
‘మహానటి’లో కీర్తీ సురేశ్
అందాల అభినేత్రి సావిత్రి జీవితంపై తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. టైటిల్ రోల్‌ను కీర్తీ సురేశ్, ఇతర ముఖ్య పాత్రలను సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ‘మహానటి’ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలై ఘనవిజయం సాధించింది. అలాగే ఇప్పటికే ఈ చిత్రం పలు చిత్రోత్సవాలకు ఎంపికైంది. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది.
‘ఇండియన్ పనోరమ’లో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఈ సినిమా ఎంపికైంది. 49వ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఉత్సవాలు ఈనెలలో గోవాలో జరగనున్నాయి. అందులో భాగంగా ‘మహానటి’ చిత్రాన్ని అక్కడ ప్రదర్శిస్తారు. హిందీ, తమిళ, మలయాళం, తుళు... ఇలా భారతీయ భాషల నుంచి 22 చిత్రాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు అర్హత పొందాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది ఆ గౌరవం ‘మహానటి’కి దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment