International Film Festival of India
-
ముగిసిన ఇఫీ వేడుకలు
ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలు గురువారం అట్టహాసంగా ముగిశాయి. ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో 55వ ఇఫీ వేడుకలు జరిగాయి. ‘యంగ్ ఫిల్మ్‌మేకర్స్: ద ఫ్యూచర్ ఈజ్ నౌ’ అనే థీమ్‌తో ఈ వేడుకులను నిర్వహించారు. 80 దేశాలకు చెందిన 180 సినిమాల ప్రదర్శన జరిగింది. ఇక ఈ వేడుకల్లో నటులు ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, దర్శకుడు తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. తొమ్మిది రోజులపాటు జరిగిన ‘ఇఫీ’ ఉత్సవాల్లో దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులుపాల్గొన్నారు. చివరి రోజు విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఆటాపాటలతో ముగింపు వేడుకలు ముగిశాయి. ఇక అవార్డు విజేతల వివరాల్లోకి వెళితే... ‘హోలీ కౌ’ చిత్రంలోని నటనకు గాను క్లెమెంట్ ఫేబో ఈ ఏడాది ‘ఇఫీ’ ఉత్తమ నటుడిగా నిలిచారు. బెస్ట్ ఫిల్మ్‌కి ఇచ్చే ప్రతిష్టాత్మక ‘ది గోల్డెన్ పీకాక్’ అవార్డు లిథువేనియాకి చెందిన ‘టాక్సిక్’కి దక్కింది. ఇదే చిత్రానికి గాను వెస్ట, లెవాలకు ఉత్తమ నటీమణులుగా అవార్డులు దక్కాయి. ‘ది న్యూ ఇయర్ దట్ నెవర్ కమ్’ చిత్రానికి గాను రొమేనియా దర్శకుడు బోగ్దాన్ మురేసాకు ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. ‘హూ డు ఐ బిలాంగ్ టు’ చిత్రానికిగాను ఫ్రెంచ్ కమ్ ట్యూనీషియా నటుడు ఆడమ్ బెస్సాకు ఉత్తమ నటుడిగా అవార్డు (స్పెషల్ మెన్షన్) దక్కింది.‘బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో నవజ్యోత్ బండివాడేకర్ (గుజరాతీ ఫిల్మ్ ‘ఘారత్ గణపతి’) అవార్డు అందుకున్నారు. ‘బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్’గా అమెరికన్ ఫిల్మ్ మేకర్ సారా ఫ్రైడ్‌ల్యాండ్ (ది ఫెమిలియర్ టచ్)కు, లూయిస్ కోర్వోసియర్స్కు స్పెషల్ జ్యూరీ అవార్డు (హోలీ కౌ సినిమాకు) అవార్డులు దక్కాయి. ప్రతిష్ఠాత్మకమైన సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారం ఈ ఏడాది ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్ నోయిస్కు దక్కింది. ఈ సందర్భంగా తాను ఓ ఇండియన్ ఫిల్మ్‌ను చేయబోతున్నానని కూడా ఫిలిప్ పేర్కొన్నారు.ఇక ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్–2024’గా బాలీవుడ్ నటుడు విక్రాంత్ మెస్సీకి ఈ ఏడాది పురస్కారం దక్కింది. మరాఠీ వెబ్ సిరీస్ ‘లంపన్’కు బెస్ట్ సిరీస్‌గా , ‘క్రాసింగ్’ సినిమాకు యూనెస్కో గాంధీ మెడల్– 2024 పురస్కారం దక్కింది. ‘ఇఫీ’ ముగింపు వేడుకల్లో శ్రియా శరణ్, ప్రతీక్ గాంధీ, రష్మికా మందన్నాలతోపాటు పలువురు సినీ ప్రముఖులుపాల్గొన్నారు. పుష్పరాజ్ ఎక్కడ?‘ఇఫీ’ వేడుకలకు హాజరైన రష్మికా మందన్నాను ‘పుష్పరాజ్’ (‘పుష్ప’లో అల్లు అర్జున్పాత్ర పేరు) ఎక్కడ అని విలేకరులు అడగ్గా.. ‘‘హైదరాబాద్‌లో బిజీగా ఉన్నారు. సుకుమార్ సార్, దేవిశ్రీ సార్... ఇలా అందరూ బిజీగా ఉన్నారు. అందుకే అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరు కాలేక΄ోయారు. ‘పుష్ప’ తరఫున నేను వచ్చాను’’ అన్నారు. ‘పుష్ప’ కి అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వచ్చింది కదా... మీకు ‘పుష్ప 2’తో వస్తుందనుకుంటున్నారా? అని విలేకరులు అడగ్గా... ‘చూద్దాం’ అని నవ్వేశారు. -
ఇఫీలో మా కాళి
రైమా సేన్, అభిషేక్ సింగ్ ప్రధాన పాత్రల్లో విజయ్ యెలకంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘మా కాళి’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన మల్టీ లింగ్వల్ మూవీ ఇది. హిందీలో నిర్మించిన ఈ చిత్రం బెంగాలీ, తెలుగులో 2025లో విడుదల కానుంది. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ(ఇంటర్నేనేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో ‘మా కాళి’ సినిమాని ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్, గోవా రాష్ట్ర డీజీపీ అలోక్ కుమార్ హాజరయ్యారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ– ‘‘మా కాళి’ చిత్రాన్ని భారతదేశ విభజన, డైరెక్ట్ యాక్షన్ డే నేపథ్యంలో తీశారు. 1947లో స్వాతంత్య్రం పొందిన మన దేశం ఆ తర్వాత ఇండియా, పాకిస్థాన్ గా మారింది. 1971 నాటికి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌గా మారింది. ఒక దేశం మూడు ముక్కలైంది. అయినప్పటికీ భారతదేశం మాత్రమే ఇప్పటికీ రాజ్యాంగాన్ని నమ్ముతుంది. ‘మా కాళి’ వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడింది. డైరెక్ట్ యాక్షన్ డే అనేది మన దేశ చరిత్రలో ఒక బ్లాక్ డే’’ అని తెలిపారు. ‘‘మా కాళి’కి ప్రమోద్ సావంత్, ఆనంద బోస్గార్ల నుంచి వచ్చిన ప్రశంసల్ని సత్కారంగా భావిస్తున్నాం’’ అన్నారు విజయ్ యెలకంటి, నిర్మాత వందనా ప్రసాద్. -
ప్రేక్షకులూ భాగస్వాములే!
‘‘ఆర్టిస్టుగా ప్రతిభ ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ ఎవర్నీ ఆపలేరు’’ అని అంటున్నారు. కృతీ సనన్. గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో ఆమెపాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సమావేశంలో బంధు ప్రీతి గురించి కృతీ సనన్ మాట్లాడిన వ్యాఖ్యలు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో నాకు మంచి ఆహ్వానమే లభించింది. అయితే ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేనప్పుడు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కొంత సమయం పట్టడం సహజమే.మేగజీన్స్లో మన ఫొటోలు కనిపించేందుకు కూడా సమయం పటొచ్చు. ఇదంతా స్ట్రగుల్లో భాగమే. అయితే రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత, ప్రతిభతో, బాగా కష్టపడితే ఏదీ ఆపలేదు’’ అని అన్నారు. ఇంకా ఇండస్ట్రీలో బంధుప్రీతి గురించి కృతీ చెబుతూ– ‘‘బంధుప్రీతి అపవాదు మొత్తం బాధ్యతను ఇండస్ట్రీయే మోయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఈ విషయంలో ప్రేక్షకుల భాగస్వామ్యం కూడా ఉంది. స్టార్ కిడ్స్ అంటూ మీడియా వాళ్లు వారిపై ప్రత్యేక ఫోకస్ పెడతారు. దీంతో ఆడియన్స్ స్టార్ కిడ్స్ను ఫాలో అవుతుంటారు. స్టార్ కిడ్స్‌పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి, స్టార్ కిడ్స్‌తోనే సినిమాలు తీయాలని నిర్మాతలు అనుకుంటారు. అయితే ఆడియన్స్‌కు కనెక్ట్ కాని వారు ఎవరూ ఇండస్ట్రీలో ఉండలేరు. అది నిజం. ప్రతిభ ఉన్నవాళ్లే ఉంటారు’’ అన్నారు. -
ఇఫీలో హను–మాన్ భాగం కావడం ఆనందం: తేజ సజ్జా
‘‘కథా కథనాల పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిరుచి మన సినిమా అభివృద్ధికి దోహదపడుతుంది’’ అన్నారు హీరో తేజ సజ్జా. ‘‘హను–మాన్’ కేవలం సినిమా కాదు.. మన సాంస్కృతిక మూలాలు, సంప్రదాయాలకు కట్టిన పట్టం’’ అని కూడా అన్నారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇండియన్ పనోరమా విభాగంలో ‘హను–మాన్’ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ... ‘‘కల్పిత గ్రామమైన అంజనాద్రి నేపథ్యంలో దైవిక శక్తులను పొందిన ఓ చిన్న దొంగ... మహా శక్తిమంతుడైన హనుమంతుని దాకా సాగించే ప్రయాణాన్ని ఈ చిత్రం చూపించిందని, భారతీయ పురాణాల విశిష్టతను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఈ చిత్రం ద్వారా నిర్వర్తించామనీ అన్నారు. ఈ చిత్రం మన పౌరాణిక మూలాలను చాటి చెబుతూ భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలిపిందన్నారు.‘హను–మాన్ ’ సీక్వెల్ రూపకల్పన కోసం పని చేస్తున్నట్టు ధృవీకరించారు. తెలుగు పరిశ్రమ వినూత్న కథనాలతో అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు సాధిస్తోందన్నారు. ‘హను–మాన్’ సాంస్కృతిక వారసత్వం, ఆధునిక కథల శక్తిమంతమైన సమ్మేళనమని, భారతీయ పనోరమాలో భాగం కావడం ఈ చిత్ర కళాత్మక సాంస్కృతిక విశిష్టతకు నిదర్శనం’’ అంటూ తన ఆనంద వ్యక్తం చేశారు తేజ సజ్జా. – గోవా నుంచి సాక్షి ప్రతినిధి -
సినిమా... సాహిత్యం మధ్య సాన్నిహిత్యం పెరగాలి: దర్శకుడు మణిరత్నం
‘‘సినిమా... సాహిత్యం మధ్య ఎంత సాన్నిహిత్యం పెరిగితే అంతగా భారతీయ సినిమా మెరుగుపడుతుంది’’ అని అభిప్రాయపడ్డారు దక్షిణాది దర్శక దిగ్గజం మణిరత్నం. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో భాగంగా ‘ట్రాన్స్ఫార్మింగ్ లిటరరీ మాస్టర్‌పీస్’ అనే అంశంపై ‘మాస్టర్ క్లాస్’లో ఆయన మాట్లాడారు. మరో దక్షిణాది ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా మణిరత్నంతో సంభాషించారు. ‘‘నేను ఇప్పటికీ ప్రేక్షకులలో ఒక్కడిగా కూర్చుని సినిమా చూసే వ్యక్తినే’’ అని మణిరత్నం అన్నారు. ఏళ్లుగా మాస్టర్ పీస్ లాంటి సినిమాలు అందిస్తున్నప్పటికీ తనను తాను అనుభవశూన్యుడిలా, ప్రారంభ దశలో ఉన్నట్లుగానే భావిస్తాను అన్నారాయన. సినిమా, సాహిత్యం మధ్య లోతైన అనుబంధం ఏర్పడేలా సినిమా నిర్మాతలు చూడాలని మణిరత్నం కోరారు.పుస్తకానికి దృశ్యరూపం ఇవ్వాలంటే...పుస్తకాలను చలన చిత్రాలలోకి మార్చడంలోని సూక్ష్మ నైపుణ్యాలను ఈ సందర్భంగా మణిరత్నం వివరించారు. ‘‘సినిమాలు దృశ్య మాధ్యమానికి చెందినవి. కానీ పుస్తకాలు ప్రధానంగా ఊహాజనితమైనవి. పుస్తకాలకు దృశ్యరూపం ఇచ్చేటప్పుడు ఫిల్మ్ మేకర్‌కు అదనపు సామర్థ్యం ఉండాలి. పాఠకుడి ఊహకు ప్రాణం పోయడంలో జాగ్రత్త వహించాలి’’ అని సూచించారు. ఇంకా పురాణాలు, ప్రాచీన భారతీయ చరిత్ర తన దృక్పథాన్ని ప్రభావితం చేశాయని మణిరత్నం అన్నారు. కల్కి కృష్ణమూర్తి 1955 నాటి ఐకానిక్ రచనల నుంచి స్వీకరించిన తన ‘΄పొన్నియిన్ సెల్వన్’ చిత్రం గురించి మాట్లాడుతూ... చోళుల కాలాన్ని చిత్రించేందుకు పడిన వ్యయ ప్రయాసలను వివరించారు. తంజావూరులో ఆ కాలపు అవశేషాలు కూడా లేకుండా యాయని, అయితే సెట్లను రూపొందించడానికి ఇష్టపడక భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో షూటింగ్ చేశామని, అక్కడి నిర్మాణాన్ని చోళుల వాస్తుశిల్పం ప్రకారం మార్చామనీ అన్నారు. సృజనాత్మక స్వేచ్ఛను తీసుకుంటున్నప్పుడు ఆలోచనాత్మకంగా, పుస్తకాన్ని దాని అసలు స్ఫూర్తిని కాపాడేలా చూడాలని యువ సినీ రూపకర్తల్ని మణిరత్నం కోరారు.వినోదమే ప్రధానం: శివ కార్తికేయన్‘‘సినిమా పరిశ్రమలోకి రావడానికి నేను ఏ లక్ష్యాలను పెట్టుకోలేదు. కేవలం ప్రేక్షకులకు వినోదం అందించాలని తప్ప’’ అన్నారు ప్రముఖ నటుడు శివ కార్తికేయన్. ‘ఇఫీ’లో భాగంగా కళా అకాడమీ ప్రాంగణంలోని ఇంట్రాక్టీవ్ సెషన్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి ఖుష్బూ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ... తాను స్టార్ కావాలని రాలేదని, చేసే పాత్రల ద్వారా ప్రేక్షకులకు వినోదం పంచాలనుకున్నానని, అందుకు అనుగుణంగానే తొలుత టీవీ కార్యక్రమాలు... ఆ తర్వాత అంతకన్నా పెద్దదైన వెండితెరపైనా అవకాశాలు అందుకున్నాననీ శివ కార్తికేయన్ పేర్కొన్నారు. 200 సినిమాలకు పైగా నటించినా ఇప్పటికీ తన లక్ష్యం ప్రేక్షకులకు వినోదం అందించడమే అన్నారాయన. – గోవా నుంచి సాక్షి ప్రతినిధిఇఫీలో ఎమ్ 4 ఎమ్మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’(మోటివ్ ఫర్ మర్డర్). జో శర్మ, సంబీత్ ఆచార్య లీడ్ రోల్స్‌లో నటించారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ (యూఎస్ఏ) బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది. కాగా ఈ మూవీ హిందీ ట్రైలర్‌ని ‘ఇఫీ’లో శనివారం విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం గురించి మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ–‘‘యూనివర్సల్ సబ్జెక్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’. ప్రేక్షకులు మా మూవీని చూసి థ్రిల్ అవుతారు’’ అన్నారు. -
ప్రపంచాన్ని మార్చే శక్తి సినిమాకి ఉంది: అక్కినేని అమల
‘‘ఓ ఉత్తమమైన ప్రదేశంగా ప్రపంచాన్ని మార్చే శక్తి సినిమా మాధ్యమానికి ఉంది’’ అని అక్కినేని అమల అన్నారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు చెందిన విద్యార్థులు తీసిన షార్ట్ ఫిల్మ్ ‘రోడ్ నెం 52’ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అమల విలేకరులతో మాట్లాడారు. ‘‘దేశంలోఎందరో ప్రతిభావంతులైన యువత సినీ రంగంలో రాణించేందుకు కృషి చేస్తున్నారని, వారిని తీర్చిదిద్దే పనిలో తాము పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు.కొన్నేళ్లుగా వందలాది మందికి తమ అన్నపూర్ణ సంస్థ శిక్షణ అందించిందని, ఇప్పటికే పలువురు సినిమా రంగంలో పని చేస్తున్నారని వివరించారు. మహారాష్ట్రకు చెందిన యువకులు అచ్చ తెలుగు కథాంశం ఎంచుకుని అద్భుతమైన రీతిలో తెరకెక్కించారని ‘రోడ్ నెం 52’ రూపకర్తల్ని అభినందించారు అమల. ‘రోడ్ నెం 52’ రచయిత– దర్శకుడు సరోజ్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ అథర్వ మహేష్ గాగ్ తమ అనుభవాలు పంచుకున్నారు. నటీమణుల పాత్రల నిడివి పెరగాలి‘‘నటీమణులకు తెరపై పోషించే పాత్రల నిడివి పెరిగితే తెరవెనుక గౌరవం కూడా పెరుగుతుంది’’ అనే అభిప్రాయం ‘ఇఫీ’లో నిర్వహించిన సదస్సులో వ్యక్తమైంది. సినీ పరిశ్రమలో మహిళా భద్రత అనే అంశంపై జరిగిన చర్చలో నటి–నిర్మాత వాణీ త్రిపాఠి టికూ మోడరేట్ చేసిన ఫ్యానెల్ పాల్గొంది. నటి సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘సినిమాల్లో ఏదో ఇలా వచ్చి అలా పోయేవి కాకుండా మహిళలు తాము నటించే పాత్రలు బలంగా ఉండేలా చూసుకోవాలి’’ అన్నారు.‘‘లొకేషన్లో మహిళలు వేధింపులకు గురి కాకూడదు. వారికి తాము చేసే పని వాతావరణంలో భద్రత, గౌరవం తప్పనిసరిగా ఉండాలి’’ అని దర్శకుడు ఇంతియాజ్ అలీ పేర్కొన్నారు. ‘‘వినోదంపై దృష్టి సారిస్తూనే సమానత్వానికిప్రా ధాన్యం ఇవ్వడంతో పాటు బాధ్యతాయుతమైన చిత్రనిర్మాణం సాగాలి’’ అని ఖుష్బూ అన్నారు. మహిళలు తెరపై గౌరవప్రదంగా, తెరవెనుక సురక్షితంగా ఉండాలని, మహిళల భద్రతకి సినిమా ఉదాహరణగా ఉండాలనే పిలుపుతో ఫ్యానెల్ ముగిసింది. -
అలాంటప్పుడే నటీమణులకు గౌరవం పెరుగుతుంది: సుహాసిని
తెరపై పోషించే పాత్రల నిడివి పెరిగితే నటీమణులకు తెరవెనుక గౌరవం కూడా పెరుగుతుంది అన్న అభిప్రాయం ఇఫీ (భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం) సదస్సులో వ్యక్తమైంది. సినీ ఇండస్ట్రీలో మహిళా భద్రత అనే అంశంపై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా నటి సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ.. సినిమాల్లో ఏదో అలా వచ్చి ఇలా పోయేవి కాకుండా మెరుగైన కీలక పాత్రల కోసం మహిళలు ప్రయత్నించాలన్నారు. భద్రత, గౌరవం కావాలిపరిశ్రమలో వర్క్ ఎథిక్స్ గురించి అవగాహన పెoచాలని పిలుపునిచ్చారు. ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ.. నటీమణులు వేధింపులకు గురయ్యే అవకాశం లేని సినిమా సెట్లను రూపొందించాలన్నారు. వారికి తాము చేసే పని వాతావరణంలో భద్రత, గౌరవం తప్పనిసరిగా ఉండాలన్నారు. కుష్బూ సుందర్ మాట్లాడుతూ వినోదంపై దృష్టి సారిస్తూనే, సమానత్వానికి కూడా ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా సినిమాలను రూపొందించాలన్నారు. లింగ వివక్షపై చర్చఅలా ఈ సదస్సులో పని చేసే చోట భద్రత, సమానత్వం, సినిమా పాత్రలపై చర్చించారు. లింగ వివక్ష ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్యానెలిస్ట్‌లు ఏకగ్రీవంగా అంగీకరించారు. మహిళల భద్రతకు సినిమా ఉదాహరణగా ఉండాలనే పిలుపుతో ప్యానెల్ ముగిసింది. ఇకపోతే భారత్ హై హమ్ పేరిట దూరదర్శన్‌లో ప్రసారం కానున్న యానిమేషన్ సిరీస్ పోస్టర్‌ను నాగార్జున విడుదల చేశారు. ఇసుకలో అద్భుతాలుఅలాగే ప్రఖ్యాత ఆర్టిస్ట్ సుందరం పట్నాయక్.. గోవాలోని మెరామర్ బీచ్‌లో అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సిన్హాల సైకత శిల్పాలను తయారు చేశాడు. కాగా నవంబర్ 20న.. 55వ ఇఫీ ( భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం) వేడుకలు గోవాలో మొదలయ్యాయి. ఈ సెలబ్రేషన్స్ ఈ నెల 28 వరకు జరగనున్నాయి. -
IFFI : గోవా సినిమా పండుగ..సందడి చేసిన స్టార్లు (ఫొటోలు)
-
IFFI : ఘనంగా గోవా సినిమా పండుగ ప్రారంభం.. సందడి చేసిన నాగ్, ఇతరులు (ఫొటోలు)
-
గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో...
జో శర్మ, సంబీత్ ఆచార్య లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఎమ్ 4 ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ (యూఎస్ఏ) బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హిందీ ట్రైలర్‌ని ఈ నెల 23న గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో విడుదల చేయనున్నారు. -
మా నాన్న వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను – నాగార్జున
‘‘మా నాన్న నేర్పిన జీవిత పాఠాలు నన్ను ఎన్నో రకాలుగా ప్రభావితం చేశాయి. మా నాన్న బాటలో నడవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రసార సమాచార శాఖ సహకారంతో జాతీయ చిత్ర పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇఫీ) బుధవారం గోవాలోప్రారంభమైంది. ఈ నెల 28 వరకూ ఈ చిత్రోత్సవం జరగనుంది. తొలి రోజు నటులు ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, దర్శకుడు తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా లెజండరీ ఆల్బమ్‌ని విడుదల చేశారు. ఈ వేదికపై తండ్రి ఏఎన్నార్ గురించి మాట్లాడారు నాగార్జున. యాంకర్ కోరిన మీదట తాను నటించిన ‘బంగార్రాజు’ చిత్రంలోని ‘వాసివాడి తస్సాదియ్యా..’ డైలాగ్ చెప్పారు నాగార్జున. ఈ చిత్రోత్సంలో నాగార్జున, అమల దంపతులను, నటుడు శరత్ కుమార్, దర్శకుడు ఆర్కే సెల్వమణి, చిదానంద నాయక్, నిర్మాత–దర్శకుడు సుభాష్ ఘాయ్, నటీమణులు నిత్యా మీనన్, ప్రణీతలను సన్మానించారు. ‘‘పేపర్ బాయ్‌గా నా ప్రస్థానం ప్రారంభించాను’’ అని శరత్‌కుమార్ పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమాల్లోని కొత్తదనం, పాజిటివిటీ అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు టాలీవుడ్‌ని చేరువ చేస్తున్నాయి’’ అన్నారు అమల.ఐఫీ... ఇంకొన్ని విశేషాలు→ కార్యక్రమప్రారంభంలో భారత వందనం నృత్య కార్యక్రమం ఆహూతులను విశేషంగా అలరించింది.→ సినీ దిగ్గజాలు అక్కినేని నాగేశ్వరరావు, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా, రాజ్ కపూర్ల జీవితం గురించి బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ అందించిన వీడియో సహిత కార్యక్రమం ఆకట్టుకుంది.→ పలుమార్లు ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం ప్రస్తావన వచ్చింది.→ చిత్రోత్సవంలో భాగంగా విభిన్న కేటగిరీలో చిత్రాలను ఎంపిక చేసే జ్యూరీల్లో తెలుగు దర్శకుడు హరీష్ శంకర్, హైదరాబాద్‌కు చెందిన యువ డిజైనర్ అర్చనా రావు ఉన్నారు.→ బాలీవుడ్ నటి మానుషీ చిల్లర్ ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ పాటకు నృత్యంతో అలరించారు.→ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురు పండిట్ రవిశంకర్ జీవిత ఘట్టాల ఆధారంగా తీస్తున్న చిత్ర విశేషాలు ప్రదర్శించారు.→ ఆహూతుల్లో ఖుష్బూ, సుశాంత్ తదితరులు ఉన్నారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
ఇఫీలో గుస్సాడీ నృత్యం
తెలంగాణ సంప్రదాయ నృత్య వైభవం మరోసారి జాతీయ అంతర్జాతీయ వేదికలపై తళుక్కుమననుంది. గోవాలో అట్టహాసంగా బుధవారం జరుగనున్న అంతర్జాతీయ భారత్ చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. ఇఫీ)ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఆదివాసీ గోండు గిరిజనుల గుస్సాడీ నృత్యం ప్రదర్శనకు అవకాశం దక్కించుకుంది. ఈ నృత్య కళాకారునిగా ఇటీవలే కీర్తిశేషులైన పద్మశ్రీ కనకరాజు జాతీయ స్థాయిలో పేరొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో తెలంగాణ సంప్రదాయ నృత్య ప్రదర్శనకు నోచుకోవడం, ఆ ప్రదర్శనలో పాల్గొనే కళాకారులు అందరూ దివంగత కనకరాజు శిష్యులే కావడంతో ఇది గత నెలలోనే దివికేగిన గుస్సాడీ నృత్య దిగ్గజానికి ఘన నివాళిగా చెప్పొచ్చు. – సాక్షి, హైదరాబాద్ -
గేదెను వదిలేసి వచ్చేదెలా?
ఉత్తరాఖండ్‌కు చెందిన 80 ఏళ్ల హీరా దేవి గతేడాది ‘పైర్’ (చితి) అనే హిందీ చిత్రంలో ‘హీరోయిన్ ’గా నటించారు. ఆ చిత్రం ‘టాలిన్ బ్లాక్ నైట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’కు ఇండియా నుండి అధికారికంగా పోటీకి ఎంపికైంది కూడా. విషయం ఏమిటంటే – ఉత్తర ఐరో΄ాలోని ఎస్టోనియా దేశానికి రాజధాని అయిన టాలిన్ పట్టణంలో జరుగుతున్న ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ రోజు (నవంబర్ 19) సాయంత్రం ‘పైర్’ను ప్రదర్శిస్తున్నారు. ఇక విశేషం ఏమిటంటే – చిత్ర దర్శకుడు వినోద్ కప్రీ తనతోపాటుగా హీరా దేవిని ఎస్టోనియా తీసుకువెళ్లేందుకు ఎట్టకేలకు ఆమెను ఒప్పించగలిగారు. చిత్ర బృందంతో కలిసి హీరాదేవి ఆదివారం ఎస్టోనియా విమానం ఎక్కేశారు. అదేం విశేషం అంటారా? తన బర్రెను వదలి తను వచ్చేదే లేదని హీరా దేవి మొరాయించారు మరి!అసలు ‘ఫైర్’ చిత్రంలో నటించే ముందు కూడా ఆమె ఒక పట్టాన ఊరు దాటేందుకు అంగీకరించలేదు. ‘‘షూటింగ్ కోసం రోజూ నేను మీతో వచ్చేస్తుంటే ఇక్కడ నా బర్రెను ఎవరు చూసుకుంటారు?’’ అని ఆమె ప్రశ్న. ఇప్పుడు ఎస్టోనియా వెళ్లటానికి ఆమె అడుగుతూ వచ్చిన ప్రశ్న కూడా అదే.. ‘‘మీతోపాటు విమానం ఎక్కేస్తే ఇక్కడ నా బర్రెను ఎవరు చూసుకుంటారు?’’ అని! ‘‘నేను తప్ప నా బర్రెకు ఎవరూ లేరు, నేను రాలేను..’’ అని కరాకండిగా చెప్పేశారు హీరా దేవి. ఆమె నిరాకరణ సమంజసమైనదే. హీరా దేవి ఉంటున్నది ‘గడ్టిర్’ అనే మారుమూల గ్రామంలో. ఆమె, ఆమె బర్రె తప్ప ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. ఇంట్లోనే కాదు, ఆ ఊళ్లో జనం ఉండేది కూడా తక్కువే. అంతా వేరే ఊళ్లకు వలస వెళ్లిపోయారు. హీరా దేవి కూతురు కూడా అక్కడి కి 30 కి.మీ. దూరంలోని బరణి గ్రామంలో ఉంటోంది. హీరా దేవి ఇద్దరు కొడుకులు ఢిల్లీలో స్థిరపడిపోయారు. చివరికి ఆమె పెద్ద కొడుకు చేత చెప్పించి ‘పైర్’లో హీరోయిన్పాత్రలో నటించేందుకు ఒప్పించారు చిత్ర దర్శకుడు కప్రీ.‘పైర్’ 80 ఏళ్ల వయసులో ఉన్న దంపతుల ప్రేమ కథ. ఉత్తరాఖండ్‌లోని మున్శా్యరీ గ్రామంలోని ఒక నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం స్క్రీన్ ప్లేను 2018లోనే రాసి పెట్టుకున్నారు వినోద్ కప్రీ. స్థానిక నటుల కోసం వెతకులాటతోనే ఇన్నేళ్లూ గడిచిపోయాయు. ఆఖరికి.. ‘గడ్టిర్’ గ్రామంలో పసుగ్రాసం కోసం అడవికి వెళుతుండే కొందరు మహిళల ద్వారా హీరా దేవి చలాకీగా ఉంటారని, చక్కగాపాడతారని, భావాలను ముఖంలో భలేగా ఒలికిస్తారని తెలుసుకున్న కప్రీ.. హీరోయిన్ పాత్రకు హీరా దేవిని ఎంపిక చేసుకున్నారు. హీరోగా మున్శా్యరీ గ్రామంలో నాటకాలు వేస్తుండే మాజీ సైనికుడు పదమ్ సింగ్‌ని తీసుకున్నారు. ‘పైర్’లో ఇద్దరూ చక్కగా నటించారు. చిత్రానికి మంచి ఆర్ట్ మూవీగా పేరొచ్చింది. ఆ చిత్రాన్నే ఇవాళ ఎస్టోనియాను ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ – హీరా దేవి తన బర్రెను వదిలిపెట్టి ఎస్టోనియా వెళ్లేందుకు ఎలా అంగీకరించారు?! బర్రెను తను చూసుకుంటానని తల్లికి హామీ ఇచ్చి కూతురు ఆదివారం ఉదయం ఊళ్లోకి దిగగానే... బర్రె కంఠాన్ని ప్రేమగా, మృదువుగా నిమిరి, వెనక్కు తిరిగి తిరిగి బర్రె వైపు చూసుకుంటూ ఎస్టోనియా వెళ్లటం కోసం ఊళ్లోంచి బయటకు అడుగు పెట్టారు హీరా దేవి. -
ఇఫీలో శతాబ్ది వేడుకలు
అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా... భారతీయ చిత్రసీమలో ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. నటులుగా ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడిగా మహమ్మద్ రఫీ, దర్శకుడిగా తపన్ సిన్హా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ) ఘనంగా నివాళులర్పించనుంది. 55వ ఇఫీ వేడుకలు గోవాలో ఈ నెల 20న ఆరంభమై 28 వరకూ జరుగుతాయి.22న అక్కినేని నాగేశ్వరరావు, 24న రాజ్ కపూర్, 26న మహమ్మద్ రఫీ, 27న తపన్ సిన్హాలకు చెందిన శతాబ్ది వేడుకలను జరపడానికి ‘ఇఫీ’ నిర్వాహకులు ప్లాన్ చేశారు. గోవా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చిత్రోత్సవాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇక నలుగురు లెజెండ్స్ నివాళి కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. ⇒ నలుగురు లెజెండ్స్ కెరీర్లో చెరగని ముద్ర వేసిన చిత్రాలను, పాటలను ప్రదర్శించనున్నారు. ఏఎన్నార్ క్లాసిక్ మూవీ ‘దేవదాసు’, రాజ్ కపూర్ కెరీర్లో మైలురాయి అయిన ‘ఆవారా’, తపన్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో అద్భుత చిత్రం ‘హార్మోనియమ్’ చిత్రాలను ప్రదర్శించడంతో పాటు ‘హమ్ దోనో’లో మహమ్మద్ రఫీ పాడిన పాటలను వినిపించనున్నారు. కాగా, వీక్షకులకు నాణ్యతతో చూపించడానికి ఈ చిత్రాలను పునరుద్ధరించే బాధ్యతను నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఫిల్మ్ ఆరై్కవ్ ఆఫ్ ఇండియా తీసుకుంది. అలాగే ఈ ప్రముఖుల సినిమా కెరీర్‌కి సంబంధించిన ఏవీ (ఆడియో విజువల్) చూపించనున్నారు. ⇒నలుగురు కళాకారుల ప్రత్యేక నివాళిలో భాగంగా వారి విజయాలను గౌరవిస్తూ పద్మశ్రీ సుదర్శన్ పటా్నయక్ గోవాలోని కళా అకాడమీలో సృష్టించే ‘శాండ్ ఆర్ట్’ ఇల్ల్రస్టేషన్ని ప్రదర్శించనున్నారు. ⇒ సినిమా రంగంలో, భారతీయ సంస్కృతిపై వీరు వేసిన ముద్రకు ప్రతీకగా ఈ నలుగురు దిగ్గజాలకు అంకితం చేస్తూ ప్రత్యేక స్టాంపును ఆవిష్కరించనున్నారు. ⇒ ఈ నలుగురి కెరీర్లో తీపి గుర్తులుగా నిలిచిపోయిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేకమైన ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ‘ఇఫీ’ ప్లాన్ చేస్తోంది. ⇒ రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ కెరీర్‌లోని చిత్రాల్లోని 150 పాటలు, ఏఎన్నార్, తపన్ సిన్హా చిత్రాల్లోని 75 పాటలు... మొత్తంగా 225 పాటలతో ఓ సంగీత విభావరి జరగనుంది.భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ నలుగురు కళాకారుల శతాబ్ది వేడుకల్లో భాగంగా ఇంకా పలు కార్యక్రమాలను ప్లాన్ చేశారు. -
ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏలో షబానా సినీ స్వర్ణోత్సవం
బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ కెరీర్లో గోల్డెన్ ఇయర్లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఆసియా (ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ) టొరంటో’ షబానా ఆజ్మీ సినీ స్వర్ణోత్సవాన్ని జరపనుంది. 13వ ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ–టొరంటో వేడుకలు కెనడాలో ఈ ఏడాది అక్టోబరు 10 నుంచి 20 వరకు జరగనున్నాయి. 22 భాషల్లోని 120 చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమవుతాయని అలాగే సినిమా రంగానికి విశేష సేవలు అందించిన సీనియర్ నటి షబానా ఆజ్మీ స్వర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని, ‘ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ–టొరంటో ఫెస్టివల్’ నిర్వాహక అధ్యక్షుడు సన్నీ గిల్ పేర్కొన్నారు. ఇక 1950 సెప్టెంబరు 18న కైఫీ ఆజ్మీ (దివంగత ప్రముఖ గీత రచయిత), దివంగత నటి షౌకత్ కైఫీ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు షబానా ఆజ్మీ. 150పైగా చిత్రాల్లో నటించారామె. షబానా ఆజ్మీ తొలి చిత్రం ‘అంకుర్’ 1974లో విడుదలైంది. దాంతో నటిగా షబానా ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 ఏళ్ల జర్నీని పూర్తి చేసుకున్నట్లయింది. ‘అంకుర్, అర్థ్ (1982), కందార్ (1984), పార్ (1984), గాడ్ మదర్ (1999) వంటి సినిమాలకు గాను షబానా జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకున్నారు.ఇంకా ‘శత్రంజ్ కే ఖిలాడీ – 1977 (ది చెస్ ప్లేయర్స్), మండీ (1983), ఫైర్ (1996), మక్డీ (2002)’ వంటి ఎన్నో హిట్ ఫిల్మ్స్‌లో నటించారామె. అంతేకాదు... అమెరికన్ మిలటరీ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ ‘హాలో’ (2022–2024)లోనూ నటించి, హాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొందారు. సినీ రంగానికి షబానా అందించిన సేవలకుగాను 1998లో పద్మశ్రీ, 2012లో పద్మభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. -
IFFI Goa 2023: గోవా ఇఫి వేడుకల్లో తారాలోకం (ఫొటోలు)
-
కశ్మీర్ ఫైల్స్‌పై... మాటలు.. మంటలు
ముంబై: విడుదలైనప్పుడే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇఫీ ఉదంతం పుణ్యమా అని మరోసారి దేశవ్యాప్తంగా మంటలు రేపుతోంది. అదో చెత్త సినిమా అంటూ సోమవారం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ముగింపు వేడుకల్లో ఇజ్రాయెల్‌కు చెందిన జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలపై ఇంటా బయటా విమర్శలు రేగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇది పెద్ద చర్చకు తెర తీసింది. నదవ్ వ్యాఖ్యలను భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ తీవ్రంగా ఖండించారు. ‘‘అతిథిని దైవంగా భావించే దేశానికి వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి. ఇఫీ జడ్జీల ప్యానల్‌కు సారథ్య స్థానంలో కూచోబెట్టిన ఆతిథ్య దేశాన్ని నదవ్ తన వ్యాఖ్యలతో దారుణంగా అవమానించారు’’ అంటూ మంగళవారం బహిరంగ లేఖలో దుయ్యబట్టారు. ‘‘హిట్లర్ సారథ్యంలోని నాజీల చేతుల్లో లక్షలాది మంది యూదులు హోలోకాస్ట్ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో నిస్సహాయంగా ఊచకోతకు గురయ్యారు. అదృష్టం కొద్దీ ఆ మారణహోమం నుంచి తప్పించుకున్న వారి వారసున్ని నేను. నీ వ్యాఖ్యలనే గీటురాయిగా తీసుకునే పక్షంలో హోలోకాస్ట్ దారుణాలపై హాలీవుడ్ దర్శక దిగ్గజం స్పీల్బర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్ కూడా చెత్త సినిమాయేనా అని భారతీయులు ప్రశ్నిస్తుంటే నా మనసెంతో గాయపడుతోంది. కశ్మీర్ ఫైల్స్‌పై నీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వాటిని నువ్వు ఏ విధంగానూ సమర్థించుకోలేవు’’ అంటూ తూర్పారబట్టారు. నదవ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కశ్మీరీ పండిట్ల మండిపాటు బీజేపీతో పాటు కశ్మీర్ ఫైల్స్ సినిమా రచయిత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అందులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కూడా నదవ్ విమర్శలను తీవ్రంగా ఖండించారు. ‘‘భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ఉగ్రవాదుల వాదనకు మద్దతిచ్చేందుకు వాడుకున్న తీరు ఆశ్చర్యకరం. కశ్మీర్ ఫైల్స్ ప్రచారం కోసం తీసిందని, అందులో ఒక్క సీన్ గానీ, డైలాగ్ గానీ అవాస్తవమని నిరూపించినా ఇకపై సినిమాలే తీయను. నదవ్తో పాటు ప్రపంచ మేధావులకు, అర్బన్ నక్సల్స్‌కు ఇది నా సవాలు’’ అని అగ్నిహోత్రి అన్నారు. నవద్ను తక్షణం భారత్ నుంచి పంపించేయాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ కాన్సులర్ జనరల్ కొబ్బీ షొషానీ కూడా నదవ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. -
నాకు యువ హీరోలు పోటీ కాదు.. నేనే వాళ్లకు పోటీ: చిరంజీవి
-
నాకు వారు పోటీ కాదు.. నేనే వారికి పోటీ: మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల్లో అవార్డ్ స్వీకరించారు. ఈ వేడుకల్లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డును కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ వేడుకలో సతీసమేతంగా ఆయన హాజరయ్యారు. అవార్డు అందుకున్న మెగాస్టార్ వేదికపైనే భావోద్వేగానికి గురయ్యారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. 2022 సంవత్సరానికిగాను భారతీయ సినీ పరిశ్రమ గర్వించదిగిన వ్యక్తిగా చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇదివరకే ప్రకటించారు. (చదవండి:మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం.. కేంద్రమంత్రి ప్రశంసలు) చిరంజీవి మాట్లాడుతూ.. 'నాకు యువహీరోలు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ. ఈ అవార్డు నా అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నింపింది. ఈ క్షణం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నా. నా చివరి శ్వాస వరకు సినిమాల నుంచి తప్పుకోను. నేను ఎప్పుడు మీతోనే ఉంటా. మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా. మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కుడున్నా వారి ప్రేమకు నేను దాసోహం. ఆ ప్రేమ కావాలి. ఆ ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ అందరికీ జీవితాంతం కృతజ్ఞతగా ఉంటా. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు. నా స్నేహితుడు అక్షయ్ కుమార్ ఇక్కడే ఉన్నారు. నేను ఈ స్థాయికి వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో నేను ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నా. కానీ అప్పుడు దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫోటో లేదని బాధపడ్డా. కానీ ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది. ' అంటూ చిరు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. మెగాస్టార్ మాట్లాడుతూ..' నేను ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించా. శివ శంకర్ వరప్రసాద్ అనే నాకు.. సినీ పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చింది. 45 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నా. రాజకీయంలోకి వెళ్లడం వల్ల కొన్నాళ్లు విరామం వచ్చింది. పాలిటిక్స్‌లోకి వెళ్లడం వల్ల సినిమా విలువేంటో అర్థమైంది. ఏ రంగంలో అయినా అవినీతి ఉండొచ్చు. కానీ చిత్ర పరిశ్రమలో లేదు. ఇక్కడ ప్రతిభ ఒక్కటే కొలమానం.' అని అన్నారు. -
IFFI: కిడకి అభినందనలు
ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. పూ రామన్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో ఆర్ఏ వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని గోవాలో జరుగుతున్న ‘ఇఫీ’ (‘భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు’)లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించగా, వీక్షకులు ‘స్టాండింగ్ ఒవేషన్’తో అభినందించారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఏఆర్ వెంకట్‌కి ‘కిడ’ తొలి సినిమా అయినా బాగా తీశాడు. సినిమాకు భాషాపరమైన ఎల్లలు, హద్దులు లేవు. మంచి సినిమా వస్తే చూస్తారనే నమ్మకంతో తమిళంలో తీశాను’’ అన్నారు. ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ– ‘‘తాత, మనవడు, మేక చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. పనోరమాలో పదర్శించిన సినిమాని చాలామంది స్టూడెంట్స్ చూశారు.. వారికి బాగా నచ్చింది. నా తొలి సినిమాకు రవికిశోర్లాంటి నిర్మాత లభించడం నా అదృష్టం’’ అన్నారు. -
తెలుగు చిత్రానికి మరో అరుదైన గౌరవం.. ఆ విభాగంలో ఎంపిక
శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ఈ చిత్రం ఎంపికైంది. నేషనల్ ఫిల్మ్ అర్చివ్స్ ఆఫ్ ఇండియా వారు మనదేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి ప్రదర్శించనున్నారు. ఈ కేటగిరీలో శంకరాభరణం సినిమాకు చోటు దక్కింది. (చదవండి: Sarath Kumar: కళా తపస్వి జీవన చిత్ర ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించిన నటుడు) తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించిన దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్ చిత్రం శంకరాభరణం చిత్రాన్ని పనాజీలో జరుగుతున్న ఇఫి-2022 వేడుకల్లో ప్రదర్శించనున్నారు. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరావు ఈ సినిమాను నిర్మించారు. డిజిటలైజ్ చేసి ప్రదర్శించే భారతీయ సినిమాల్లో తెలుగు చిత్రం శంకరాభరణం చిత్రం చోటు దక్కించుకుంది. ఈ చిత్ర ప్రదర్శనకు నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు. -
వారి వల్లే నేను ఈ స్థానంలో ఉన్నా.. చిరు ఎమోషనల్ ట్వీట్
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అవార్డు ప్రకటించటం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ గౌరవం నాకు లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి మెగాస్టార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2022 ఏడాది గానూ భారతీయ సినీ పరిశ్రమ గర్వించదిగిన వ్యక్తిగా చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. నాకు ఈ అవార్డు రావడానికి ప్రధానం కారణం నా అభిమానులేనని చిరు అన్నారు. నాపై ప్రేమ చూపిస్తున్న అభిమానులందరి వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో మెగాస్టార్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు అందుకోనున్నారు. Greatly Delighted and Humbled at this honour, Sri @ianuragthakur ! My deep gratitude to Govt of India@MIB_India @IFFIGoa @Anurag_Office and all my loving fans only because of whom i am here today! https://t.co/IbgvDiyNNI — Chiranjeevi Konidela (@KChiruTweets) November 20, 2022 -
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం.. కేంద్రమంత్రి ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. ఆయనను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపుతో గౌరవించింది. 2022 సంవత్సరానికిగాను భారతీయ సినీ పరిశ్రమ గర్వించదిగిన వ్యక్తిగా చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డును మెగాస్టార్ అందుకోనున్నారు. ఇప్పటికే గోవాలో చలన చిత్రోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభం కాగా... ఈ నెల 28 వరకు జరగనున్నాయి. ఈ అవార్డుకు చిరంజీవి ఎంపిక కావడం పట్ల కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో నటుడిగా రాణిస్తోన్న చిరంజీవి... 150 సినిమాలు పూర్తి చేసి తన అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి అని చిరంజీవిని కొనియాడారు. ఈ వేడుకల్లో 79 దేశాలకు చెందిన 280 చిత్రాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1978లో సినీ రంగంలో అడుగుపెట్టిన చిరంజీవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారకమైన పద్మభూషణ్ 2006లో చిరంజీవిని వరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. చిరంజీవి 2012 నుంచి2014 వరకు కేంద్ర పర్యాటక మంత్రిగా సేవలందించారు. Indian Film Personality of the Year 2022 award goes to 𝐌𝐞𝐠𝐚𝐬𝐭𝐚𝐫 𝐂𝐡𝐢𝐫𝐚𝐧𝐣𝐞𝐞𝐯𝐢 With an illustrious career spanning almost four decades, he has been a part of more than 150 feature films 📽️https://t.co/1lSx81bGMw#IFFI #AnythingForFilms #IFFI53 @KChiruTweets pic.twitter.com/AY6UzMhfix — PIB India (@PIB_India) November 20, 2022 -
జై భీమ్ చిత్రానికి మరో అరుదైన గౌరవం
తమిళసినిమా: నటుడు సర్య కథానాయకుడిగా నటించి నిర్మించిన సూరరై పోట్రు, జై భీమ్ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను, విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. సూరరై పోట్రు చిత్రం సూర్యకు తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తెచ్చిపెట్టింది. ఇక జై భీమ్ 94వ అకాడమీ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుందీ చిత్రం. ఈ సినిమాను సౌత్ ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి వెల్లడించారు. నవంబర్ 20 నుం 28 వరకు గోవాలో ఈ చిత్రోత్సవాలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రోత్సవాల్లో మొత్తం 45 చిత్రాలను ప్రదర్శించనున్నారు. అందులో 20 లఘు చిత్రాలు, 25 కమర్షియల్ చిత్రాలకు చోటు లభించాయి. అందులో సూర్య కథానాయకుడిగా నటించిన జై భీమ్ ఒకటి. ఈ చిత్రాన్ని నటుడు సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఇందులో సూర్య న్యాయమూర్తి కే.చంద్రు పాత్రలో నటించారు. గత ఏడాది నవంబర్ నెలలో అమేజాన్ ప్రైమ్ టైమ్‌లో విడుదలై విశేష ఆదరణను పొందింది. -
ఇఫీలో ఇండియన్ పనోరమాకు ఎంపికైన 'కిడ', 'ఖుదీరామ్ బోస్'
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ను ఈ రోజు వెల్లడించారు. ఫీచర్ ఫిల్మ్స్‌లో 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తమిళ సినిమా 'కిడ', స్వాతంత్ర్య సమర యోధుడు ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ ఖుదీరామ్ బోస్’ ఎంపికయ్యాయి. ఈ చిత్రాలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరిగే 53వ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'లో ప్రదర్శించబడతాయి. 'కిడ'లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ జాగర్ల మూడి, డి. వి. యస్. రాజుల దర్శకత్వంలో రజిత విజయ్ జాగర్లమూడి నిర్మిస్తున్న స్వాతంత్ర్య సమర యోధుడు బయోపిక్ చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమ చిత్రం ఇండియన్ పనోరమాకు ఎంపికవడం పట్ల నిర్మాత రజిత విజయ్ జాగర్లమూడి, దర్శకులు విజయ్ జాగర్లమూడి, డివిఎస్ రాజు సంతోషం వ్యక్తం చేశారు.