
ఈ ఏడాది జరిగే గోవాలో 53వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు నవంబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఆసియాలో జరిగే అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్స్‌లో ఇండియా ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఒకటి. తాజాగా ఈ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించే తేదీలు, ప్రదర్శించే సినిమా వివరాలను ఇండయన్ పనోరమా ప్రకటించింది. ఈ చిత్రోత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. 25 ఫిచర్స్ ఫిలింస్, 20 నాన్ ఫిచర్స్ ఫలింస్‌ను ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు.
అందులో తెలుగులో సంచలన విజయం సాధించిన ఆర్‌ఆర్‌ఆర్, ఆఖండ చిత్రాలకు గుర్తంపు లభించింది. మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్‌లో ప్రదర్శించే ఐదు సినిమాల్లో రెండు తెలుగు సినిమాలకు చోటు దక్కడం విశేషం. ఆర్‌ఆర్‌ఆర్, ఆఖండలతో పాటు బాలీవుడ్ మూవీ కాశ్మీర్ ఫైల్స్, టోనిక్(బెంగాలి చిత్రం) ధర్మం వీర్ ముక్కడ్ పోస్ట్ థానే (మరాఠీ) సినిమాలను ఈ మెయిన్ స్ట్రీమ్ చిత్రాల్లో ప్రదర్శించనున్నారు. కాగా కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన జరగనున్న ఈ చిత్రోత్సవాలకు ఉపాధ్యాక్షుడిగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment