దేశంలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు(ఇఫి) ఆతిథ్యం ఇచ్చేందుకు గోవాలో శాశ్వత వేదికను నిర్మిస్తామని ముఖ్యమంత్రి మనోహర్ పర్రికార్ హామీ ఇచ్చారు.
పనాజీ: దేశంలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు(ఇఫి) ఆతిథ్యం ఇచ్చేందుకు గోవాలో శాశ్వత వేదికను నిర్మిస్తామని ముఖ్యమంత్రి మనోహర్ పర్రికార్ హామీ ఇచ్చారు. తదుపరి వేడుకల నాటికి మీరామర్ బీచ్ వద్ద దీన్ని సిద్ధం చేస్తామని ప్రకటించారు. పనాజీలో బుధవారం సాయంత్రం అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హాలీవుడ్, బాలీవుడ్ తారలు సుసాన్ సరాన్‌డాన్, వహీదా రెహమాన్, కమల్‌హాసన్, రేఖ, రాణిముఖర్జీ, అలియాభట్, గాయని ఆషా భోంస్లే తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలీవుడ్ అలనాటి తార వహీదా రెహమాన్‌ను శత చిత్రోత్సవ అవార్డుతో సత్కరించారు.