glamour
-
పెళ్లైనా తగ్గేదేలే అంటున్న కీర్తి సురేష్
-
మరింత బోల్డ్‌గా డార్లింగ్ హీరోయిన్ నభా నటేశ్.. క్రేజీ అవార్డ్ కొట్టేసింది!
-
తెల్లదనం సాధ్యమే..! ఎండకు వాడిన చర్మం..!
టీనేజ్ అమ్మాయిల దగ్గర నుంచి వర్కింగ్ విమెన్స్ వరకు అందరూ ఎదుర్కొన్నే సమస్య ముఖం నల్లగా మారి, వాడిపోవడం. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో బయటకు అడుగు పెట్టనదే పని కాదు. అలాంటప్పడు ఎండకు, కాలుష్యానికి గురై చర్మం నల్లగా మారి కమిలిపోవడం జరుతుంది. ఒక విధమైన డల్నెస్తో వాడిపోయినట్లు ఉంటుంది. అందుకోసం పార్లర్లకు పరుగులు తీయాల్సిన పనిలేదు. మనకు దొరికిన టైంలోనే ఇంట్లో మనం అను నిత్యం వాడే వాటితోనే ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. నలుపు దనానికి చెక్‌పెట్టొచ్చు. ఎలాగో చూద్దామా..!బంగాళదుంప నాచురల్ బ్లీచ్. బంగాళదుంప రసాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. రసం తీయడం కుదరకపోతే బంగాళదుంపను పలుచగా తరిగి ముఖం మీద పరిచినట్లు అమర్చాలి. అందులోని రసాన్ని చర్మం పీల్చుకున్న తర్వాత ఆ ముక్కలతోనే ముఖమంతటినీ వలయాకారంగా రుద్ది ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే ఎండ తీవ్రత వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల నల్లబడిన చర్మం తెల్లబడుతుంది.మెడ దగ్గర నలుపు తగ్గాలంటే... మెడ భాగం జిడ్డుగా, నలుపుగా మారితే బొ΄్పాయిపండు గుజ్జును పట్టించి, పది నిమిషాల మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారంలో రెండుసార్లైనా ఇలా చేస్తూ ఉంటే నలుపు తగ్గుతుంది.మోచేతుల నలుపు తగ్గాలంటే నిమ్మ ఉప్పును రాసి, అరగంట ఉంచి, శుభ్రపరుచుకోవాలి.ఆలివ్ ఆయిల్‌తో మోచేతుల భాగాన్ని మసాజ్ చేసి, ఆ తర్వాత నిమ్మకాయ రసంతో రుద్దితే నలుపుదనం తగ్గుతుంది.పెదాలు నలుపు తగ్గాలంటే బీట్రూట్ ముక్కతో పెదాలను కొద్దిపాటి ఒత్తిడితో మర్దనా చేయాలి.శిరోజాల కోసం చూర్ణం..అరకప్పు డ్రైఫ్రూట్స్... బాదం, పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్నట్స్; అరకప్పు ఓట్స్, పచ్చి శనగపప్పు, పెసరపప్పు కలిపి అరకప్పు, సబ్జా గింజలు అరకప్పు, అవిసె గింజలు అరకప్పు చొప్పున తీసుకుని దోరగా వేయించి చూర్ణం చేసుకుని డబ్బాలో నిల్వ చేయాలి. ఈ పొడిని టేబుల్ స్పూన్ తీసుకుని టీ లేదా స్మూతీలో వేసుకుని తాగాలి. టీ అలవాటు లేని వాళ్లు వేడినీళ్లలో కలుపుకొని రోజూ ఉదయాన్నే తాగితే రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ పొడి జుట్టు సంరక్షణకే గాక ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుంది.(చదవండి: యూట్యూబర్ వెయిట్ లాస్ జర్నీ: జస్ట్ రెండేళ్లలో ఏకంగా వంద కిలోలు..!) -
మిల్కీ బ్యూటీ కాదు అంతకు మించి.. తమన్నా గ్లామర్‌కు కుర్రకారు ఫిదా (ఫోటోలు)
-
Actress Athulya Ravi: గ్లామర్ తో మతులు పోగొడుతున్న యంగ్ బ్యూటీ..
-
'అత్యంత చెత్త గ్లామర్ నాదే'.. సైంధవ్ నటుడి షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఈ ఏడాది వెంకటేశ్ నటించిన సైంధవ్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నవాజుద్దీన్ నటించిన 'రౌతు కా రాజ్' సినిమా జీ5లో జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన ముఖం చూసి నిరుపేద అనుకుంటారని అన్నారు. అంతే కాకుండా ఇండస్ట్రీలో అత్యంత అగ్లీయస్ట్ నటుడిని తానేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ మాట్లాడుతూ..'కొంతమంది మన రూపాన్ని ఎందుకు ద్వేషిస్తారో నాకు తెలియదు. బహుశా మనం అంత అందంగా కనిపించకపోవడం వల్లే కావొచ్చు. నేను కూడా నన్ను నేను అద్దంలో చూసుకుంటా. నేను అందంగా లేకపోయినా సినిమా పరిశ్రమలోకి ఎందుకు వచ్చానా అని ప్రశ్నించుకుంటా. బాలీవుడ్లో శారీరకంగా.. అత్యంత అంద విహీనంగా కనిపించే నటుడిని నేనే. ఈ విషయం నాకు తెలుసు. అయితే చిత్ర పరిశ్రమపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. నా కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను పోషించే అవకాశం ఇచ్చినందుకు ఇండస్ట్రీకి నా కృతజ్ఞతలు' అని అన్నారు.కాగా.. నవాజుద్దీన్ చివరిసారిగా హడ్డీలో కనిపించాడు. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో విడుదలైంది. అతని ఇటీవల విడుదలైన రౌతు క రాజ్ జూన్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆనంద్ సురపూర్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ చిత్రంలో అతుల్ తివారీ, రాజేష్ కుమార్, నారాయణి శాస్త్రి కూడా నటించారు. -
Priyanka Jain HD Photos: తొలిసారి గ్లామర్ లుక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ 'ప్రియాంక' (ఫోటోలు)
-
Kasthuri Shankar : సీరియల్ నటి కస్తూరిని ఇలా గ్లామర్ లుక్‌లో చూశారా? (ఫోటోలు
-
అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచుతున్న కీర్తి సురేష్
అభినయానికి అడ్రస్ కీర్తి సురేష్ అంటారు. అది అక్షరాల నిజం. మహానటి చిత్రంలో అలాంటి నటనతోనే అందరి నోట శభాష్ అనిపించుకుని జాతీయ ఉత్తమ అవార్డులు గెలుచుకుంది. అలా దక్షిణాదిలో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ భామకు ఆరంభం నుంచే నటనకు అవకాశం ఉన్న పాత్రలు వరిస్తున్నాయి. అలా కొన్ని లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలోనూ నటించి మెప్పించింది. చదవండి: అదృష్టం అంటే త్రిషదే.. ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు ఆ మధ్య తమిళంలో సానికాగితం అనే చిత్రంలో నవరసాలు పండించింది. ఇక ఇటీవల తెలుగులో నానికి జంటగా దసరా చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా నటించి ప్రశంసలు అందుకుంది. మధ్యలో కొన్ని చిత్రాల్లో గ్లామర్ పాత్రలు పోషించినా, ఆమె ఇమేజ్ అవి అంతగా సరిపడలేదు అని విమర్శిస్తున్న వారు ఉన్నారు. అయితే నటి కీర్తి సురేష్ ప్రస్తుతం గ్లామర్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండే ఈమెకు మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వారిని సంతోష పెట్టడానికో, లేక అవకాశాల కోసమో గానీ ఇటీవల ప్రత్యేకంగా ఫొటో సెషన్ నిర్వహించుకుని అందాలను ఎక్స్‌ఫోజ్ చేయడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం తెలిసిందే. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చదవండి:పీవీఆర్ సౌత్ వైస్ ప్రెసిడెంట్ అన్‌స్టాపబుల్ పేరుతో ఆటోబయోగ్రఫీ -
విడాకుల రూమర్స్.. అదే సమస్య అంటూ ఓపెన్ అయిన నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సినిమాల్లో కంటే ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన నిహారిక యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా నిహారిక భర్త చైతన్యకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు భార్యభర్తలిద్దదరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, మొదట చైతన్య పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేయడంతో విడాకుల రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ఇక రీసెంట్గా నిహారిక కూడా ఒక్క ఫోటో మినహా పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేసేసింది. నెట్టింట వీరి విడాకుల రూమర్స్ హాట్‌టాపిక్‌గా మారినా ఇంతవరకు స్పందించని నిహారిక హాట్ ఫోటోషూట్స్‌తో మాత్రం రచ్చ చేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె లేటెస్ట్ ఫోటోలతో ఫిదా చేస్తుంది. తాజాగా డెనిమ్ అవుట్‌ఫిట్‌లో గ్లామర్ ట్రీట్‌తో ఎక్స్‌పోజింగ్‌లో నో కాంప్రమైజ్ అంటూ ఫోటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
దూసుకుపోతున్న గ్లామర్ హీరోయిన్స్.. సక్సెస్ సీక్రెట్స్ ఇవే
-
అందుకే గ్లామర్ పాత్రలు చేయను : వరలక్ష్మీ శరత్‌కుమార్
తమిళసినిమా: డేరింగ్ అండ్ బోల్డ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్. పోడా పోడీ చిత్రం ద్వారా నటుడు శింబుకు కథానాయకిగా పరిచయమైన ఈమె తర్వాతి కాలంలో ట్రెండ్ మార్చుకుని ప్రతినాయకిగా అవతారం ఎత్తారు. అప్పటి నుంచి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ప్రశంసలు, విజయాలు వరిస్తున్నాయి. ఇప్పుడు తమిళంతో పాటు తెలుగు, మలయాళం తదితర భాషల్లోనూ ఈమె కెరీర్ పీక్స్‌లో కొనసాగుతోంది. నాయకిగా, ప్రతినాయకిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఏ పాత్రకైనా రెడీ అంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. తమిళంతో పాటు తెలుగులోనూ వరలక్ష్మి శరత్‌కుమార్‌కు మంచి డిమాండ్ ఉంది. సంక్రాంతి బరిలోకి దిగుతున్న బాలకృష్ణ కథానాయకుడుగా నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో ఈమె విలనిజం ప్రదర్శించారు. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రతినాయకిగా నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవల ఒక భేటీలో బదులిస్తూ గ్లామర్ పాత్రలు తనకు వర్కౌట్ కాదని భావించానని, అయినా అలాంటి పాత్రలు చేయడానికి చాలామంది ఉన్నారని అన్నారు. అందుకే తాను ప్రతినాయక బాటను ఎంచుకున్నానని తెలిపారు. ఇలాంటి కొన్ని పాత్రలు తానే చేయగలనని అభిప్రాయపడ్డారు. అయితే తనకు గురువు, దర్శకుడు బాల అని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో తారై తప్పట్టై చిత్రంలో గరగాటకారిగా నటించి ప్రశంసలు అందుకున్నట్లు చెప్పారు. అయినా తాను ప్రతినాయకి పాత్రల్లో నటిస్తూ సంతోషంగానే ఉన్నానని పేర్కొన్నారు. -
Shruti Haasan: శృతిమించిన అవతారం!
లోకనాయకుడు కమలహాసన్ వారసురాలు శృతిహాసన్ అంటే నిర్మొహమాటానికి నిదర్శనం. గ్లామరస్‌కు చిరునామా అంటారు. ఈ బ్యూటీ ఏం చెప్పినా సంచలనమే. ఏం చేసినా వార్త. వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచే శృతిహాసన్ సంగీత దర్శకురాలిగా, నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈమె హిందీ, తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ బహుభాష నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే శృతిహాసన్‌కు తెలుగులోనే మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణకు జంటగా వీర సింహారెడ్డి ,ప్రభాస్‌తో సలార్ అంటూ క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ఒకేసారి విడుదలకు సిద్ధం అవుతుండటం విశేషం. కాగా శృతిహాసన్‌ను చూడ్డానికి ఎవరైనా ఇష్టపడతారు. అలాంటిది ఎవరికి రుచించని గెటప్‌లో శృతిహాసన్ తన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. సింపుల్ జుట్టుతో కూడిన రోజు. జ్వరం, సైనస్ కారణంగా ఉబ్బిన ముఖం. నెలసరి రోజు వంటి వాటిని మీరు ఇష్టపడతారా అంటూ ఆ ఫొటోలకు కారణాలను పేర్కొన్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో శృతి ఏమిటీ అవతారం? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చదవండి: (రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మీనా.. వరుడు అతడే?) -
హీరో గ్లామర్‌లో కొత్తగా ఈ ఫెసిలిటీ కూడా
ముంబై: లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోహోండా గ్లామర్ 125 సీసీ బైక్‌లో మరొ అధునాత ఫీచర్‌ని హీరో మోటర్ కార్ప్ జోడించింది. మార్కెట్లో గ్లామర్‌కి పోటీగా ఉన్న ఇతర మోడళ్లకు సవాల్ విసిరింది. బ్లూటూత్ ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న 125 సీసీ సెగ్మెంట్లో హీరో గ్లామర్ది ప్రత్యేక స్థానం. మైలేజీ, మెయింటనెన్స్, స్టైలింగ్ విషయంలో బ్యాలెన్స్ చేస్తూ మార్కెట్లోకి వచ్చిన తక్కువ కాలంలోనో ఎక్కువ అమ్మకాలు సాధించింది. డిజిటల్ డిస్ప్లేతో ఆదిలోనే ఆకట్టుకుంది. కాగా తాజాగా గ్లామర్ బైక్‌కి బ్లూటూత్ ఫీచర్‌ని యాడ్ చేసింది హీరో మోటర్ కార్ప్. టీజర్ రిలీజ్ రైడింగ్‌లో ఉన్నప్పుడు మోబైల్‌కి వచ్చే కాల్స్ వివరాలు చూసుకునేందుకు వీలుగా బ్లూటూత్ ఫీచర్‌ని హీరో మోటర్ కార్ప్ జత చేసింది. దీనికి తగ్గట్టుగా మీటర్ కన్సోల్‌లో డిజిటల్ డిస్ప్లే సైజుని కూడా పెంచింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా టీజర్‌ను హీరో మోటర్ కార్ప్ లాంఛ్ చేసింది. మరిన్ని హంగులు బ్లూ టూత్ ఫీచర్‌తో పాటు గ్లామర్ 125 సీసీలో ఎల్ఈడీ ల్యాంప్‌ను మరింత ఆకర్షణీయంగా హీరో మోటర్ కార్ప్ మార్చింది. హెచ్ ఆకారంలోకి హెడ్‌ల్యాంప్‌ని డిజైన్ చేసింది. అదే విధంగా స్పీడో మీటర్ కన్సోల్‌ని ప్తూర్తిగా డిజిటల్‌గా మార్చింది. ప్రస్తుతం మార్కెట్లో హీరోహోండా గ్లామర్ 125 సీసీ ధర రూ.78,900 (ఢిల్లీ, ఎక్స్‌షోరూమ్)గా ఉంది. అప్‌గ్రేడ్ చేసిన గ్లామర్ 125 సీసీని ఈ ఆగస్టులోనే మార్కెట్లో రిలీజ్ కానుంది. Always stay connected. Get ready for a revolutionary ride... Coming Soon. pic.twitter.com/Tmy2DbSFDe — Hero MotoCorp (@HeroMotoCorp) July 25, 2021 -
హీరో మోటోకార్ప్...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ చార్జర్, టర్న్ బై టర్న్ నావిగేషన్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటి హంగులు పొందుపరిచారు. 125 సీసీ బీఎస్–6 ఇంజన్‌తో తయారైంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర డ్రమ్ బ్రేక్స్ వేరియంట్ రూ.78,900, డిస్క్ బ్రేక్స్‌తో రూ.83,500 ఉంది. సాంకేతికత, శైలి, భద్రత కోరుకునే వినియోగదార్ల కోసం దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. 2005లో హీరో గ్లామర్ భారత్‌లో రంగ ప్రవేశం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో దేశీయంగా కంపెనీ 10,24,507 యూనిట్ల మోటార్ సైకిల్స్, స్కూటర్స్‌ను విక్రయించింది. -
గ్లామర్ ఎక్స్ టెక్ బైక్ ను లాంచ్ చేసిన హీరో మోటోకార్ప్
ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ నేడు(జూలై 20) తన గ్లామర్ ఎక్స్ టెక్ బైక్ ను లాంఛ్ చేసింది. హీరో గ్లామర్ ఎక్స్ టెక్ బైక్ రెండు విభిన్న ఆప్షన్ లలో లభిస్తుంది. ఒకటి డ్రమ్ వేరియంట్ అయితే, మరొకటి డిస్క్ వేరియంట్. డ్రమ్ వేరియంట్ ₹78,900కు, డిస్క్ వేరియంట్ ₹.83,700(ఎక్స్ షోరూమ్, హైదరాబాద్) ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. 125 సీసీ కమ్యూటర్ మోటార్ సైకిల్ అనేక ఫీచర్లతో వచ్చింది. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఇంటిగ్రేటెడ్ యుఎస్ బి ఛార్జర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, బ్యాంక్ యాంగిల్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ గేర్ పొజిషన్ ఇండికేటర్, రియల్ టైమ్ మైలేజీ వంటి సమాచారాన్ని చూపిస్తుంది. గ్లామర్ ఎక్స్ టెక్ లో హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్, ఫ్రంట్ 240 మీ.మీ డిస్క్ బ్రేకులు, వెడల్పియర్ రియర్ టైర్, 180 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. డిజైన్ పరంగా హీరో గ్లామర్ ఎక్స్ టెక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ తో వస్తుంది. హీరో గ్లామర్ ఎక్స్ టెక్ బైక్ 125 సీసీ బీఎస్-వీఐ ఎక్స్ సెన్స్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 7,500 ఆర్ పీఎమ్ వద్ద 10.7 బిహెచ్ పీ పవర్ ని, 6,000 ఆర్ పీఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. -
యాంకర్ దేవిక సింగ్ గ్లామర్ ఫోటోలు
-
ఇక గ్లామర్‌కు సై!
సినిమా: హీరోయిన్లకు అభినయం అవసరమే కానీ, ఈ తరంలో అంతకు మించి అందాలారబోత అవసరం. స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవారంతా అంతా గ్లామర్‌ను నమ్ముకున్నవారే. ఈ విషయం కొంచెం ఆలస్యంగా నటి మాళవిక నాయర్‌కు అర్థమైనట్లుంది. ఈ అమ్మడు ఇకపై గ్లామర్‌కు హద్దులు చెరిపేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే రంగప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ పలు కమర్శియల్ యాడ్స్‌లోనూ నటించింది. ఆ తరువాత 2013లో మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా అవకాశాన్ని అందుకుంది. ఇక 2014లో కుక్కూ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయింది. అలా అక్కడ, ఇక్కడా ఒక్కో చిత్రం చేస్తూ వచ్చిన మాళవిక నాయర్ ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకూ వచ్చింది. ఆ తరువాత కల్యాణ వైభోగమే చిత్రాలు చేసినా, తాజాగా టాక్సీవాలాతో మరో మంచి హిట్‌ను అందుకుంది. తమిళంలో కుక్కూ చిత్రంలో అంధురాలిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న ఈ భామ చాలా కాలం తరువాత ఇక్కడ అరసియల్ల ఇదెల్లాం సహజమప్పా చిత్రంలో నటిస్తోంది. మరో పక్క బీఏ చదువుతున్న ఈ అమ్మడు ఇకపై నటనపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. అదేవిధంగా ఇప్పటి వరకూ గ్లామర్‌కు ఆమడ దూరంగా పక్కింటి అమ్మాయి ఇమేజ్ను తెచ్చుకున్న మాళవికనాయర్‌కు ఇప్పుడు కమర్శియల్ హీరోయిన్గా మారాలనే ఆశ పుట్టిందట. అలా కావాలంటే గ్లామరస్‌గా నటించాల్సిందే. అందుకూ సిద్ధమైపోయిందట. ఇకపై ఎలాంటి పాత్ర అయినా హద్దులు మీరని విధంగా అందాలారబోతకు మాళవికానాయర్ సిద్ధం అంటోందని çకోలీవుడ్ వర్గాల టాక్. -
గ్లామర్ సీక్రెట్స్ బయటపెట్టిన తమన్నా
సాధారణంగా హీరోయిన్లు ఎంత పెద్ద స్టార్డమ్తో వెలిగిపోతున్నా ఇప్పటికీ అమ్మ చాటు బిడ్డల్లానే ప్రవర్తిస్తుంటారు. వారికి ఏం కావాలన్నా, ఏం చేయాలన్నా అమ్మ ఆలోచనలు, సలహాలే తీసుకుంటారు. అంటే వారికంటూ వ్యక్తిత్వం ఉండదా? అన్న ప్రశ్నను పక్కన పెడితే చాలా మంది అలానే ప్రవర్తిస్తుంటారు. నటి తమన్నా విషయానికొస్తే నేనూ అంతే అని చెప్పకనే చెప్పింది. బాహుబలి చిత్రానికి ముందు పలు కమర్శియల్ చిత్రాల్లో నటించినా, ఆ చిత్రం తమన్నాకు తెచ్చి పెట్టిన ఇమేజ్ వేరు. ఇంకా చెప్పాలంటే బాహుబలితో ఈ మిల్కీబ్యూటీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిందనే చెప్పాలి. ప్రస్తుతం క్వీన్ చిత్ర తెలుగు వెర్షన్లో నటిస్తున్న తమన్నా, చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇక తమిళంలో ప్రభుదేవాతో దేవి–2 చిత్రంలో మరోసారి రొమాన్స్ చేస్తోంది. తన అందం గురించి ఈ బ్యూటీ తెలుపుతూ సినిమా గ్లామర్ ప్రపంచంగా పేర్కొంది. ఇక్కడ అందం ముఖ్యమని, అయితే అంతకంటే ముఖ్యం ప్రతిభ అని పేర్కొంది. ప్రతిభ ఉంటేనే ఇక్కడ నాలుగు కాలాల పాటు నిలబడగలమని అంది. తననే తీసుకుంటే 10 ఏళ్లకు పైగా నటిగా రాణిస్తున్నానని చెప్పింది. అయినా మీ అందం ఏ మాత్రం తగ్గలేదని చాలా మంది అంటుంటారని, మీ సౌందర్య రహస్యం ఏమిటని అడుగుతుంటారని చెప్పింది. నిజం చెప్పాలంటే తాను అందానికి ఎక్కువ మెరుగులు దిద్దుకోను అని పేర్కొంది. ఇక షూటింగ్ ముగిసి ప్యాకప్ అనగానే మేకప్‌ను తుడిచేసి సాధారణ అమ్మాయిగా మారిపోతాను అని చెప్పింది. ఇంట్లో ఉంటే సాధారణ అమ్మాయిలు సౌందర్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో తానూ అంతేనని చెప్పింది. అయితే తాను నటిని కావడంతో అందాలను ఎలా కాపాడుకోవాలన్నది బాగా తెలుసుని చాలా మంది అనుకుంటారని అంది. కానీ తాను ఇప్పటికీ అందం విషయంలో తన తల్లి ఆలోచనలనే అమలు పరుస్తానని చెప్పింది. అలా అందం విషయంలో పాత పద్ధతులనే పాటిస్తానని అంది. అవి కూడా షూటింగ్ సమయంలోనే ఇతర సమయాల్లో పెద్దగా పాటించనని తమన్నా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ అమ్మడు చెప్పేవి నమ్మశక్యంగా ఉన్నాయంటారా? ఆ విషయాన్ని మీకే వదిలేస్తున్నాం. -
గ్లామర్‌పై రష్మి షాకింగ్ కామెంట్స్ !
-
బికినీలో బెస్ట్‌గా కనిపించాలని...
వెండితెరపై కథానాయికలు చిట్టి పొట్టి దుస్తుల్లో, నిండైన చీరల్లో... ఎలా ప్రత్యక్షమైనా చూడ్డానికి పసందుగా ఉంటుంది. అందుకే హీరోలు లేకుండా సినిమాలు వస్తాయి కానీ, హీరోయిన్ లేని సినిమా దాదాపు ఉండదు. గ్లామర్‌కి అంత పవర్ ఉంటుంది మరి. కానీ, చిన్ని చిన్ని డ్రెస్సుల్లో కనిపించాలంటే ఖలేజా ఉండాలి. ఎందుకంటే, శరీరాకృతి బాగా లేకపోతే విమర్శలపాలు కావాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కృతీ సనన్ కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నారట. విషయం ఏంటంటే.. ప్రస్తుతం నటిస్తున్న ‘రాబ్తా’ చిత్రంలో ఆమె బికినీలో దర్శనమివ్వనున్నారట. బికినీలో కనిపించడం అంటే ఓ సాహసమే. ఎక్కడి కొలతలు అక్కడ కరెక్ట్‌గా ఉండాల్సిందే. ప్రస్తుతం ఆ కొలతల కోసమే ఆమె వర్కవుట్ చేస్తున్నారట. బికినీలో వీలైనంత బెస్ట్‌గా కనిపించాలనే పట్టుదలతో ఉన్నారని బాలీవుడ్ టాక్. మామూలుగానే కృతి శరీరాకృతి బాగుంటుంది. బికినీ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయితే కత్తిలా ఉంటారని చెప్పొచ్చు. ఈ తరం నాయికల్లో కరీనా కపూర్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, ఆలియా భట్ వంటి వాళ్లు బికినీల్లో దర్శనమిచ్చి భేష్ అనిపించుకున్నారు. కృతీ సనన్ కూడా కితాబులు కొట్టేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆమె కసరత్తుల గురించి తెలిసినవాళ్లు అంటున్నారు. -
నన్ను అందుకే వాడుకుంటున్నారు
నన్ను గ్లామర్‌కే వాడుకుంటున్నారని తెగ బాధ పడిపోతోంది నటి క్యాథరిన్ ట్రెసా. కోలీవుడ్‌లో గట్టి పోటీ ఉన్నా అవకాశాలను బాగానే రాబట్టుకుంటోంది ఈ అమ్మడు. తెలుగులో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అందాలారబోతలో దుమ్మురేపిన ఈ దుబాయ్ బ్యూటీ తమిళలోకొచ్చేసరికి మెడ్రాస్ చిత్రంలో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో బాగానే నటించింది. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఇకపై అలాంటి నటనకు అవకాశం ఉన్నా మంచి పాత్రలు వస్తాయని ఆశించింది. అయితే అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటి అన్నట్టుగా క్యాథరిన్ పరిస్థితి మారింది. ఆ తరువాత విశాల్ సరసన కథకళి, అధర్వతో కణిదన్ చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు విజయం సాధించినా వాటిలో ఈ అమ్మడు గ్లామర్‌డాల్ పాత్రలకే పరిమితమైంది. దీంతో ఎంతో బాధ పడిపోతున్న క్యాథరిన్ ట్రెసా తనను దర్శక నిర్మాతలు గ్లామర్‌కే వాడుకుంటున్నారని తెగ ఇదైపోతోంది. మోడ్రన్ పేరుతో కురచ దుస్తులు ధరింపజేస్తున్నారని వాపోతోంది. గ్లామరస్ పాత్రలతో అభిమానులు పెరుగుతున్నారన్నది కాస్త సంతోషంగా ఉన్నా మరీ అలాంటి పాత్రలకే ట్రేడ్ మార్క్‌గా మార్చేయడం బాధగా ఉందని పేర్కొంది. ఎన్ని చిత్రాలు చేశామన్నది కాకుండా ఎంత మంచి పాత్రలు పోషించామన్నదే లెక్కకొస్తుందనీ అలా చెప్పుకునే మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని క్యాథరిన్ ట్రెసా అంటోంది.నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభిస్తే తన సత్తా చాటుకుంటానని పేర్కొంది. -
బ్యాక్ లెస్... బ్యూటీ మోర్!
‘‘ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అదే చేయాలి. లేకపోతే హర్ట్ అయిపోతారు’’ అని కొంతమంది కథానాయికలు చెబుతుంటారు. ‘ఫలానా సినిమాలో గ్లామర్ పరంగా కొంచెం హద్దు దాటినట్లున్నారు?’ అనే ప్రశ్నకు కథానాయికలు సర్వసాధారణంగా చెప్పే జవాబు అది. ఒకప్పుడు నిండైన చీరకట్టులో కనిపించిన తారలు.. అప్పుడప్పుడు మాత్రం కురచ గౌనుల్లోనూ, ఉల్లిపొర లాంటి చీరల్లోనూ కనువిందు చేసేవారు. ఇప్పుడు మామూలుగానే ట్రెండ్ మారింది. దాంతో, బట్టల నిడివి తగ్గడం సాధారణమైంది. నడుము, నాభి చూపించడం సర్వసాధారణమైంది. నిన్న మొన్నటివరకూ ముందు వైపు అందాలనే ప్రదర్శించిన తారలు ఇప్పుడు బ్యాక్ పై దృష్టి పెడుతున్నారు. పాటల్లో కొన్ని సెకన్ల పాటు వీపు భాగం చూపిస్తున్న తారలు విడిగా అవార్డుల ఫంక్షన్లలో ఇంకా రెచ్చిపోతున్నారు. హాలీవుడ్ స్టయిల్లో పొడవాటి గౌనుల్లో దర్శనమిస్తున్నారు. వీపు అంతా కనిపించేలా వెనక భాగంలో దాదాపు నడుము నుంచి మాత్రమే బట్టలు ఉండేలా ఆ గౌన్లను డిజైన్ చేయించుకుంటున్నారు. అలా ఈ మధ్యకాలంలో వీపు అందాలను చూపించి, వార్తల్లో నిలిచినవాళ్లల్లో తాప్సీ, రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా, రాశీ ఖన్నా తదితరులు ఉన్నారు. వీళ్ల బ్యాక్ బ్యూటీ చూడకుండా, వెనకెనకే ఫాలో కాకుండా ఉండడం కుర్రకారుకు కష్టమే. ఆ సంగతి అలా ఉంచితే... ఇలా పొదుపైన బట్టలు వాడుతున్న తారలు పిసినారులని మాత్రం అనుకోకండి. ఒక్కో గౌను ఖరీదు మినిమమ్ 50 వేల రూపాయల నుంచి మొదలవుతుంది. కొన్నిటి ధర అయితే, లక్ష పైగానే ఉంటుందట -
క్రేజీగా అమ్మాయిలు... ఈజీగా మోసాలు
ఇంగ్లిష్‌లో కాన్టెస్ట్ అంటే పోటీ. కాన్ అంటే మోసం. కాన్-టెస్ట్ అంటే మరి మోసం చేసే పోటీ అన్నట్టేగా! ఆడపిల్లల్ని బురిడీ కొడుతున్న ఎన్నో కాన్-టెస్ట్‌లు ఉన్నాయి జాగ్రత్త. అందాల వేట జోరు మీదుంది. కళాశాలా, షాపింగ్మాలా అనే తేడా లేదు. పబ్బులా, క్లబ్బులా అనే వ్యత్యాసమూ లేదు. ఎందెందు వెతికినా అందందే అన్నట్టుగా కొనసాగుతోంది అందగత్తెల అన్వేషణ. కిరీట ధారులై కిలకిలమంటున్న కాంతల నవ్వులతో నగరాలు హిస్టీరియా పూనినట్టు ఊగిపోతున్నాయి. ‘బ్యూటీ’ పథం వేగం చూస్తూంటే వీకెండ్స్‌లో ఏ మూవీకి వెళదాం అనేంత సహజంగా ఏ బ్యూటీ పెజెంట్కు వెళదాం అని అడిగే రోజులు వస్తాయేమోననే సందేహం. అయితే లెక్కకు మిక్కిలిగా జరుగుతున్న అందాల పోటీలన్నీ అందలాలెక్కించేవేనా? అథఃపాతాళానికి తోసేవి ఏమీ లేవా? అంటే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం, సమయం, సందర్భం కూడా వచ్చేశాయి.మిస్ ఢిల్లీ నుంచి మిస్ గల్లీ దాకా రకరకాల టైటిల్స్ అనౌన్స్ చేస్తూ ఎడా పెడా నిర్వహిస్తున్న కాంటెస్ట్‌లతో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే విలువైన సమయంతో పాటు మరెన్నో కోల్పోవాల్సి వస్తుందని గ్లామర్ రంగ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. క్రేజీగా అమ్మాయిలు... ఈజీగా మోసాలు ఒకప్పుడు దేశీయంగా తెల్సిన ఏకైక బ్యూటీ కాంటెస్ట్ మిస్ ఇండియా. దాని తర్వాత మిసెస్ ఇండియా, గ్లాడ్రాగ్స్; మిస్ సౌతిండియా నుంచి మిస్ హైదరాబాద్, మిస్ తెలంగాణ మిస్ గుజరాతీ ఇలా ఏరియాల వారీగా, కమ్యూనిటీల వారీగా కూడా వచ్చేశాయి. ఇక్కడే వీటిని మార్కెట్ చేసుకునేవారు అడ్డదారులు తొక్కడానికి అందమైన బాట ఏర్పడింది. ఒకప్పటితో పోలిస్తే సినిమా, మోడలింగ్ రంగాలకు తొలి మెట్టు అని భావించే ఈ పోటీల్లో పాల్గొనేందుకు యువతులు బాగా ముందుకొస్తున్నారు. బ్యూటీ ఈవెంట్స్ వాణిజ్యపరంగానూ లాభదాయకంగా మారాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచార ం అందించే మార్గాలుగా కూడా ఉపకరిస్తున్నాయి. కాస్తంత ముందస్తు ప్రచారం తోడైతే బోలెడన్ని అప్లికేషన్లు, కోకొల్లలుగా అభ్యర్థులు, ఇబ్బడిముబ్బడిగా స్పాన్సర్లు... దీంతో చిన్నా చితకా ఈవెంట్ మేనేజర్లు అందరూ కాంటెస్ట్ ముసుగులో దోపిడీకి దిగుతున్నారు. బ్యూటీఫుల్...బీకేర్ ఫుల్... అద్దం అబద్ధం చెప్పదు. అందాల కిరీటం అబద్ధం చెప్పొచ్చు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ట్రెండ్స్‌లో అడుగు కలపడంలో తప్పులేకపోయినా, మార్కెట్ మాయలో పావులుగా మారకుండా జాగ్రత్త పడాలి. దశల వారీ పోటీ, గ్రూమింగ్ సెషన్ల పేరుతో కొన్ని రోజుల పాటు యువతులను పూర్తిగా తమ ‘ఆధ్వర్యం’లో ఉండేలా చూసుకుంటున్నారు నిర్వాహకులు. ఆ సమయంలోనే ‘ఫలానా బ్యూటీ పేజెంట్‌లో పార్టిసిపెంట్స్ ఫలానా షోరూమ్‌లో...’ అంటూ ప్రచారం చేస్తున్నారు. అలా రకరకాల కమర్షియల్ ఈవెంట్స్‌లో అమ్మాయిలను పాల్గొనేలా చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఈ సమయంలో అమ్మాయిలు వీరు చెప్పినట్టు ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప మరేమీ చేయలేరు. ఇక టైటిల్స్ మోసాలు సరేసరి. ఇటీవల జరిగిన ఓ కాంటెస్ట్‌లో నిర్వాహకులు తమ స్వంత వారికే టైటిల్‌ను దక్కించుకునేలా చేస్తే, మరో సంస్థ విజేతకు ప్రైజ్‌మనీ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టింది. చాలా రకాల పోటీలు ప్రకటనలకే పరిమితమవుతూ స్పాన్సర్స్ వస్తే ఓకే లేకపోతే లేదు అన్నట్టుంటున్నాయి. అందాల పోటీలో గెలిచినా, ఓడిపోయినా నష్టం లేదు. అయితే చదువు, తెలివితేటలూ ఉండీ వంచనకు గురైతే అది జీవితకాలం వెంటాడే చేదు జ్ఞాపకం అవుతుంది. ఆ పరిస్థితి రాకుండా అమ్మాయిలు తెలివితేటలతో ముందడుగు వేయడమే నిజమైన గెలుపు. ఆ అమ్మాయిది విజయవాడ. మోడలింగ్‌లో కెరీర్ ఎంచుకుంది. ఓ బ్యూటీ కాంటెస్ట్‌కు అప్లయ్ చేసింది. హైదరాబాద్‌లో ఆడిషన్ల ప్రక్రియ తర్వాత ఆమె ఎంపికయినట్టు ప్రకటించారు. తుది పోటీలలో పొల్గొనేందుకు అర్హత ధ్రువీకరణ పత్రాలు పంపిస్తామన్నారు. సరేనని ఇంటికొచ్చేశాక ఆమెకు వచ్చిన ఫోన్లు ఆమె కంటి మీద కునుకును కరవు చేశాయి. నిర్వాహకుల తరపున ఇద్దరు వ్యక్తులు ఆమెకు ఫోన్ చేసి తమ ‘అవసరాల’ను ఏకరవు పెట్టడం, అవి తీరిస్తే ైటె టిల్ తథ్యమని, ఆ తర్వాత ఏకంగా ఎక్కడికో ఆమె వెళ్లిపోతుందని చెప్పడం మొదలుపెట్టారు. సంప్రదాయ కుటుంబానికి చెందిన ఆమె మనసును నిభాయించుకుని... ఆ పోటీకి గుడ్‌బై చెప్పేసింది. కాకినాడకు చెందిన మరో అమ్మాయి హైదరాబా ద్‌కు వచ్చి, నాలుగైదు బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొ ంది. చివరకి ఒక సంస్థ వారు ఏదో నామ్‌కే వాస్తే టైటిల్ ఆమె చేతిలో పెట్టి, ఏడాది పాటు తమ ఆధ్వ ర్యంలో పనిచేయాల న్నారు. ఆ తర్వాత సిని మాలో ఛాన్స్ అంటూ ‘యువ నిర్మాతల’కు పరిచ యం చేశారు. కొన్ని నెలలు వారి చేతిలో కీలుబొమ్మలా మారాక... కొన్ని రోజులు ఓ రెస్టారెంట్లో సైతం పని చేసిన ఆ యువతి నర్సుగా పనిచేసే తల్లి ఏడ్చి మొత్తుకున్నాక తిరిగి తన ఊరుకు వెళ్లిపోయింది.ఇటీవలే ఒక బ్యూటీ ఈవెంట్లో టైటిల్ సాధించిన అందాల రాణికి ఆర్నెల్లుగా ప్రైజ్‌మనీ సంగతి అటుంచి, ధృవీకరణ పత్రం కూడా ఇవ్వకుండా నిర్వాహకులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. అందాల పోటీల్లో పాల్గొనాలకునే అమ్మాయిలకు కొన్ని సూచనలు మోడల్‌గా రాణించాలంటే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఫిజిక్ లేకపోయినా పర్లేదు మా కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు అంటే నమ్మవద్దు.ఎంట్రీ ఫీజు కింద వేల రూపాయలు కట్టమంటే ఆదరబాదరా కట్టనవసరం లేదు.ఈ పోటీలలో అనుమతి, రిజిస్ట్రేషన్ లేనివాటిని గుర్తించాల్సిన బాధ్యత అమ్మాయిలదే.పబ్‌లు, లాంజ్బార్లను వేదికగా చేసుకుని నిర్వహించే పోటీలకు దూరంగా ఉండడమే మేలుటాప్ మోడల్స్‌ను, స్టార్స్‌ను తీసుకొచ్చినంత మాత్రాన గొప్ప సంస్థలు అనుకోవద్దు. సెలబ్రిటీలు తమ రెమ్యునరేషన్ తీసుకుని ప్రకటన వరకూ మాత్రమే పరిమితమవుతారు. ఆ తర్వాత వారికి ఆ ఈవెంట్ బాధ్యత ఉండదు. గ్లామర్ రంగంలో రాణించాలనా? టైంపాస్కా అనేది ముందు నిర్ణయించుకోవాలి.పోటీ నిర్వాహకులు ఎవరు? నిర్వాహక సంస్థ గత చరిత్ర ఏమిటి? ఆ కాంటెస్ట్‌లో గెలిస్తే వారందించే ప్రయోజనాలకు హామీ ఏమిటి? వగైరా విషయాలు సమగ్రంగా తెలుసుకోవాలి.కాంటెస్ట్ నిర్వహణ సందర్భంగా గ్రూమింగ్ సెషన్ల కోసమో, మరొకటో అంటూ నిర్వాహకులు దూరప్రాంతాలకు తీసుకెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్వాహకులపై ఎటువంటి సందేహాలు తలెత్తినా, పోటీలో నిర్ణయాలు సరిగా తీసుకోవడం లేదు అనిపించినా వెంటనే వాటిపై ప్రశ్నించాలి. మౌనం వహించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువఅప్లయ్ చేసినప్పటి నుంచి ప్రతి దశలో తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తూ, వీలైతే వారిలో ఎవరో ఒకరు మీ వెంటే ఉండేలా చూసుకోవాలి. - ఎస్.సత్యబాబు -
శ్రీదివ్య చూపు గ్లామర్ వైపు
నటి శ్రీదివ్య పేరు చెప్పగానే మంచి హోమ్లీ నటి అనే అంతా అంటారు. ఆమె ఇప్పటి వరకూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ కథా పాత్రలనే పోషించి సక్సెస్ అయ్యారు. కోలీవుడ్‌లో శ్రీదివ్య నటించి విడుదలైన తొలి చిత్రం వరుత్తపడాద వాలిభర్ సంఘం అనూహ్య విజయాన్ని సాధించింది.ఆ తరువాత నటించిన జీవా,వెళ్లైకారదురై, కాక్కిసట్టై చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. అధర్వతో నటించిన ఈటీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. వాటిలో కార్తీ సరసన నటిస్తున్న కాష్మోరా చిత్రం ఒకటి. కాగా ఈ తెలుగమ్మాయికి నటి కీర్తీసురేశ్‌తో పెద్ద చిక్కే వచ్చిపడిందట. ఈ మలయాళీ బ్యూటీ హోమ్లీ పాత్రలు ఎంపిక చేసుకుంటూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను పొందుతుండడంతో నటి శ్రీదివ్యకు వస్తాయని ఆశించి అవకాశాలు కీర్తీసురేశ్‌ను వరిస్తున్నాయట. దీంతో ఆలోచనలో పడ్డ శ్రీదివ్య కొత్త నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదట. అదేమిటో తెలుసా?ఇకపై తన పంథాను మార్చుకుని గ్లామర్ వైపు దృష్టి సారిస్తున్నారట. ఇప్పటి వరకూ హోమ్లీ ఇమేజ్ రుచి చూసి శ్రీదివ్య ఇక గ్లామర్ సంగతి చూడాలనుకుంటున్నారట. -
ఆ విమర్శలు చాలవు
సాధారణంగా నటీమణులపై విమర్శలు చేస్తే వారు అగ్గిమీద గుగ్గిలం అవుతారు. అయితే నటి రాధిక ఆప్తే అందుకు విరుద్ధం అని చెప్పక తప్పదు. ఈ త్తరాది భామ ఏమంటుందో చూడండి. నాపై విమర్శలు చాలానే వస్తున్నాయి. ఇవి చాలవు ఇంకా ఘాటైన విమర్శలు ఆశిస్తున్నాను. నా చిత్రాల ఎంపికను, గ్లామర్ నటనను పలువురు పలు రకాలుగా విమర్శిస్తున్నారు.తా జాగా కమర్షియల్ చిత్రాలనే ఎంచుకుంటున్నావేంటని ప్రశ్నిస్తున్నారు. అలాంటి చిత్రాలే నటీనటుల స్థాయిని పెంచుతాయి. అదే విధంగా గ్లామర్‌గా నటించకుంటే నటిగా నిలబడడం కష్టం. కమర్షియల్ చిత్రాలు చెయ్యడానికి ఇదే లెక్క. కమర్షియల్ చిత్రాలు అంటే చాలదు అందుకు తగిన మషాలా జోడించాలి. కోట్ల రూపాయల పెట్టుబడులతో చిత్రం తయారవుతోంది. అంత డబ్బు ఆషామాషీగా ఖర్చు పెట్టలేరు. అన్నింటికీ లెక్కలు ఉంటాయి. నాపై వస్తున్న విమర్శల గురించి అడుగుతున్నారు. సద్విమర్శలు మనోబలాన్ని పెంచుతున్నాయి. అలాగే ఘాటైన విమర్శలను ఎదుర్కొంటున్నాను. వీటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి మిశ్రమ విమర్శలను మరిన్ని ఆశిస్తున్నాను అని ఈ సంచలన నటి అంటోంది. ఈ అందాల భామ త్వరలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జతకట్టడానికి సిద్ధం అవుతోంది. -
హీరోయిన్లు గ్లామర్ కోసమే
హీరోయిన్లను దక్షిణాది చిత్ర పరిశ్రమలో గ్లామర్ కోసమే వాడుకుంటున్నారని నటి నిత్యామీనన్ మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. ఏ విషయమైనా నిర్మొహమాటంగా మాట్లాడే ఈ కేరళ కుట్టికి పొగరుబోతు అనే పేరు కూడా ఉంది. అలాంటి నిత్యమీనన్ ఇటీవల వరుసగా మూడు విజయాలను అందుకున్న ఆనందంలో మాట్లాడుతూ సమీపంలోని నటించిన మూడు చిత్రాలు విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఈ మూడు చిత్రాల్లోనూ వైవిధ్యభరిత పాత్రలు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ కాదల్ కన్మని(ఒకే బంగారం)లో నటించడం మరచిపోలేని అనుభవంగా వ్యాఖ్యానించారు. అయితే ఆ చిత్రంలో కంటే లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన-2లో వికలాంగ యువతిగా నటించడం బాగా నచ్చిందన్నారు. అది దెయ్యం ఇతివృత్తంతో తెరకెక్కినా తన పాత్రను చాలెంజ్‌గా తీసుకుని నటించానన్నారు. తాను నటించే చిత్రాల్లో కొన్ని నిబంధనలు విధించుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా చిత్ర స్క్రీన్‌ప్లే నచ్చకుంటే అందులో నటించే ప్రసక్తే లేదన్నారు. సినిమా కథను ఎలా చెబుతున్నారన్నది ముఖ్యం అన్నారు. కథా పాత్రతో పాటుగా కథనం చిత్రానికి ముఖ్యం అని అన్నారు. మరో విషయం ఏమిటంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోల ఆధిక్యం కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. హీరోయిన్లను గ్లామర్ కోసమే ఉపయోగించుకుంటున్నారన్నారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. హీరోయిన్లకు ప్రాముఖ్యతను ఇవ్వాలని నిత్యామీనన్ విజ్ఞప్తి చేశారు. -
హాట్... హాట్‌గా అలియా!
‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ చిత్రంలో ఆలియా భట్ అందాలు చూసి ఫ్లాట్ కాని కుర్రకారు లేరేమో. దర్శక, నిర్మాత కరణ్‌జోహార్ తెరకెక్కించిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆలియా భట్ గ్లామర్ కూడా ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందనడంలో అతిశయోక్తి కాదేమో. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ మొదటి చిత్రమైనా ఆలియా భట్ బికినీలో అందాలు ఒలికించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఇప్పుడు మళ్లీ కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘షాన్ దార్’ చిత్రంలో ఆలియా బికినీలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. ‘క్వీన్’ ఫేం వికాస్ బెహల్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్‌కపూర్ హీరోగా నటిస్తున్నారు. -
నో గ్లామర్.. ఓన్లీ యాక్టింగ్
-
అంత కసి ఎందుకు కంగనా?!
గాసిప్ కంగనా రనౌత్ అంటే గ్లామర్ స్టార్ అనేవారు మొదట్లో. కానీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ క్వీన్ అంటున్నారు. ఫ్యాషన్, తను వెడ్స్ మను, క్వీన్ లాంటి చిత్రాలతో నటిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించి జాతీయ అవార్డును సైతం అందుకుంది కంగనా. అయితే అందుకు సంతోషపడాల్సింది పోయి... అనవసరంగా పాత విషయాలన్నీ తవ్వుతోంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న నాటి నుంచి ప్రతి ఇంటర్వ్యూలోనూ తనను చాలామంది ఎదగనివ్వలేదని, అయినా కష్టపడి ఎదిగానని చెప్పుకుంటోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అయితే... నన్ను వెన్నుపోటు పొడవాలని చూసినవాళ్లు, వెనక్కి లాగాలని చూసినవాళ్లు అంటూ ఇండస్ట్రీలోని కొన్ని పెద్ద తలకాయలను టార్గెట్ చేసి మాట్లాడింది. దాంతో ఆ పెద్దలు రుసరుసలాడుతున్నారని సమాచారం. ఇక్కడ నటించడం తెలిస్తే చాలదు, ప్రవర్తించడం కూడా తెలియాలి అని కొందరు కంగనాకి సలహా కూడా ఇస్తున్నారట. కంగనా ఆ సలహాను పాటిస్తుందో లేదో మరి! -
గ్లామర్‌కు మెరుగులు
విశ్వనాయకుడు కమలహాసన్ కుటుంబం నుంచి ప్రస్తుత చివరి నట పయనం అక్షరహాసన్. ఈమె కూడా తన అక్క శ్రుతిహాసన్ మాదిరిగానే తన నట జీవితానికి బాలీవుడ్ నుంచే శ్రీకారం చుట్టారు. అయితే శ్రుతిహాసన్‌లా కాకుండా అక్షర తొలి చిత్రంతోనే పలువురు ప్రశంసల్ని, మంచి విజయాన్ని అందుకున్నారు. షమితాబ్లో ఒక సహాయ దర్శకురాలిగా సహజమైన నటనను ప్రదర్శించి ఆ పాత్రకు జీవం పోశారు. బాలీవుడ్ బిగ్‌బి, కోలీవుడ్ సీనియర్నటుడు ధనుష్‌ల మధ్య నటించడం అంత అషామాషి విషయం కాదు. అయినా అక్షర తన పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఫలితం కోలీవుడ్, బాలీవుడ్‌లలో పలు అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయట. అయితే చిత్రాల ఎంపిక విషయంలో ఏ మాత్రం తొందరపడని అక్షరహాసన్ తన అందాన్ని పెంచుకునే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం. తొలి చిత్రం సమయంలో తన రూపంలోను, ధరించే దుస్తులపైనా ప్రత్యేక దృష్టి సారించని అక్షర చుట్టూ ప్రస్తుతం శారీరక కసరత్తులు, శిక్షకులు, కేశాలంకారణ నైపుణ్యాలు అందాన్ని మెరుగులు దిద్దే నిపుణులు అంటూ ఒక పెద్ద బృందమే చేరిపోయిందట. వీరంతా అక్షరను బాలీవుడ్ ఇండస్ట్రీకి తగ్గ ఫిగర్‌గా మార్చి చూపిస్తామని వాగ్దానాలు కూడా చేసేశారట. సమీప కాలంలో ఈమె ముంబయిలో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రముఖ మోడల్స్‌తో కలిసి కవాత్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరచారట. ఈ విషయం గురించి అక్షర తెలుపుతూ ఒక నటికి దుస్తులు, అలంకార వస్తువులపై శ్రద్ధ ఎంత అవసరం అన్నది తెలుసుకున్నానన్నారు. ఒకపక్క గ్లామర్‌లో తన సోదరి శ్రుతి దుమ్మురేపుతుండడంతో అక్షరకు అలాంటి ఆశ పుట్టడమే మార్పుకు కారణం కావచ్చునంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
నేనొక ప్రేమ పిపాసిని...
గ్లామర్ పాయింట్ ‘మీరెప్పుడైనా ప్రేమలో పడ్డారా?’ అని ఎవరైనా అడిగితే- ‘కొత్తగా పడడం ఏమిటి? ప్రేమలోనే ఉన్నాను’ అంటాను. ‘పేరు చెప్పండి?’ అంటారు ఆసక్తిగా. ‘అమ్మానాన్నా’ అంటాను! ‘ఇదీ ప్రేమ’ అని చెప్పడానికి ప్రత్యేక కొలమానాలు ఏవీ లేవు. నిజానికి నాకు ‘ప్రేమ’ అంటే ఏమిటో బొత్తిగా తెలియదు. కానీ ఆ మాటను ప్రేమిస్తాను. తెలియకపోయినా దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రేమ అనేది స్వేచ్ఛా ప్రవాహంలాంటిది. అది మనల్ని ఒక స్వతంత్ర స్థితికి తీసుకువెళుతుంది. సానుకూలశక్తిని పెంపొందిస్తుంది. ప్రేమ... ప్రతి తరానికి కొత్తగానే ఉంటుంది. ప్రస్తుతం మాత్రం నేను తల్లిదండ్రుల ప్రేమలో ఉన్నాను. అది షరతులు లేని ప్రేమ. అన్ని ప్రేమల్లోకెల్లా గొప్ప ప్రేమ! - శ్రద్ధా కపూర్ -
అవును... నాక్కొంచెం తిక్కుంది!
గ్లామర్ పాయింట్ బెబో (కరీనా కపూర్) మాట్లాడినా అందమే, మాట్లాడకపోయినా అందమే. మాట్లాడితే మాత్రం ఎలాంటి మొహమాటాలు లేకుండా మాట్లాడుతుంది. ఆమె మాటల్లో కొన్ని... ‘సినిమానే నా ప్రపంచం...సినిమానే తాగుతాను, తింటాను...’ ఇలా ఏవేవో అంటూ ఉంటారు. నేను మాత్రం ఈ టైప్ కాదు. సినిమాకు అవతల చాలా ప్రపంచం ఉంది అనుకుంటాను. అందుకే నేను నటించిన సినిమాలను చూడడానికి కూడా ఇష్టపడను. సైఫ్‌కు నాకు మధ్య సినిమాల ప్రస్తావన ఎప్పుడూ రాదు. ఎందుకంటే సినిమాలే మా జీవితం కాదు ‘గోరి తేరే ప్యార్ మే’ సినిమాలో ‘కాస్త తిక్క ఉన్న అమ్మాయి’ పాత్రలో నటించాను. నిజజీవితంలో కూడా నేను అంతే. ఒక ప్రాజెక్ట్ నాకు నచ్చకపోతే ఎన్ని విధాలుగా చెప్పినా సరే నేను ‘నో’ అంటూనే ఉంటాను. అందుకే కొందరు నా గురించి ‘‘ఈ అమ్మాయికి కొంచెం తిక్క ఉంది’’ అని అనుకుంటారు! ‘ఇంత అందమైన జీవితం ఇచ్చావు. దేవుడా నీకు కృతజ్ఞతలు’ అని నేను ఎప్పుడూ చెప్పను. కాకపోతే ఒక కోరిక మాత్రం ఉంది. నేను అరవై సంవత్సరాల్లోకి ప్రవేశించినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే... నన్ను నేను ‘యాక్టర్’గా గుర్తు తెచ్చుకోవాలి తప్ప ‘స్టార్’గా కాదు. ఎందుకంటే స్టార్లు వస్తుంటారు పోతుంటారు... నిలబడేది మాత్రం యాక్టరే! -
అనుష్క కొత్త నిర్ణయం!
గ్లామర్‌తో యూత్‌కి కిక్ ఎక్కించిన అనుష్కకు క్షణం తీరికలేదు. లేడీ ఓరీయంటెడ్ మూవీలతో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఇటు టాలీవుడ్‌ని అటు కోలీవుడ్‌ని ఈ గద్వాల్ రాణి ఏలేస్తోంది. కింగ్ నాగార్జున సరసన 'సూపర్' సినిమాలో నటించి అనుష్క టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఒక వైపు గ్లామర్ రోల్స్‌లో నటిస్తూ మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌కి చేరుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్స్‌లో అనుష్క నటిస్తోంది. సినిమాల షూటింగ్‌ల కోసమే కాకుండా, ఆ పాత్రల కోసం రిహార్సల్స్ కోసం తెగ శ్రమిస్తూ క్షణం తీరికలేకుండా పని చేస్తోంది. టాలీవుడ్లో బాహుబలి, రుద్రమదేవి, కోలీవుడ్‌లో లింగా, అజిత్-గౌతమ్ మీనన్ సినిమాలతో అనుష్క బిజీబిజీగా ఉంది. భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగులో నటనకు ఆస్కారమున్న పాత్రలు, తమిళంలో గ్లామర్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించాలని నిర్ణయం తీసుకుందట. తన మనసులోని మాటను దర్శకులకు, నిర్మాతలకు కూడా చెప్పేసినట్లు సమాచారం. ఇక నుంచి దర్శకనిర్మాతలు అనుష్కతో సినిమా తీయాలంటే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ** -
కోటిస్తే.. ఆరబోస్తా
సినిమా అనేది గ్లామర్ ప్రపంచం అయితే అందులో గ్లామర్‌ను హీరోయిన్లు సాదకంగా వాడుకుంటూ పారితోషికాన్ని పెంచుకుపోతున్నారు. ప్రస్తుతం కొన్ని మంచి కథా చిత్రాలు వస్తున్న గ్లామర్ డిమాండ్ గ్లామర్దే. కాకపోతే నిన్నగాక మొన్న వచ్చిన నటి లక్ష్మీమీనన్ కోటి రూపాయల పారితోషికం తీసుకునే హీరోయిన్ల క్లబ్లో చేరడానికి తహతహలాడుతుండటమేమిటి! కుంకి చిత్రంలో కొండవాసి పడతిగా మంచి అభినయాన్నే ప్రదర్శించిన ఈ మళయాళ భామ అలా మరో రెండు చిత్రాల్లో నటించిందో లేదో అప్పుడే గ్లామర్ ప్రదర్శనకు రెడీ అయిపోయింది. అదృష్టం తరుముకొస్తున్నట్లు ఈ అమ్మడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మొదట్లో మోడ్రన్ దుస్తులు తన శరీరాకృతికి సరిపడవని, పక్కింటి అమ్మాయి ఇమేజ్ చాలని దీర్ఘాలు తీసిన లక్ష్మీమీనన్ నాన్ శిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో ఏకంగా లిప్‌లాక్ సన్నివేశాల్లో లీనమై నటించేసింది. అదేమంటే కథ డిమాండ్ మేరకే నటించాల్సి వచ్చిందని స్టేట్మెంట్స్ ఇచ్చేసింది. ఆ తరువాత ఎలాంటి చుంబనాలకైనా రెడీ అంటూ గేట్లు తెరిచేసింది. దీంతో దర్శక నిర్మాతలు ఆమె కాల్షీట్స్ కోసం క్యూ కడుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న లక్ష్మీమీనన్ తన పారితోషికాన్ని ఐదు లక్షలు, పది లక్షలు, అంటూ పెంచుకుంటూపోతోంది. ప్రస్తుతం అరకోటికి చేరిన లక్ష్మీమీనన్ ఇక తన పారితోషికం కోటి అంటోందట. కోటంటే మరి ఎక్కువ అంటున్న దర్శక నిర్మాతలతో కావాలంటే మరిన్ని ముద్దు సన్నివేశాల్లో, మరింత అందాలు ఆరబోయడానికి తాను రెడీ అని నిర్మాతల్ని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చేస్తుందట మాలీవుడ్ ముద్దుగుమ్మ లక్ష్మీమీనన్! -
చాలామంది బయటకు చెప్పరు...నేను చెబుతున్నాను!
కొవ్వొత్తి ... తాను కరుగుతూ... చుట్టూ ఉన్నవారికి వెలుగునిస్తుంది. షకీలా కూడా అంతే. తన కోసం కన్నా... తనను నమ్ముకున్నవారి కోసమే అష్టకష్టాలు పడింది. పైకి సీతాకోక చిలుకలా కనిపించే ఈ గొంగళి పురుగు లాంటి గ్లామర్ ప్రపంచంతో ఇరవై ఏళ్ళుగా అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంది. ఫైనల్‌గా తనకు మిగిలింది... ‘సెక్సీ క్వీన్’ అనే బిరుదు మాత్రమే. సెంటు స్థలం లేదు... సొంత ఇల్లు కూడా లేదు... నమ్మినవాళ్ళే నట్టేట ముంచారు... ఒంటరిగా వచ్చింది.. ఒంటరిగా మిగిలింది... అందరికీ ఆమె ఎద ఒంపులే కనిపిస్తాయి. కానీ, ఆ గుండెల మాటున గడ్డకట్టిన కన్నీటి సంద్రం ఎవరికీ కనిపించదు.. ‘ఎ’ సర్టిఫికెట్ తార అనిపించుకున్న షకీలా తన లైఫ్‌ను ‘ఎ’ టూ ‘జెడ్’ ఆవిష్కరించింది. చాలా రోజుల తరువాత మళ్ళీ తెర మీదకొచ్చారు. ఇంత గ్యాప్ ఎందుకని? షకీలా: (ఠక్కున అందుకుంటూ...) నిజంగానే గ్యాప్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఇప్పటికి అయిదేళ్ళ పైగా నాకు తెలుగు సినిమాల ఆఫర్లు లేవు. అయితే, తమిళ, మలయాళ, కన్నడాల్లో చేస్తున్నా. నాలుగేళ్ళుగా కన్నడంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నా. తెలుగులో లాగా ఏదో కామెడీ కోసమని పెట్టే పాత్రలు కాక, పూర్తిగా భిన్నమైన పాత్రలు పోషిస్తున్నా. ఇతర భాషల్లో ఇన్ని పాత్రలు చేస్తున్నప్పటికీ, తెలుగులో నన్నెందుకు పిలవడం లేదో తెలియదు. అసలు ఇప్పటి దాకా ఏయే భాషల్లో సినిమాలు చేశారు? షకీలా: తెలుగు, తమిళ, మలయాళ, కన్నడాల్లో కలిపి దాదాపు 300కు పైగా సినిమాల్లో చేశా. హిందీలో ‘హత్యారా’ అని ఒకే సినిమాలో నటించా. ఇప్పుడు ఉన్నట్టుండి దర్శకత్వం వైపు ఎందుకు వచ్చారు? షకీలా: ఎవరైనా ఎల్.కె.జి తరువాత యు.కె.జి. చదువుతారు కదా! అలాగే, నేను కూడా ఆర్టిస్టు నుంచి దర్శకురాలినయ్యా. ఆర్టిస్టుగా మొదలైన నేను అక్కడే ఎందుకు ఆగిపోవాలి. నా ఈ 20 ఏళ్ళ నట జీవితంలో ఎంతోమంది దర్శకులనూ, వాళ్ళు పనిచేసే విధానాన్నీ దగ్గర నుంచి గమనించా. ‘నేనెందుకు దర్శకత్వం వహించకూడద’ని పదేళ్ళుగా నా మనసులో ఉంది. నిజం చెప్పాలంటే, అప్పటి నుంచి అవకాశం రాలేదు. ఏవో ప్రయత్నాలు చేయడం, అవి మొదట్లోనే ఆగిపోవడం జరిగింది. మరి ఒకేసారి తెలుగు - హిందీల్లో ఇప్పుడు మాత్రం ఛాన్సెలా వచ్చింది? షకీలా: నిర్మాతలనుసమన్వయం చేసుకొని, సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్ళడం నాకు మొదట్లో తెలియదు. తీరా ఇప్పుడు సీనియర్ దర్శకుడు స్వర్గీయ కట్టా సుబ్బారావు కుమారుడు కట్టా శ్రీకర్ ప్రసాద్ వల్ల ఈ ప్రాజెక్ట్ కుదిరింది. చెన్నైలో మా ఇంటి మేడ మీద కట్టా సుబ్బారావు గారు వాళ్ళ ఆఫీస్ ఉండేది. ఆయన, మా నాన్న గారు మంచి మిత్రులు. వాళ్ళ ఇల్లు కూడా కోడంబాక్కమ్‌లోని డెరైక్టర్స్ కాలనీలోనే! అప్పటి నుంచి మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేము రాజోలులో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి, వస్తుండేవాళ్ళం. అలా మేము చాలా క్లోజ్. నేను చెప్పిన కథ విని, ఈ సినిమాను ఆర్గనైజ్ చేసింది ఆయనే. అలా నా దర్శకత్వంలో తొలి చిత్రం మొదలైంది. కానీ, మునుపే ఓ మలయాళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలొచ్చాయే! షకీలా: అవును. గత ఏడాది ‘నీలకురింజి పూత్తు’ అనే ఓ మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించాలని అనుకున్నా. ఆ కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైనది. నిజజీవితంలో నా లాగా చాలా సాహసోపేతంగా ఉండాలి. ఆ పాత్రకు రంజిత లాంటి పలువురు నటీమణులను అనుకున్నా. కానీ, ఆ పాత్రను నేనే పోషించాలని నిర్మాత పట్టుబట్టాడు. నేనేమో వేరే వాళ్ళను పెడదామన్నా. అలా అభిప్రాయభేదాల వల్ల ఆ సినిమా ఎనౌన్స్‌మెంట్‌కే పరిమితమైంది. మొదలు కాకుండానే, ఆగిపోయింది. ఆ చిత్రానికి నేను దర్శకత్వం వహిస్తానన్న సంగతి తెలిసి, కట్టా శ్రీకర్ ప్రసాద్ సోదరుడు కణ్ణా నాకు ఎంతో సాయపడ్డాడు. నాకు ఒక ట్యూటర్ లాగా అన్నీ చెప్పింది ఆయనే. మీ దర్శకత్వంలోని ఈ తొలి సినిమాకు ‘పార్ట్ వన్’ అని పేరు పెట్టారట? షకీలా: లేదు.. లేదు... అలాగని మొదట అనుకున్నాం. కానీ, ఆ పేరు పెడితే, అదేదో నా ఆత్మకథ ఆధారంగా తీస్తున్న సినిమా అనుకొనే ప్రమాదం ఉందని భావించాం. అందుకే, సరైన టైటిల్ చూసి, త్వరలోనే ప్రకటిస్తా. నిజానికి, గత ఏడాది చివరలోనే ‘షకీలా ఆత్మకథ’ అంటూ మలయాళంలో మీ ఆత్మకథ పుస్తకంగా వచ్చింది కదా! ఆత్మకథ రాయాలని ఎందుకు అనిపించింది? షకీలా: తేజ దర్శకత్వంలో ‘కేక’ చిత్రానికి పనిచేసినప్పుడు కెమేరామన్ పి.సి. శ్రీరామ్ గారు నాతో మాట్లాడుతూ, ‘నీ లాంటి అమ్మాయి నీ కథ ఏమిటన్నది రాయాలి. అది అందరికీ తెలియాలి. దాని ద్వారా నలుగురికీ ఉపయోగం’ అన్నారు. అప్పటి నుంచి నా బుర్రలో ఆ ఆలోచన తిరుగుతూ ఉంది. కానీ, నాదేమీ మహాత్మా గాంధీ జీవితం కాదు, మదర్ థెరెసా జీవితం కాదు. ప్రతి నటి జీవితంలో ఉన్నవే నా జీవితంలోనూ ఉన్నాయి, జరిగాయి. అయితే, ఒక మనిషిగా... ఆ తరువాత నటిగా నాకు ఎదురైన అనుభవాలు చెప్పడం వల్ల కొందరికైనా ఉపయోగపడతాయన్నందు వల్లే నా కథకు పుస్తక రూపమిచ్చా. కేరళలోని క్యాలికట్‌కు చెందిన అషాద్ బతేరీ అనే మంచి కవి, రచయిత నా ఆత్మకథ రాస్తానంటూ వచ్చారు. నా కథ మొత్తం ఆయనే మలయాళంలో రాశారు. నాకు మలయాళం చదవడం రాదు. అందుకే, అందులో ఏముందో నాకే తెలీదు (నవ్వులు). కానీ చదివినవాళ్ళంతా బాగుందన్నారు. మరి, మీ ఆత్మకథను తెలుగుతో పాటు, ఇతర భాషల్లో తెచ్చే ఆలోచన ఏదీ లేదా? షకీలా: నిజం చెప్పాలంటే, ఆ మలయాళ పుస్తకం అధికారిక ఆవిష్కరణ కూడా ఇప్పటి దాకా జరగలేదు. అయినా, ఇప్పటికే 5 వేల కాపీలు అమ్ముడైపోయింది. ఆ విషయంలో రచయితతో నేను దెబ్బలాడాను కూడా. దుబాయ్‌లో బుక్‌ఫెస్టివల్‌లో బాగుంటుందని పెట్టామనీ, అలా ఆవిష్కరణ జరగకుండానే జనంలోకి వెళ్ళిపోయిందనీ వివరణ ఇచ్చాడు. ఇప్పుడీ పుస్తకాన్ని తెలుగు, కన్నడంలో కూడా అనువదిద్దామని ప్రచురణకర్తలు అడుగుతున్నారు. మాట్లాడుకొని, ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీషు - ఇన్ని భాషలు స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. అసలింతకీ మీది ఏ ఊరు? షకీలా: (నవ్వేస్తూ...) ఒక్క కన్నడం తప్ప ఈ భాషలన్నీ అచ్చంగా ఆ మాతృభాషీయులు మాట్లాడినట్లే మాట్లాడగలను. మద్రాసులో పుట్టి పెరిగా కాబట్టి తమిళం కొట్టినపిండి. మలయాళంలో నటించా... అదీ బాగా వచ్చు. ఇంగ్లీషు మీడియమ్‌లో చదివా కాబట్టి, ఇంగ్లీషు సరేసరి. ముస్లిమ్ అమ్మాయిని కాబట్టి, ఆటోమేటిగ్గా హిందీ వచ్చు. ఇక, తెలుగంటారా? అది నా మాతృభాష. మా అమ్మ చాంద్ బేగమ్‌ది నెల్లూరు. తెలుగు మాట్లాడేది. మా నాన్న చాంద్ బాషాది తమిళనాడు. ఆయనకు ఉర్దూ, తమిళమే వచ్చు. వీటి వల్ల, నాకిన్ని భాషలొచ్చు. ఇన్ని భాషా చిత్రాలతో జనానికి దగ్గరయ్యా. మీ అసలు పేరే షకీలానా? పేరు చివర ‘జాన్’ అని ఉందేమిటి? షకీలా: అవును. ఆ పేరు వెనక కూడా పెద్ద కథే ఉంది. మా అమ్మానాన్నకు మేము ఏడుగురు సంతానం. నేను అయిదోదాన్ని. నా పూర్తి పేరు ముస్లిమ్ పద్ధతిలో - షకీలా జాన్. అక్కకీ, చెల్లెలికీ మంచి పేరు పెట్టారనీ, నా పేరు నాకు నచ్చలేదనీ నాన్నతో గొడవపడేదాన్ని. అప్పుడాయన అసలు విషయం చెప్పారు. ఆయన వయసులో ఉండగా, సుశీల అనే అమ్మాయిని ప్రేమించారట. ఆ ప్రేమ సక్సెస్ కాలేదు. ఆ అమ్మాయికి గుర్తుగా, ఆ పేరు ధ్వనించేలా షకీలా అని పెట్టారట. అయితే, షకీలా జాన్ అనే ముస్లిమ్ పేరును స్కూల్ రికార్డుల్లో రాస్తున్నప్పుడు, క్రైస్తవ పద్ధతిలో జె.ఓ.హెచ్.ఎన్. - జాన్ అనే ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాశారు. నా సర్టిఫికెట్లలో, చివరకు నా పాస్‌పోర్ట్‌లో కూడా అదే ఉంది. దాంతో, అదేమిటని చాలామంది పొరపడుతుంటారు. ఇంతకీ సినిమాల్లోకి ఎలా వచ్చారు? షకీలా: మా నాన్న మద్రాసులో ‘కలై సెల్వి రిక్రియేషన్ క్లబ్’ నడుపుతుండేవారు. అందులో ఆయనకు నష్టం వచ్చింది. కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. అప్పటికి నేను ఎనిమిదో తరగతి తప్పాను. సరిగ్గా చదవడం లేదని మా నాన్న ఇంటి బయట నన్ను కొడుతుండడం చూసి, ఎదురింట్లో ఉన్న సినిమా ఆఫీసులోని మేకప్‌మ్యాన్ ఆపాడు. సినిమాల్లో నన్ను నటించమంటే, మా నాన్న సరే అన్నారు. ఆయన తీసుకువెళ్లి, చిత్ర దర్శకుడికి పరిచయం చేశారు. ఆ సినిమాలో సిల్క్ స్మితకు చెల్లెలి పాత్రతో సినిమా రంగ ప్రవేశం చేశా. మీతో లాభం పొంది, ఇంట్లోవాళ్ళే మిమ్మల్ని మోసం చేశారని విన్నాం. నిజమా? షకీలా: అవును నిజమే. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే, మా అక్క పిల్లలను సొంత బిడ్డలుగా చూసుకుంటూ వచ్చా. వాళ్లను నేను పెంచలేదు కానీ, చిన్నప్పుడు నేను ఎలాగూ బాగా బతకలేదని, వాళ్లయినా దర్జాగా ఉండాలని వాళ్ల కోసం ఎంతో ఖర్చు చేశా. కానీ, మా అక్క నాకంటూ ఏదీ కొననివ్వ లేదు. ఎప్పుడూ ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూ వచ్చింది. అలా నేను సంపాదించినదంతా వాళ్ళకే ఖర్చు పెట్టా. నా వాళ్ళను నమ్మా. నా సంపాదనంతా పోగొట్టుకున్నా. నాకు అయిదేళ్ళ వయసప్పుడు మా అమ్మా నాన్న సహా మా కుటుంబమంతా మద్రాసులో ఏ ఇంట్లో అద్దెకు దిగిందో ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటున్నా. నాకంటూ ఇవాళ్టికీ సొంత ఇల్లు, స్థలం - ఏదీ లేదు. కానీ, ఒకానొక దశలో మీకు భారీ పారితోషికం ఇచ్చినట్లున్నారు! షకీలా: అవును. తొలి చిత్రం ‘ప్లే గర్ల్స్’కు నా రెమ్యూనరేషన్ రూ. 2 వేలే. కాస్తంత పేరొచ్చాక, పరిశ్రమను ఊపేసిన నా సూపర్‌హిట్ మలయాళ చిత్రం ‘కిన్నార తుంబిగళ్’ (తెలుగులో ‘కామేశ్వరి’గా అనువాదమైంది) చిత్రానికి అయిదు రోజులకు 20 వేలు. తీరా పొగమంచు తదితర కారణాల వల్ల ఆ సినిమా త్రివేండ్రం దగ్గర పొన్ముడిలో 21 రోజులు షూటింగ్ చేశారు. అలా మొదలై, నటిగా రోజుకు రూ. 2 లక్షలు, 3 లక్షల దశ దాకా ఎదిగా. కోట్లు సంపాదించా. ఇక్కడే పోగొట్టుకున్నా. అంత సంపాదన పోగొట్టుకున్నానని బాధపడుతున్నారా? షకీలా: డబ్బు పోయింది నిజమే. కానీ, నేను ఎవరికిచ్చా...? మా అక్కకు, నా రక్త సంబంధీకులకే కదా! కాబట్టి, నేను వేరెవరినో నిందించడానికి వీల్లేదు. నా అనుకొని నమ్మినవాళ్ళే ఇవాళ నన్ను పిల్లలకు దూరంగా పెట్టడం, నాతో మాట్లాడవద్దనడం బాధించింది. నా వాళ్ళను నమ్మాను. మోసపోయాను. (చేతిని గుండెల మీద ఆనిస్తూ) అదే నాకు నొప్పిగా ఉంది. అందుకే, నా దృష్టిలో మా అక్క చచ్చిపోయింది. ఏమైనా, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నాది మంచి మనసు. నేనెప్పుడూ అవతలివాళ్ళకు మేలే చేశా. ఎవరినీ ఏమార్చలేదు. కాబట్టి, ఆ అల్లా నాకు మంచే చేస్తాడు. అదే నా నమ్మకం. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా? షకీలా: బాగా నమ్ముతా. నేను లావుగా, నల్లగా ఉంటా. అతిలోక సౌందర్యరాశినేమీ కాదు. అయినా సరే, ఇవాళ ఇన్ని లక్షల మంది అభిమానం సంపాదించి, ఈ స్థితిలో ఉన్నానంటే అది ఆ దేవుడిచ్చిన వరమే. నేను ఇస్లామ్‌ను నమ్ముతా. ఈ మధ్యే షిర్డీకి వెళ్ళొచ్చా. పదేళ్ళ వయసులో అనుకుంటా, ఓసారి తిరుపతి వెళ్ళా. మళ్ళీ ఎన్నో ఏళ్ళుగా తిరుపతి వెళ్ళాలని కోరిక. ఈ మధ్యే తమ్ముడితో కలసి, తృప్తిగా దర్శనం చేసుకొచ్చా. అయితే, దేవుడి దగ్గరకెళితే, ఫలానాది కావాలని అడగను... అడగలేను. అడగకుండానే అన్నిటిలో ఆయన ఆశీస్సులిచ్చాడు. ఇంకేం కావాలి! అయితే, ఇవేవీ తెలియని చిన్న వయసులో తిరుపతికెళ్ళినప్పుడు దేవుడి వైభోగం చూసి, ‘నిన్నే పెళ్ళి చేసుకుంటా’ అన్నాను. (నవ్వులు...) తరువాత దేవుడు కాకపోయినా... దేవుడు లాంటి భర్త కావాలని మీరెప్పుడూ ఆలోచించలేదా? షకీలా: (వెంటనే అందుకుంటూ... బాధగా...) నేనూ ఆడపిల్లనేనండీ! నాకూ మనసుంటుంది! ఇప్పటి దాకా చేసుకోలేదంటే, నాకు పెళ్ళి అవసరం లేక కాదు. నన్ను నన్నుగా ప్రేమించేవాడు రాక! ఇప్పటి దాకా మీరు ఎవరినీ ప్రేమించలేదా? మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేదా? షకీలా: ఎందుకు ప్రేమించలేదు. ఆ జాబితా చాలా పెద్దదే. నేను సిన్సియర్‌గా ప్రేమించినా, వాళ్ళు మాత్రం ప్రేమిస్తున్నామంటూనే, నా ఫ్యామిలీ వద్దని దూరం పెడుతున్నారు. వాళ్ళు నన్నే గనక నిజంగా ప్రేమిస్తే, నా కుటుంబాన్ని కూడా అక్కున చేర్చుకోవాలి కదా! అంటే, వాళ్ళు నన్ను కాదు... నా దగ్గర ఉన్న వేరే దేనినో ప్రేమిస్తున్నారన్న మాట! ఆ మోసం తట్టుకోలేక, వాళ్ళనే వదులుకున్నా. ఇంతమంది దగ్గర మోసపోయిన మీకు కోపం, ద్వేషం లేవా? షకీలా: చూడండి. ఇలాంటివన్నీ ఈ సినిమా రంగంలో జరిగేవే. కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోవడమూ మామూలే. సినిమాల్లోనూ చూపించారు. అందరికీ జరిగేదే నాకూ జరిగింది. కాకపోతే, చాలామంది బయటకు చెప్పరు, నేను చెబుతున్నాను. అంతే తేడా! మీ ఆత్మకథలో కూడా ఇవన్నీ చెప్పారా? షకీలా: అఫ్కోర్స్ చెప్పా! నేను అబద్ధాలు చెప్పలేదు, రాయలేదు. కాకపోతే, నన్ను మోసం చేసిన వాళ్ళ పేర్లేవీ బయటపెట్టలేదు. ఎందుకంటే, నేనివాళ పది మందికి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగానూ అంటే అది నా రెక్కల కష్టంతో సాధించిన విషయం. అలాంటి నేను ఇలాంటి కొందరి పేర్లు చెప్పి, నా ద్వారా వాళ్ళనెందుకు ఫేమస్ చేయాలి? అందుకే, పేర్లు చెప్పలేదు. అయితే... ఒక్క మాట. నాకు వాళ్ళు మీద కక్ష లేదు. ఎదురై పలకరిస్తే, మామూలుగానే మాట్లాడుతున్నా. చిన్నప్పుడు స్కూల్లో ఎదురైన ‘చైల్డ్ ఎబ్యూజ్’ గురించీ ఆత్మకథలో రాశారట... షకీలా: అవును రాశాను. మద్రాసులో నేను సరస్వతీ విద్యాలయ, జవహర్ విద్యాలయ - ఇలా రకరకాల స్కూల్స్‌లో చదివాను. అప్పట్లో కొందరు మాస్టర్లు క్లాసులో పనిష్మెంట్ ఇచ్చే మిషతో నాతో అసభ్యంగా వ్యవహరించిన సంఘటనలు ఉన్నాయి. ఆ వయసులో ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియక నేను పెదవి విప్పలేదు. ఎవరితోనూ ఫిర్యాదు పూర్వకంగా ప్రస్తావించ లేదు. ఇప్పటికీ అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే, నాలా నోరు విప్పకపోతే కష్టమని చెప్పడం కోసం ఆ సంగతులు ప్రస్తావించాను. అయితే, ఎన్నో ఏళ్ళ క్రితం సంగతులు కాబట్టి ఇప్పుడెందుకు లెమ్మని ఇక్కడ కూడా పేర్లు బయటపెట్టలేదు. మీ సినిమా రిలీజంటే మలయాళ స్టార్ల చిత్రాల్ని వాయిదా వేసుకున్నారంటారు... షకీలా: అలా జరిగిందని పత్రికల వాళ్ళే రాశారు. నాకు నిజానిజాలు తెలియవు. ‘షకీలా సినిమా’ అని ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే, ‘ఆండవన్’ (తమిళంలో దేవుడు అని అర్థం) కరుణ. అప్పుడూ, ఇప్పుడూ నేను ఒకే వ్యక్తిని. మరి, మీకు స్టార్ల నుంచి బెదిరింపులు రాలేదా? షకీలా: అలాంటివి ఎప్పుడూ రాలేదు. పైగా, నాకు వాళ్ళందరితో సత్సంబంధాలుఉన్నాయి. వాళ్ళ సినిమాల్లో కూడా నటించాను. మోహన్‌లాల్‌తో ‘ఛోటా ముంబయ్’లో నటించా. నేనంటే పడకపోతే, గొడవ ఉంటే... వాళ్ళ సినిమాల్లో నన్ను నటించనివ్వరుగా! (నవ్వు...) ‘షకీలా చిత్రాలు’గా పేరుపడ్డ ‘అలాంటి’ సినిమాల్లో నటించాల్సి వచ్చినప్పుడు మీరు బాధపడలేదా? మీ కుటుంబ సభ్యులు ఎవరూ ఏమీ అనేవారు కాదా? షకీలా: నేనెప్పుడూ బాధ పడలేదు. మా నాన్న ఆర్థికంగా చితికిపోయి ఉన్నప్పుడు, ఎనిమిదో తరగతి తప్పిన నేను సినీ రంగంలోకి వచ్చాను. ‘నా కుటుంబం కష్టాల్లో ఉంది. వాళ్ళను గట్టెక్కించాలి. నేను అనుకున్న మంచి జీవితం వాళ్ళకివ్వాలి’ - అప్పట్లో అదే నా ఆలోచనంతా. 1994లో సినీ రంగానికి వచ్చా. 1996 - 97లో అనుకుంటా... మా నాన్న చనిపోతూ మా అమ్మ చేయి పట్టుకొని, అమ్మనూ, తమ్ముడు సలీమ్‌నూ నాకు చూపిస్తూ, ‘వాళ్ళ బాధ్యత చూసుకోమన్నట్లు’గా సైగ చేస్తూనే, కన్నుమూశారు. వినడానికి సినిమా కథలా అనిపించినా, ఇది వాస్తవం. నా మీద ఆధారపడిన వీళ్ళకు ఏదో చేయాలనే నా తపన అంతా. అందుకే, నాకు వచ్చిన సినిమాలన్నిటిలో నటించాను. ఆ సంగతీ మా వాళ్ళకూ తెలుసు. అలా కష్టపడి సంపాదించి, మా అక్క, అన్న, వాళ్ళ పిల్లలు - అందరినీ నిలబెట్టేందుకు శ్రమించా. ‘అవసరంలో ఉన్నా’మంటూ అడిగితే చాలు... లేదనకుండా డబ్బులిచ్చా. దానధర్మాలు చేశా. కిడ్నీలు చెడిపోవడంతో మా అమ్మకు లక్షలు ఖర్చు పెట్టి, వైద్యం చేయించా. (కొంచెం బాధగా) అయినా అమ్మను దక్కించుకోలేకపోయా. కానీ, మీ మీద ‘అశ్లీల చిత్ర తార’ అనే విమర్శలొచ్చాయి. సినీ రంగంలో కూడా చాలామంది మిమ్మల్ని లోకువగా చూశారు... షకీలా: ఐ డోంట్ కేర్! నేను నా కోసం, నా కుటుంబం కోసం కష్టపడ్డా. ఎవరేమనుకుంటే నాకేంటి? ఇప్పుడు నేను క్యారెక్టర్ పాత్రలు వేస్తున్నా. అయినా సరే, ఇప్పటికీ నన్ను ఏ సినీ ఫంక్షన్లకూ పిలవరెందుకో అర్థం కాదు. 2001లో మలయాళంలో 97 చిత్రాలొస్తే, అందులో 30 మీవే. అలా హవా నడుస్తున్న రోజుల్లోనే ఉన్నట్టుండి ‘ఆ చిత్రాల’ నుంచి తప్పుకోవడానికి కారణం? షకీలా: నిజం చెప్పాలంటే, రకరకాల గెటప్‌లతో కూడిన భిన్నమైన పాత్రలు నాకు ఇచ్చేవారు. వారు చెప్పినట్లు నటించేదాన్ని. అయితే, రిలీజయ్యాక హాలులో వాటిని చూసే తీరిక ఉండేది కాదు. ఒకసారి ఇలాగే ఓ మంచి గెటప్‌తో, ఓ సినిమాలో నటించాను. నా మీద చక్కటి సన్నివేశాలు చిత్రీకరించారు. తీరా రిలీజయ్యాక, నా మేకప్ మ్యాన్ రవి ఆ సినిమా చూసి వచ్చాడు. సినిమా, నా పాత్ర ఎలా ఉన్నాయని అడిగితే, ‘అందులో ఎంతసేపటికీ చిన్న తువ్వాలు కట్టుకొని తిరిగే దృశ్యాలు తప్ప ఇంకేమీ లేవన్నాడు. దాంతో, నేను చాలా ఫీలయ్యాను. ఇక అప్పటికప్పుడు మద్రాసులో తమిళ జర్నలిస్టులందరినీ పిలిచి, ‘ఆ తరహా’ సినిమాల్లో నటించనంటూ ప్రకటించాను. ఇదంతా జరిగింది 2001 చివరలో! అప్పటికే నేను తీసుకున్న 23 సినిమాల అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేశాను. అలా ఆ అధ్యాయం ముగిసింది. ‘ఆ పాత్రల’ నుంచి క్యారెక్టర్ నటిగా ఎలా మారారు? కష్టం కాలేదా? షకీలా: హ్యాట్సాఫ్ టు డెరైక్టర్ తేజ. ‘జయం’ (2002)లో లెక్చరర్ పాత్ర ఇచ్చి, కెరీర్‌కు కొత్త మార్గం చూపెట్టారు. ఆ విషయంలో ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే! ఆయన నాకు పెద్దన్న లాంటివాడు. అప్పటి నుంచి గత పన్నెండేళ్ళుగా మెయిన్‌స్ట్రీమ్ సినిమాల్లో క్యారెక్టర్లు వేస్తున్నా. స్తవ సన్న్యాసినిగా నటించాలని కోరిక అని గతంలో చెప్పేవారు... షకీలా: ఆ కోరిక తీరింది. మలయాళంలో ఏడేళ్ళ క్రితం రూపొందించిన ఓ చిత్రంలో అలాంటి పాత్ర చేశా. కానీ, దురదృష్టవశాత్తూ అది ఇప్పటికీ రిలీజ్ కాలేదు. సినీ నటి సంఘవి నటించిన ‘నాన్సీ’ అనే తమిళ సీరియల్లో కూడా అలాంటి వేషం వేశా. అది వీక్షకుల ముందుకు వచ్చింది. దక్షిణాది భాషలన్నీ మాట్లాడే మీరు డబ్బింగ్ చెప్పుకొనే ప్రయత్నం చేయలేదేం? షకీలా: చూడండి. మన పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పడం వల్ల ఆ డబ్బింగ్ కళాకారులకు కూడా రెండొందలో, మూడొందలో వస్తాయి. కుటుంబం గడుస్తుంది. వాళ్ళ కడుపెందుకు కొట్టడం? (నవ్వుతూ...) ఇప్పుడు నేను చేసే మహత్తరమైన పాత్రలకు నాకు నేనే డబ్బింగ్ చెప్పుకొంటే, నాకేమైనా జాతీయ అవార్డులొస్తాయా ఏమిటి? జీవితం, గడచిన కాలం, కెరీర్ పట్ల ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డారా? షకీలా: నాకు రిగ్రెట్స్ ఏమీ లేవు. జీవితం ఎటు తీసుకెళితే అటు వెళ్ళాను. భగవంతుడు నాకంటూ ఈ దోవ ఇచ్చాడు. ఇందులో ముందుకు వెళ్ళాను. ఎప్పుడైనా, నాకు వచ్చిన పనిని నిజాయతీగా చేశాను. ఎవరినీ మోసం చేయలేదు. నావి సెక్స్ సినిమాలనీ, సాఫ్ట్ పోర్ట్ సినిమాలనీ అన్నవాళ్ళు ఇవాళ సన్నీ లియోన్ లాంటి తారలను అంగీకరిస్తున్నారు కదా! ఏమైనా, మన దక్షిణాదిలో సిల్క్ స్మిత తరువాత మళ్ళీ అంతటి సుదీర్ఘ కాలం అందరి దృష్టినీ ఆకర్షించి, వార్తల్లో వ్యక్తిగా నిలిచింది నేనే. అయామ్ హ్యాపీ. మళ్ళీ జన్మంటూ ఉంటే... షకీలా: షకీలా గానే పుడతాను. ఇప్పటి లానే మంచిగా జీవిస్తూ, పదిమందికీ చేతనైన మంచి చేస్తాను. - రెంటాల జయదేవ దేవుడిచ్చిన బిడ్డ నేనెప్పుడూ ఒంటరిగా లేను. నాకు భయం. ఎప్పుడూ మా అమ్మ నా పక్కనే ఉండేది. ఆమెకు ఒంట్లో బాగా లేనప్పుడు కూడా ఆమె మంచం పక్కనే పడుకొనేదాన్ని. అలాంటిది మా అమ్మ చనిపోయాక ఒంటరి నయ్యా. చుట్టాలు కూడా మొహం చాటేశారు. ‘జియారత్’ (సమాధిపై పూలు చల్లుతూ నివాళి ఇవ్వడం) చేసే దాకా కూడా ఎవరూ లేరు. మమ్మీ పోయాక కనీసం ఇంట్లో వంటైనా చేయలేదు. తినీ తినకుండా ఉండి పోయేదాన్ని. అలాంటి స్థితిలో తంగం అనే ఈ అబ్బాయి దేవుడు పంపినట్లుగా నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నాకు అచ్చం మా అమ్మలా వంట చేసేది, మందులు ఇచ్చేది వీడే. నన్ను మమ్మీ అనే పిలుస్తాడు. వాళ్ళ ఊరు వెళ్ళినా, అనుక్షణం నా బాగోగుల గురించి ఫోన్లో అడుగుతూనే ఉంటాడు. రెండు రోజులకని వెళ్ళినవాడు కూడా రెండు గంటల్లోనే వెనక్కి వచ్చేస్తాడు. అల్లా మీద ఒట్టు... వీడు నాకు దేవుడిచ్చిన బిడ్డ. ఇప్పుడు వీడే నాకు దిక్కు. నాదగ్గరకు వచ్చిన ఒక్కొక్కరిదీ ఒక్కో కథ! ఇప్పటికి ఓ ఇరవై మంది నాకు జీవితంలో ఎదురయ్యారు. అందరూ అందరే! తెలుగు, తమిళ, మలయాళాల్లో పేరున్న ఒక హీరో నన్ను ప్రేమించానన్నాడు. అతను చిన్నప్పటి నుంచీ నాకు తెలిసినవాడు, మిత్రుడు కూడా! అయిదేళ్ళు ‘రిలేషన్షిప్’లో ఉన్నాం. కానీ, సదరు హీరో ఎంత దుర్మార్గుడంటే, రోజూ కొట్టి, కొట్టి హింసించేవాడు. తన ఒంటి మీద కూడా గాయాలు చేసుకొనేవాడు. శాడిస్టులా ప్రవర్తించేవాడు. అయినా మత్తు దిగిపోయాక, క్షమించమని అడిగేసరికి మెత్తబడేదాన్ని. కానీ, చివరకు అతను నాకు ద్రోహం చేశాడు. ఆ బంధం తెగిపోయింది. తరువాత తమిళనాట కొత్తగా ఏర్పడిన ఓ హీరో గారి రాజకీయ పార్టీ ప్రముఖుడు నన్ను ప్రేమించానన్నాడు. అదీ కట్ అయిపోయింది. ఇలా... ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథ. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గరలో ఓ వ్యక్తి నన్ను సిన్సియర్‌గానే ప్రేమిస్తున్నానంటున్నాడు. అదెంత కాలమో! -
వాహ్.. ఐష్ అనుకున్నారంతా(టా)..!
-
లోక్‌సభ ఎన్నికల్లో సినీ గ్లామర్
కోల్‌కతా: త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో సినీ గ్లామర్‌తో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి సినీ, క్రీడా తారలు పెద్ద ఎత్తున బరిలోకి దిగుతుండటం విశేషం. అధికార తృణమాల్ కాంగ్రెస్ పార్టీ తరపునే ఏకంగా తొమ్మిది మంది పోటీ చేయనుండగా, బీజేపీ తరపున ఇద్దరు రంగంలోకి దిగనున్నారు. సినీ తారలకు ప్రజలతో ఉన్న అనుబంధం దృష్ట్యా వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నట్టు టీఎంసీ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తృణమాల్ కాంగ్రెస్ తరపున నిన్నటి తరం అందాల నాయిక మున్ మున్ సేన్ పోటీ చేస్తున్నారు. బంకూర లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. సేన్ తరపున ముద్దుల కూతుళ్లు, యువ కథానాయికలు రియా, రైమా సేన్లు ప్రచారం చేయనున్నారు. ఇక మిడ్నాపూర్ నుంచి మరో నటి సంధ్యా రాయ్, ఘటల్ నుంచి బెంగాలీ సూపర్ స్టార్ దేవ్, డార్జిలింగ్ నుంచి సాకర్ స్టార్ బైచుంగ్ భూటియా టీఎంసీ తరపున బరిలో దిగనున్నారు. భూటియా స్వరాష్ట్రం సిక్కిం అయినా పశ్చిమ బెంగాల్‌తో ప్రత్యేక అనుబంధముంది. సుభాష్ చంద్రబోస్ మునిమనవడు, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుగట బోస్ కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. టీఎంసీ తరపున మాజీ ఫుట్‌బాలర్ ప్రసూన్ బెనర్జీ, గాయకులు ఇంద్రానిల్ సేన్, సుమిత్రా రాయ్ బరిలో దిగనున్నారు. బీజేపీ తరపున మెజీషియన్ పీసీ సర్కార్, నటుడు జార్జి బెకర్ పోటీ చేయనున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు బప్పిలహరి కూడా పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసే యోచనలో ఉన్నారు. కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. లెఫ్ట్ ఫ్రంట్ నేతలు మాత్రం ప్రజల కోసం పనిచేస్తున్న కార్యకర్తలకే అవకాశం ఇస్తామని చెబుతున్నారు. -
కార్యకర్త కన్నెర్రజేస్తే...
రంగుల కల, గ్లామర్, అయ్యప్ప స్వామి, సర్దార్ చిత్రాల్లో బాలనటునిగా చేసిన మనీష్‌బాబు హీరోగా ‘కార్యకర్త’ సినిమా రూపొందనుంది. చిత్తజల్లు ప్రసాదనాయుడు దర్శకత్వంలో జనం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. ఈ నెల ద్వితీయార్ధంలో చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఒక పార్టీ ఎదుగుదలకు ముందుగా శ్రమించే వ్యక్తి కార్యకర్త. ఎలాంటి రాజకీయ చరిత్రకైనా పునాదిరాయి కార్యకర్త. అలాంటి కార్యకర్త కన్నెర్ర చేస్తే రాజకీయ నాయకుల చరిత్ర కాలి బూడిదైపోతుందనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ధనుంజయ్, సమర్పణ: జి.ఆంజనేయులు. -
గ్లామర్ అంటే బికినీయేనా ?
కథానాయికల కెరీర్ పాతిక, ముప్ఫయ్ ఏళ్లనే మాట నాటి తరం నాయికలతోనే పోయింది. నేటి తరం నాయికలు మహా అయితే ఆరేడేళ్లు రాణించగలుగుతారేమో? చాలామంది విషయంలో ఇదే జరుగుతుంది. కానీ, నయనతారలాంటివారి విషయంలో మాత్రం అబద్ధం అవుతుంది. ఆమె కథానాయికై పదేళ్లయ్యింది. మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు, తమిళ భాషల్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంటారామె. భాష కాని భాషలో సినిమాలు చేస్తూ పదేళ్లు నెగ్గుకొచ్చారు కదా. మీ విజయ రహస్యమేంటి? అనే ప్రశ్న నయనతార ముందుంచితే -‘‘అంకితభావం, నిజాయితీ, ఆత్మవిశ్వాసం... ఈ మూడింటితో పాటు ఆ దేవుడి ఆశీర్వాదం. పదేళ్లుగా ఇక్కడ ఉంటూ... ఇంకా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నానంటే ఇవే కారణాలు. ప్రతిభకు అదృష్టం తోడైతే ఎవరైనాసరే సక్సెస్ ట్రాక్‌లో వెళ్లిపోతారు’’ అని చెప్పారామె. కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా అడపాదడపా తనని తాను మరింతగా నిరూపించుకునే పాత్రలు చేస్తూ వస్తున్నారు నయనతార. ‘గ్లామర్’కి సరైన అర్థం చాలామందికి తెలియదని ఆమె చెబుతూ -‘‘గ్లామర్ అంటే స్కిన్ షో అని కొంతమంది అనుకుంటారు. అలాగే బికినీ ధరిస్తేనే గ్లామర్ అంటారు. కానీ, లంగా, ఓణీ, చీరల్లో కూడా గ్లామరస్‌గా కనిపించవచ్చు. మనం మన శరీరాన్ని ఎంత స్టయిలిష్‌గా ప్రదర్శిస్తున్నామన్నదే ముఖ్యం. నా దృష్టిలో గ్లామర్ అంటే స్టయిలిష్‌గా కనిపించడం. అంతేకానీ వేసుకునే కాస్ట్యూమ్ని బట్టి గ్లామర్ వచ్చేయదు’’ అన్నారు. -
భార్యను హతమార్చిన ప్రబుద్ధుడు
విలాసాగర్(జమ్మికుంట రూరల్), న్యూస్‌లైన్ : అందంగా లేదన్న కారణంతో భార్యను హతమార్చాడో ప్రబుద్ధుడు. పెళ్లయిన 14 నెలలకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన కోమల వివాహం జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన కుమార్‌తో 14 నెలల క్రితం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 1,20,000 కట్నం, రెండు తులాల బంగారం లాంఛనాలు ముట్టజెప్పారు. కొంతకాలంగా భార్య అం దంగా లేదని అతడు వేధించడం ప్రారంభించాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరగ్గా భార్యను సరిగానే చూసుకుంటానని చెప్పి తీసుకెళ్లాడు. గత గురువారం భార్యభర్తలు పోతిరెడ్డిపల్లికి వెళ్లారు. శనివారం ఉదయం ఇద్దరూ కలిసి విలాసాగర్ బయల్దేరారు. పోతిరెడ్డిపల్లి- విలాసాగర్ మధ్య ఉన్న మానేరు వాగు దాటగానే కోరపల్లి శివారులోని సప్పికుంట ప్రాంతంలో కోమల మెడ కు చున్నీ చుట్టి హతమార్చాడు. తర్వా త ఒక్కడే ఇంటికి వెళ్లిపోయాడు. అత డి తల్లిదండ్రులు కోమల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కూ తురు ఇంటికి రాలేదని చెప్పారు. దీంతో కంగారుపడ్డ వారు సోమవారం విలాసాగర్ చేరుకుని కుమార్‌ను నిలదీశారు. అతడు వారిని ఘటనాస్థలికి తీసుకెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు. కోమల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ సీఐ వీరభద్రం సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.