ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ను ఈ రోజు వెల్లడించారు. ఫీచర్ ఫిల్మ్స్‌లో 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తమిళ సినిమా 'కిడ', స్వాతంత్ర్య సమర యోధుడు ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ ఖుదీరామ్ బోస్’ ఎంపికయ్యాయి. ఈ చిత్రాలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరిగే 53వ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'లో ప్రదర్శించబడతాయి.
'కిడ'లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు.
విజయ్ జాగర్ల మూడి, డి. వి. యస్. రాజుల దర్శకత్వంలో రజిత విజయ్ జాగర్లమూడి నిర్మిస్తున్న స్వాతంత్ర్య సమర యోధుడు బయోపిక్ చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమ చిత్రం ఇండియన్ పనోరమాకు ఎంపికవడం పట్ల నిర్మాత రజిత విజయ్ జాగర్లమూడి, దర్శకులు విజయ్ జాగర్లమూడి, డివిఎస్ రాజు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment