Keerthy Suresh Glamour Show In Social Media - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: పక్కింటి అమ్మాయిలా ఉండే కీర్తిసురేష్‌.. ఇప్పుడిలా మారిపోయిందేంటి?

Published Tue, May 30 2023 7:36 AM | Last Updated on Tue, May 30 2023 9:35 AM

Keerthy Suresh Glamour Show In Social Media - Sakshi

అభినయానికి అడ్రస్‌ కీర్తి సురేష్‌ అంటారు. అది అక్షరాల నిజం. మహానటి చిత్రంలో అలాంటి నటనతోనే అందరి నోట శభాష్‌ అనిపించుకుని జాతీయ ఉత్తమ అవార్డులు గెలుచుకుంది. అలా దక్షిణాదిలో పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామకు ఆరంభం నుంచే నటనకు అవకాశం ఉన్న పాత్రలు వరిస్తున్నాయి. అలా కొన్ని లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రంలోనూ నటించి మెప్పించింది. చదవండి: అదృష్టం అంటే త్రిషదే.. ఏకంగా ముగ్గురు స్టార్‌ హీరోలు 

ఆ మధ్య తమిళంలో సానికాగితం అనే చిత్రంలో నవరసాలు పండించింది. ఇక ఇటీవల తెలుగులో నానికి జంటగా దసరా చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా నటించి ప్రశంసలు అందుకుంది. మధ్యలో కొన్ని చిత్రాల్లో గ్లామర్‌ పాత్రలు పోషించినా, ఆమె ఇమేజ్‌ అవి అంతగా సరిపడలేదు అని విమర్శిస్తున్న వారు ఉన్నారు. అయితే నటి కీర్తి సురేష్‌ ప్రస్తుతం గ్లామర్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువగా సోషల్‌ మీడియాలో ఉండే ఈమెకు మిలియన్‌కు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. వారిని సంతోష పెట్టడానికో, లేక అవకాశాల కోసమో గానీ ఇటీవల ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ నిర్వహించుకుని అందాలను ఎక్స్‌ఫోజ్‌ చేయడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం తెలిసిందే. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

చదవండి:పీవీఆర్‌ సౌత్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అన్‌స్టాపబుల్‌ పేరుతో ఆటోబయోగ్రఫీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement