property dispute
-
అదనపు కలెక్టర్ ఎదుటే కస్సు.. బుస్సు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మంచు కుటుంబ వివాదం మరింత క్లిష్టంగా మారుతోంది. తన ఇల్లు ఖాళీ చేయించండి అంటూ సినీనటుడు మంచు మోహన్‌బాబు వయో వృద్ధుల చట్టం కింద నెలన్నర రోజుల క్రితమే జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ నారాయణరెడ్డి మంచు మనోజ్‌కు 15 రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. మంచు మనోజ్ తన అడ్వకేట్‌తో కలిసి జనవరి 18న జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఎదుట హాజరై వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని అడిగారు. తాజాగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రెండో హియరింగ్ జరిగింది. తండ్రీ కొడుకులిద్దరూ వేర్వేరు వాహనాల్లో తమ న్యాయవాదులతో కలిసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ముందు వేర్వేరుగా లోపలకు పిలిచి.. వారు నేరుగా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ చాంబర్‌కు చేరుకున్నారు. తొలుత ఇద్దరిని వేర్వేరుగా లోపలకు పిలిచి మాట్లాడారు. సుమారు రెండుగంటల పాటు విచారణ కొనసాగింది. చివరి నిమిషంలో ఇద్దరూ అదనపు కలెక్టర్ ఎదుటే వాగ్వాదానికి దిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తీవ్ర వాగ్వాదంతోపాటు ఒకరినొకరు దూషించుకోవడమే కాకుండా ఒకానొక దశలో తోపులాడుకునే స్థాయికి వెళ్లినట్టు సమాచారం. ప్రతిమాసింగ్ వారిని సముదాయించే ప్రయత్నం చేసినా..వినిపించుకోకపోవడంతో రక్షణ కోసం పోలీసులను లోపలకు పిలిపించారు. ‘ఇల్లు, ఇతర ఆస్తులన్నీ నా స్వార్జితం, వాటి నుంచి ఖాళీ చేయించాల్సిందే’అంటూ తండ్రి మోహన్‌బాబు విచారణ అధికారి ముందు పట్టుబట్టగా, కొడుకు మనోజ్ అందుకు నిరాకరించినట్టు తెలిసింది. ముందు నుంచి ఒకరు..వెనుక నుంచి మరొకరు నాన్నకు ఇల్లు ఒక్కటే కాదని, చా లా ఆస్తులు ఉన్నాయని, వారసత్వంగా నాకు ఆస్తిలో వాటా ఉందని, విద్యా సంస్థల్లో జరుగుతున్న అన్యా యాలపై ప్రశ్నించినందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తాను ఏనాడు కూడా నాన్నపై చేయి చేసుకోలేదని మనోజ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ‘అతను నా కొడుకే కాదు..అతని నుంచి నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షణ కల్పించండి’అంటూ మోహన్‌బాబు అదనపు కలెక్టర్‌కు విన్నవించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే పలు ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను మనోజ్ విచారణాధికారి ముందు ఉంచారు. అనంతరం మోహన్‌బాబు వెనుక వైపు నుంచి వెళ్లిపోగా, మనోజ్ ముందు వైపు నుంచి ఆవేశంగా బయటకు వెళ్లిపోవడం, విచారణ జరుగుతున్న సమయంలో మీడియా సహా ఇతర వ్యక్తులను అటు వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం గమనార్హం. మరో పదిరోజుల్లో మూడో విచారణకు హాజరుకావాలని ప్రతిమాసింగ్ వారికి సూచించినట్టు సమాచారం. -
చెల్లెమ్మా ఇంత పనిచేస్తావా..! జగనన్న మనసు నీకు తెలియదా ?.. చంద్రబాబు ఉచ్చులో పడి..!
-
అన్న జైలుకు పోయినా సరే.. నాకు ఆస్తి కావాలి అంతే!
-
ఎవరి ట్రాప్ లో పడి ఎవరి కోసం షర్మిల ఇలా చేస్తుంది..?
-
జగన్ తీసుకుంది మంచి నిర్ణయమే..
-
చంద్రబాబు, షర్మిల కుట్రను ముందే పసిగట్టిన జగన్..
-
సోదరుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు
కంటోన్మెంట్(హైదరాబాద్): ఆస్తి తగాదాలతో వరుసకు సోదరుడైన ఒక వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ ప్రాంతంలోని బోయిన్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 70 శాతం గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బోయిన్పల్లి కంసారిబజార్ రామమందిరం సమీపంలో కందికొండ సత్తయ్య, ముత్తయ్యలకు నివాసస్థలం ఉంది. ముత్తయ్య కుమారుడు శ్రీనివాస్(62) ఇటీవల తన తండ్రి ద్వారా సంక్రమించిన స్థలంలో ఇంటినిర్మాణం చేపట్టి అద్దెకు ఇచ్చాడు. తాను సమీపబస్తీలో నివాసం ఉంటున్నాడు. కంసారి బజార్లో తన ఇంటి పక్కనే వరుసకు సోదరుడైన వినోద్ (సత్తయ్య కుమారుడు) మరో ఇంటిలో నివాసముంటున్నాడు. వీరిద్దరి ఇళ్ల నడుమ ఉన్న చిన్నపాటి సందు గుండానే శ్రీనివాస్ ఇంటికి దారి ఉంది. ఈ స్థలం విషయంలోనే వీరి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం శ్రీనివాస్ అద్దె వసూలు నిమిత్తం తన ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా వినోద్ అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తన అన్నను చంపానంటూ అరుస్తూ పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్‌లో శ్రీనివాస్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో శ్రీనివాస్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: మాజీ ఐఏఎస్ భన్వర్‌లాల్ ఇంటిని ఖాళీ చేసిన ఐపీఎస్ నవీన్ కుమార్
సాక్షి, హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్‌లాల్ ఇంటిని ప్రస్తుతం ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఖాళీ చేయించారు. తన ఇల్లుని ఆక్రమించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని, ఐపీఎస్ అధికారి నవీన్‌పై భన్వర్‌లాల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. భన్వర్‌లాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు చేపట్టారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీసీఎస్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో వివాదాస్పదంగా మారిన ఇంటిని నవీన్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. చదవండి: హైదరాబాద్: రిటైర్డ్ IASకు ప్రజెంట్ IPS టోకరా! కేసు వివరాలు ఏంటంటే.? IAS అధికారిగా సుదీర్ఘ కాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన భన్వర్‌లాల్ 2017లో రిటైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు. జూబ్లీహిల్స్‌లో భన్వర్‌లాల్‌కు ఓ భవంతి ఉంది. 2014లో ఈ ఇంటికి సంబంధించి ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో అద్దె ఒప్పందం చేసుకున్నారు. దీని కాల పరిధి అయిదు సంవత్సరాలు. ఈ రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం భన్వర్‌లాల్ జూబ్లిహిల్స్‌లోని తన నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్ల కోసం అద్దెకు ఇచ్చారు. 2019లో ఈ ఒప్పందం ముగిసినా.. ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది భన్వర్ లాల్ ఆరోపణ. భన్వర్ లాల్ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు? 2019 తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి IPS అధికారి నవీన్‌కుమార్ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెరమీదికి వచ్చాయి. ఈ డాక్యుమెంట్లు తమ ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ తరహాలో రూపొందించిన నకిలీ పత్రాలని భన్వర్‌లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పత్రాలను ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ కలిసి తయారు చేశారని, వీటికి IPS అధికారి నవీన్‌కుమార్ సహకరించారన్నది భన్వర్ లాల్ ఆరోపణ. పోలీసులు ఏం చేశారు? భన్వర్‌లాల్ ఆరోపణలతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. డాక్యుమెంట్లను విచారించి అవి ఫేక్ అని తేల్చారు. డిసెంబర్ 22న ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన ఐపీఎస్ అధికారి నవీన్‌కుమార్ ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే నవీన్ కుమార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లను రూపొందించి భన్వర్‌లాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అనుమానిస్తున్నారు. IPS అధికారి నవీన్‌కుమార్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ అకాడమీలో గత ఆరేళ్లుగా తన సేవలను కొనసాగిస్తున్న నవీన్ కుమార్.. గతంలో వికారాబాద్‌లో ఎస్పీగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డీసీపీగా విధులు నిర్వహించారు. ఆయన ఆచూకీని తెలుసుకున్న పోలీసులు ఇవ్వాళ అదుపులోకి తీసుకున్నారు.గత నెల 17 న భన్వర్ లాల్ భార్య మనీలాల్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అరెస్టులు ఈ నెలలో జరిగాయి. -
ఆస్తి కోసం అమానుషం
వనపర్తి: ఆస్తి ముందు అన్నదమ్ముల అనుబంధం, చిన్నప్పటి నుంచి కలసి ఉన్న సోదర ప్రేమ చిన్నబోయాయి. నడిరోడ్డుపై సొంత తమ్ముళ్లే తోడబుట్టిన అన్నను కత్తులతో వేటాడి హత్య చేశారు. బుధవారం వనపర్తి జిల్లాకేంద్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి మండలం రాజపేట పెద్దతండాకు చెందిన మంగ్లీ, పూల్య నాయక్‌లకు ఐదుగురు కుమారులున్నారు. 20 ఎకరాల భూమిని తండ్రి తన కుమారులకు సమానంగా పంచి ఇచ్చాడు. రెండో కుమారుడు బద్రీనాథ్ నాయక్ (51) వీపనగండ్లలో ఏపీఓగా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురూ ఆడపిల్లలే ఉండడంతో వంశోద్ధారకుడు లేడని.. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని పేదలైన తమ్ముళ్లకు ఇవ్వాలనే ప్రతిపాదన కుటుంబంలో తెచ్చారు. అందుకు బద్రీనాథ్ ఒప్పుకోకపోవడంతో, తాను పంచి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలని తండ్రి డిమాండ్ చేయడంతో పాటు కోర్టుకు సైతం వెళ్లాడు. దీంతో అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయి. పదేళ్లుగా ఈ ఆస్తి వివాదం కోర్టులో కొనసాగుతుండగానే.. చాలాసార్లు ఘర్షణపడ్డారు. సోదరుల నుంచి ప్రాణభయం ఉండటంతో బద్రీనాథ్ కొంతకాలంగా బయట తిరిగే సందర్భంలో హతీరాం అనే వ్యక్తిని వెంటబెట్టుకునేవారు. బుధవారం విధి నిర్వహణలో భాగంగా కలెక్టరేట్‌కు వచ్చిన బద్రీనాథ్ తిరిగి వెళుతుండగా.. ఇద్దరు తమ్ముళ్లు సర్దార్ నాయక్, కోట్యా నాయక్‌తో పాటు సర్దార్ నాయక్ కుమారుడు పరమేశ్‌లు కాపుకాసి మరికుంట సమీపంలో కత్తులతో దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా విచక్షణారహితంగా నరకడంతో బద్రీనాథ్ అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న హతీరాంకు కత్తి గాయం కావడంతో భయంతో పరారయ్యాడు. అనంతరం రెండు బైక్‌లపై నిందితులు అక్కడి నుంచి పారిపోయి.. వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితులు తమ అదుపులో ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహేశ్వర్‌రావు తెలిపారు. -
కొడుకును బావిలో పడేసి.. ఆపై పురుగు మందు తాగి..
ఎలిగేడు: కుటుంబంలో ఆస్తి గొడవలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి కొడుకు(17 నెలలు)ను బావిలో పడేసి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో బాలుడు మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లికి చెందిన కల్వల తిరుపతిరెడ్డి, మానస దంపతులు. వీరికి దేవాన్ష్ (17 నెలలు) సంతానం. తిరుపతిరెడ్డి, అతడి సోదరుడు రత్నాకర్‌రెడ్డి మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. మూడునెలల క్రితం పంచాయితీ పెట్టి పెద్దల సమక్షంలో ఆస్తి పంచుకున్నారు. అప్పటి నుంచి తిరుపతిరెడ్డి భార్య, కుమారుడితో కలిసి సుల్తానాబాద్‌లోని ఓ అద్దింట్లో నివాసం ఉంటున్నాడు. ఆస్తి పంపకాల విషయమై చంపుతామని తరచూ కొందరు బెదిరిస్తున్నారని భార్యతో చెప్పుకుని తిరుపతిరెడ్డి బాధపడేవాడు. ఈ క్రమంలో రాములపల్లిలో ఉంటున్న తల్లిదండ్రులకు తన కుమారుడిని చూపించి తీసుకొస్తానని భార్యతో చెప్పి బయల్దేరాడు. అయితే ఎంతకూ తిరిగి రాకపోవడంతో భర్తకు మానస ఫోన్ చేయగా సమాధానం రాలేదు. వెంటనే అత్తామామలకు ఫోన్ చేయగా రాములపల్లికి రాలేదని వారు చెప్పారు. అనుమానంతో పొలం వద్దకు వెళ్లి చూడగా తిరుపతిరెడ్డి అపస్మారకస్థితిలో కనిపించాడు. బావిలో బాలుడి చెప్పులు కన్పించాయి. తిరుపతిరెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాస్త తేరుకున్నాక దేవాన్ష్ గురించి అడుగగా తానే బావిలో పడేసి గడ్డిమందు తాగానని చెప్పాడు. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ సీఐ జగదీశ్, జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ బావి వద్దకు చేరుకుని గ్రామస్తుల సహకారంతో దేవాన్ష్ మృతదేహాన్ని బయటకు తీయించారు. మానస ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Hyderabad: మిస్టరీగా మారిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి.. అదే కారణమా!
సాక్షి, మేడ్చల్, మహబూబ్‌నగర్: మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం ప్రగతినగర్‌లోని మధురానగర్ కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మణికంఠవర్మ (29) మృతి మిస్టరీగా మారింది. తన పెంపుడు కుక్కకు మందులు కొనేందుకు బుధవారం ఉదయం కారులో ఇంటి నుంచి బయలుదేరిన ఆయన వనపర్తి జిల్లా శ్రీరంగాపుర్ మండలం జానంపేట శివారులోని రామసముద్రం చెరువులో గురువారం శవమై తేలడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతుడి తల్లి విష్ణుప్రియ, అక్క అన్నపూర్ణదేవి కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కుక్కపిల్లకు మందులు తీసుకువస్తానని మణికంఠవర్మ కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడికి కాల్ చేయగా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో వారు అతడి స్నేహితులు, తమ బంధువులకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో సాయంత్రం జేఎన్టీయూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వారు ప్రగతినగర్ బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధికి వస్తుందని చెప్పడంతో బాచుపల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామసముద్రం చెరువులో శవమై.. వనపర్తి జిల్లా, శ్రీరంగాపుర్ మండలం, జానంపేట శివారులోని రామసముద్రం చెరువులో తూము వద్ద శవం ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించి సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డికి తెలియజేయగా.. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి షర్టు లేదు.. ట్రాక్ ప్యాంట్‌కు కారు తాళం చెవి కట్టి ఉంది. పోలీసులు తాళం చెవి తీసుకుని కారును ఓపెన్ చేసి చూడగా.. అందులో స్విచ్ ఆఫ్ అయిన సెల్‌ఫోన్ లభించింది. ఆన్‌చేసి ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేయగా లాక్‌వేసి ఉంది. పోలీసులు అందులోని సిమ్‌కార్డును తీసి మరో సెల్లో వేసి ఆన్ చేశారు. దీంతో అతడి మిత్రులు, బంధువులకు ఎస్ఎంఎస్ వచి్చంది. శివాజీ అనే వ్యక్తి వెంటనే కాల్ చేయగా.. కానిస్టేబుల్ విషయం చెప్పి రమ్మన్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు గురువారం సాయంత్రానికి వనపర్తికి చేరుకున్నారు. శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆస్తి వివాదమే కారణమా ? కొన్నేళ్ల క్రితం గండిమైసమ్మ ప్రాంతంలో మృతుడి తండ్రి ఓ వెంచర్లో 340 గజాల ప్లాటు కొనుగోలు చేశాడు. దీని పక్కనే మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ భవన్‌ను నిరి్మంచారు. దాని పార్కింగ్ కోసం ఆ పార్టీ నేతలు వెంచర్‌లోని ప్లాట్లను చదును చేసేందుకు యత్నించారు. దీంతో మణికంఠవర్మ, తనతో పాటు కొనుగోలు చేసిన వారితో కలిసి కోర్టులో కేసు వేశారు. కోర్టు స్టే ఇవ్వగా.. తహసీల్దార్ స్వయంగా వచ్చి చదును చేసే పనులను నిలిపివేయించారు. ఈ క్రమంలో మణికంఠవర్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆస్తి వివాదమే ప్రాణం తీసిందని.. ఈ వివాదం తప్ప తమకు ఎలాంటి సమస్యలు లేవని మృతుడి తల్లి, అక్క రోదిస్తూ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
తల్లి తలను నరికి.. ఆ తలతో అటూ ఇటూ తిరిగి..
