భార్యను హతమార్చిన ప్రబుద్ధుడు | wife killed by husband | Sakshi
Sakshi News home page

భార్యను హతమార్చిన ప్రబుద్ధుడు

Published Tue, Aug 13 2013 7:18 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

wife killed by husband


 విలాసాగర్(జమ్మికుంట రూరల్), న్యూస్‌లైన్ : అందంగా లేదన్న కారణంతో భార్యను హతమార్చాడో ప్రబుద్ధుడు. పెళ్లయిన 14 నెలలకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన కోమల వివాహం జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన కుమార్‌తో 14 నెలల క్రితం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 1,20,000 కట్నం, రెండు తులాల బంగారం లాంఛనాలు ముట్టజెప్పారు. కొంతకాలంగా భార్య అం దంగా లేదని అతడు వేధించడం ప్రారంభించాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరగ్గా భార్యను సరిగానే చూసుకుంటానని చెప్పి తీసుకెళ్లాడు.
 
 గత గురువారం భార్యభర్తలు పోతిరెడ్డిపల్లికి వెళ్లారు. శనివారం ఉదయం ఇద్దరూ కలిసి విలాసాగర్ బయల్దేరారు. పోతిరెడ్డిపల్లి- విలాసాగర్ మధ్య ఉన్న మానేరు వాగు దాటగానే కోరపల్లి శివారులోని సప్పికుంట ప్రాంతంలో కోమల మెడ కు చున్నీ చుట్టి హతమార్చాడు. తర్వా త ఒక్కడే ఇంటికి వెళ్లిపోయాడు. అత డి తల్లిదండ్రులు కోమల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కూ తురు ఇంటికి రాలేదని చెప్పారు. దీంతో కంగారుపడ్డ వారు సోమవారం విలాసాగర్ చేరుకుని కుమార్‌ను నిలదీశారు. అతడు వారిని ఘటనాస్థలికి తీసుకెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు. కోమల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ సీఐ వీరభద్రం సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement