ఆ విమర్శలు చాలవు | That's enough criticism | Sakshi
Sakshi News home page

ఆ విమర్శలు చాలవు

Aug 21 2015 5:05 AM | Updated on Sep 3 2017 7:48 AM

ఆ విమర్శలు చాలవు

ఆ విమర్శలు చాలవు

సాధారణంగా నటీమణులపై విమర్శలు చేస్తే వారు అగ్గిమీద గుగ్గిలం అవుతారు.

సాధారణంగా నటీమణులపై విమర్శలు చేస్తే వారు అగ్గిమీద గుగ్గిలం అవుతారు. అయితే నటి రాధిక ఆప్తే అందుకు విరుద్ధం అని చెప్పక తప్పదు. ఈ త్తరాది భామ ఏమంటుందో చూడండి. నాపై విమర్శలు చాలానే వస్తున్నాయి. ఇవి చాలవు ఇంకా ఘాటైన విమర్శలు ఆశిస్తున్నాను. నా చిత్రాల ఎంపికను, గ్లామర్ నటనను పలువురు పలు రకాలుగా విమర్శిస్తున్నారు.తా జాగా కమర్షియల్ చిత్రాలనే ఎంచుకుంటున్నావేంటని ప్రశ్నిస్తున్నారు. అలాంటి చిత్రాలే నటీనటుల స్థాయిని పెంచుతాయి. అదే విధంగా గ్లామర్‌గా నటించకుంటే నటిగా నిలబడడం కష్టం. కమర్షియల్ చిత్రాలు చెయ్యడానికి ఇదే లెక్క. కమర్షియల్ చిత్రాలు అంటే చాలదు అందుకు తగిన మషాలా జోడించాలి. కోట్ల రూపాయల పెట్టుబడులతో చిత్రం తయారవుతోంది. అంత డబ్బు ఆషామాషీగా ఖర్చు పెట్టలేరు.

అన్నింటికీ లెక్కలు ఉంటాయి. నాపై వస్తున్న విమర్శల గురించి అడుగుతున్నారు. సద్విమర్శలు మనోబలాన్ని పెంచుతున్నాయి. అలాగే ఘాటైన విమర్శలను ఎదుర్కొంటున్నాను. వీటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి మిశ్రమ విమర్శలను మరిన్ని ఆశిస్తున్నాను అని ఈ సంచలన నటి అంటోంది. ఈ అందాల భామ త్వరలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జతకట్టడానికి సిద్ధం అవుతోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement