవ్ లపిద్ అందరి ముందూ చేసిన వ్యాఖ్య అలాంటిదే! ఇఫీలోని అంతర్జాతీయ పోటీ విభాగంలో ఇతర దేశాల చిత్రాలతో పాటు భారత్ నుంచి ఒక ఎంట్రీ అయిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చూసిన ఆయన దాన్ని ‘అసభ్య ప్రచార చిత్రం. ఈ ఉత్సవంలో ప్రదర్శనకు తగదు’ అన్నారు. ఈ హఠాత్ వ్యాఖ్యలు ఒక వర్గాన్ని హతాశులను చేస్తే, మరో వర్గంలో హర్షం నింపాయి. అతిథిగా పిలిచి, అవార్డుల జ్యూరీ పెత్తనమిస్తే ఇంత మాట అంటారా? కశ్మీర్‌లోని మైనారిటీ హిందువుల బాధల్ని తొలిసారి ఇంతగా తెరపై చూపిస్తే, సినిమా బాలేదనడమేమిటి? ఆస్కార్లు వచ్చిన స్పీల్బర్గ్ ‘షిండ్లర్స్ లిస్ట్’ మాటేమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు చర్చ రేపుతున్నాయి. 1990ల నుంచి ఇప్పటికీ ఆగని కశ్మీరీ పండిట్ల విషాదగాథ కట్టెదుటి నిజం. ఎవరూ కాదనలేని సత్యం. అయితే, ఆ సత్యాన్ని ఏ రకంగా తెరపై చూపారన్నదే వివాదం. ఈ ఏడాది మార్చిలో రిలీజైన ఈ 170 నిమిషాల చిత్రం వాణిజ్య విజయం అందుకుంది. అంతే వివాదాస్పదమూ అయింది. 1990ల కాలఘట్టాన్ని మనసును కదిలించేలా తెరపై చూపారనే ప్రశంసతో పాటు పలు వాస్తవాలను తమకు అనుకూలమైన మేరకే చూపి, మతోద్వేగాన్ని రెచ్చగొట్టారనే విమర్శలూ వెల్లువెత్తాయి. మోదీ, అమిత్ షా తదితర పాలకవర్గ అగ్రనేతలు స్వయంగా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలు, నేతాగణం వినోదపు పన్ను మినహాయింపు నుంచి ఉచితంగా టికెట్ల పంపిణీ దాకా ఈ చిత్రాన్ని పూర్తిగా భుజానికెత్తుకున్నాయి. అలా సహజంగానే ఈ సినిమాకు రాజకీయ రంగు, విభజన – విద్వేషవాదమనే పొంగు వచ్చాయి. ‘సెకనుకు 24 ఫ్రేముల చొప్పున చెప్పే సత్యం సినిమా’ అన్నారు దర్శక దిగ్గజం గొడార్డ్. కానీ, ఇవాళ విప్లవ వీరుడు అల్లూరి సైతం బ్రిటీషు వారి దగ్గర పనిచేసినట్టు సినిమాటిక్ కల్పనతో ఆస్కార్ గురిగా మన చిత్రాలు బరిలోకి దిగుతున్నప్పుడు సినిమా ఎంత సత్యమనే సందేహం కలుగుతుంది. స్వప్నలోక విహారంగా మారిన నేటి సినిమాలో సైతం కళ్ళెదుటి జీవితానికి కల్పన చేర్చి కదిలించేలా చెబితే చాలు. విలువలెలా ఉన్నా వసూళ్ళవర్షం కురుస్తుంది. అది బాక్సాఫీస్ నిరూపిత సత్యం. వ్యాపారంలో అది ఓకేనేమో కానీ, కళాత్మక విలువలెన్నో చూసి కిరీటం పెట్టాల్సిన అవార్డ్స్‌కు అది పనికొస్తుందా? ఇఫీలో అంతర్జాతీయ చిత్రాలతో పోటీకి మనోళ్ళు దింపిన ‘కశ్మీర్ ఫైల్స్’తో సమస్య ఇదే. కశ్మీర్‌పై కన్నీరుపెట్టేవారూ కథనంలో నిజాయతీపై భిన్నాభిప్రాయంతో ఉంటే తప్పు పట్టలేం. కరోనా తర్వాత రూ. 330 కోట్లు సంపాదించి, ఈ ఏటి మేటి బాలీవుడ్ హిట్‌గా నిలిచిన ‘కశ్మీర్ ఫైల్స్’ ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది. లాల్‌బహదూర్ మరణం మిస్టరీపై ‘తాష్కెంట్ ఫైల్స్’ తీసి, పెద్దగా ఆకర్షించలేని దర్శక– రచయిత వివేక్ అగ్నిహోత్రి దీనికి మాత్రం సీక్వెల్ తీస్తానని ప్రకటించారు. ‘కశ్మీర్ ఫైల్స్’ ప్రేరణగా అదే తరహాలో అనేకులు రకరకాల ‘ఫైల్స్’తో వెండితెర వ్యాపారం మొదలెట్టారు. ఈ పరిస్థితుల్లో ‘ఇఫీ’ జ్యూరీ ఛైర్మన్∙వ్యాఖ్య దౌత్యపరంగానూ కలకలం రేపింది. ఇజ్రాయిల్ రాయబారి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తోటి ఇజ్రాయిలీ వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు. భారత ఆతిథ్యాన్ని దుర్వినియోగం చేసినందుకు క్షమాపణ కోరాలంటూ బహిరంగ లేఖ రాశారు. ‘భారత్‌కు వచ్చి వెళ్ళిపోతున్న నీకేం! ఇక్కడే ఉండాల్సినవాళ్ళ పరిస్థితి ఏమి’టంటూ మందలిస్తూనే, మనసులోని భయం బయటపెట్టారు. నిజానికి, నదవ్కు ఇలాంటివి కొత్తేమీకాదు. కాన్, బెర్లిన్ లాంటి ప్రఖ్యాత చిత్రోత్సవాల్లో జ్యూరీ సభ్యుడిగా అనుభవం, ఘాటుగా మాట్లాడతాడనే ముద్ర ఆయనకున్నాయి. ఆ నిష్కర్ష వైఖరి వల్లే ఇఫీకి పిలిచి, జ్యూరీ బాధ్యతలిచ్చారనుకోవచ్చు. అయితే, ప్రపంచంలో అత్యధిక సినిమాలు తీసే దేశంలో, ప్రభుత్వం వారి ప్రతిష్ఠాత్మక చలనచిత్రోత్సవంలో, పాలకపక్ష అండదండలున్న కళాకృషిని విమర్శించడం జీర్ణించుకోవడం కష్టమే. అలాగే, గెల్చిన చిత్రాలను ప్రస్తావించే వేదికపై అవార్డ్ రాని ఎంట్రీపై వ్యాఖ్యలు చేయడమూ విచిత్రమే. అంత మాత్రానికే సినిమాను విమర్శించిన వారందరినీ అర్బన్ నక్సల్స్, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న తుకడే గ్యాంగ్ అనేయచ్చా? నదవ్ పండిట్లకు మద్దతునిస్తూనే, ‘హింసాద్వేషాల్ని ప్రేరేపించేలా మసిపూసి మారేడుకాయలా ఆ చిత్రం తీశారు. ఫాసిస్ట్ కోణం ఉంద’ని వివరణనిచ్చారు. ఇది తనొక్కరి అభిప్రాయం కాదనీ, బయట పెదవి విప్పకున్నా సినిమా చూడగానే జ్యూరీ మొత్తం ఇదే అభిప్రాయపడిందనీ తేల్చారు. సిన్మా సహా ఏ కళాకృషీ విమర్శకు అతీతం కాదు. ఆత్మాశ్రయమే అయినా అవార్డ్ నిర్ణేతల పని అదే! విధాన నిర్ణయాలతో బాధితులకు సాంత్వన చేకూర్చాల్సినవారు అది గాలి కొదిలి, ప్రచార కళతో వెండితెర వెనక దాగుందామనుకుంటేనే దారుణం. గత ఎనిమిదేళ్ళలో పాలకులు ఎందరు పండిట్లకు కశ్మీర్లో పునరావాసం కల్పించగలిగారు? మిగిలిన కొద్ది కుటుంబాలు నేటికీ తూటాలకు బలవుతుంటే ఏ మేరకు రక్షణ కల్పించారు? వీటిని వదిలేసి, నిర్దిష్ట రాజకీయ లక్ష్యాలతో తీసిన వ్యాపారాత్మక చిత్రం బాగోగులపై ఎవరో, ఏదో అన్నారని విరుచుకుపడితే ఉపయోగమేంటి? బాధిత కశ్మీరీలకు కావాల్సింది పెదాల మీది ప్రేమ కాదు... పాలకుల చేతల్లో చేవ. సినిమాలు అందుకు ప్రేరేపిస్తే మంచిదే. వెనకుండి నడిపే రాజకీయుల కోసం విద్వేషాలకు ఆజ్యం పోసి, విభజన పెంచితేనే కష్టం. తాజా ఘటనతో ‘ఇఫీ’ జ్యూరీలను సజాతీయులతో నింపేస్తే మరీ నష్టం! -
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం.. కేంద్రమంత్రి ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. ఆయనను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపుతో గౌరవించింది. 2022 సంవత్సరానికిగాను భారతీయ సినీ పరిశ్రమ గర్వించదిగిన వ్యక్తిగా చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డును మెగాస్టార్ అందుకోనున్నారు. ఇప్పటికే గోవాలో చలన చిత్రోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభం కాగా... ఈ నెల 28 వరకు జరగనున్నాయి. ఈ అవార్డుకు చిరంజీవి ఎంపిక కావడం పట్ల కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో నటుడిగా రాణిస్తోన్న చిరంజీవి... 150 సినిమాలు పూర్తి చేసి తన అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి అని చిరంజీవిని కొనియాడారు. ఈ వేడుకల్లో 79 దేశాలకు చెందిన 280 చిత్రాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1978లో సినీ రంగంలో అడుగుపెట్టిన చిరంజీవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారకమైన పద్మభూషణ్ 2006లో చిరంజీవిని వరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. చిరంజీవి 2012 నుంచి2014 వరకు కేంద్ర పర్యాటక మంత్రిగా సేవలందించారు. Indian Film Personality of the Year 2022 award goes to 𝐌𝐞𝐠𝐚𝐬𝐭𝐚𝐫 𝐂𝐡𝐢𝐫𝐚𝐧𝐣𝐞𝐞𝐯𝐢 With an illustrious career spanning almost four decades, he has been a part of more than 150 feature films 📽️https://t.co/1lSx81bGMw#IFFI #AnythingForFilms #IFFI53 @KChiruTweets pic.twitter.com/AY6UzMhfix — PIB India (@PIB_India) November 20, 2022 -
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, మెయిన్ స్ట్రీమ్‌లో ఆర్ఆర్ఆర్, అఖండ చిత్రాలు
ఈ ఏడాది జరిగే గోవాలో 53వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు నవంబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఆసియాలో జరిగే అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్స్‌లో ఇండియా ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఒకటి. తాజాగా ఈ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించే తేదీలు, ప్రదర్శించే సినిమా వివరాలను ఇండయన్ పనోరమా ప్రకటించింది. ఈ చిత్రోత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. 25 ఫిచర్స్ ఫిలింస్, 20 నాన్ ఫిచర్స్ ఫలింస్ను ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. అందులో తెలుగులో సంచలన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్, ఆఖండ చిత్రాలకు గుర్తంపు లభించింది. మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్లో ప్రదర్శించే ఐదు సినిమాల్లో రెండు తెలుగు సినిమాలకు చోటు దక్కడం విశేషం. ఆర్ఆర్ఆర్, ఆఖండలతో పాటు బాలీవుడ్ మూవీ కాశ్మీర్ ఫైల్స్, టోనిక్(బెంగాలి చిత్రం) ధర్మం వీర్ ముక్కడ్ పోస్ట్ థానే (మరాఠీ) సినిమాలను ఈ మెయిన్ స్ట్రీమ్ చిత్రాల్లో ప్రదర్శించనున్నారు. కాగా కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన జరగనున్న ఈ చిత్రోత్సవాలకు ఉపాధ్యాక్షుడిగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ వ్యవహరించనున్నారు. -
Barefoot Empress: పోరాడే వాళ్లకో ప్రేమలేఖ
‘ఏదైనా సాధించాలనుకుని పోరాడే వాళ్లకు ఈ డాక్యుమెంటరీ ఒక ప్రేమలేఖ’ అంటాడు అంతర్జాతీయ చెఫ్ వికాస్ ఖన్నా. 94 ఏళ్ల వయసులో పట్టుబట్టి కేరళ సాక్షరతా మిషన్‌లో నాలుగో క్లాసు పాసైన కార్తాయని అమ్మ మీద అతడు ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్’ పేరుతో డాక్యుమెంటరీ నిర్మించాడు. ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్న ఆ డాక్యుమెంటరీ త్వరలో భారతప్రేక్షకుల కోసం రిలీజ్ కానుంది. ఈ డాక్యుమెంటరీ ఆడపిల్లలందరినీ చదివించక తప్పని స్ఫూర్తినిస్తుంది అంటున్నాడు వికాస్. అంతర్జాతీయ వంటగాడిగా ఖ్యాతి పొందిన వికాస్ ఖన్నాకు నానమ్మ వయసు ఉన్న వారు ఇచ్చే స్ఫూర్తి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఎందుకంటే అతడు జన్మతః కాళ్లలో ఇబ్బందితో పుట్టాడు. అంటే 13 ఏళ్ల వరకు పరిగెత్తడం అతనికి సాధ్యం కాలేదు. దాంతో ఆడుకోవడానికి వెళ్లేవాడు కాదు. అందువల్ల అతడి నానమ్మ అతణ్ణి తన వంటగదిలో కూచోబెట్టుకుని వంటలు చేస్తూ మంచి మంచి కబుర్లు చెప్పేది. ఆమె వల్ల అతను స్ఫూర్తి పొందాడు. అంతే కాదు గొప్ప వంటవాడు అయ్యాడు. ఇప్పుడు బహుశా కేరళ కార్తాయని అమ్మను చూసినప్పుడు అతనికి తన నానమ్మ గుర్తుకు వచ్చి ఉంటుంది. కార్తాయని అమ్మ 96 ఏళ్ల వయసులో చదువుకోవాలని సంకల్పించింది. పల్లెల్లో వయోజనులు చదువుకోవడం గురించి ఆలోచనే ఉండదు. ఇక 90 దాటిన వారిని ‘ఇంకా పిలుపు రాలేదా’ అన్నట్టు చూస్తూ ఉంటారు కొందరు. అలాంటిది కేరళలోని అలెప్పి జిల్లా ‘చెప్పడ్’ అనే చిన్న ఊళ్లోని కార్తాయని అమ్మ అందరి అంచనాలు తారుమారు చేసింది. కేరళ ప్రభుత్వం వయోజనుల కోసం ఏర్పాటు చేసిన అక్షరాస్యతా కార్యక్రమం కింద ఇంట్లో ఉండి చదువుకుని నాలుగో తరగతిని వందకు 98 మార్కులతో పాసయ్యింది. 15 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్నవారికి కనీస చదువు నేర్పాలనుకున్న ఈ కార్యక్రమంలో కార్తాయని అమ్మ ఉత్సాహంగా దూకింది. చదవడం (30 మార్కులకు పరీక్ష), రాయడం (40 మార్కులకు), లెక్కలు (30 మార్కులకు) ఈ మూడు అంశాల్లో ఉమ్మడిగా 100కు 30 మార్కులు వస్తే పాస్ చేస్తారు. కాని కార్తాయని అమ్మకు 98 మార్కులు వచ్చాయి. దాంతో ఆమెకు రాష్ట్రం మొత్తం సలామ్ చేసింది. ప్రతిష్ఠా్టత్మక కేంద్ర స్త్రీ శక్తి అవార్డు వరించింది. ‘ఏదైనా పట్టుబట్టి సాధించాలనుకునేవారికి ఆమెను మించిన స్ఫూర్తి లేదు’ అంటాకు వికాస్ ఖన్నా. ఇంతకు ముందు వికాస్ ఖన్నా ‘ది లాస్ట్ కలర్’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ డాక్యుమెంటరీ అతడి రెండో ప్రయత్నం. ఉత్త కాళ్లతో ఆమె ఒక యోధురాలిగా పరీక్ష రాయడానికి స్థానిక స్కూలుకు వెళుతున్న ఫొటో ఎవరినైనా కట్టి పడేస్తుంది. ఆ పరీక్షలో పాసయ్యి గెలిచి ఆమె పట్టుదలకు సామ్రాజ్ఞి అయ్యింది. అందుకే వికాస్ ఖన్నా ఈ డాక్యుమెంటరీకి ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్’ (ఉత్తకాళ్ల సామ్రాజ్ఞి) అని పెట్టాడు. నూరేళ్ల ఆయుష్షుకు చేరినా కార్తాయని అమ్మ ఇంకా చదువుకోవాలనే అభిలషిస్తోంది. ‘మరి అలాంటిది మన దేశంలో చిన్నారి ఆడపిల్లలు ఎంతమంది చదువుకోవాలని కోరుకుంటారో కదా. వారందరూ చదువుకోవాల్సిన అవసరాన్ని ఈ డాక్యుమెంటరీ చెప్తుంది’ అంటాడు వికాస్. ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో పాల్గొన్న ఈ డాక్యుమెంటరీ త్వరలో మన దేశంలో బహుశా ఓటీటీ ద్వారా విడుదల కానుంది. -
ఖుష్బూ సుందర్‌కు కీలక బాధ్యతలు
అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో నటి, బీజేపీ సభ్యురాలు ఖుష్బూ సందర్ కీలక బాధ్యతలు నిర్వహించానున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో గోవాలో 53వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు జరగనున్నాయి. కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన జరగనున్న ఈ చిత్రోత్సవాలకు ఉపాధ్యాక్షుడిగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ వ్యవహరించనున్నారు. చదవండి: కృష్ణ వంశీ భారీ ప్లాన్.. రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్! ఇందుకు గానూ ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మార్గదర్శక కమిటీ సభ్యురాలిగా నటి ఖుష్బూ బాధ్యతలను నిర్వహించానున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఆమెతో పాటు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, విపుల్ అమృత్‌వాల్ షాకు కమిటీలో చోటు కల్పించారు. -
పోరాట స్ఫూర్తి
‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ’ మొదలైంది. చిత్రాభిమానుల విశిష్ట పండగ లో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. మొదటి విశేషం... చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యే సగం చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ మహిళా దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమైన బంగ్లాదేశ్ చిత్రం ‘రెహన మరియమ్ నూర్’ మహిళల సమస్యను ప్రతిబింబిస్తుంది. 37 సంవత్సరాల రెహన మెడికల్ కాలేజి ప్రొఫెసర్. ఒక బిడ్డకు తల్లిగా, అమ్మకు కూతురిగా, సోదరుడికి అక్కగా ఆమె వ్యక్తిగత జీవితానికి, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌గా వృత్తి జీవితానికి మధ్య సమన్వయం, వాటి మధ్య తలెత్తే వైరుధ్యాలు, వాటి పరిష్కారం కోసం చేసే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపిస్తుంది.రెండో విశేషం... ఈ చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన కుర్దిష్ ఫిల్మ్‌మేకర్ లిసా కలన్ను ‘స్పిరిట్ ఆఫ్ సినిమా’ పురస్కారంతో సత్కరిస్తారు. కొన్ని నిజజీవిత కథలు, కల్పన కంటే ఆశ్చర్యపరుస్తాయి. ‘లిసా కలన్’ది అచ్చంగా అలాంటి కథ... ఐసిస్ ఉగ్రవాదుల బాంబుదాడిలో రెండు కాళ్లు పోగొట్టుకుంది లిసా. అయితే ఆమె పోగొట్టుకుంది కాళ్లు మాత్రమే. ఆమెలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, దూసుకుపోయే తత్వం ఎక్కడికీ పోలేదు. ‘హిడెన్’ అనే సినిమాకు ఆర్ట్‌డైరెక్టర్‌గా వ్యవహరించడంతో పాటు నటించింది. ‘వాయిస్ ఆఫ్ ది స్ట్రీట్’ సినిమాకు సౌండ్ అండ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించింది. ఎన్నిరకాల సృజనాత్మక బాధ్యతలను చేపట్టినా ఆమె నమ్మిన సూత్రం ... బాధితుల గొంతును ప్రపంచానికి వినిపించాలని. ఇందుకు చిత్రాలను బలమైన ఆయుధంగా ఎంచుకుంది. టర్కీలోని కుర్ద్‌ల కుటుంబంలో పుట్టిన లిసా, బాల్యంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంది. రాజ్యహింసను దగ్గర నుంచి చూసింది. హైస్కూల్ చదువుతోనే ఆమె చదువు ఆగిపోయింది. దీనికి కారణం...పై చదువులు తన మాతృభాషలో కాకుండా ‘టర్కిష్’లో మాత్రమే చదువుకునే పరిస్థితి ఉండడం. చదువుకు దూరమైనప్పటికీ ‘అరమ్ టైగ్రన్ సిటీ కన్జర్వేటరీ’లో సినిమా పాఠాలు చదువుకుంది. విస్తృతమైన ప్రపంచాన్ని చూసింది. సినిమా కోర్స్ తన మాతృభాష లోనే ఉండడం ఆమెకు బాగా నచ్చిన విషయం. ఈ చిత్రకళల ఆలయంలో తాను గడిపిన రెండు సంవత్సరాల కాలం విలువైనది. విలువల గురించి తెలుకునేలా చేసింది. ఆ తరువాత... ఊరు, వాడ, పల్లె, పట్లణం అనే తేడా లేకుండా కుర్దుల జీవితాన్ని చూడడానికి తిరిగింది. ముఖ్యంగా కుర్దీష్ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు లిసాను కదిలించాయి. వారి ఆత్మగౌరవ పోరాటం ఆకట్టుకుంది. తాను చూసిన దృశ్యాలను పొలిటికల్ డాక్యుమెంటరీల రూపంలో ప్రపంచానికి చూపింది. మృత్యువు ఎదురొచ్చిన రోజు... జూన్, 2015లో దియర్బకిర్ నగరంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో పాల్గొంది లిసా. పార్టీని లక్ష్యంగా చేసుకొని ‘ఐసిస్’ ఉగ్రవాదులు చేసిన బాంబుదాడిలో మృత్యువు అంచుల వరకు వెళ్లింది లిసా. రెండు కాళ్లు పోగొట్టుకుంది. ‘లిసా బతకడం అరుదైనఅదృష్టం’ అన్నారు. మంచమే ఆమె ప్రపంచం అయింది. తాను అమితంగా ప్రేమించిన చిత్రప్రపంచం దూరమైపోయింది. ‘ఇంటిపట్టునే ఉండు తల్లీ ఎందుకొచ్చిన కష్టాలు!’ అన్నవాళ్లతోపాటు– ‘రెండు కాళ్లే పోయినప్పుడు, ఇంట్లో పడుండక ఏమి చేస్తుంది’ అని వెక్కిరించిన వాళ్ళూ ఉన్నారు. ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో ఆరు సంవత్సరాలు నరకప్రాయంగా గడిచాయి. వేరే వాళ్లలో అయితే జీవన ఆసక్తి అంటూ లేకుండా పోయేదేమోగానీ లిసా మాత్రం మళ్లీ అడుగులు వేసింది. ఈసారి కృత్రిమకాళ్లతో! గతంలోలాగే ఉద్యమాలలో భాగం అయింది. చిత్రాలను తీయడం మొదలు పెట్టింది. ‘ఎందరి జీవితాలనో తెరకెక్కించింది లిసా. నిజానికి ఆమె జీవితమే ఒక అద్భుతమై చిత్రం’ అనే మాట తిరువనంతపురం చిత్రోత్సవంలో నలుమూలలా వినిపిస్తూనే ఉంది. -
కళ: త్రీ ఇన్ వన్... నెంబర్‌వన్!
కథలు కంచికి పోతాయో లేదో తెలియదుగానీ...కాసేపు ఆలోచిస్తే మన దగ్గరికే నడిచొస్తాయి అని చిత్ర చరిత్ర చెబుతూనే ఉంది. ఒక చిత్రం మొదలు కావాలంటే డైరెక్టర్ బౌండ్ స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగుతాడు. ఈ చిత్రం విషయంలో మాత్రం అలా జరగలేదు. ‘ఈ సబ్జెక్ట్ అనుకుంటున్నాను. మీరు మీ అనుభవాలు చెప్పండి చాలు స్క్రిప్ట్ రాసుకుంటాను’ అన్నాడు డైరెక్టర్ దేవాశిష్ మహ్కిజ. అన్నపూర్ణ సోని, భూమిక దూబె, ఈప్సిత చక్రవర్తి... అనే ఈ ముగ్గురు మహిళలు తమ అనుభవాలను చెప్పడమే కాదు రచన సహకారం అందించి, నటించి చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. దేశీయంగానే కాదు, అంతర్జాతీయస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న లఘు చిత్రం చీపటాకదుంప. 24 నిమిషాల నిడివిగల ఈ హిందీ షార్ట్‌ఫిల్మ్ తెగ నవ్విస్తుంది. అయితే ఇదేమీ హాస్యచిత్రం కాదు. నవ్విస్తూనే ఆలోచనలు రేకెత్తించే చిత్రం. ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ఇటీవల ‘జెండర్ సెన్సిటివిటీ’ అవార్డ్ గెలుచుకుంది. ‘పురుషులు ఇలాంటి దుస్తులు ధరించాలి. స్త్రీలు ఇలాంటి దుస్తులు మాత్రమే ధరించాలి. పురుషుల నడక ఇలా ఉండాలి. స్త్రీల నడక ఇలా మాత్రమే ఉండాలి....’ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు ఉండదు. ‘జెండర్ సెన్సిటివిటీ’ స్పృహతో మన ఆలోచనల్లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ప్రతిబింబించే చిత్రం ఇది. ‘చీపటాకదుంప’ అనేది దాగుడుమూతల్లాంటి ఒక ఆట. ఈ చిత్రానికి మూలస్తంభాలుగా నిలిచిన ముగ్గురు మహిళల గురించి... మధ్యప్రదేశ్‌లోని బర్త్ అనే చిన్న టౌన్‌కు చెందిన అన్నపూర్ణ సోని జబల్పూర్లో మ్యూజిక్కోర్సు చేసింది. సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, మైమ్...ఇలా ఎన్నో విద్యల్లో ప్రతిభ చూపేది. స్థానిక ‘వివేచన రంగ్మండల్’ అనే నాటక సంస్థలో చేరిన కొత్తలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) గురించి గొప్పగా విన్నది. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. రెండో ప్రయత్నంలో సీటు గెలుచుకుంది. ఇక ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముంబై యూనివర్శిటీలో మాస్ మీడియాలో పట్టా పుచ్చుకుంది భూమిక దూబె. ఎన్ఎస్డీ స్టూడెంట్. గొప్ప నాటక దర్శకులతో కలిసి పనిచేసింది. ఎన్నో లఘు చిత్రాలలో నటించింది. అవార్డ్లు గెలుచుకుంది. ‘చీపటాకదుంప’ చిత్రానికి దూబె కో–ప్రొడ్యూసర్, కాస్టింగ్ డైరెక్టర్. ‘నా మీద నాకు నమ్మకాన్ని, ఉత్సాహాన్ని పెంచిన చిత్రం ఇది’ అంటున్న భూమిక దూబె మరిన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలనుకుంటోంది. ఈప్సిత చక్రవర్తి నటిగానే కాదు స్క్రీన్ రైటర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఎన్ఎస్డీ స్టూడెంట్. కథలు, నవలలను నాటకాలుగా మలచడం అంటే ఇష్టం. విలియమ్ షేక్స్పియర్ ‘ఎ మిడ్నైట్ సమ్మర్ డ్రీమ్’ను ‘కసుమాల్ సప్నో’గా స్థానికీకరించి రాజస్థాన్‌లో ఇచ్చిన ప్రదర్శనకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘ఉజాగర్ డ్రామటిక్ అసోసియేషన్’ (ముంబై) అనే థియేటర్ గ్రూప్ వ్యవస్థాపకురాలు. తాజా విషయం ఈ ముగ్గురు ‘చీపటాకదుంప’ దగ్గర మాత్రమే ఆగిపోవాలనుకోవడం లేదు. మహిళలకు సంబంధించిన విభిన్న కోణాలకు కళారూపం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కరి ఆలోచనలు బాగుంటాయి. ఆ ఒక్కరికి మరో ఇద్దరి ఆలోచనలు తోడైతే మరీ బాగుంటాయి అని చెప్పడానికి సంశయం ఎందుకు! -
ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైన 'నాట్యం' మూవీ
‘‘డ్యాన్స్, వ్యాపార రంగం నుంచి వచ్చిన మీరు ‘నాట్యం’ లాంటి సినిమాను ఎందుకు చేస్తున్నారు? అని చాలామంది అడిగారు. ‘ఇఫీ’ వేడుకల్లో మా ‘నాట్యం’ సినిమా ప్రదర్శితం కానుండటమే ఆ ప్రశ్నకు సమాధానం. మా చిత్రానికి ఆ అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది’’ అని సంధ్యారాజు అన్నారు. ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరు 22న విడుదలైంది. కాగా భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు(ఇఫి) ఈ నెల 20 నుంచి గోవాలో ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ 52వ ‘ఇఫి’ వేడుకల్లో ఇండియన్ పనోరమ విభాగంలో ‘నాట్యం’ ప్రదర్శితం కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్ కోరుకొండ మాట్లాడుతూ– ‘‘నాట్యం’ సినిమాతో భారతీయ, తెలుగు సంస్కృతులు, సంప్రదాయల గురించి మాట్లాడుకుంటే చాలనుకున్నాం.. కానీ ఇప్పుడు మా చిత్రం ప్రేక్షకులు గర్వపడే తెలుగు సినిమాగా నిలిచింది. మా చిత్రాన్ని కె.విశ్వనాథ్, చిరంజీవి, బాలకృష్ణ, రామ్‌చరణ్, రవితేజ.. వంటి చాలామంది ప్రోత్సహించారు.. ఇందుకు వారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నాట్యం’ సినిమా గురించి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు’’ అన్నారు నటుడు కమల్ కామరాజు. నిర్మాతలు ప్రసన్న కుమార్, వి.మోహన్ పాల్గొన్నారు. -
అపర్ణ సినీ ప్రపూర్ణ
తండ్రి సినిమా క్రిటిక్, తల్లి కాస్ట్యూమ్ డిజైనర్. ఈ దంపతుల పదేళ్ల కూతురు..ఓ రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకుంటూ..‘‘అమ్మా నేను భవిష్యత్‌లో మంచి నటిని కాబోతున్నాను’ అని చెప్పింది. తల్లిదండ్రులు ఇద్దరూ సినీపరిశ్రమతో సంబంధాలు ఉన్నవారే అయినప్పటికీ తమ చిన్నారి చెప్పిన బుజ్జిబుజ్జి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అ చిన్నారి పదహారేళ్లకే సత్యజీత్ రే సినిమాలో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడు ఆరంభమైన అపర్ణాసేన్ ప్రయాణం నటిగా, దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్‌గా... ఎడిటర్‌గా అంచలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే పాపులర్ వ్యక్తుల జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ ‘ద రేపిస్ట్’ సినిమా తీసి ప్రతిష్టాత్మక ‘కిమ్ జిసెక్’ పురస్కారాన్ని అపర్ణ గెలుచుకున్నారు. అనేక అంతర్జాతీయ చిత్రాలతో పోటీ పడి ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును దక్కించుకోవడం విశేషం. కుమార్తె కొంకణసేన్ శర్మతో అపర్ణాసేన్ అప్పటి కలకత్తాలోని బెంగాలీ దంపతులు చిదానంద్ దాస్‌గుప్తా, సుప్రియ దాస్‌గుప్తాలకు 1945లో అక్టోబర్ 25న అపర్ణ జని్మంచింది. ఆమె బాల్యం అంతా కలకత్తాలోనే గడిచింది. బిఏ(ఇంగ్లిష్) డిగ్రీ పూర్తిచేసింది. 1961లో మ్యాగ్నమ్ ఫోటోగ్రాఫర్ బ్రేయిన్ బ్రాకేను కలిసిన అపర్ణ అతను తీస్తోన్న మాన్సూన్ సీరిస్‌లో నటించింది. పదహారేళ్లకే మోడల్‌గా మారిన అపర్ణ ..ఈ అనుభవంతో సత్యజీత్రే నిర్మించిన తీన్ కన్యలో మూడో భాగం ‘సమాప్తి’ లో నటించింది. ఈ సినిమాలో అపర్ణాకు మంచి గుర్తింపు లభించింది. మరోపక్క తన చదువును కొనసాగిస్తూనే కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ బిఏ(ఇంగ్లిష్) చదివింది. సమాప్తి తర్వాత ‘బక్సాబాదరల్’, ‘ఆకాశ్ కుసుమ్’లో నటించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేదు. తరువాత నటించిన ‘అపరాజితో’ మంచి కమర్షియల్ హిట్‌ను అందించింది. ఒక పక్క సినిమా, మరోపక్క థియేటర్లలో నటిస్తూ సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తరువాత సత్యజీత్ రే నిర్మించిన అనేక సినిమాల్లో నటించింది. రేకు వారసురాలిగా.. అపర్ణ తండ్రి సత్యజిత్ రేలు మంచి స్నేహితులు కావడం, వల్ల రేకు సన్నిహితంగా పెరిగిన అపర్ణ ...తన మొదటి సినిమా కూడా రే దర్శకత్వం వహించడంతో..ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయనలా విభిన్న సినిమాలు తీయడం ప్రారంభించింది. రాజకీయాలు, వివిధ రకాల మానవ సంబంధాలపై అపర్ణా అనేక సినిమాలు నిర్మించారు. 1981లో విడుదలైన ‘36 చౌరంగీ లేన్’ అనే ఇంగ్లిష్ సినిమాతో అపర్ణాకు రచయితగా, డైరెక్టర్‌గా గుర్తింపు లభించింది. అపర్ణ సిని పరిశ్రమకు చేసిన కృషికి గాను 1986లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. బెస్ట్ డైరెక్టర్ నేషనల్ అవార్డులను అందుకుంది. జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జ్యూరీగా వ్యవహరించడమేగాక అనేక లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు. 2009లో ‘అంతహీన్’ లో నటించగా ..ఈ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ లుకింగ్ ఉమెన్.. బెస్ట్ లుకింగ్ ఇండియన్ ఉమెన్ జాబితాలో నిలిచిన అపర్ణ..నటిగా, దర్శకురాలిగా ఎదిగినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులకు లోనయ్యారు. అయినప్పటికీ తన ఇద్దరు కూతుర్లు, మనవ సంతానంతో ఆమె ఆనందంగా గడుపుతున్నారు. ప్రస్తుతం బెంగాల్లో బాగా పాపులర్ అయిన మహిళా మ్యాగజీన్ ‘సనంద’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాగజీన్ లో సామాజిక సమస్యలపై ఆమె ఎడిటోరియల్స్ రాస్తున్నారు. ద రేపిస్ట్.. ఈ సినిమాను పదిహేనేళ్ల క్రితమే తియ్యాలని అపర్ణాసేన్ అనుకుంది. ఆ తరువాత భారత్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలను గమనిస్తూ ఉండేది. ఎవరూ కూడా పుట్టుకతో రేపిస్ట్ కారు. చిన్నప్పుడు అమాయకంగా ఉండే అబ్బాయిలు యవ్వనంలోకి వచ్చాక వారిలో ఎందుకు అత్యాచార మనస్తత్వం ఏర్పడుతుంది? రేపిస్ట్‌గా ఎలా మారుతున్నారు? ఇది కేవలం సమాజంలో ఉన్న అసమానతలు, లేదా జన్యువుల వల్ల జరుగుతోందా? ఇటువంటి ప్రశ్నలు అపర్ణ మనసులో మెదిలాయి. కానీ వేటికీ జవాబు దొరకలేదు. వీటన్నింటికి జవాబులు అన్వేషించే క్రమంలోనే ‘ద రేపిస్ట్’ సినిమా తీశారు. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో పుస్తకాలు చదివారు, అనేక మంది లాయర్లు, ఫెమినిస్టులు, స్నేహితులతో కలిసి చర్చించి తన కూతురు, ప్రముఖ నటి కొంకణా సేన్ శర్మ ప్రధాన పాత్రధారిగా సినిమాను తీశారు. ఇప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా తీయడం, దానికి అంతర్జాతీయ అవార్డు వరించడంతో..75 ఏళ్ల వయసులోనూ తన ప్రతిభను నిరూపించుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
డైరెక్టర్‌కే సినిమా చూపించారు
-
‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుములకు టోకరా..
సాక్షి, హైదరాబాద్: నితిన్ కథానాయకుడిగా నటించిన ‘భీష్మ’ చిత్రం పేరు చెప్పి, ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. త్వరలో జరుగనున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆ చిత్రాన్ని నామినేట్ చేస్తామంటూ నమ్మబలికారు. ఆయన నుంచి రూ. 66 వేలు డిపాజిట్ చేయించుకుని మోసం చేశారు. వెంకీ సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. డైరెక్టర్ వెంకీ కుడుములకు ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం అద్భుతంగా ఉందని చెప్పారు. దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆరు కేటగిరీల్లో నామినేట్ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నాడు. తాను ఆ ప్యానల్లో కీలక సభ్యుడిని అని, గోప్యత వహించాల్సిన అంశం కావడంతో రహస్యంగా ఇలా ఫోన్ చేశానని నమ్మబలికాడు. ఆ ఫెస్టివల్లో నామినేట్ చేయడానికి ఒకో కేటగిరికి రూ.11 వేలు చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నాడు. దీనికి వెంకీ అంగీకరించడంతో ఓ బ్యాంకు ఖాతా వివరాలు పంపిన నేరగాడు అందులో డబ్బు డిపాజిట్ చేయమన్నాడు. సైబర్ నేరగాడు చెప్పింది నిజమేనని నమ్మిన వెంకీ మొత్తం రూ.66 వేలు ఆ బ్యాంకు ఖాతాలోకి పంపాడు. మరుసటి రోజు మళ్లీ డైరెక్టర్ వెంకీకి ఫోన్ చేసిన సైబర్ నేరగాడు కొత్త కథ చెప్పాడు. ఆరింటిలోనూ మూడు కేటగిరిలకు సంబంధించి నామినేట్ చేసే విషయంలో చిన్న పొరపాటు జరిగిందంటూ క్షమాపణలు చెప్పాడు. వాటిని సరిచెయ్యడానికి మరికొంత మొత్తం చెల్లించాల్సి వస్తుందంటూ చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన వెంకీ సదరు చిత్ర నిర్మాత నామినేషన్ పర్వం వద్దన్నారంటూ చెప్పి తాత్కాలికంగా దాట వేశారు. ఆపై పూర్వాపరాలు పరిశీలించిన ఆయన జరిగిన మోసం తెలుసుకున్నారు. దీనిపై సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాడు వినియోగించిన ఫోన్ నెంబర్లు, వెంకీ డబ్బు పంపిన ఖాతాల వివరాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చరణ్‌ను మెప్పించిన ‘భీష్మ’ డైరెక్టర్ 'భీష్మ' డైరెక్టర్‌కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన నితిన్ నో చెప్పిన చెర్రీ.. మహేష్ గ్రీన్ సిగ్నల్! -
తమిళ చిత్రానికి అంతర్జాతీయ గౌరవం..
దర్శకుడు పీఎస్ వినోద్ రాజ్ తెరకెక్కించిన తమిళ చిత్రం కూజంగల్(గులకరాళ్లు) చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్‌డామ్‌లో(ఐఎఫ్ఆర్ఆర్) భాగంగా కూజంగల్ ‘టైగర్ అవార్డు’ను సొంతం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని పొందిన మొదటి తమిళ చిత్రం ఇదే. దీనిని కోలీవుడ్ కపుల్ నయనతార విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సందర్భంగా నెదర్లాండ్స్‌లోని ఐఎఫ్ఎఫ్ఆర్ కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో కలిసి కూజంగల్ స్క్రీనింగ్‌లో విఘ్నేష్, నయనతార సందడి చేశారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కూజంగల్ చిత్రాన్ని గురువారం రోటర్‌డామ్ ఉత్సవంలో ప్రదర్శించారు. కాగా టైగర్ అవార్డును గెలుచుకున్న రెండవ భారతీయ చిత్రం కూజంగల్. మొదట 2017లో సనల్ కుమార్ ససిధరన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం సెక్సీ దుర్గా ఈ అవార్డును గెలుచుకుంది. కాగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రోటర్‌డామ్ విభిన్న ప్రయోగాతక చిత్రాలను గుర్తించడంలో ప్రసిద్ధి చెందింది. తాగుబోతు తండ్రికి, అతని కొడుక్కి మధ్య జరిగే కథనే కూజంగల్..ఇందులో నూతన నటులు కరుతదయ్యన్, చెల్లా పాండి నటించారు. ఇల్లు వదిలి వెళ్లిన తల్లిని తిరిగి తీసుకురావడానికి తండ్రీ, కొడుకులు చేసే ప్రయత్నమే ఈ సినిమా. వినోద్ రాజ్‌కు దర్శకుడిగా కూజంగల్ మొదటి చిత్రం. అవార్డు అందుకోవడంపై ఆయన స్పందిస్తూ.. గులకరాళ్లు సినిమా టైగర్ అవార్డు 2021గెలుచుకున్నందుకు ఆనందంగా ఉంది. సినిమా కోసం మేం పడిన కష్టానికి ఫలితం దక్కింది. సినిమాపై చూపిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. మరోవైపను దీనిపై విఘ్నేష్ స్పందిస్తూ.. టైగర్ అవార్డు గెలుచున్న మొదటి తమిళ చిత్రం కూజంగల్ అని పేర్కొన్నారు. ఈ సినిమా వెనుక దర్శకుడు వినోత్ కృషి ఎక్కువ ఉందన్నారు. ఈయన చేసిన మొదటి చిత్రానికే ఇంత పెద్ద గౌరవం లభించిందన్నారు. అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నాడు. చదవండి: నోరుపారేసుకున్న నెటిజన్.. అనసూయ గట్టి కౌంటర్ కేజీఎఫ్ 2 తర్వాతే రాధేశ్యామ్! -
ఈసారి ఇఫీలో గతం
గోవాలో జరగనున్న 51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (ఇఫీ) ఇటీవల విడుదలైన చిన్న చిత్రం ‘గతం’కి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ పనోరమా విభాగంలో ‘గతం’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ విభాగంలో ఈ ఏడాది ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమా ఇది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న సినిమాల జాబితాను శనివారం ప్రకటించారు. వచ్చే జనవరి 16 నుంచి 24 వరకు జరగనున్న ఈ చలనచిత్రోత్సవాలలో భాగంగా ఇండియన్ పనోరమా విభాగం కింద భారత్ నుంచి హిందీ, ఇంగ్లిష్, తెలుగు, తమిళ సహా ఇతర భాషల చిత్రాలు 23 ఎంపికయ్యాయి. ఇక, మెయిన్ స్ట్రీమ్ విభాగంలో తమిళ చిత్రం ‘అసురన్’ (తెలుగులో వెంకటేశ్ నటిస్తున్న ‘నారప్ప’కు మూలం), మలయాళ చిత్రం ‘కప్పేలా’, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన హిందీ చిత్రం ‘ఛిఛోరే’ ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఇక ఇండియన్ పనోరమా విభాగంలో ఎంపికైన ‘గతం’ విషయానికి వస్తే... భార్గవ పోలుదాసు, రాకేష్ గలేభే, పూజిత ముఖ్య పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని కిరణ్ కొండమడుగుల తెరకెక్కించారు. భార్గవ పోలుదాసు, సృజన్ ఎర్రబోలు, హర్షవర్థన్ ప్రతాప్ నిర్మించారు. మొత్తం అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఈ నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయింది. ఇండియన్ పనోరమాకు ఎంపికైన ఏకైక తెలుగు చిత్రం -
ఎఫ్2 చిత్రానికి ఇండియన్ పనోరమ అవార్డు
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్‌లు నటించిన చిత్రం ‘ఎఫ్–2’. గతేడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. 2019వ సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియావారు ఎంపిక చేసిన వివిధ భాషల్లోని 26 సినిమాలకు కేంద్ర సమాచార శాఖ అవార్డులను ప్రకటించింది. ఇండియన్ పనోరమ అవార్డుకు ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఎఫ్–2’ సినిమాను ఎంపిక చేసింది. ‘‘ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు’’ అన్నారు చిత్రనిర్మాత ‘దిల్ రాజు’. ‘‘ఎఫ్2’ సినిమాతో పాటు దర్శకునిగా నాకు అవార్డు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. వెంకటేశ్, వరుణ్‌తో పాటు ‘ఎఫ్2’కి పని చేసిన అందరికీ’ థ్యాంక్స్’’ అన్నారు అనిల్ రావిపూడి. -
బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హారామీ
ఇమ్రాన్ హష్మి నటించిన లేటెస్ట్ హిందీ చిత్రం ‘హారామీ’కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఈ ఏడాది జరగనున్న బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘హారామీ’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఇండో – అమెరికన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్యామ్ మదిరాజ్ దర్శకత్వం వహించారు. ముంబై వీధుల్లో జరిగే క్రైమ్ కథా చిత్రమిది. రెండేళ్ల పాటు ఈ సినిమాను చిత్రీకరించారు. ‘మా టీమ్ అందరి శ్రమ వల్ల బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి మా సినిమా ఎంపికైందని అనుకుంటున్నాను. ఇండియన్ ఆడియన్స్‌కు ఈ సినిమా ఎప్పుడు చూపిస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు ఇమ్రాన్ హష్మి. అక్టోబర్ 21 నుంచి 30 వరకూ బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. -
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ షురూ
కోవిడ్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నీ వాయిదా పడ్డాయి. మే నెలలో జరగాల్సిన కాన్స్ చిత్రోత్సవాలు జరగలేదు. వచ్చే ఏడాది జరిగే గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్ అవార్డులను కొన్ని వారాలు వెనక్కి జరిపారు. ఈ ఏడాది జరగాల్సిన కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను వర్చువల్‌గా (ఆన్లైన్లో) జరపడానికి నిశ్చయించారు. అయితే వెనిస్ చిత్రోత్సవాలను కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ జరపబోతున్నట్టు ప్రకటించారు నిర్వాహకులు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో సుమారు 50 దేశాలు పాల్గొనబోతున్నాయి. ఈ సంబరానికి హాజరుకానున్న వాళ్లందరికీ ఉష్ణోగ్రత చూసే లోపలి అనుమతిస్తారట. ప్రతీ రెండో సీట్ ఖాళీగా ఉండేలా చూసుకుంటారట. ఈ ఫెస్టివల్‌కి హాజరు కావాలనుకున్నవాళ్లు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని కూడా తెలిపారు.