హత్యా? ఆత్మహత్యా? | Murder? Suicide? | Sakshi
Sakshi News home page

హత్యా? ఆత్మహత్యా?

Published Wed, Jul 9 2014 3:20 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

హత్యా? ఆత్మహత్యా? - Sakshi

హత్యా? ఆత్మహత్యా?

బొండపల్లి: మండలంలోని దేవుపల్లి గ్రామంలో సోమవారం రాత్రి  ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. డాబాలకొత్తవలస మండలం చింతలదిమ్మ గ్రామానికి చెందిన బలగసంతోష్ (30) ఆరేళ్ల క్రితం దేవుపల్లి గ్రామానికి చెందిన చలపాకఅంజి కుమార్తె ఉమాసత్యవతిని వివాహం చేసుకుని అత్తవారింటి పక్కనే ఇల్లుకట్టుకుని భార్య,ఇద్దరు పిల్లలుశేవతరాణి,వంశీకృష్ణతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. వృత్తిరీత్యా కార్పెంటర్ అయిన సంతోష్ మంచి పేరు తెచ్చుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు.
 
 అయితే ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య తరచూ చిన్నపాటి తగాదాలు జరుగుతుండడంతో అదే గ్రామంలోని బంధువులు సముదాయించి వారి కాపురాన్ని చక్కదిద్దారు. అయితే సంతోష్‌కు గ్రామంలో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య ఉమాసత్యవతి,ఆమె మేనమామలు పెద్దమనుషుల వద్ద సోమవారం పంచాయితీ పెట్టించారు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ రాత్రి 10.30 సమయంలో రసాయనాలు తాగాడని. వెంటనే  ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మర్గమధ్యంలో మృతి చెందినట్లు భార్య, బంధువులు చెప్పారని మృతుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు.
 
 తమ కుమారుడు సంతోష్‌ను భార్య ఉమాసత్యవతి  ఆమె బంధువులు కొట్టి చంపి ఉంటారని ఆత్మహత్య చేసుకున్నట్లు కథ అల్లుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతోష్‌కు వివాహేతర సంబంధం ఉందని ప్రచారం జరగడంతో గ్రామానికి చెందిన వారు ఎవరైనా కక్ష తీర్చుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొండపల్లి ఎస్సై తారకేశ్వరరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజపతినగరం సీఐ చంద్రశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజపతినగరం సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా హత్యా,ఆత్మహత్యా అనేది తెలుసుకుని కేసు నమోదు చేస్తామని మృతుని బంధువులకు సీఐ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement