తెరపై పోషించే పాత్రల నిడివి పెరిగితే నటీమణులకు తెరవెనుక గౌరవం కూడా పెరుగుతుంది అన్న అభిప్రాయం ఇఫీ (భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం) సదస్సులో వ్యక్తమైంది. సినీ ఇండస్ట్రీలో మహిళా భద్రత అనే అంశంపై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా నటి సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ.. సినిమాల్లో ఏదో అలా వచ్చి ఇలా పోయేవి కాకుండా మెరుగైన కీలక పాత్రల కోసం మహిళలు ప్రయత్నించాలన్నారు.
భద్రత, గౌరవం కావాలి
పరిశ్రమలో వర్క్ ఎథిక్స్ గురించి అవగాహన పెoచాలని పిలుపునిచ్చారు. ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ.. నటీమణులు వేధింపులకు గురయ్యే అవకాశం లేని సినిమా సెట్‌లను రూపొందించాలన్నారు. వారికి తాము చేసే పని వాతావరణంలో భద్రత, గౌరవం తప్పనిసరిగా ఉండాలన్నారు. కుష్బూ సుందర్ మాట్లాడుతూ వినోదంపై దృష్టి సారిస్తూనే, సమానత్వానికి కూడా ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా సినిమాలను రూపొందించాలన్నారు.
లింగ వివక్షపై చర్చ
అలా ఈ సదస్సులో పని చేసే చోట భద్రత, సమానత్వం, సినిమా పాత్రలపై చర్చించారు. లింగ వివక్ష ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్యానెలిస్ట్‌లు ఏకగ్రీవంగా అంగీకరించారు. మహిళల భద్రతకు సినిమా ఉదాహరణగా ఉండాలనే పిలుపుతో ప్యానెల్ ముగిసింది. ఇకపోతే భారత్ హై హమ్ పేరిట దూరదర్శన్‌లో ప్రసారం కానున్న యానిమేషన్ సిరీస్ పోస్టర్‌ను నాగార్జున విడుదల చేశారు.
ఇసుకలో అద్భుతాలు
అలాగే ప్రఖ్యాత ఆర్టిస్ట్ సుందరం పట్నాయక్.. గోవాలోని మెరామర్ బీచ్‌లో అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సిన్హాల సైకత శిల్పాలను తయారు చేశాడు. కాగా నవంబర్ 20న.. 55వ ఇఫీ ( భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం) వేడుకలు గోవాలో మొదలయ్యాయి. ఈ సెలబ్రేషన్స్ ఈ నెల 28 వరకు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment