ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్ నోయిస్‌కు లైఫ్‌టైమ్ అవార్డు
ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా విక్రాంత్ మెస్సీ
ఇఫీ (ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలు గురువారం అట్టహాసంగా ముగిశాయి. ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో 55వ ఇఫీ వేడుకలు జరిగాయి. ‘యంగ్ ఫిల్మ్‌మేకర్స్: ద ఫ్యూచర్ ఈజ్ నౌ’ అనే థీమ్‌తో ఈ వేడుకులను నిర్వహించారు. 80 దేశాలకు చెందిన 180 సినిమాల ప్రదర్శన జరిగింది. ఇక ఈ వేడుకల్లో నటులు ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, దర్శకుడు తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. తొమ్మిది రోజులపాటు జరిగిన ‘ఇఫీ’ ఉత్సవాల్లో దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులుపాల్గొన్నారు. చివరి రోజు విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఆటాపాటలతో ముగింపు వేడుకలు ముగిశాయి. ఇక అవార్డు విజేతల వివరాల్లోకి వెళితే...
‘హోలీ కౌ’ చిత్రంలోని నటనకు గాను క్లెమెంట్ ఫేబో ఈ ఏడాది ‘ఇఫీ’ ఉత్తమ నటుడిగా నిలిచారు. బెస్ట్ ఫిల్మ్‌కి ఇచ్చే ప్రతిష్టాత్మక ‘ది గోల్డెన్ పీకాక్’ అవార్డు లిథువేనియాకి చెందిన ‘టాక్సిక్’కి దక్కింది. ఇదే చిత్రానికి గాను వెస్ట, లెవాలకు ఉత్తమ నటీమణులుగా అవార్డులు దక్కాయి. ‘ది న్యూ ఇయర్ దట్ నెవర్ కమ్’ చిత్రానికి గాను రొమేనియా దర్శకుడు బోగ్దాన్ మురేసాకు ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. ‘హూ డు ఐ బిలాంగ్ టు’ చిత్రానికిగాను ఫ్రెంచ్ కమ్ ట్యూనీషియా నటుడు ఆడమ్ బెస్సాకు ఉత్తమ నటుడిగా అవార్డు (స్పెషల్ మెన్షన్) దక్కింది.
‘బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో నవజ్యోత్ బండివాడేకర్ (గుజరాతీ ఫిల్మ్ ‘ఘారత్ గణపతి’) అవార్డు అందుకున్నారు. ‘బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్’గా అమెరికన్ ఫిల్మ్ మేకర్ సారా ఫ్రైడ్‌ల్యాండ్ (ది ఫెమిలియర్ టచ్)కు, లూయిస్ కోర్వోసియర్స్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు (హోలీ కౌ సినిమాకు) అవార్డులు దక్కాయి. ప్రతిష్ఠాత్మకమైన సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారం ఈ ఏడాది ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్ నోయిస్‌కు దక్కింది. ఈ సందర్భంగా తాను ఓ ఇండియన్ ఫిల్మ్‌ను చేయబోతున్నానని కూడా ఫిలిప్ పేర్కొన్నారు.
ఇక ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్–2024’గా బాలీవుడ్ నటుడు విక్రాంత్ మెస్సీకి ఈ ఏడాది పురస్కారం దక్కింది. మరాఠీ వెబ్ సిరీస్ ‘లంపన్’కు బెస్ట్ సిరీస్‌గా , ‘క్రాసింగ్’ సినిమాకు యూనెస్కో గాంధీ మెడల్– 2024 పురస్కారం దక్కింది. ‘ఇఫీ’ ముగింపు వేడుకల్లో శ్రియా శరణ్, ప్రతీక్ గాంధీ, రష్మికా మందన్నాలతోపాటు పలువురు సినీ ప్రముఖులుపాల్గొన్నారు.
పుష్పరాజ్ ఎక్కడ?
‘ఇఫీ’ వేడుకలకు హాజరైన రష్మికా మందన్నాను ‘పుష్పరాజ్’ (‘పుష్ప’లో అల్లు అర్జున్‌పాత్ర పేరు) ఎక్కడ అని విలేకరులు అడగ్గా.. ‘‘హైదరాబాద్‌లో బిజీగా ఉన్నారు. సుకుమార్ సార్, దేవిశ్రీ సార్... ఇలా అందరూ బిజీగా ఉన్నారు. అందుకే అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరు కాలేక΄ోయారు. ‘పుష్ప’ తరఫున నేను వచ్చాను’’ అన్నారు. ‘పుష్ప’ కి అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వచ్చింది కదా... మీకు ‘పుష్ప 2’తో వస్తుందనుకుంటున్నారా? అని విలేకరులు అడగ్గా... ‘చూద్దాం’ అని నవ్వేశారు.
Comments
Please login to add a commentAdd a comment