
సౌత్ ఇండియా హీరోయిన్ కీర్తీ సురేష్ ముందు రకరకాల రుచికరమైన ఆహారపదార్థాలు ఎన్ని పెట్టినా, తను మాత్రం దోశ కోసమే ఎదురుచూస్తుంది. దోశ అంటే అంత ప్రాణం. ఒకరోజు హీరో నాని ఇంటికి వెళ్లినప్పుడు, డైనింగ్ టేబుల్‌పై ఉండే ఐటమ్స్ నచ్చక, తానే కిచెన్‌లోకి వెళ్లి, దోశ వేసుకొని తినింది. ఇక చిరంజీవి గారి వంటవాడికి అయితే, ‘భోళా శకంర్’ షూటింగ్ సెట్‌లోనూ తనకు పంపే ఆహారం ఎలా ఉండాలో ఫోన్ చేసి, చెప్పి మరీ చేయించుకునేది.
చిలిపి అలవాటు
చిన్నప్పుడు తరచు రుపాయి నాణేలను నోట్లో పెట్టుకోవడం అలవాటు ఉండేది. అలా రెండుసార్లు మింగేసింది. ఆ అలవాటు మానడానికి చాలా కాలమే పట్టింది. చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా తనని తిడితే, వాళ్లు రెస్ట్‌రూమ్‌కి వెళ్లినప్పుడు బయట గడియ పెట్టి వెళ్లిపోతుందట! అలా వాళ్ల అమ్మను చాలాసార్లు ఏడిపించింది. ఇప్పటికీ అలాగే చేస్తుందట!
అన్నీ ఫ్లాపులే
కీర్తి సినీ ప్రయాణం అనుకున్నంత సాఫీగా ఏమీ సాగలేదు. మొదట్లో తను నటించిన మూడు సినిమాలు చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయాయి. ఆపై విడుదలైన సినిమాలు కూడా అంతంతమాత్రంగానే ఆడాయి. దీంతో దశాబ్దం
పాటు ఐరన్‌లెగ్ ముద్రను ధరించింది.
చాలా భయపడ్డా
కీర్తి ఎక్కువగా భయపడింది సావిత్రిగారిలా నటించడానికేనట! మహానటి సావిత్రి బయోపిక్ కోసం ముందుగా చాలామంది హీరోయిన్లను అనుకున్నా, చివరకు కీర్తికే ఆ చాన్స్ దక్కింది. ఆ సినిమాకు ఆమెను ఒప్పించడానికి డైరెక్టర్‌కు తలప్రాణం తోకకొచ్చింది.
నా పాట..
గాత్రంతోనూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది కీర్తి. ‘సామి స్క్వేర్’లో ‘పుదు మెట్రో రైల్’ పాట పాడింది కీర్తినే.. ‘కల్కి 2898 ఏడీ’ లోనూ బుజ్జిగా ఒక కారుకు వాయిస్ అందించింది. ఇలా నటి, గాయని మాత్రమే కాదు, స్విమ్మర్, ఫ్యాషన్ డిజైనర్ కూడా!
బ్యూటీ సీక్రెట్..
ఆరోగ్యం, అందంపై చాలా శ్రద్ధ తీసుకుంటుంది కీర్తి. ఇందుకోసం, సహజమైన పద్ధతుల్నే పాటిస్తుంది. నారింజ తొక్కల పొడి, పచ్చి పసుపు, పాల మీగడ ఇలా ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది. షూటింగ్ లేనప్పుడు అసలు మేకప్ వేసుకోదు.
అక్క సిద్ధమైంది
కీర్తి ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘అక్క’ వెబ్ సిరీస్‌లో లేడీ డాన్‌గా చాలా బోల్డ్‌గా, వైల్డ్‌గా కనిపించబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment