
సాక్షి,బళ్లారి: పెళ్లి చేయలేదని, ఆస్తి పంచలేదనే ద్వేషంతో సొంత అన్నను కడతేర్చిన తమ్ముడి ఉదంతం కొప్పళ జిల్లాలో చోటు చేసుకుంది. కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా పట్టల చింతగ్రామంలో బసప్ప కడివాలకు నలుగురు కుమారులు ఉన్నారు. యమునప్ప(40) పెద్ద కొడుకు. కుటుంబ బాధ్యతలు మీద వేసుకొని ఒకరికి పెళ్లి చేసి మరొక తమ్ముడికి వివాహం కూడా నిశ్చయం చేశారు.
అయితే తనకు పెళ్లీడు వచ్చినా పెళ్లి సంబంధాలు చూడటం లేదని, పైగా ఆస్తి పంచాలని కోరినా పట్టించుకోలేదని నాలుగో తమ్ముడు మల్లప్ప తన అన్నపై కక్ష పెంచుకున్నాడు. ఈక్రమంలో అన్నను శనివారం కొడవలితో నరికి హత్య చేశాడు. హనుమసాగర్ పోలీసులు వచ్చి యమునప్ప శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడు మల్లప్పను అరెస్ట్ చేశారు.
(చదవండి: మంగళూరు అబ్బాయి, నెదర్లాండ్స్ అమ్మాయి)
Comments
Please login to add a commentAdd a comment