జనగామ రూరల్: చెల్లికి భూమి రాసి ఇచ్చి.. తనకు మాత్రం భూమి ఇవ్వడం లేదన్న కక్షతో కన్నతల్లిని ఓ కొడుకు అత్యంత కర్కశంగా చంపేశాడు. చికెన్కొట్టే కత్తితో తల్లి మెడ నరికి తలను వేరు చేశాడు. అనంతరం నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన జనగామ జిల్లా జనగామ మండలం మరిగడి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మరిగడి గ్రామానికి చెందిన కూరాకుల రాజయ్య, రమణమ్మలకు కుమారుడు కన్నప్ప, కూతురు లావణ్య ఉన్నారు. వీరికి పది ఎకరాల భూమి ఉంది. పదేళ్ల క్రితం రాజయ్య పక్ష వాతంతో చనిపోయాడు. గతంలో చికెన్ దుకాణం నడిపిన కన్నప్ప రెండు నెలలుగా స్థానికంగా సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె తన భర్తతో గొడవపడి మూడు నెలలనుంచి తల్లి వద్దే ఉంటోంది. ఈక్రమంలో కుమార్తెకు ఎలాంటి ఆధారం లేనందున ఉన్న భూమిలో కొంత ఇవ్వాలని తల్లి రమణమ్మ కొద్ది కాలంగా కుమారుడితో పట్టుబడుతోంది. ఇందుకు అతను సుముఖంగా లేకపోవడంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో కన్నప్పకు తెలియకుండా గత నెల 30న కుమార్తెకు 4ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసింది. విషయం తెలుసుకున్న కుమారుడు మిగిలిన భూమిని తనకు ఇవ్వాలని తల్లిని కోరాడు. ఇందుకు ఆమె ససేమిరా అంది. తాను బతికి ఉండగా ఆస్తిని ఇవ్వనని.. కుమారుడికి తెగేసి చెప్పడంతో కక్ష పెంచుకున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇరువురూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోగా కుమారుడిపై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో గురువారం ఉదయం చెల్లి లావణ్య పాల కోసం బయటకు వెళ్లింది. బైక్‌పై వచ్చిన కన్నప్ప వెంట తెచ్చుకున్న చికెన్ కొట్టే కత్తితో ఇంటిగడప వద్ద ఉన్న తల్లి రమణమ్మ (60) మెడపై నరికాడు. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. ఆ తరువాత తలను వేరు చేసి దానిని పట్టుకుని ఇంటిముందు అటూ ఇటూ కాసేపు తిరిగాడు. అనంతరం బైక్‌పై వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. జనగామ డీసీపీ సీతారాం, ఏసీపీ దేవేందర్‌రెడ్డి, సీఐ, ఎస్సైలు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. -
పెళ్లీడు వచ్చినా పెళ్లి చేయటం లేదన్న కోపంతో అన్నని..
సాక్షి,బళ్లారి: పెళ్లి చేయలేదని, ఆస్తి పంచలేదనే ద్వేషంతో సొంత అన్నను కడతేర్చిన తమ్ముడి ఉదంతం కొప్పళ జిల్లాలో చోటు చేసుకుంది. కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా పట్టల చింతగ్రామంలో బసప్ప కడివాలకు నలుగురు కుమారులు ఉన్నారు. యమునప్ప(40) పెద్ద కొడుకు. కుటుంబ బాధ్యతలు మీద వేసుకొని ఒకరికి పెళ్లి చేసి మరొక తమ్ముడికి వివాహం కూడా నిశ్చయం చేశారు. అయితే తనకు పెళ్లీడు వచ్చినా పెళ్లి సంబంధాలు చూడటం లేదని, పైగా ఆస్తి పంచాలని కోరినా పట్టించుకోలేదని నాలుగో తమ్ముడు మల్లప్ప తన అన్నపై కక్ష పెంచుకున్నాడు. ఈక్రమంలో అన్నను శనివారం కొడవలితో నరికి హత్య చేశాడు. హనుమసాగర్ పోలీసులు వచ్చి యమునప్ప శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడు మల్లప్పను అరెస్ట్ చేశారు. (చదవండి: మంగళూరు అబ్బాయి, నెదర్లాండ్స్ అమ్మాయి) -
ధనమే తల్లి ధనమే తండ్రి ధనమే దైవమా..
తల్లి.. తండ్రి.. ఈ లోకంలో కనిపించే ప్రత్యక్ష దైవాలు. నవమాసాలు మోసి, ప్రాణం పోయే నొప్పులను పంటి బిగువన భరించి జన్మనిచ్చేది తల్లి అయితే.. బిడ్డ ముసిముసి నవ్వులకు మురిసిపోతూ.. బుడి బుడి అడుగుల్లో సంతోషం వెతుక్కుంటూ.. కంటికి రెప్పలా కాపాడుకునేది తండ్రి. రక్తం పంచిన వీరిద్దరినీ మించిన బంధం మరొకటి ఉండదు..కష్ట మొచ్చినా, నష్టమొచ్చినా కడుపులో దాచుకొనే నేస్తాలూ ఈ ఇద్దరే. అమ్మ లేనిదే ముద్ద దిగదు.. నాన్న లేనిదే కాలం గడవదు.. పిల్లలకు వీళ్లే రెండు కళ్లు. తాము తినకపోయినా పిల్లల కడుపు నిండితే చాలనుకునే తల్లిదండ్రులు.. కాస్త వయస్సు పైబడితే చాలు, అదే పిల్లలకు చేదవుతున్నారు. తమ బతుకు వారి రక్తమాంసాలనే విషయం మరిచి.. చచ్చినప్పుడు వెంట రాని డబ్బు కోసం కాటికి కాలు చాచిన ఎండు కట్టెలను వీధిన పడేస్తున్న ఘటన కడు దయనీయం. పుట్టినప్పుడు.. పెరుగుతున్నప్పడు.. అమ్మానాన్నలపై ఎనలేని ప్రేమ. పెరిగే కొద్దీ, ఓ తోడు ఇంటికి చేరగానే ఆ బంధం క్రమంగా బరువవుతోంది. ఈ రోజు వాళ్లు.. రేపు మనం అనే విషయాన్ని మరిచి, కళ్లను కమ్మేసిన కరెన్సీ పొరలు మానవ సంబంధాలను కనుమరుగు చేస్తున్నాయి. మట్టినే నమ్ముకున్న ఓ రైతు, రెక్కలు ముక్కలు చేసుకొని ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఓ ఇంటి వాళ్లను చేసి ఉన్నంతలో పంచిపెట్టాడు. ఇక్కడే.. అన్నదమ్ములు, తోడి కోడళ్ల మధ్య అగ్గి రాజుకుంది. ఎక్కువ తక్కువలు బేరీజు వేసుకొని.. చివరకు సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇంట్లోకి రావద్దంటూ గెంటేయడం మానవత్వానికి మాయని మచ్చగా నిలుస్తోంది. చంద్రగిరి: మండల పరిధిలోని కొటాల గ్రామానికి చెందిన చెంగల్‌రామ నాయుడు(86), నాగభూషణమ్మ(75) దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు యోగానంద తిరుపతిలోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపనీలో జూనియర్ అసిస్టెంట్‌గా.. చిన్న కుమారుడు దేవరాజులు టీటీడీకి చెందిన సాంస్కృతిక విభాగంలో నెల్లూరులో పనిచేస్తున్నారు. ఇటీవల కొటాల గ్రామంలోని సర్వే నంబర్ 445లోని చెంగల్‌రామ నాయుడుకు చెందిన వ్యవసాయ భూమిలో 54 సెంట్లను యోగానందకు, 15 సెంట్లను దేవరాజులకు రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే 20 ఏళ్ల క్రితం చెంగల్‌రామ నాయుడు నిర్మించిన ఇంట్లో భార్యతో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం యోగనంద పాత ఇంటిని మరింత సౌకర్యవంతంగా కట్టుకోవడానికి బ్యాంకు లోను అవసరమని తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి నాగభూషణమ్మ, తమ్ముడు దేవరాజు సంతకాలు లేకుండా వృద్ధ దంపతులు నివాసం ఉంటున్న ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. పంపకాల్లో అన్యాయమని.. సోమవారం రాత్రి యోగానంద ఇంట్లో ఉండగా అతని భార్య విశ్వేశ్వరి(వేద) వృద్ధులు ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి ఆస్తి పంపకాల్లో అన్యాయం చేశారంటూ గొడవకు దిగింది. మేము కోరిన మేరకు ఆస్తి పంపకాలు చేయలేదని, అడిగిన మేరకు రాసివ్వకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడింది. వృద్ధాప్యం కారణంగా తాను ఎక్కడికీ రాలేనని, నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితిల్లో ఉన్నామని కోడలితో కన్నీరు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టి పరిష్కరించుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా తిట్ల దండకం అందుకుంది. అంతటిలో ఆగకుండా తీవ్ర ఆగ్రహంతో ఇల్లు తన భర్త యోగానంద పేరిట ఉందంటూ వృద్ధులను బయటకు గెంటేసి తాళం వేసింది. బంధువుల ఇంట్లో ఆశ్రయం కోడలు ఇంట్లో నుంచి గెంటేయడంతో రాత్రి వేళ వృద్ధ దంపతుల పరిస్థితి దయనీయంగా మారింది. నడవలేని స్థితిలోని భార్యతో ఎక్కడికి వెళ్లాలో తెలియక కన్నీరుమున్నీరయ్యాడు. గ్రామ పెద్దలు కోడలికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోకపోవడంతో చివరకు బంధువుల ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకు ఎంతో గుట్టుగా సంసారం నెట్టుకొచ్చినా, ఇద్దరు కొడుకులు ఉండి మరో ఇంట్లో ఉండాల్సి రావడంతో ఆ దంపతులు కుమిలిపోయారు. విధిలేక పోలీసుస్టేషన్‌కు.. ఆ రాత్రి కన్నీళ్లతో గడిచిపోయింది. ఇక బంధువులకు భారం కాలేక, న్యాయం జరుగుతుందనే ఆశతో అతి కష్టం మీద పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. కొడుకు, కోడలికి సర్దిచెప్పి న్యాయం చేయాలని చంద్రగిరి ఎస్ఐ వంశీధర్‌ను వేడుకున్నారు. కనీసం పోలీసుస్టేషన్ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధుల వద్దకే వెళ్లి ఎస్ఐ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. వృద్ధ దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎట్టకేలకు ఓ చిన్న గది ఒక రాత్రి బంధువుల ఇంట్లో తల దాచుకొని, మరుసటి రోజు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన వృద్ధ దంపతులకు కాస్త ఊరట కల్పించేందుకు గ్రామ పెద్దలు రంగంలోకి దిగారు. యోగానంద, అతని భార్య విశ్వేశ్వరితో చర్చించి, గట్టిగానే హెచ్చరించారు. కుమారుడి స్వాధీనంలోని ఇంట్లోనే వృథాగా ఉన్న ఓ గదిలో వృద్ధ దంపతులు ఉండేందుకు అతి కష్టం మీద ఒప్పించారు. కనీస సౌకర్యాలు లేని ఆ గదిని చూసి నాగభూషణమ్మ ఈ వయస్సులో తమకు ఇదేమి ఖర్మ అంటూ కన్నీరుమున్నీరైంది. అల్లారు ముద్దుగా పెంచినా.. ఇద్దరూ కొడుకులే కావడంతో జీవిత చరమాంకంలో ఎలాంటి లోటు ఉండదనుకున్నాం. ఈ వయస్సులో ఆస్తి పంపకాల వద్ద పెద్ద కొడుకు, కోడలు చేస్తున్న అరాచకం కన్నీరు పెట్టిస్తోంది. నా భార్యకు ఇటీవల ఆపరేషన్ జరగడంతో కనీసం కూర్చోలేని పరిస్థితి. కష్టపడి ఇల్లు కట్టి, కొడుక్కు ఉద్యోగం తీయిస్తే నిలువ నీడ లేకుండా చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. ఈ వయస్సులో మాకు ఇంకేమీ వద్దు, మా ఇంట్లో మమ్మల్ని ఉండనిస్తే చాలు. – చెంగల్‌రామ నాయుడు మమ్మల్ని మోసం చేశారు 2006లో మా మామ చెంగల్‌రామ నాయుడు ఆస్తి భాగపరిష్కారంలో నన్ను, నా భర్తను మోసం చేసి మా మరిదికి అనుకూలంగా వ్యవహరించారు. మెయిన్ రోడ్డులోని పొలం కాకుండా మాకు లోపలి భాగం ఇచ్చారు. అడిగితే అదేం లేదని, మీకు మెయిన్ రోడ్డులోనే ఉంటుందని చెప్పడంతో అప్పట్లో సంతకాలు చేశాం. ఇప్పుడు మా మరిది ఆ స్థలాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే విషయమై అత్తమామలను సోమవారం రాత్రి ప్రశ్నిస్తే పత్రాలు ఎలా ఉంటే అలా చేసుకోండని అంటున్నారు. 2003లో అత్తమామలు ఉంటున్న ఇంటిని మాకు రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకే మా ఇంటికి మాకు ఇమ్మంటున్నా. – విశ్వేశ్వరి, యోగానంద భార్య, కొటాల -
తండ్రి కొడుకుల జంట హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
ఉప్పల్: ఉప్పల్‌లో శుక్రవారం జరిగిన తండ్రి కొడుకుల దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థిరాస్థి విషయంలో కుటుంబ తగాదాలు, కోర్టు కేసులు, విచారణలు వెరిసి ఒకే కుటుంబంలో ఇద్దరి హత్యకు దారితీసిన విషయం విదితమే. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆస్థి తగాదాలతో పాటు మరేదైన కోణం ఉందా అనే విషయంలో సైతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుల విచారణ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. ఇప్పటికే దాదపుగా 40 మంది అనుమానితులను విచారించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీల ఆధారంగా, నిందితుల చాయ చిత్రాలతో అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ నంబర్లు, సెల్ టవర్లు లోకేషన్లతో కేసును చేధించే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసుల అదుపులో మరో నలుగురు శనివారం మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం అనుమానితులైన కొందరిని అదుపులోకి విచారించిన సంగతి విదితమే. దుండగులు అదే గల్లీలో బాధితుల ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్లో ఉంటూ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణంలో వెల్లడైంది. హాస్టల్లోని సీసీ ఫుటేజీలతో పాటు డీవీఆర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: తండ్రీ కొడుకుల దారుణ హత్య) -
ఆస్తి వివాదం: వృద్ధుడు చేసిన పనికి నాలుగు ప్రాణాలు బలి
సాక్షి కేరళ(ఇడుక్కి): ఆస్తుల విషయంలో తన పర భేదాన్ని మరిచిపోయి చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. ఆఖరికి తన కడుపున పుట్టిన వాళ్లు అని కనికరం కూడా ఉండదేమో. బహుశా ఆస్తి మీద ఉన్న వ్యామోహం మానవతా విలువలు మరిచి పశువులా ప్రవర్తించేలా చేస్తుందేమో. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఆస్తి విషయమై కన్న కొడుకు, మనవరాళ్లు అనే బాంధవ్యాన్ని మరిచి నిద్రిస్తున్నప్పుడే పెట్రోల్ పోసి ఇంటికి నిప్పంటించాడు. వాళ్లెవ్వరు బతికి బయట పడకూడదని పక్కా ప్లాన్‌తో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఆస్తి తగాదాల కారణంగా కేరళలోని ఇడుక్కిలో 79 ఏళ్ల హమీద్ తన కొడుకు కుటుంబాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ వృద్ధుడు వాళ్లు నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో కొడుకు, కోడలు, ఇద్దరు మనవరాళ్లు చనిపోయారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే హమీద్ ఇంటికి తాళం వేసిన తర్వాత కిటికి లోంచి పెట్రోల్ నింపిన బాటిళ్లను విసిరి అనంతరం నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. మంటలను గమనించిన స్థానికులు సైతం వారిని కాపాడలేకపోయారని వెల్లడించారు. అతను పక్కా ప్లాన్‌తో వాటర్ ట్యాంకును ఖాళీ చేయడమే కాక పక్కనున్న బావి నుంచి నీళ్లు తోడి ఎవరైన కాపాడతారేమోనని బావి వద్ద ఉండే నీళ్లు తోడే బకెట్‌ని కూడా తీసేశాడని చెప్పారు. ఇంటి లోపల దృశ్యం చాలా హృదయ విదారకంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే స్థానికులు హమీద్ పెట్రోల్ పోసి హత్య చేయడం చూశామని చెప్పడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: సాగర్ కాల్వలో తేలిన కారు.. వీడిన మిస్టరీ, ఆ పని అన్నాచెల్లెలే చేశారు!) -
వైరల్ వీడియో: అందరూ చూస్తుండగానే రోడ్డుపై కర్రలతో హల్చల్
న్యూఢిల్లీ: జనమంతా చూస్తుండగా రోడ్డు మీద కొంతమంది వ్యక్తులు బంధువులపై కర్రలతో దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆస్తి పంపకాల విషయంలో రెండు కుటుంబాల మధ్య ఈ కొట్లాట జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఆస్తి వివాదంపై కొంతమంది వ్యక్తులు తమ బంధువులపై కర్రలు, క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశారు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. పట్టపగలు నడిరోడుపై కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అల్లర్ల నుంచి పరిస్థితిని నియంత్రించి. గాయపడిన వారిని స్థానికి ఆసుపత్రికి తరలించారు. దాడులకు పాల్పడిన నలుగురిని జగత్ (62), హరేందర్ (41), సుమిత్ (29), అమిత్ (24)గా గుర్తించారు. పోలీసులు ఇప్పటి వరకు జగత్‌ను మాత్రమే అరెస్టు చేశారు. అయితే శ్యామ్, జగత్, అతని పిల్లలకు మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. శ్యామ్, అతని బంధువులపై జగత్ తన కొడుకులు దాడి చేశారని పేర్కొన్నారు. ఇరు కుటుంబాలు ఈ ప్రాంతంలో గతంలో కూడా కొట్టుకున్నాయని, వారిపై పాత కేసులు కూడా ఉన్నాయని డీసీపీ సంజయ్ తెలిపారు. చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!! - incident took place in Northeast Delhi's New Usmanpur area. One accused has been arrested. pic.twitter.com/mMllfvLAVo — Mahender Singh Manral (@mahendermanral) February 12, 2022 -
సెల్ఫీ సూసైడ్ కలకలం
-
కరీంనగర్లో సెల్ఫీ సూసైడ్ కలకలం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. నగరంలోని తిరుమలనగర్‌కి చెందిన తిప్పారపు శ్రీనివాసాచారి(42) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.. తనకు చెందాల్సిన ఆస్తిని తన అన్న అక్రమంగా అతని భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన అక్క కూడా మోసం చేసిందని వాపోయాడు. చదవండి: పెళ్లైన ఆర్నెళ్లకే.. భార్యను వదిలేసి ప్రియురాలితో.. కరీంనగర్‌లోని భగత్ నగర్ లోని ప్రాపర్టీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని శ్రీనివాసచారి వివరించారు. అందుకే చనిపోతున్నట్టు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఐదున్నర గంటలు..6 నేరాలు.. వీడు మామూలోడు కాదురోయ్! -
హైడ్రామా: కిరోసిన్ డబ్బా పట్టుకుని ఇంటి డాబా ఎక్కిన కొడుకు..
సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం): ఆస్తిలో తనకూ వాటా ఇవ్వాలంటూ ఓ వ్యక్తి భవనమెక్కి హల్చల్ చేసిన సంఘటన సత్తుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని గాంధీనగర్–4కు చెందిన గుణగంటి రామకృష్ణ పదేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులతో అతనికి సంబంధాలు నిలిచిపోయాయి. ఇటీవల తండ్రి ఆస్తిని ఇద్దరు కూతుళ్లకు పంచుతున్న క్రమంలో తనకూ వాటా ఇవ్వాలని వారం రోజులపాటు ఇంటి ముందు వరండాపైనే ఆందోళన చేశాడు. సమస్య పరిష్కా రం కాకపోవడంతో ఆదివారం ఉదయం కిరోసిన్ డబ్బా పట్టుకుని తన ఇంటి డాబా ఎక్కాడు. ఆస్తిలో వాటా ఇవ్వకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, చల్లగుళ్ల నర్సింహారావు, గాదె సత్యం తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. కాగా రామకృష్ణను మాటల్లో పెట్టి రామిశెట్టి కృష్ణమూర్తి అనే వ్యక్తి వెనుకవైపు నుంచి వెళ్లి గట్టిగా పట్టుకుని రక్షించాడు. పెద్దల సమక్షంలో ఆస్తిలో వాటా ఇస్తామని హామీ పత్రం రాసి ఇవ్వటంతో.. సుమారు ఐదు గంటలపాటు నడిచిన హైడ్రామా సద్దుమణిగింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎటువంటి ప్రమాదం జరగకుండా వల ఏర్పాటు చేశారు. -
దయనీయ పరిస్థితి.. బతికుండగానే పెద్దకర్మ!
సాక్షి, నకిరేకల్(నల్లగొండ): ఇంటికి పెద్ద కొడుకని ఎంత ముద్దు చేసి ఉంటుంది? కానీ బతికుండగానే ఆ తల్లికి పెద్దకర్మ చేయాలని చూశాడా కుమారుడు. తోడబుట్టిన వారికే అన్నీ పంచిపెడుతోందని కన్నతల్లిపై కక్షగట్టిన ఆ ప్రబుద్దుడు.. బతికున్న తన తల్లి పేరుతో సంతాప కార్డు ముద్రించాడు. దీంతో విషయం తెలిసిన అతని తల్లి పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన వారణాశి పోశమ్మకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు. వృద్ధాప్యంలోనూ కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తోంది. పోశమ్మ పెద్ద కుమారుడు యాదగిరి తన తల్లి సంపాందించిన సొమ్మును కూతుళ్లకే పెడుతోందని కక్ష పెంచుకున్నాడు. అదికాస్తా శృతిమించి చివరకు తన తల్లి చనిపోయిందని, పెద్ద కర్మ చేస్తున్నామని సంతాప కార్డులను ప్రింట్ చేయించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ విషయం పోశమ్మకు తెలిసింది. కొడుకు చేసిన పనికి కన్నీరుమున్నీరైంది. తాను చనిపోక ముందే చనిపోయినట్లు కొడుకు చేసిన నిర్వాకంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై నకిరేకల్ సీఐ నాగరాజు వెంటనే స్పందించి పోశమ్మ పెద్ద కూమారుడు యాదగిరిని పిలిపించారు. పోలీసుల సమక్షంలో యాదగిరి త న తల్లికి క్షమాపణ చెప్పాడు. అంతే ఆ తల్లి మనసు కరిగిపోయిది. ఆదివారం తమ కుటుంబ సభ్యుల మధ్య అన్నీ మాట్లాడుకుంటామని పోలీసులకు చెప్పి తల్లీ, కొడుకులు ఇంటికి వెళ్లిపోయారు. చదవండి: అసభ్యకర ప్రవర్తన: యాదగిరిగుట్ట రూరల్ సీఐ సస్పెన్షన్ -
దారుణం: కన్నతల్లిపై కొడుకు, కోడలి పైశాచికత్వం..
సాక్షి, నిడమనూరు(నల్లగొండ): చిన్నకూతురు పేర అదనంగా భూమి రిజిస్ట్రేషన్ చేసిందనే అక్కసుతో తన తల్లిపై కుమారుడు, కోడలు దాడి చేసి గాయపరిచిన సంఘటన మండలంలోని పార్వతీపురంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పార్వతీపురంలో ఇట్టె కిష్టమ్మ, కోటయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి ఉన్న భూమిలో పెద్దకుమారుడికి, చిన్న కుమారుడికి తలా కొంత భూమిని పంచి ఇచ్చి, మిగతాది తమపేరున ఉంచుకున్నారు. ఇదిలా ఉండగా చిన్నకూతురు అయిన విజయలక్ష్మి పేర కట్నకానుకగా ఇచ్చిన భూమికి అదనంగా రిజిస్ట్రేషన్ చేసిందని పెద్దకుమారుడు అయిన సూరిబాబు అప్పుడప్పుడు తల్లితో గొడవపడుతూ ఉండేవాడు. తల్లి కిష్టమ్మ ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో ఇంట్లో పని చేసుకుంటుండగా పెద్ద కుమారుడు, అతడి భార్య భూలక్ష్మి, వారి కూతుళ్లు వచ్చి భూమి విషయంలో కిష్టమ్మతో గొడవపడ్డారు. కొడవలి, రాడ్డుతో తీవ్రంగా కొట్టారు. దీంతో వృద్ధురాలి తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుమార్తె మాణిక్యాల విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు. కాగా.. ఇట్టె కిష్టమ్మపై 2019లో కూడా కుమారుడు ఇట్టె సూరిబాబు బీరు సీసాతో దాడి చేసి గాయపర్చాడు. కోలుకున్న తర్వాత తిరిగి రెండేళ్లకు సూరిబాబుతో పాటు అతడి భార్య, ఇద్దరు కూతుర్లు దాడి చేయడం గమనార్హం. చదవండి: పండుగరోజు విషాదం: చెల్లితో రాఖీ కట్టించుకోకుండానే... -
చావేగతి అని.. యూట్యూబ్‌లో వెతికి.. ఆన్లైన్లో ఆర్డర్ చేసి..
రామవరప్పాడు (గన్నవరం): సంతోషాల పొదరిల్లు వారి కుటుంబం.. భార్య, భర్త ఇద్దరు పిల్లలతో ఆనందంగా సాగిపోతుంది వారి జీవితం.. అటువంటి సమయంలో కరోనా మహమ్మారి కాటేసింది. ఇంటి పెద్దయిన భర్తను దూరం చేసింది.. తనకు, తన బిడ్డలకు అండగా ఉంటారనుకున్న అత్తింటి వారు ఆమె ఆవేదనను మరింత ఎక్కువ చేశారు. ఆస్తి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోనన్న ఆలోచనతో ఆ తల్లిని వేధింపులకు గురిచేశారు. తట్టుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక ఇక లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఎలా ఆత్మహత్య చేసుకోవాలో యూట్యూబ్‌లో సెర్చ్ చేసింది. ఓ కెమికల్‌ను ఆన్‌లోనే కొనుగోలు చేసింది. తన ఒక్కతే చనిపోతే.. ఇద్దరు బిడ్డలు అనాథలవుతారని ఆలోచించింది. ఆ కెమికల్‌ను తనతోపాటు, తన బిడ్డలకు పట్టించింది. కళ్లముందే బిడ్డలు చనిపోతుంటే చూడలేకపోయిందో.. లేక చివరిగా తన అక్కతో మాట్లాడాలనుకుందో గానీ విషయాన్ని ఆమె అక్కకు ఫోన్లో చెప్పింది. వెంటనే స్పందించిన అక్క హుటాహుటిన ఆమె ఇంటికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించింది. ఆ ఘటన విజయవాడరూరల్ మండలం నిడమానూరులో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇవి.. నిడమానూరు రామానగర్ రామాలయం సమీపంలో సూరెడ్డి బాలకృష్ణ, దివ్య (30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి భార్గవ్ (7), రోహిత్ (5) సంతానం. బాలకృష్ణ చందు కార్ ట్రావెల్స్‌లో మెనేజర్‌గా పని చేసేవాడు. మూడు నెలల క్రితం కరోనాతో బాలకృష్ణ మృతి చెందాడు. అప్పటి నుంచి దివ్య పిల్లలతో కలిసి జీవిస్తోంది. భర్త మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన దివ్య ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఒంటరిగా తనలో తాను కుమిలిపోతుండేది. అధికమైన అత్తింటి వేధింపులు ఈ క్రమంలో దివ్యకు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. రామానగర్‌లోని ఓ బహుళ అంతస్తు భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో దివ్య, ఫస్ట్ ఫ్లోర్లో అత్త, సెకండ్ ఫ్లోర్లో మరిది ఉంటున్నారు. బాలకృష్ణ మృతి చెందినప్పటి నుంచి అత్త సుజాత, మరిది శ్రీనివాసరావు, తోడికోడలు మల్లీశ్వరి కలిసి దివ్యను వేధింపులకు గురి చేస్తున్నారు. భర్త చనిపోయినా ఇక్కడెందుకు ఉన్నావు.. పుట్టింటికి వెళ్లిపో అంటూ చీటికీ మాటికీ గొడవ పడుతుండేవారు. భర్త మరణంతో ఆధారం కోల్పోయానని, ఉన్న ఆస్తిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని దివ్య అత్తింటివారిని కోరింది. దీనికి అత్త సుజాత, మరిది శ్రీనివాసరావు నిరాకరించడంతో పిల్లలను ఎలా చదివించాలి, పోషించాలన్న ఆలోచనతో మనోవేదనకు గురైంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దివ్య, భార్గవ్, రోహిత్ అక్కకు విషయం చెప్పడంతో.. అర్ధరాత్రి దాటిన తర్వాత పెనమలూరులో నివాసం ఉంటున్న తన అక్కకు దివ్య ఫోన్ చేసి, తాము చనిపోతున్న విషయాన్ని చెప్పింది. ఆమె వెంటనే స్పందించి బంధువులతో కలిసి దివ్య ఇంటికి వచ్చింది. అప్పటికే అపస్మారకస్థితికి చేరుకున్న తల్లీపిల్లలను హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. పిల్లలు రెయిన్బో ఆస్పత్రిలో, దివ్య ఆయుష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పిల్లలకు ప్రాణాపాయం నుంచి బయట పడగా.. దివ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్లో సెర్చ్ చేసి.. ఒక పక్క భర్త మృతి చెందడం, మరో పక్క అత్తింటి వారి వేధింపులు ఎక్కువవడంతో జీవితంపై విరక్తి చెందిన దివ్య చనిపోవాలని నిర్ణయించుకుంది. యూట్యూబ్‌లో ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అనే అంశంపై శోధించింది. సోడియం ఎజైడ్ కెమికల్ తాగితే వెంటనే ప్రాణాలు పోతాయని తెలుసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారన్న ఉద్దేశంతో శనివారం రాత్రి కెమికల్‌ను తాను తాగి, పిల్లలకూ తాగించింది. -
వివాహమై 30 ఏళ్లు.. మరో మహిళను పెళ్లి చేసుకుని..
సాక్షి,కారేపల్లి(ఖమ్మం): భర్త నుంచి తనకు ఆస్తి పంచి ఇవ్వాలని.. తన కూతురుతో కలిసి ఓ మహిళ కారేపల్లి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మాధారం గ్రామానికి చెందిన చిలక సాంబశివరావుకు 30 ఏళ్ల క్రితం సీతమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కృష్ణవేణి ఉంది. కాగా సాంబశివరావు మరో మహిళను రెండో వివాహం చేసుకొని, తనను, తన కూతురిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని వాపోయింది. ఇంట్లో గానీ, వ్యవసాయ భూమిలో గానీ ఆస్థి పంచి ఇవ్వలేదని, ఈ విషయమై పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపించింది. ఈ విషయమై.. ఎస్ఐ సురేష్‌ను వివరణ కోరగా.. సీతమ్మ తన భర్త నుంచి ఆస్థి పంచి ఇవ్వాలని.. పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసిందని, ఇది సివిల్ మ్యాటర్ అని కోర్టు ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా సీతమ్మ పోలీసు స్టేషన్‌కు వస్తూ.. ఎస్ఐలు మారినప్పుడల్లా ఇదే విషయంపై సీతమ్మ ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసిందని, కోర్టు ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సీతమ్మకు చెప్పామన్నారు. -
ఘోరం: ఆస్తి కోసం యువకుడిని చంపిన కుటుంబం..
సాక్షి, దుగ్గొండి(వరంగల్): వారంతా ఒకే తల్లీబిడ్డలు. కలిసి పెరిగి పెద్దవారయ్యారు. ఇన్ని రోజులు అన్యోన్యంగానే ఉన్నారు. కానీ ఆస్తి వారి మధ్య చిచ్చు పెట్టింది. ఆస్తి పంపకం విషయంలో గొడవపడి కుటుంబ సభ్యులు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇదే క్రమంలో సోదరులు, సోదరి, తల్లిచేతిలో పెద్ద కుమారుడు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన దుగ్గొండి మండలం బంధంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మక్కాజి ప్రమీలకు ముగ్గురు కుమారులు రాజేష్ (32) ప్రవీణ్, నాగరాజు, కూతురు సరిత ఉన్నారు. రాజేష్ గత కొంత కాలంగా హన్మకొండలో కారు క్యాబ్ సర్వీస్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండు రోజుల క్రితం భార్య శైలజ, రెండేళ్ల కుమారుడితో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. ఇంటి ఆస్తి విషయంలో రాజేష్‌తో తమ్ముళ్లు ప్రవీణ్, నాగరాజు, సోదరి సరిత, తల్లి ప్రమీల గొడవ పడ్డారు. వీరంతా బండరాయితో మూకుమ్మడిగా రాజేష్‌పై దాడి చేయడంతో ఇంట్లోనే కుప్పకూలాడు. కొన ఊపిరితో రాజేష్‌ను ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని నర్సంపేట ఏసీపీ ఫణీందర్, సీఐ సతీష్‌బాబు, ఇన్చార్జి ఎస్సై వెంకటేశ్వర్లు పరిశీలించారు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
తండ్రితో కలిసి తల్లిని నరికి చంపాడు
నల్లగొండ క్రైం: ఓ కుటుంబంలో ఆస్తి వివాదం చిచ్చుపెట్టింది. తండ్రితో కలిసి ఓ కుమారుడు తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా నల్లగొండ మండలంలో చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. దండెంపల్లి గ్రామానికి చెందిన సుంకరబోయిన యాదమ్మ (55), ఆమె భర్త గంగయ్య, కుమారుడు యాదగిరి సోమవారం రాత్రి ఆస్తులు, అప్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. అంతలో యాదమ్మ ‘అంతా నా ఇష్టం. నా సోదరుడు పొగాకు శ్రీను చెప్పినట్టే చేస్తా’నని చెప్పడంతో కోపోద్రిక్తులైన భర్త, కుమారుడు ఆమెతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో గంగయ్య, యాదగిరి కలిసి గొడ్డలితో యాదమ్మ తలపై వేటువేశారు. కొనఊపిరితో ఉన్న ఆమెను బంధువులు రాత్రి 11 గంటల సమయంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందింది. వివాదానికి కారణమిదీ... సుంకరబోయిన గంగయ్య, యాదమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె కళావతిని యాదమ్మ తన సోదరుడైన అన్నెపర్తికి చెం దిన పొగాకు శ్రీనుకు ఇచ్చి వివాహం చేసింది. కుమారుడు యాదగిరికి వివాహం కాగా, అతని కుటుంబంలో శ్రీను కారణంగా వివాదాలు తలెత్తి భార్యాభర్తలు విడిపోయారు. యాదగిరికి మరోసారి వివాహ ప్రయత్నాలు చేస్తుండగా.. శ్రీను వాటిని చెడగొట్టేవాడు. దీంతోపాటు వ్యవసాయ భూమిలో వాటా కోసం శ్రీను కోర్టులో కేసు వేశాడు. తర్వాత వాటా కు అంగీకారం కుదరడంతో కేసు విరమించుకున్నాడు. నల్లగొండలో ఉన్న ప్లాట్‌ను యాదమ్మ తన పెద్ద కుమార్తె కుటుంబసభ్యులకు ఇచ్చింది. తర్వాత ఆమె భర్త వద్ద ఉండకుండా పెద్ద కుమార్తె అత్తగారితో కలసి ఉంటోంది. కుమారుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడ టం.. సోదరుడివైపే ఒత్తాసు పలుకుతుండటంతో కుటుంబం కలహాలు తలెత్తాయి. ఈక్రమంలో భూమిని అమ్మే విషయమై వివాదం చెలరేగడంతో భర్త, కుమారుడు కలిసి యాదమ్మను చంపేశారు. తండ్రి, సోదరుడు కలిసి హత్య చేశారని చిన్న కుమార్తె రేణుక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
రెండున్నర ఎకరాల కోసం నలుగురు బలి
యశవంతపుర: భూ వివాదంలో దాయాది కుటుంబాల ఘర్షణలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కర్ణాటకలో హాసన్ జిల్లా హొళె నరసిపుర తాలూకా మారగౌడనహళ్లిలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. మల్లేశ్, స్వామిగౌడ దాయాదులు. రెండున్నర ఎకరాల పొలంపై వీరిద్దరికీ కొన్నేళ్ల నుంచి కోర్టులో కేసు నడుస్తుండగా ఇటీవల మల్లేశ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనితో మల్లేశ్ కొడుకు బసవరాజు సోమవారం దుక్కి చేయడానికి వెళ్లాడు. స్వామిగౌడ కొడుకు పాపన్న, ప్రదీప, శశి అతన్ని అడ్డుకుని పంపేశారు. దీనిపై సోమవారం మధ్యాహ్నం ఇరువర్గాలు ఇళ్ల వద్ద కట్టెలు, కత్తులతో కొట్లాటకు దిగారు. ఈ దాడిలో మల్లేశ్ (60) అతని బంధువు మంజేశ (35), అల్లుడు రవి (35)తోపాటు స్వామిగౌడ కొడుకు పాపన్న (42)చనిపోయారు. -
ఆస్తి తగాదాలతో టీఆర్ఎస్ నేత హత్య
సాక్షి, దేవరకొండ : కుటుంబ ఆస్తి తగాదాలు చిలికి.. చిలికి గాలివానగా మారి ఒకరి ప్రాణాన్ని బలిగొంది.. మృతుడు టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు. చందంపేట మండలంలో శని వారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పాత పోలేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గోప్యానాయక్ కుటుంబానికి చందంపేట మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లాలునాయక్ (50) కుటుంబానికి కొంత కాలంగా ఆస్తి పంచాయితీ నడుస్తోంది. ఈ విషయమై పలుమార్లు ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. లాలునాయక్ కుమార్తె రమావత్ పవిత్ర ప్రస్తుతం చందంపేట జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా, చందంపేట మండలం పోలేపల్లి స్టేజీ వద్ద బస్‌షెల్టర్‌ను ఆక్రమించుకొని రోడ్డు వెంట ఏర్పాటు చేసిన దుకాణాలను శనివారం ఆర్అండ్బీ పోలీస్‌శాఖ సంయుక్తంగా తొలగించడం ప్రారంభించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న గోప్యానాయక్ కుమారుడు విజయ్‌నాయక్, లాలునాయక్‌లు తారసపడడంతో మాటమాట పెరిగి ఆస్తి విషయమై తగాదా పడ్డారు. దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అక్కడినుంచి బిల్డింగ్‌తండా గ్రామానికి వెళ్లిన ఇరు వర్గీయులు మరోసారి ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో మారణాయుధాలతో దాడి చేయడంతో లాలునాయక్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే అతన్ని దేవరకొండలోని ఓ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. లాలు నాయక్ మృతిచెందిన విషయం తెలుసుకున్న అతని వర్గీయులు విజయ్‌నాయక్ ఇంటిపై దాడికి దిగి సామగ్రిని ధ్వంసం చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిండి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలేపల్లి, బిల్డింగ్‌తండాలలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన నేపథ్యంలో పికెట్ ఏర్పాటుచేసినట్లు ఎస్ఐ సందీప్‌కుమార్ తెలి పారు. శాంతిద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
‘20వేల కోట్ల ఆస్తి.. ముగ్గురికి హక్కు ఉంది’
చండీగఢ్: దివంగత ఫరీద్కోట్ మహారాజాకు చెందిన దాదాపు రూ.20,000 కోట్ల విలువైన ఆస్తిని.. ఆయన కుమార్తెలకు వారసత్వంగా మంజూరు చేస్తు హర్యానా హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీనిలో మణిమజ్రా కోట, సిమ్లా మషోబ్రాలోని ఆస్తులు, బ్యాంక్ డిపాజిట్లు, ఆభరణాలు, పాతకాలపు కార్లు, ఢిల్లీ ఇండియా గేట్ సమీపంలోని కోపర్నికస్ మార్గ్ వద్ద ఉన్న ఫరీద్కోట్ హౌస్ ఉన్నాయి. కుమార్తెలు రాజ్‌కుమారి అమృత్ కౌర్, దీపిందర్ కౌర్ ఇద్దరికీ ఈ ఆస్తిలో 75 శాతం వాటా లభిస్తుందని కోర్టు తెలిపింది. మిగిలిన 25 శాతం వాటా వారి తల్లి మహారాణి మహీందర్ కౌర్‌కు చెందుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్ తన 547 పేజీల తీర్పులో ఇద్దరు కుమార్తెల హక్కులను సమర్థించారు. మహారావల్ కేవాజీ ట్రస్ట్, దీపిందర్ కౌర్ చేసిన విజ్ఞప్తులను తోసిపుచ్చారు.అంతేకాక ఫరీద్కోట్ పాలకుడు రాజా హరీందర్ సింగ్ బ్రార్ మరణించినప్పుడు మహారాణి మహేంద్ర కౌర్ సజీవంగా ఉన్నారని.. ఆమెకు కూడా ఆస్తిలో వాటా ఉంటుందని కోర్టు తెలిపింది. అయితే ప్రస్తుతం మహారాణి మహీందర్ కౌర్, ఆమె కుమార్తె దీపిందర్ కౌర్ ఇద్దరూ మరణించారు. దాంతో ఈ ఇద్దరి వాటాలు వారి చట్టపరమైన వారసులకు వెళ్తాయని కోర్టు తెలిపింది. ఇప్పటివరకు ఆస్తులను నిర్వహిస్తున్న మహారావల్ ఖేవాజీ ట్రస్ట్ చట్టవిరుద్ధమని ప్రకటించిన దిగువ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. దిగువ కోర్టు 2013 జూలై 25న తన తీర్పులో.. దివంగత తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న అమృత్ కౌర్‌కు వారసత్వాన్ని ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని దీపిందర్ కౌర్ పై కోర్టులో సవాలు చేశారు. దీన్ని కోర్టు 2018లోనే కొట్టివేసింది. ఫరీద్కోట్ వివాదం... 1918 లో మూడేళ్ళ వయసులో పాలకుడిగా పట్టాభిషేకం పొందిన హరీందర్ ఫరీద్కోట్ ఎస్టేట్ చివరి పాలకుడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు... అమృత్ కౌర్, దీపిందర్ కౌర్ , మహిపీందర్ కౌర్ కాగా ఒక కుమారుడు హర్మహిందర్ సింగ్ ఉన్నారు. కొడుకు 1981 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఏడుగురు సిక్కు రాచరికపు మహారాజులలో ఒకరైన హరీందర్ 1989లో మరణించాడు. చనిపోయేనాటికి ఆయనకు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్,ఢిల్లీ, హర్యానా మరియు చంఢీగడ్‌లో ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయి. అక్టోబర్ 1989 లో మహారాజా మరణించిన తర్వాత ఈ ఆస్తి వివాదం ప్రారంభమైంది. హరీందర్ కౌర్ మరణించిన తర్వాత ఓ విల్లు వెలుగులోకి వచ్చింది. ఈ విల్లును 1982లో రాసినట్లు దానిలో ఉంది. మహారాజా తన ఆస్తులను మహర్వాల్ ఖేవాజీ ట్రస్ట్‌కు ఇచ్చినట్లు విల్లు పేర్కొంది. అంతేకాక కుమార్తె దీపిందర్ కౌర్ అధ్వర్యంలో ఈ ట్రస్ట్ నడుస్తుంది. మూడవ కుమార్తె ఈ ట్రస్టుకు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. రెండవ కుమార్తె అయిన అమృత్ కౌర్ 1952లో తండ్రికి ఇష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ఆమెకు ఈ ఆస్తిలో వాటాలేదని మహారాజా ప్రకటించారు. అయితే మహారాజు చనిపోయిన తర్వాత అమృత్ కౌర్ ఎస్టేట్ యాక్ట్, 1948 ఆధారంగా మొత్తం ఎస్టేట్ మీద దావా వేశారు. విల్లు నకిలీదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగానే మహారాజా మూడవ కుమార్తె మహిపీందర్ కౌర్ 2001లో కన్యగానే మరణించారు. మరో రెండు పిటిషన్లు.. అమృత్ కౌర్ మాదిరిగానే మహారాజా హరీందర్ సింగ్ సోదరుడు మంజిత్ ఇందర్ సింగ్ కుమారుడు భరతీందర్ సింగ్ జేష్ఠత్వ నియమాన్ని పేర్కొంటూ ఆస్తిపై తనకు హక్కు కల్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. తండ్రి రాసిన విల్లు ఆధారంగా తనకు ఆస్తిలో వాటా దక్కాలని దీపిందర్ కౌర్ దావా వేశారు. అయితే ఈ వివాదం నడుస్తుండగానే దీపిందర్ కౌర్ మరణించారు. ఈ వివాదానికికి సంబంధించి 2018లోనే హర్యానా హై కోర్టు ట్రస్టు పాత్ర శూన్యమని ప్రకటించి కుమార్తెలకు ఆస్తిని ఇవ్వమని పేర్కొంది. నేడు జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్ 30ఏళ్ల ఈ వివాదానికి తుది తీర్పు ఇచ్చారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం రాజా హరీందర్ సింగ్ ఆస్తిలో ఆయన ఇద్దరు కుమార్తెలు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్‌లతో పాటు మహారాణికి వాటా ఉంటుందని కోర్టు తెలిపింది. ఆస్తిని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో ట్రస్ట్ ధర్మకర్తలు కుట్ర పన్నారని.. నకిలీ విల్లును సృష్టించారని కోర్టు వెల్లడించింది. -
తండ్రిని చంపి.. 25 ముక్కలుగా నరికి..
న్యూఢిల్లీ : ఆస్తి కోసం కన్నతండ్రినే అత్యంత దారుణంగా హతమార్చాడో కొడుకు. అనంతరం అతడి శవాన్ని ముక్కలుగా నరికి తప్పించుకునే క్రమంలో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఢిల్లీలోని షాదర ఏరియాలో చోటుచేసుకుంది. వివరాలు.. సందేశ్ అగర్వాల్(48) అనే వ్యక్తి ఫార్ష్ బజార్లో కాస్మొటిక్ షాప్ నడుపూతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా ఆస్తి మొత్తం తన పేరిట రాయాలని పెద్ద కొడుకు అమన్ తండ్రితో గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అమన్ తండ్రిని హత్య చేశాడు. అనంతరం అతడి శవాన్ని 25 ముక్కలుగా నరికి.. నాలుగు బ్యాగుల్లో ప్యాక్ చేశాడు. స్నేహితుల సహాయంతో మంగళవారం వాటిని తరలిస్తుండగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా తండ్రి తనను ఎప్పుడూ తిడుతుండటంతోనే హత్య చేశానని అమన్ చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా ఈ విషయం గురించి సందేశ్ సోదరుడు మాట్లాడుతూ..‘ ఆస్తి విషయంలో సందేశ్‌కు, అతడి భార్యాపిల్లలకు గొడవలు జరుగుతున్నాయి. సందేశ్ ఇప్పటికే తన ఆస్తిలో సగం వారి పేరిట రాశాడు. కేవలం ఒక్క షాపు మాత్రమే అతడి పేరుతో ఉంది. అయితే దానిని కూడా దక్కించుకునేందుకు వారు సందేశ్‌ను చంపేశారు. నెల రోజులుగా సందేశ్‌ను చంపుతానంటూ అమన్ బెదిరిస్తూనే ఉన్నాడు. సందేశ్ హత్యలో అతడి భార్య ప్రమేయం కూడా ఉంది. ఆస్తి కోసం నా తమ్ముడిని పొట్టనబెట్టుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఆస్తి తగాదా.. తమ్ముడిని కాల్చిచంపిన అన్న
సాక్షి, చెన్నై: ఆస్తి తగాదా ఓ పారిశ్రామికవేత్త కుటుంబంలో చిచ్చుపెట్టింది. ఉమ్మడి కుటుంబం విడిపోతోందన్న వేదనతో తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపేశాడు అన్న. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో చోటుచేసుకుంది. మట్టకడై ప్రాంతానికి చెందిన బిల్లా జగన్ (43) కుటుంబానికి ట్రాన్స్‌పోర్టు, ఫైనాన్స్ సంస్థలు, కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. డీఎంకే పార్టీకి తూత్తుకుడి నేతగా వ్యవహరిస్తున్న జగన్‌కు, సిమన్సన్ (37)తో పాటు మరో ఇద్దరు సోదరులు ఉన్నారు. సిమన్సన్కు ఏడాదిన్నర క్రితం మనపట్టికి చెందిన ధరణితో వివాహం అయ్యింది. అందరూ ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆస్తి పంచాలని సిమన్సన్ గొడవ పడేవాడు. కుటుంబంలోని మిగిలిన వాళ్లకు ఆస్తి పంచుకోవడం ఇష్టం లేదు. తూత్తుకుడికి చెందిన ఓ పోలీసు అధికారి ఈ అన్నదమ్ముళ్ల మధ్య పంచాయితీ పెట్టి సఖ్యతకు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జగన్, సిమన్సన్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఆస్తి పంచే ప్రసక్తే లేదని జగన్ తేల్చి చెప్పేశాడు. అదే సమయంలో సిమన్సన్ భార్య ధరణి ఆగ్రహంతో తన పుట్టింటికి వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లడం, అన్నయ్య ఆస్తి పంచకపోవడంతో ఆగ్రహానికి గురైన సిమన్సన్ రాత్రి సమయంలో తన మిత్రులు మారి, నారాయణన్‌లతో కలసి ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన జగన్ తన వద్ద ఉన్న తుపాకీతో సిమన్సన్ను కాల్చాడు. అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. తమ్ముడి హత్య అనంతరం విదేశాలకు పారిపోయేందుకు జగన్ ప్రయత్నించాడు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం విమానాశ్రయంలో మంగళవారం జగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
తల్లిని కుర్చీకి కట్టేసి.. కత్తితో పోడిచేసి..
సాక్షి ప్రతినిధి, చెన్నై : కన్న కొడుకే ఆమె పాలిట కాలయముడయ్యాడు. ఆస్తి కోసం అనేకసార్లు దాడిచేసి వేధించాడు. అమె అంగీకరించకపోవడంతో కన్నతల్లి అనే కనికరం లేకుండా అత్యంత కిరాతకంగా హతమార్చి పరారైన సంఘటన తమిళనాడులో కలకలం రేపింది. హతురాలు అన్నాడీఎంకే మాజీ ఎంపీ కుళందైవేలు భార్య. వివరాల్లోకి వెళ్తే.. అన్నాడీఎంకే మాజీ ఎంపీ కుళందైవేలు, భార్య రత్నం (63) దంపతులకు కుమార్తె డాక్టర్ సుధ (37), కుమారుడు ప్రవీణ్ (35) ఉన్నారు. కుళందైవేలు నాలుగేళ్ల క్రితం మరణించగా, కుమార్తె సుధ ఓ డాక్టర్‌ను వివాహమాడి తిరుప్పూరులో ఉంటోంది. ప్రవీణ్ బీఈ చదువును మధ్యలోనే ఆపేసి విదేశాలకు వెళ్లడంతో చెన్నై బీసెంట్‌నగర్‌లోని లగ్జరీ బంగ్లాలో రత్నం ఒంటరిగా ఉంటోంది. నెల రోజుల క్రితం కుమారుడు ప్రవీణ్ ఒక యువతిని వెంటబెట్టుకుని చెన్నైలోని తల్లి వద్దకు వచ్చాడు. ఆ యువతి తన భార్య అని పరిచయం చేయడంతో తల్లీ కొడుకుల మధ్య గొడవ జరిగింది. చెన్నైకి వచ్చినప్పటి నుంచి ఆస్తి పంపకాలు చేయాలని వేధించసాగాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కుమార్తెకు ఫోన్‌చేసిన రత్నం.. ఆస్తిని పంచకుంటే హత్య చేస్తానని బెదిరించడమేగాక ప్రవీణ్ తనపై దాడిచేశాడని బోరున విలపిస్తూ చెప్పింది. దీంతో బీసెంట్‌నగర్‌లోని తన బంధువులకు సుధ ఫోన్‌చేసి ధైర్యం చెప్పాల్సిందిగా కోరింది. బంధువులు రత్నం ఇంటికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లగా.. నోట్లో కాగితాలు కుక్కి, ప్లాస్టిక్ వైరుతో కాళ్లు చేతులూ కట్టేసి.. గొంతు, కడుపులో కత్తితో పొడవడంతో ప్రాణాలొదిలిన స్థితిలో రత్నం రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పరారీలో ఉన్న ప్రవీణ్, అతనితో ఉన్న యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. లండన్‌లో ఉంటున్న ప్రవీణ్ అక్కడే ఒక యువతిని రహస్యంగా వివాహం చేసుకున్నట్టు సమాచారం. అప్పులపాలు కావడంతో ఆస్తికోసం కన్నతల్లినే హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్‌ను పట్టుకునేందుకు మూడు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రవీణ్ విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాల్లో అలర్ట్ ప్రకటించారు. -
ఆస్తి కోసమే హత్య
కదిరి: కదిరి పట్టణంలోని కస్తూరిబాయి వీధికి చెందిన బోగాతమ్మ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసమే ఆమెను అంతమొందించినట్లు విచారణలో తేలింది. చిన్నల్లుడి సోదరే నిందితురాలని తేలింది. ఈమెతోపాటు మరో ఇద్దరు కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పట్టణ సీఐ గోరంట్ల మాధవ్ శనివారం తన చాంబర్లో మీడియాకు వెల్లడించారు. డబ్బు కోసం ఒత్తిడి బోగాతమ్మకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె పద్మావతమ్మ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఉద్యోగం చేస్తోంది. చిన్న కుమార్తె భాగ్యలక్ష్మి గృహిణి. ఈమె భర్త రైల్వే కుళ్లాయప్ప అలియాస్ కుమార్ తిరుపతిలో రైల్వే గార్డుగా పనిచేస్తున్నాడు. బోగాతమ్మకు కదిరి పట్టణంలోని కస్తూరిబాయి వీధిలో రెండు, చైర్మన్ వీధిలో ఒకటి ఇలా మొత్తం మూడు ఇళ్లు ఉన్నాయి. అందులో ఒక ఇల్లు తన చిన్న కుమార్తె పేరుమీద ఉండటంతో ఆ ఇంటిని గత నెలలో తల్లి బోగాతమ్మ తిరిగి తన పేరుమీద రాయించుకుంది. మరో ఇల్లు ఈ మ«ధ్యే అమ్మి ఆ వచ్చిన డబ్బులో చిన్నల్లుడి అవసరాల కోసం రూ.18 లక్షలు ఇచ్చింది. ఇంకా కావాలని డిమాండ్ చేస్తుండటంతో తన దగ్గర డబ్బు లేదంటూ చివరిగా రూ.5 లక్షలు ఇచ్చింది. ఇక డబ్బులు అడగనంటూ చిన్నల్లుడి చేత రాయించుకొని దాన్ని ల్యామినేషన్ చేయించుకొని ఇంట్లో భద్రంగా దాచుకుంది. వెలుగులోకి వచ్చిందిలా.. తల్లి బోగాతమ్మ కన్పించడం లేదంటూ హైదరాబాద్‌లో ఉంటున్న పెద్ద కుమార్తె పద్మావతమ్మ ఈ నెల రెండో తేదీన కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌తో పాటు కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి సీరియస్‌గా తీసుకున్నారు. ఆమె సెల్‌కు వచ్చిన ఫోన్ నంబర్ల ఆధారంగా ఎవరో హత్య చేశారని నిర్ధారించుకున్నారు. ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు సీఐ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పట్టణ ఎస్ఐ హేమంత్‌కుమార్‌లు దర్యాప్తు ప్రారంభించారు. కర్ణాటక పోలీసుల సహకారంతో కేసును ఛేదించారు. ప్రధాన నిందితురాలైన చిన్నల్లుడు సోదరి రామలక్ష్మితోపాటు ఆమెకు సహకరించిన కిరాయి హంతకులు అల్లాబకాష్, రమేష్‌లను అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు. బోగాతమ్మ చిన్నల్లుడు కుళ్లాయప్ప అలియాస్ కుమార్ పాత్రపై కూడా అనుమానం ఉందని, విచారణలో తేలుస్తామని తెలిపారు. నిందితులను శనివారం కోర్టులో హాజరుపరచగా.. వారిని మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారన్నారు. నమ్మించి మట్టుబెట్టేశారు గోరంట్లలో తక్కువ ధరకే రైతుల దగ్గర బియ్యం దొరుకుతాయని చిన్నల్లుడి సోదరి రామలక్ష్మితో పాటు ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లికి చెందిన అల్లాబకాష్, బెంగుళూరులో కారు అద్దెకు పెట్టుకొని జీవనం సాగిస్తున్న రమేష్‌లు బోగాతమ్మను నమ్మించి జూన్ 26న కారులో తీసుకెళ్లారు. అల్లుడి సోదరే కదా అని ఆమె వారి మాటలు నమ్మి వెంట వెళ్లింది. గోరంట్ల దగ్గరకు వెళ్లగానే కారులో సిద్ధంగా ఉంచుకున్న దోమల నివారణ మందును ఆమెపై స్ప్రేపై చేయడంతో స్పృహతప్పి పడిపోయింది. అక్కడే బోగాతమ్మను హత్య చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక రాష్ట్రం తవరగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రోడ్డు పక్కన శవాన్ని పడేసి వచ్చారు. -
ట్రాక్టర్‌తో తొక్కించి.. కల్టివేటర్‌తో చుట్టేసి..
సారంగాపూర్ (జగిత్యాల): ఆస్తి ముందు వారికి అనుబంధాలు కనిపించలేదు. భర్తతో కలసి కూతురే తన తండ్రి ప్రాణాలను తీసింది. ఆదివారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో ఈ దారుణ సంఘటన జరిగింది. సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన పూరెల్లి మల్లయ్య(48) కుమార్తె జల అలియాస్ కావ్యను పదేళ్ల క్రితం రేచపల్లికి చెందిన దీటి కొమురయ్యకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ సమయంలో కట్నం కింద రెండెకరాల భూమి, రూ.5 లక్షలు ఇచ్చాడు. మల్లయ్య మిగిలిన నాలుగెకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. అయితే ఆ నాలుగెకరాలను సైతం తామే సాగు చేసుకుంటామని అల్లుడు, కూతురు ఇటీవల దున్నారు. విషయం తెలుసుకున్న మల్లయ్య తిరిగి అదే భూమిని ట్రాక్టర్ తో దున్నించాడు. ఈ క్రమంలో అల్లుడు, కూతురు ఆదివారం ఉదయం అదే భూమిలో పసుపు, మొక్కజొన్న వేసేందుకు వెళ్లగా మల్లయ్య, అతని తండ్రి గంగారాం అక్కడికెళ్లి నిలదీశారు. ట్రాక్టర్‌కు అడ్డుగా వెళ్లి నిల్చున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన కూతురు తండ్రిని నెట్టివేసింది. అల్లుడు ట్రాక్టర్‌ను మల్లయ్య మీదికి తోలాడు. ట్రాక్టర్ అతనిమీది నుంచి దాట గానే కల్టివేటర్‌తో మల్లయ్య చనిపోయే వరకు పొలంలోనే చక్కర్లు కొట్టించాడు. ఈ విషయాన్ని గమనిస్తున్న పక్క పొలంలో ఉన్న మల్లయ్య అన్న గంగారెడ్డి అడ్డుకునేందుకు పరుగెడుతూ వస్తుండగా.. ‘రారా! మీ తమ్ముడిని చంపినట్లు నిన్ను కూడా తొక్కిస్తా..’అంటూ కొమురయ్య అరవడంతో అక్కడే పనిచేస్తున్న కూలీలు గంగారెడ్డిని అడ్డుకున్నారు. మల్లయ్య చనిపోయాడని నిర్ధారించుకున్న అల్లుడు, కూతురు ట్రాక్టర్‌పై ఇంటికెళ్లి, అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యారు. అల్లుడు, కూతురు సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. -
ఆస్తి కోసం అన్నను గొడ్దలితో నరికేశాడు..
-
సోదరి కాళ్లు నరికిన సోదరులు...
ఇస్లామాబాద్ : ఆస్తిలో వాటా ఆడిగిందన్న అక్కసుతో సోదరి రెండు కాళ్లను సోదరులు నరికేసిన కిరాతక ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఖానెవాల్ ప్రాంతానికి చెందిన వ్యవసాయ పనులు చేసుకునే ఓ మహిళ వారసత్వంగా వస్తున్న ఆస్తిలో తన సోదరులతో సమానంగా వాటా కోరింది. వాళ్లు దానికి అంగీకరించకపోవడంతో కోర్టుకి వెళ్తానని బెదిరించింది. కోపంతో ఊగిపోయిన సోదరులు విచక్షణ కోల్పోయి సోదరిపై దారుణంగా దాడికి తెగబడ్డారు. గొడ్డలితో దాడి చేసి కాళ్లను నరికేశారు. తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో ఉన్న ఆమెను అధికారులు ఖానెవాల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. గొడ్డలి దాడితో కాలి ఎముకలు బాధితురాలి శరీరం నుంచి వేరయ్యాయని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను ముల్తాన్‌లోని నిష్తార్ ఆస్పత్రికి తరలించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి వాంగ్మూలం తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఆమెకు అన్యాయం
కోట్ల విలువైన స్థలం.. అందులో ఓ చిన్న పెంకుటిల్లు.. చుట్టూ ఖాళీ జాగా.. ఏళ్లుగా అందులోనే తలదాచుకుంటున్న ఓ పేద వృద్ధురాలు.. ఆ ఆస్తి ఎవరిదనే దానిపై అస్పష్టత. కొన్ని వర్గాల మధ్య వివాదం. ఇంతకంటే భూదందాకు టీడీపీ నేతలకు అవకాశం ఏముంటుంది? సివిల్ దందాలో బెదిరించాలంటే పోలీసులకు ఇంకేం కావాలి? ఫలితం.. కొన్నిరోజులుగా ఆ పేద మహిళ పోలీసుల వేధింపులతో నలిగిపోతోంది. అక్రమ నిర్బంధంతో పోలీసుస్టేషన్లోనే బిక్కుబిక్కుమంటోంది. విజయవాడలో సివిల్ దందాలు.. అందులో పోలీసుల అత్యుత్సాహానికి తాజా తార్కాణం ఇది. సాక్షి, అమరావతిబ్యూరో: అది విజయవాడలోని కరెన్సీనగర్. అందులో దాదాపు రూ.2 కోట్ల విలువచేసే ఖాళీ స్థలం. అందులో ఓ చిన్న పాత పెంకుటిల్లు, దానిచుట్టూ పెద్ద ఖాళీ జాగా. ఆ పెంకుటిల్లులో ఎన్నో ఏళ్లుగా ఓ పేద మహిళ నివసిస్తోంది. ఆ స్థలం హక్కుల గురించి కొందరి మధ్య వివాదం దీర్ఘకాలంగా ఉంది. కానీ, ఆ మహిళ ఏళ్లుగా ఆ పెంకుటింటిలోనే నివసిస్తోంది. ఆమెకు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అన్నీ కూడా అదే చిరునామాతో ఉన్నాయి. ఆమె చిన్నచిన్న పనులు చేస్తూ పిల్లలను పోషించింది. కొడుకు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఆమె మాత్రం అందులోనే నివసిస్తోంది. కాగా, కొన్నిరోజుల క్రితం అదే ప్రాంతంలో ఉండే టీడీపీ స్థానిక నేత ఒకరు వచ్చి ఆ ఇల్లు, ఖాళీస్థలం తనదని, ఖాళీ చేయమని చెప్పారు. అందుకు ఆమె కొంత సమయం అడిగింది. తన రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అన్నీ ఇదే చిరునామాతో ఉన్నాయని, తన కొడుకు అడ్రస్ ప్రూఫ్ అవేనని చెప్పింది. తనకు కొంత సమయం ఇస్తే మరో ఇంటికి మారి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను ఆ చిరునామాకు మార్పించుకుంటానని తెలిపింది. అందుకు ఆ టీడీపీ నేత ససేమిరా అన్నాడు. రెండు మూడు రోజుల్లోనే ఖాళీ చేయాలని హుకుం జారీ చేశాడు. అంతలోనే మరో వ్యక్తి వచ్చి ఆ ఇల్లు, ఖాళీ స్థలం తనవని, ఖాళీ చేయాలని గొడవ చేశారు. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థంకాలేదు. అక్రమ నిర్బంధం ఈ విషయం తెలియడంతో టీడీపీ నేత వెంటనే రంగంలోకి దిగారు. ఆ మహిళను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని, అంతకుముందే ఆమె ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులలో చిరునామా మార్చాలని ఒత్తిడి చేశారు. అందుకు కొంత సమయం కావాలని ఆమె కోరడంతో పోలీసులను తెరపైకి తెచ్చారు. ఓ మధ్యస్థాయి అధికారి, ఓ స్టేషన్ అధికారి ఆమెను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. టీడీపీ నేత చెప్పినట్లు వెంటనే ఇల్లు ఖాళీ చేయాల్సిందేనన్నారు. అంతేకాదు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులలో ఆ ఇంటి చిరునామాను మార్చాలని కూడా ఒత్తిడి చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా తమదైన శైలిలో హెచ్చరించారు. దీంతో ఆమె హడలిపోయింది. ఆ ఆస్తి తనది కాదని స్పష్టం చేస్తూనే తన కొడుకు వచ్చి మరో ఇంటికి మారే వరకు గడువు ఇవ్వాలనే మాత్రమే కోరుతున్నానని తెలిపింది. అందుకు టీడీపీ నేత, పోలీసులు ససేమిరా అన్నారు. ఖాళీ పత్రాలపై సంతకాలు చేయడంతోపాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులలో చిరునామా మార్చే వరకు విడిచిపెట్టమని తేల్చిచెప్పారు. కొన్నిరోజులుగా ఆమె పోలీస్‌స్టేషన్ వద్దే ఉంటోంది. మరో మాటలో చెప్పాలంటే ఆమెను అక్రమంగా నిర్బంధించినట్లే. ఆమె సమీప బంధువులు.. టీడీపీ నేత, పోలీసులతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. అది సివిల్ వ్యవహారం. నిబంధనల ప్రకారం పోలీసులు అందులో జోక్యం చేసుకోకూడదు. అందులోనూ ఓ మహిళను నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ స్టేషన్లో బలవంతంగా ఉంచడం దారుణం. కానీ, టీడీపీ నేతకు సివిల్ దందాలో కొమ్ముకాస్తున్న ఆ ఇద్దరు పోలీసు అధికారులకు ఇవేమీ పట్టట్లేదు. -
భీమవరంలో తుపాకుల కలకలం
పశ్చిమగోదావరి, భీమవరం టౌన్ : ఆస్తి వివాదంలో ఒక వ్యక్తి గన్‌తో చంపుతానని బెదిరించినట్టు మరో వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు బెదిరించిన వ్యక్తి ఇంటికి వెళ్లగా పిస్టల్, గన్ దొరికాయి. వాటిని పరిశీలించిన పోలీసులు అవి ఎయిర్ పిస్టల్, గన్‌లుగా నిర్ధారించారు. వన్‌టౌన్ ఎస్సై పి.అప్పారావు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విస్సాకోడేరుకు చెందిన ఉగ్గు శ్రీనివాస్‌కు భీమవరం పీపీ రోడ్డులోని సెయింట్ మేరీస్ స్కూల్ వద్ద 163 గజాల స్థలం ఉంది. 2009లో శ్రీనివాస్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని అతని అన్నయ్య సురేష్‌బాబు ఆ స్థలాన్ని రాయించుకున్నాడని తెలిపారు. దీనిపై శ్రీనివాస్ అక్క కట్టా సత్యవతి ఆ స్థలంలో తనకూ వాటా ఉన్నట్టుగా కోర్టులో సివిల్ కేసు వేశారు. ఈ స్థలం విషయంలో వారి మధ్య తగదా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తన్నేరు రాజబాబు ఈ కేసును, సమస్యలను పూర్తిగా తొలగిస్తానని, ఆ స్థలాన్ని అప్పగిస్తానని చెప్పి తన వద్ద సంతకాలు తీసుకున్నాడని శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తనకు తెలియకుండా ఆ స్థలాన్ని రాజబాబు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు. ఈ విషయమై ఈ నెల 7న శ్రీనివాస్ తన భార్యతో కలిసి రాజబాబు ఇంటికి వెళ్లి ప్రశ్నించగా అతడు గన్ తీసుకువచ్చి చంపుతానని బెదిరించాడని, అతని అత్త యాళ్ల కనకదుర్గ చాకుతో బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. దీనిపై నిందితుడి ఇంటికి వెళ్లి ఎయిర్ పిస్టల్, గన్ స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. -
ఆస్తి వివాదం..తల్లీకూతుళ్ల ఆత్మహత్య
సిరిసిల్లక్రైం: ఆస్తి వివాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఆస్తి పంపకాల కోసం జరిగిన పంచాయితీలు.. అవమానాలతో తల్లీకూతుళ్లు గుడ్ల విజయ(60), జ్యోతి(30) గురువారం ఆత్మహత్యకు పాల్ప డ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన విజయకు, గుడ్ల విశ్వనాథంతో వివాహమైంది. వీరికి ఇద్ద రు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అనంతరం వి శ్వనాథం రెండోపెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నాడు. విజయ పెద్దకూతురు హైదరాబాద్‌లో ఉంటుండగా, చిన్నకూతురు జ్యోతికి విడాకులవడంతో ఇంటి వద్దే ఉంటుంది. చిన్నకొడుకు నరేందర్, భార్య వీరితోనే ఉంటున్నారు. పెద్దకొడుకు సిరిసిల్లలోనే వేరే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం విజయ ఉంటున్న ఇల్లు, మూడు జోడీల సాంచలు, కండెలు చుట్టే మిషన్ వివాదంగా మారాయి. ఆస్తిపంపకాలలో వివాదం ఇంటిస్థలంతోపాటు మూడు జోడీల సాంచలు పంచుకునే క్రమంలో కుటుంబసభ్యుల మధ్య పంచాయితీలు జరిగాయి. ఈక్రమంలోనే రెండు రోజుల క్రితం విజయ పెద్దకొడుకు ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ అవమానంతోనే ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చనిపోవడానికి రెండు రోజుల ముందే సూసైడ్‌నోట్ రాసిపెట్టుకున్నా రు. తమ చావుకు భర్త విశ్వనాథంతోపాటు పట్టణానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులే కారణమని అందులో పేర్కొన్నారు. పెద్దకొడుకు అశోక్ అత్తవారిని వదలొద్దని కోరారు. సిరిసిల్ల సీఐ శ్రీనివాస్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకుపై కేసు ఆస్తిని పంచాలంటూ కన్నతల్లి, తోడబుట్టిన చెల్లి చావుకు కారణమైన వ్యక్తిపై సిరిసిల్ల పోలీçసులు కేసు నమోదు చేశారు. సీఐ తెలిపిన వివరాలు. గుడ్ల విజయ(60), జ్యోతి(30)పై రెండు రోజు ల క్రితం గుడ్ల అశోక్ దుర్భాశలాడుతూ చేయిచేసుకున్నాడు. మనస్తాపానికి గురైన తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయ చిన్నకొడుకు నరేందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
ఆస్తి తగాదా ఒకరు మృతి
-
తమ్ముడి చేతిలో అన్న హతం
రాయపర్తి(పాలకుర్తి): ఆస్తితగాదాలతో తమ్ముడి చేతిలో అన్న హత్యకు గురైన ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం కొండూరుకు చెందిన యాకుబ్ దంపతులకు ఇద్దరు కుమారులు(పెద్ద కుమారుడు శంషొద్దీన్, చిన్న కుమారుడు ఉమర్). వారికి ఎనమిది ఎకరాల భూమి ఉంది. కొడుకులకు చెరి మూడు ఎకరాల భూమిని పంచి ఇచ్చాడు. రెండు ఎకరాల భూమిని తల్లిదండ్రులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం మైలారం రిజర్వాయర్ నిర్మాణక్రమంలో తమ్ముడు ఉమర్‌కు చెందిన మూడెకరాలు ముంపునకు గురైంది. కాగా ఉమర్ మహబూబ్‌నగర్ జిల్లాలో పని చేస్తున్నాడు. అన్న శంషోద్దీన్(35)గ్రామంలోనే ఉండి మూడెకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. తల్లిదండ్రుల వద్ద ఉన్న రెండెకరాల భూమిని ఉమర్‌కు ఇచ్చేద్దామని తల్లిదండ్రులు శంషోద్దీన్‌తో చర్చించగా గతంలో గొడవలు జరిగాయి. చాలా ఏళ్లుగా తల్లిదండ్రులు శంషొద్దీన్ వద్దే ఉండేవారు. పదినెలలుగా తల్లిదండ్రులు ఉమర్ వద్ద ఉంటున్నారు. ఇదే అదనుగా భావించిన ఉమర్ రెండెకరాల భూమిని తన పేరుమీదకు పట్టా చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శంషొద్దీన్ అసహనంతో ఉన్నాడు. మంగళవారం రాత్రి తండ్రితో సహ ఉమర్ గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలు కాగా.. రోకలిబండతో ఉమర్ అన్న తలపై కొట్టాడు. దీంతో శంషొద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఘటనా స్థలాన్ని వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ పరిశీలించారు. మృతుడికి భార్య సుల్తానా, ముగ్గురు కుమారులున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అనుబంధాల్ని చిదిమేసింది..
- ఆస్తి గొడవల్లో దంపతులు, కొడుకు హత్య - మరో ముగ్గురికి తీవ్ర గాయాలు - కర్ణాటకలో దారుణం బళ్లారి: పొలంలో రక్తం ప్రవహించింది. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. ఆస్తి వివాదం అనుబంధాల్ని చిదిమేసింది. దాయాదుల మధ్య ఏర్పడిన గొడవల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్నం సేడం తాలూకా ముగనూరు గ్రామ శివార్లలోని వ్యవసాయ భూమిలో రెండు దాయాది కుటుంబాలు ఆస్తి పంపకాల గొడవలతో బాహాబాహీకి దిగాయి. పరస్పరం గొడ్డళ్లు, కట్టెలతో విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన దేవరాయ (56), అతని భార్య కాళమ్మ (50), వారి కుమారుడు రాజశేఖర్(20)లు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం కలబుర్గి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సేడం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గొర్రెల కాపరి దారుణ హత్య
► తలపై బండరాయితో మోది కిరాతకం ► పెద్ద కొడుకును అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ► ఆస్తి వివాదమే కారణమని అనుమానాలు షాబాద్: ఆస్తి తగాదాల కారణంగా గొర్రెల కాపరి దారుణ హత్యకు గురైన సంఘటన షాబాద్ మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. చేవెళ్ల సీఐ గురువయ్య కథనం ప్రకారం.. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కడ్మూరి అనంతయ్య(70) గొర్రెల కాపరిగా జీవనం సాగించేవాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు చేశాడు. అనంతయ్య వియ్యంకుడైన నందిగామ మండలం ఈర్లపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య వారం రోజుల క్రితం తన వద్ద ఉన్న గొర్రెలకు మేత కోసం గొర్రెల మందతో తిర్మలాపూర్ గ్రామానికి వచ్చాడు. ఇద్దరూ కలిసి రోజూ గొర్రెలను మేపుకొచ్చి రాత్రి మంద వద్ద పడుకునేవారు. అనంతయ్య రోజూ రాత్రి భోజనం చేసి మంద వద్ద ఉన్న వియ్యంకుడు సత్తయ్యకు కూడా భోజనం తీసుకుని పోయేవాడు. ఎప్పటిలాగానే గురువారం రాత్రి కూడా అనంతయ్య తన వియ్యంకుడికి భోజనం తీసుకెళ్లాడు. అనంతరం వారిద్దరూ గొర్రెల మందకు చెరో వైపున పడుకున్నారు. సత్తయ్య ఉదయం 5 గంటలకు గొర్రె పిల్లలకు తడికె అళ్లేందుకని చెట్ల కొమ్మలు తీసుకురావడానికి వెళ్లి ఆరున్నర గంటల ప్రాంతంలో వచ్చాడు. అప్పటికీ అనంతయ్య నిద్ర లేవకపోవడంతో అతడిపై కప్పి ఉన్న దుప్పటిని తీసిచూడగా.. శరీరమంతా రక్తసిక్తమై చనిపోయి కనిపించాడు. తలపై బలమైన గాయమై ఉంది. దీంతో సత్తయ్య వెంటనే ఈ విషయాన్ని అనంతయ్య చిన్నకుమారుడు శ్రీనుకు సమాచారం అందించాడు. గ్రామస్థులంతా సంఘటన స్థలానికి వచ్చి చూశారు. సమాచారం అందుకున్న చేవెళ్ల సీఐ గురువయ్య, ఎస్సైలు శ్రీధర్‌రెడ్డి, రవికుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకుని అనంతయ్య మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. హత్యపై ఆరా తీసిన పోలీసులకు గత కొద్దిరోజులుగా పెద్ద కొడుకు సుభానయ్య.. అనంతయ్యతో ఆస్థి విషయంలో గొడవలు పడుతుండేవాడని తెలిసింది. దీంతో సుభానయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య కడ్మూరి అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. -
మరిగే పప్పుచారును ముఖంపై పోసి..
ఢిల్లీ: కన్నతల్లిదండ్రులనే కనీస కనిరకం లేకుండా వృద్ధ దంపతులపై దాష్టీకానికి దిగాడో కొడుకు. భార్య సహకారంతో మరిగే పప్పుచారును ముసలోళ్ల ముఖంపై పోసి దారుణంగా హింసించాడు. దేశరాజధాని ఢిల్లీలో కలకలం రేపిన ఈ ఘటనపై కోర్టు సంచలన తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని పహాడ్ గంజ్ ప్రాంతానికి చెందిన శేష్ నాథ్ వర్మ(69), ఉర్మిళ(64) దంపతులు ఎలక్రికల్ వస్తువుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడి నబీ కరీం ప్రాంతంలో మూడంతస్తుల ఇల్లు కట్టుకుని, గ్రౌండ్ ఫ్లోర్ లో దుకాణాన్ని నడుపుతున్నారు. వాళ్ల పెద్ద కొడుకు రవీందర్ సోని(38) కూడా అదే ఇంట్లో భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఇల్లు అమ్మే విషయమై తరచూ తండ్రితో గొడవపడే రవీందర్.. 2009నుంచి వికృతంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దుకాణాన్ని తెరవనీయకుండా, తల్లిదండ్రుల్ని ఇంట్లోకి రానీయకుండా హింసించేవాడు. ఒకసారి మరిగే పప్పుచారును ముఖాలపై పోశాడు. ఇంకోసారి కిరోసిన్ కుమ్మరించి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. కొడుకు, కోడళ్ల హింసను భరించలేక చివరికా వృద్ధులు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఇటీవలే తుది తీర్పు వెల్లడించిన ఢిల్లీ కోర్టు.. రవీందర్, అతని భార్యల తీరును దారుణంగా తప్పుపట్టింది. తక్షణమే ఇంటిని ఖాళీచేయడంతోపాటు నెలకు రూ.1000 భృతి చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. కాగా, రవీందర్ మాత్రం స్థానిక కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించేపనిలో ఉన్నాడు. మూడంతస్తుల ఇల్లు తన డబ్బుతో కట్టిందేనని, తల్లిదండ్రుల పట్ల ప్రేమతో వాళ్లపేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించానని చెబుతున్నాడు. -
కొడుకుని చంపి రోజుకో అవయవం నరికేసింది!
-
కొడుకుని చంపి రోజుకో అవయవం నరికేసింది!
- దీర్ఘకాలిక వ్యాధికి చికిత్స కోసం పొలం అమ్ముకున్నాడనే కోపంతో హత్య - మృతదేహాన్ని గోనె సంచిలో ఆరు రోజులుగా ఇంటి పక్కనే దాచారు - మృతదేహం నుంచి రోజుకో అవయవం నరికేస్తున్న వైనం - బుధవారం రాత్రి తల నరుకుతుండగా గుర్తించిన స్థానికులు - గుంటూరు జిల్లా బోడిపాలెంలో ఘటన కాకుమాను (గుంటూరు) : అమ్మను మించిన దైవం లేదంటారు. అయితే నవమాసాలు మోసిన ఓ తల్లే తన కుమారుడిని కడతేర్చింది. కొడుకు మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి ఆరు రోజుల పాటు ఇంటి పక్కనే దాచింది. అంతటితో ఆగకుండా ఉన్మాదిలా మారి కొడుకు మృతదేహం నుంచి రోజుకో అవయవాన్ని నరికేస్తోంది. రెండురోజుల క్రితం మృతదేహం నుంచి చెయ్యిని వేరుచేసి సంచిలో పెట్టింది. బుధవారం రాత్రి తల నరుకుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడిపాలెంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. బోడిపాలెం గ్రామానికి చెందిన బత్తినేని అంజనాదేవి (60)ని ఆరేళ్ల క్రితం భర్త వదిలి వెళ్లిపోయాడు. ఆమెకు కుమారుడు కోటేశ్వరరావు (40)తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి కుమారుడుతో కలిసి బోడిపాలెం గ్రామంలో ఉంటోంది. కోటేశ్వరరావుకు 2004లో పొన్నూరు మండలం నిడుబ్రోలుకు చెందిన శైలజతో వివాహం జరిగింది. వీరి వైవాహిక జీవితం ప్రారంభంలో అన్యోన్యంగా సాగింది. అయితే కోటేశ్వరరావుకు ప్రాణాంతక వ్యాధి ఉందని తెలిసి భార్య శైలజ పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని నెలలు క్రితం పెద్దల సమక్షంలో ఇద్దరు కలిసి ఉండేందుకు అంగీకరించారు. ఈ మేరకు కలిసి ఉంటూ కోటేశ్వరరావు వ్యాధి నివారణ కోసం తెనాలిలో వైద్యం చేయించుకుంటున్నారు. కోటేశ్వరరావు పేరున ఉన్న 1.67 ఎకరాల భూమిని ఇటీవల విక్రయించారు. ఆ డబ్బును వైద్యం కోసం, ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన దసరా పండుగ కావటంతో భార్య శైలజతో కలసి అతను అత్తగారి ఇంటికి నిడుబ్రోలు వెళ్లారు. ఇదీ వివాదం... భార్య శైలజను పుట్టింట్లో వదిలి ఈ నెల12వ తేదీన బోడిపాలెం గ్రామం చేరుకున్న కోటేశ్వరరావు తన తల్లి పేరు మీద ఉన్న 3.23ఎకరాల భూమిలో అర ఎకరం విక్రయించి డబ్బులు ఇవ్వాలని కోరారు. ఈ విషయమై తల్లి అంజనాదేవితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అంజనాదేవి అదే గ్రామంలో నివాసం ఉంటున్న తన సోదరుడు గార్లపాటి నాగేశ్వరరావు, అంగలకుదురులో ఉంటున్న కుమార్తె ముప్పవరపు నాగలక్ష్మిలకు ఫోన్ చేసి పిలిపించుకుంది. కొడుకుతో ఆస్తి వివాదం గురించి చెప్పింది. ముగ్గురు కలిసి కోటేశ్వరరావును హతమార్చాలని పథకం రచించారు. ఇలా హతమార్చారు.. పథకం ప్రకారం ఈ నెల 13వ తేదీ రాత్రి అంజనాదేవి, నాగేశ్వరరావు, నాగలక్ష్మి కలిసి కోటేశ్వరరావును తలపై బలమైన ఆయుధంతో మోది హతమార్చారు. మృతదేహాన్ని సంచిలో చుట్టి ఇంటి పక్కనే ఉంచారు. శైలజకు తన భర్త నుంచి ఎలాంటి ఫోన్లు రాకపోవటంతో గత శుక్రవారం బోడిపాలెం వచ్చి అత్తను అడగగా... నెల్లూరు వెళ్లాడని, వారం పది రోజుల తర్వాత వస్తానని చెప్పాడని నమ్మబలికింది. అయితే ఇంట్లో దుర్వాసన రావటం గ్రహించి శైలజ తన అత్తను నిలదీయటంతో.. ఇంటి పక్కన పందికొక్కులు చచ్చాయంటూ దాటవేసింది. ఎక్కువసేపు తన కోడలు ఇంట్లో ఉంటే విషయం బయటపడుతుందని గ్రహించి తాను అర్జంటుగా గుంటూరు వెళ్లాలని, శైలజను పుట్టింటికి పంపింది. ఇంటిలో కొడుకు ఫొటోలు, ఆధార్‌కార్డులు మాయం చేసింది. అప్పటినుంచి అంజనాదేవి ఉన్మాదిలా మారి కుమారుడి మృతదేహంలోని అవయవాలను ఒక్కొక్కటి కత్తితో నరికి గోనె సంచిలో ఉంచుతోంది. వెలుగులోకి వచ్చిందిలా... బుధవారం రాత్రి అంజనాదేవి మృతదేహం నుంచి తలను వేరుచేస్తుండటంతో (కత్తితో నరుకుతున్న సమయంలో) పెద్దగా శబ్దం, దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పొన్నూరు సర్కిల్ ఇన్స్పెక్టర్కు సమాచారం అందించారు. సీఐ సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అంజనాదేవి, నాగలక్ష్మిలను అదుపులోకి తీసుకున్నారు. నాగేశ్వరరావు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొన్నూరు ప్రజావైద్యశాలకు తరలించారు. మృతునికి సంతానం లేరు. కేసును కాకుమాను ఎస్ఐ ఎల్.లోకేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కోసం తమ్ముడిని చంపిన అన్న
గురజాల (గుంటూరు) : ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి సొంత పిన్ని, తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తమ్ముడు మృతిచెందగా.. పిన్ని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా గురజాలలోని ఎస్సీ కాలనీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అన్నపురెడ్డి కోటేశ్వర్రావు, అన్నపురెడ్డి రమేష్(31) ల మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి వివాదం నెలకొని ఉంది. ఈ విషయంపై వారి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. తమ్ముడి ఆస్తిని ఎలాగైనా కాజేయాలని ఆశించిన కోటేశ్వర్రావు ఆదివారం ఉదయం రమేష్ ఇంటికి వచ్చి అతనితో గొడవకు దిగాడు. కత్తితో రమేష్‌పై దాడి చేశాడు. అడ్డొచ్చిన పిన్ని అరుణను కూడా విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఇది గుర్తించిన స్థానికులు వారిద్దనిరి ఆస్పత్రికి తరలించగా.. రమేష్ మృతిచెందాడు. అరుణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇరు వర్గాల ఘర్షణ: 9 మందికి గాయాలు
తుని : తూర్పుగోదావరి జిల్లా తుని మండలం దొండవాకలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆస్తి విషయంలో జరిగిన గొడవలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తుని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అతను మా నాన్న కొడుకు కాదు: జయ్ దేవ్ ఠాక్రే
ముంబై: ఆస్తి కోసం కోర్టుకెక్కిన బాల్ ఠాక్రే కుమారుడు జయ్ దేవ్ ఠాక్రే కేసును గురువారం ముంబై హైకోర్టును మరోసారి విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నాయకుడు బాల్ ఠాక్రే, ఆయన మాజీ భార్య స్మిత తనయుడైన జయ్ దేవ్ ఠాక్రే, ఐశ్వర్య ఠాక్రే బాల్ ఠాక్రే కుమారుడు కాదంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సమయంలో కొంతభాగాన్ని మాత్రమే ధర్మాసనం మీడియాకు అనుమతినిచ్చింది. మిగిలిన విచారణను జస్టిస్ పటేల్, ఇరువైపులా లాయర్లతో కలిసి సమావేశమయ్యారు. తుది తీర్పు వెలువడే వరకు చర్చకు సంబంధించిన వివరాలను మీడియాకు అందుబాటులో ఉండవని ప్రకటించారు. కేసు విచారణలో భాగంగా ప్రస్తుత శివసేన అధ్యక్షుడు, ఉద్ధవ్ ఠాక్రే తరఫు లాయర్ రోహిత్ కపాడియా జయ్ దేవ్ ను కొన్ని ప్రశ్నలు వేశారు. జయ్ దేవ్ కు ఆస్తిపై ఎటువంటి హక్కూలేదని, తన ఇష్ట ప్రకారమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బాల్ ఠాక్రే వీలునామా చేసిన విషయం తెలిసిందే. కాగా ఐశ్వర్యకు ఠాక్రే నుంచి వారసత్వ సంపద దక్కడంపై జయ్ దేవ్ కోర్టుకెక్కారు. బాంద్రాలోని మఠోశ్రీ బాల్ ఠాక్రే నివాసంలో 2004కు ముందు రెండో అంతస్తులో తాను నివసించినట్లు జయ్ దేవ్ తెలిపారు. మొదటి అంతస్తులో ఎవరు నివసించేవారు? అని లాయరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఎప్పుడూ తలుపుల మూసేసి ఉండేవని, అప్పుడప్పుడు తెరచి ఉండేవని చెప్పారు. బాల్ ఠాక్రేను ఈ విషయం గురించి అడుగగా ఐశ్వర్య ఉంటున్నాడని చెప్పారని తెలిపారు. మరి ఐశ్వర్యను బాల్ ఠాక్రే తన తనయుడని మీకు చెప్పారా? అని లాయరు ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చిన జయ్ దేవ్ ఆయన అలా చెప్పలేదని తెలిపారు. ఐశ్వర్యకు సంబంధించిన వివరాలను తాను సేకరించాలని ప్రయత్నించానని కానీ అవకాశం రాలేదని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి గత విచారణల్లో 1999లో తల్లి స్మితతో మనస్పర్దలు రావడం వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లు చెప్పారు. 2004లో ఠాక్రేతో విడాకులు తీసుకునేంత వరకూ స్మిత మఠోశ్రీలోనే ఉన్నట్లు కోర్టుకు చెప్పారు. 1999-2004 మధ్య కాలంలో అప్పుడప్పుడు తన తండ్రి ఠాక్రేను కలిసేందుకు వెళ్లి రాత్రికి తిరిగి తన ఫ్లాట్ కు చేరుకునేవారని తెలిపారు. 2012 నవంబర్ లో ఠాక్రే మరణించే ఒక నెల ముందు వరకూ ఆయన్ను కలవడం ఆపలేదని చెప్పారు. -
అన్న గొంతు కోసిన తమ్ముడు
హైదరాబాద్ : నగరంలోని గాంధీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదంలో.. తమ్ముడు సొంత అన్న గొంతు కోశాడు. అన్న శ్రీధర్ యాదవ్‌కు తమ్ముడు శేఖర్‌యాదవ్‌కు మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య తిరిగి గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన తమ్ముడు కత్తితో అన్నపై దాడి చేసి గొంతు కోశాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కర్రతో మనవడి దాడి
► తల పగిలి వృద్ధురాలు మృతి ► పోలీసుల అదుపులో మనవడు, కొడుకు పుట్లూరు : మనవడు కర్రతో దాడి చేయడంతో వృద్ధురాలు తల పగిలి మృతి చెందింది. ఈ సంఘటన గోపురాజుపల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, చెన్నారెడ్డి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. రెండేళ్ల కిందట చెన్నారెడ్డి మరణించాడు. లక్ష్మిదేవి (75) గ్రామంలోని బీసీ కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది. సోమవారం ఉదయం కుమారుడు చంద్రారెడ్డి, మనవడు విశ్వనాథ్‌రెడ్డి ఆమె ఇంటి వద్దకు వెళ్లి గొడవపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన మనవడు కర్ర తీసుకుని లక్ష్మిదేవి తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆ తర్వాత చంద్రారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి తగాదాతోనే... లక్ష్మిదేవి మృతికి ఆస్తి తగాదాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఈమె పేరుతో శనగలగూడూరు రెవెన్యూ పరిధిలో 8.20 ఎకరాల పొలం, గోపురాజుపల్లిలో 80 సెంట్ల స్థలం, ఒక ఇంటితో పాటు రూ.3 లక్షల నగదు ఉన్నాయి. పొలాన్ని కుమారుడు చంద్రారెడ్డి సాగు చేసుకుంటూ తల్లి జీవనం కోసం ఏటా రూ.12 వేలు అందించేవాడు. అయితే.. వృద్ధాప్యంలో తనకు అన్నం పెట్టని కొడుకుకు ఆస్తి ఇవ్వనని, కూతుళ్లకు రాసిస్తానని గ్రామంలో లక్ష్మిదేవి చెబుతుండేది. ఎప్పటికైనా ఆస్తిని కూతుళ్ల పేరుపై రాసిస్తుందన్న అనుమానంతోనే దాడి చేసి ఉంటారని గ్రామస్తులు అంటున్నారు. -
బంధాల్లేని ‘మనీ’షి!
* ఆస్తి కోసం అఘాయిత్యాలు * అయిన వారినే హతమారుస్తున్న వైనం * భూముల ధరల వెంటే పెరుగుతున్న వివాదాలు * ఆందోళన కలిగిస్తున్న నేరాలు కామారెడ్డి: పేగుబంధం పరిహాసమవుతోంది.. మానవత్వం మంట గలుస్తోంది.. మనిషి చుట్టూ తిరగాల్సిన బంధాలు, అనుబంధాలు.. ప్రస్తుతం ‘మనీ’ చుట్టూ తిరుగుతున్నాయి. ఆస్తి కోసం అయిన వారినే చంపే పరిస్థితులు దాపురించాయి. రక్తం పంచిన వారు, తోడ బుట్టిన వారే పొట్టన బెట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. భూమి, ఆస్తి, డబ్బు వంటి ఆర్థిక పరమైన వ్యవహారాలు ప్రాణాలు బలిగొంటున్నాయి. భూముల విలువలు పెరిగిన కొద్దీ అదే స్థాయిలో వివాదాలు పెరుగుతున్నాయి. పదుల సంఖ్యలో హత్యలకు దారి తీస్తున్నాయి. రెండ్రోజుల క్రితం తాడ్వాయి మండలం ఎర్రపహడ్లో చోటు చేసుకున్న ఉదంతమే అందుకు నిదర్శనం. ఆస్తి విషయంలో తాగాదాతో అన్నపై కక్ష పెంచుకున్న తమ్ముడు, కిరాతకంగా సోదరుడి గొంతు కోసి హతమార్చడం సంచలనం సృష్టించింది. మాయమవుతున్న బంధాలకు ‘మచ్చ’తునకగా నిలిచింది. భూములు, ఆస్తుల విషయంలో తలెత్తుతున్న గొడవలను సామరస్యంగా కూర్చుండి పరిష్కరించుకోవడమో, లేదా కోర్టుల ద్వారా పరిష్కారానికి ప్రయత్నించుకుండా కక్షలు పెంచుకుని దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. ఆవేశంతో హత్యలకు పాల్పడి జైలు పాలవుతున్నారు. ఫలితంగా అటు హతుల కుటుంబాలు, ఇటు హంతకుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. విలువలతో పాటే పెరుగుతున్న వివాదాలు పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా భూముల ధరలు అమాంతం పెరుగుతుండడంతో వివాదాలూ పెరుగుతున్నాయి. గెట్టు విషయంలో, వాటా విషయంలో తలెత్తుతున్న విభేదాలు, ఆస్తి పంపకాల్లో తేడాలు దాడు లు, ప్రతిదాడులకు దారి తీస్తున్నాయి. హంతకులుగా మారుస్తున్నాయి. ఆస్తి పంచుకున్నపుడు అందరూ ఇష్టంగానే పంచుకున్నా, తరువాత పెరిగిన ధరలతో విభేదాలు ఏర్పడి వివాదాలకు కారణమవుతున్నాయి. బంధాలకు విలువేది..? ఆస్తి కోసం అయిన వారినే హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మానవత్వాన్ని మరిచి తన వారినే మట్టుబెట్టడం మంట గలుస్తున్న అనుబంధాలకు మచ్చగా మిగులున్నాయి. అన్నదమ్ములు, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ, అనురాగాలు ఉండాల్సింది పోయి పగలు, ప్రతీకారాలు పెరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులకు దిగడం, హత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. మనిషిలో పెరిగిన స్వార్థం, అత్యాశ, డబ్బు వ్యామోహమే వివాదాలు, ఘర్షణలు, హత్యలకు కారణమవుతున్నాయి. మాయని ‘మచ్చ’లెన్నో ♦ తాడ్వాయి మండలం ఎర్రాపహడ్ గ్రామం వద్ద శనివారం రాత్రి కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన శెట్కూరి అమర్ (26)ను సొంత తమ్ముడే కర్కశంగా గొంతుకోసి హతమార్చాడు. ఈ సంఘటనకు ప్రధాన కారణం భూ తగాదాలేనని స్పష్టమైంది. వారసత్వంగా సంక్రమించిన ఆస్తి పంపకం విషయంలో తలెత్తిన విబేధాలతో అన్నను హతమార్చిన తమ్ముడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ♦ కామారెడ్డిలో గతేడాది ఏప్రిల్ 30న నాగరాజు (34) తన తండ్రి చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఆస్తి విషయంలో విభేదాలు తలెత్తడంతో తండ్రి సిద్దరాములు పథకం ప్రకారం మరొకరితో కలిసి నాగరాజును హతమార్చాడు. ♦ తాడ్వాయి మండల కేంద్రంలో ఆరు నెలల క్రితం అన్నదమ్ముల మధ్య మరుగుదొడ్డి నిర్మాణానికి సంబంధించి కొద్దిపాటి డబ్బు కోసం జరిగిన గొడవలో నామాల శ్రీనివాస్ (26)ను అతని అన్న రమేశ్ హతమార్చాడు. తమ్ముడు కటకటాల పాలయ్యాడు. -
అన్నను కడతేర్చిన తమ్ముడు
తాడ్వాయి (నిజామాబాద్ జిల్లా) : తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో విషాదం చోటుచేసుకుంది. తోడబుట్టిన తమ్ముడే అన్నను కిరాతకంగా హతమార్చాడు. గ్రామానికి చెందిన అమర్(27), ప్రశాంత్‌లు అన్నదమ్ములు. కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే శనివారం రాత్రి ఇద్దరి అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన ప్రశాంత్ తన అన్నను విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. పీక కోసి హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమర్‌కు మూడేళ్ల క్రితమే వివాహమైంది. ఒక బాబు ఉన్నాడు. సంఘట నాస్థలాన్ని డీఎస్పీ భాస్కర్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రి చేతిలో తనయుడు హతం
ఆలూరు (కర్నూలు) : ఆస్తి తగాదాల నేపథ్యంలో తండ్రి, కొడుకు మధ్య జరిగిన ఘర్షణ కొడుకు ప్రాణాన్ని బలి తీసుకుంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పెర్నెకల్లులో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మస్తాన్ సాబ్‌కు కొడుకు బడేషావలి(38)తో గొడవ జరిగింది. ఆవేశంలో మస్తాన్ సాబ్ కొడుకు తలపై కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బడేషావలి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అసలు కథ.. ఆస్తి తగాదా
వీళ్లు మనకు తెలిసిన వాళ్లే.. 72 ఏళ్ల వయసులో ఐవీఎఫ్(కృత్రిమ గర్భధారణ) పద్ధతిలో తల్లి అవడం ద్వారా అమృత్‌సర్‌కు చెందిన దల్జిందర్ కౌర్, ఆమె భర్త మొహిందర్ సింగ్ గిల్(79) వార్తల్లోకి ఎక్కారు. అయితే.. మనకు తెలియని విషయమేమిటంటే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక రూ. 5 కోట్ల ఆస్తి తగాదా వ్యవహారం దాగుందట. పిల్లల్లేరన్న వెలితిని పూడ్చుకోవడంతోపాటు తన తండ్రి ఆస్తి విషయంలో తోబుట్టువులతో 40 ఏళ్లుగా నడుస్తున్న వివాదానికి ముగింపు పలికేందుకు కూడా గిల్ ఈ వయసులో ఐవీఎఫ్ పద్ధతికి మొగ్గు చూపారట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. రైతు కుటుంబానికి చెందిన గిల్‌కు నలుగురు తోబుట్టువులు. ‘పిల్లల్లేరనే కారణంతో నా తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వడానికి నిరాకరించారు. ఆయన ఎనిమిదేళ్ల క్రితం చనిపోయారు. అయితే.. ఒకవేళ ఆస్తి ఇచ్చినా.. దాన్ని నా తదనంతరం చూసుకోవడానికి వారసులు లేరనే కారణంతో తోబుట్టువులు కూడా వాటా ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో నాడు తండ్రితో నేడు తోబుట్టువులతో నాలుగు దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్నా.. ఈ మొత్తం వ్యవహారం మొదలైన సమయంలో నా వయసు 40 ఏళ్లు. ఆరోగ్యపరమైన సమస్యల వల్ల మాకు పిల్లలు కలగలేదు. 1970, 80ల్లో చాలా మంది వైద్యులను కలిశాం. అయితే.. అప్పట్లో ఈ రంగంలో వైద్యం ఇంతగా అభివృద్ధి చెందలేదు. ఆశలు వదిలేసుకున్నాం. అయితే.. హరియాణాలోని ఓ సంతాన సాఫల్య కేంద్రం ఇచ్చిన ప్రకటన చూసి.. ప్రయత్నించాం. రెండేళ్ల అనంతరం ఐవీఎఫ్ పద్ధతిలో మాకు బిడ్డ పుట్టాడు’ అని మొహిందర్ సింగ్ గిల్ చెప్పారు. తమ బిడ్డకు అర్మాన్(అభిలాష) అని పేరు పెట్టారు. అర్మాన్ పుట్టాకే తమ జీవితం పరిపూర్ణమైందని అన్నారు. ‘మేం చచ్చిపోతే.. మా బిడ్డ పరిస్థితి ఏంటని అందరూ అడుగుతున్నారు. కానీ మాకు భగవంతుడిపై పూర్తి నమ్మకముంది. అర్మాన్ పుట్టాక నాకు మరింత శక్తి వచ్చినట్లయింది’ అని గిల్ చెప్పారు. -
చనిపోయిన చెల్లెలిని దూషించాడని..
హైదరాబాద్ : మరణించిన చెల్లెలిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కోపంతో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు ఆమె సోదరుడు. ఈ ఘటన నగరంలోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ముస్తఫాఖాన్, ఖుద్దూస్లు వరుసకు సోదరులు. వీరిద్దరి గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. కాగా ముస్తఫా ఖాన్ సోదరి గతేడాది దుబాయిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆస్తి తగాదాల మధ్యలో చెల్లెలి ఆత్మహత్య విషయంపై ఖుద్దూస్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కోపోద్రిక్తుడైన ముస్తఫాఖాన్.. సోదరుడైన ఖుద్దూస్ పై కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్థల వివాదంలో అన్నను చంపిన తమ్ముడు
పుట్టపర్తి అర్బన్ (అనంతపురం జిల్లా) : పుట్టపర్తి అర్బన్ మండలం కత్తివారిపల్లిలో స్థల వివాదంలో అన్నను తమ్ముడు హతమార్చాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. బాబు(47), కుళ్లాయప్ప అనే సోదరుల మధ్య చాలా రోజులుగా స్థల వివాదం ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరూ మరోసారి గొడవ పడ్డారు. పట్టరాని ఆగ్రహానికి లోనైన తమ్ముడు కుళ్లాయప్ప అన్నను ఎత్తి కింద పడేశాడు. దాంతో బాబు తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు కుళ్లాయప్ప పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
చక్రి ఆస్తిపైన తప్ప చక్రి పైన వాళ్లెవరికీ ప్రేమ లేదు
శ్రావణి (యు.ఎస్.నుంచి) అందరం కలిసి ఉన్నప్పుడు మా ఆడపడుచుల్ని, మా అత్తగారిని నేను చాలా ప్రేమగా చూశాను. మాతో ఉండేందుకు వాళ్లంగీకరించలేదు. కనీసం సెటిల్ చేసుకుందామన్నా వాళ్లెప్పుడూ సిద్ధంగా లేరు. ‘మొత్తం ఆస్తంతా మాకే వస్తుంది. మా లాయర్ చాలా గట్టివాడు’ అన్నారు. సరిగ్గా పదిహేను రోజుల్లో కోర్టు జడ్జిమెంట్ ఉండగా వీళ్లకి హఠాత్తుగా ఈ ఇల్లెందుకు గుర్తొచ్చింది? ఇల్లు వాళ్ల పొసిషన్లో ఉంటే లీగల్‌గా లబ్ధి జరుగుతుంది వాళ్ల అడ్వొకేట్ చెప్పినట్టున్నారు. ఇంటిపై లోన్ మొత్తం నేనే తీరుస్తున్నాను. వాళ్లు కడుతున్నామని చెపుతున్నది ఒట్టి అబద్దం. వాళ్ల బిల్లుల్లో డేట్స్ చూడండి. మీకే అర్థం అవుతుంది. చక్రి ఆస్తి మీద తప్ప చక్రి మీద వాళ్లెవ్వరికీ ప్రేమ లేదు. చక్రికి ఉన్న అప్పులతో వాళ్లకి పనిలేదు. కానీ ఆస్తులు మొత్తం వాళ్లకే కావాలంటారు. ఇప్పటికే చాలా అప్పులు తీర్చుకుంటూ వస్తున్నాను. ఇంకా తీర్చాల్సినవి చాలా ఉన్నాయి. నేను అమెరికాలోనే ఉన్నా మా నాన్నతో మాట్లాడమని పదే పదే చెప్పాను. కానీ వాళ్లకి ఆస్తి మొత్తం తమకే రావాలని ఉంది. నా గురించి వాళ్లు ఆలోచించడం లేదు. నిజానికి నేనిప్పుడు చక్రిని కోల్పోయి రోడ్డున పడ్డాను. అలాగని వాళ్లు ఇల్లు లేకుండా ఉండాలని నేను కోరుకోవడం లేదు. వాళ్లు అదే ఇల్లు కావాలని అడుగుతున్నారు. ఇప్పటికైనా నా భర్తపేరు బజారుకీడ్చకుండా మా నాన్నతో మాట్లాడమని నేను కోరుతున్నాను. -
ఆస్తి కోసం తండ్రిని కడతేర్చిన కొడుకు
అనారోగ్యంతో మంచానపడిన తండ్రిపై దాడి చికిత్సపొందుతూ మృతి నరసరావుపేట రూరల్ : అనారోగ్యంతో మంచాన ఉన్న తండ్రిపై ఆస్తి వివాదం నేపథ్యంలో కొడుకు దాడి చేశాడు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన తండ్రి ప్రాణాలు విడిచాడు. పోలీసుల కథనం ప్రకారం.. నరసరావుపేట మండలం కాకాని గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కృపారావు (70) కొంతకాలం క్రితం ఎకరం 20 సెంట్ల భూమి కోనుగోలు చేశాడు. ఆ తర్వాత పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఆ భూమిని తన పేరున రాయించుకునేందుకు కృపారావు కొడుకు ఏలియా పథకం పన్నాడు. తల్లి సోమమ్మకు మాయమాటలు చెప్పి భూమిని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు. పాసు పుస్తకాల కోసం వీఆర్వోను సంప్రదించగా, విషయం కాస్తా తల్లికి తెలిసింది. అప్పటి నుంచి తల్లిదండ్రులకు, కుమారుడికి మధ్య విభేదాలు వచ్చాయి. పెద్దలు ఇరువురికీ రాజీ చేసి 50 సెంట్లను తల్లికి ఇచ్చే విధంగా ఒప్పించారు. ఈ నెల 5వ తేదీన మరోమారు తల్లి, కుమారుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో మంచ ంపై ఉన్న తండ్రి గొంతు మీద ఏలియా తన్నాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన కృపారావును గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. సోమమ్మ ఫిర్యాదుతో రూరల్ సీఐ ప్రభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కోసం తాత గొంతు కోసిన మనవడు
లక్ష రూపాయల విలువ చేసే స్థలం కోసం ఓ మనవడు తాత గొంతు కోశాడు. ఈ ఘటన సైదాపురం మండలంలోని తూర్పుపొన్ల గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. తూర్పుపొన్ల గ్రామానికి చెందిన ముత్తంగి క్రిష్టయ్య(67)కు లక్ష రూపాయల విలువ చసే స్థలం ఉంది. ఆ స్థలాన్ని తనకు ఇవ్వాలని మనవడు శివ(22) కొద్దికాలంగా బలవంతపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా ఆస్తి దక్కించుకోవాలని యోచించిన శివ.. బహిర్భూమికి వెళ్ళిన తాత గొంతు కోసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మేనమామను హత్య చేసిన మేనల్లుడు
కత్తులతో దాడిచేసి హత్య మృతుని తల్లి బంధువులే సహకరించారని భార్య ఫిర్యాదు గుంటూరు రూరల్ : ఆస్తి వివాదం, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో మేనల్లుడు మేనమామను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన నగరంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సంఘటనా స్థలిలో మృతుని భార్య గుంజి ఆదిలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం శివనాగరాజు కాలనీ సెల్ టవర్ ప్రాంతానికి చెందిన గుంజి రాంబాబు(35) ఆటో తోలుకుని జీవిస్తుంటాడు. అతనికి భార్య ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత నెల రోజులుగా రాంబాబుకు అతని తల్లికి, అక్కకు, ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం జరుగుతోంది. దీంతో ప్రతి రోజు ఇంటికి వచ్చి వాళ్లు ఆతనితో వాదులాడుతుండేవారు. ఈ నేపథ్యంలో ఓ చోరీ కేసులో అరెస్టయిన రాంబాబు మేనల్లుడు తమ్మిశెట్టి శ్రీనివాస్ నాలుగు రోజుల క్రితం బెయిల్‌పై ఇంటికి వచ్చాడు. శ్రీనివాస్, రాంబాబు తల్లి, అక్క, మరో మహిళతో కలిసి మంగళవారం రాత్రి తమ ఇంటికి వచ్చి తన భర్త రాంబాబుతో వాదులాడుతుండగా శ్రీనివాస్ ఓ భారీ కత్తిని తీసుకుని రాంబాబును పొడిచేందుకు సిద్ధమయ్యాడని, తాను రెండుసార్లు అడ్డగించానని ఆదిలక్ష్మి తెలిపింది. దీంతో తనను నెట్టి తన భర్త రాంబాబును రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి, రాంబాబు తల్లి, మరోమహిళ తన భర్త చేతులు వెనుకకు విరిచి పట్టుకోగా శ్రీనివాస్ కత్తితో ఛాతీ, పొట్ట భాగాల్లో విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యాడని ఆదిలక్ష్మి చెప్పింది. తీవ్రగాయాలైన తన భర్త అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడని వాపోయింది. విషయం తెలిసి ఏఎస్పీ వెంకటప్పలనాయుడు,అరండల్‌పేట సీఐ శివప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలికి చేరుకున్నారు. హత్యజరిగిన తీరును స్థానికులను, మృతుని భార్యను అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కోసం పెద్దమ్మను అంతం చేశాడు
పెద్దకూరపాడు (గుంటూరు) : ఆస్తి కోసం ఓ వ్యక్తి పెద్దమ్మను గొంతు నులిమి హత్య చేశాడు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం గొలుసుపాడులో బక్రీద్ రోజున జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం మేరకు.. షేక్ బాషా అనే వ్యక్తి తొలుత జాన్‌బీని పెళ్లి చేసుకోగా వారికి పిల్లలు కలగలేదు. దీంతో బాషా జాన్‌బీ చెల్లెలు మీరాబీని వివాహమాడాడు. వీరికి నాగుల్‌మీరాషా సంతానం. కాగా బాషా మద్యానికి అలవాటై ఆస్తి కోసం పెద్దమ్మ జాన్‌బీని కొంతకాలంగా వేధిస్తున్నాడు. అందుకు ఆమె సమ్మతించకపోవడంతో బక్రీద్ రోజు మద్యం సేవించి ఆమెను హత్య చేశాడు. శవాన్ని ఇంట్లోనే ఉంచి గ్యాస్ట్రబుల్తో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో హత్య విషయం వెలుగు చూసింది. -
అక్కను చంపిన తమ్ముడికి రిమాండ్
వాంకిడి (ఆదిలాబాద్) : ఆస్తి కోసం అక్కని చంపిన తమ్ముడిని పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం కమ్మాన గ్రామానికి చెందిన వరగడే బాబురావు(45) అనే వ్యక్తి ఆస్తి కోసం తన అక్క సక్కుబాయి(47)తో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3న గొడవ పెద్దదై గొడ్డలితో నరికి హత్య చేశాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ రోజు రిమాండ్‌కు తరలించారు. -
తమ్ముడి భార్యపై అన్న దాడి
మదనపల్లి (చిత్తూరు జిల్లా) : ఆస్తి తగాదాల కారణంగా తమ్ముడి భార్యపై అన్న దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో అతనిపై నిర్భయ కేసు నమోదైంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి తాలుకా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. ఆస్తి తగాదాలతో మదనపల్లికి చెందిన నాగప్ప.. తమ్ముడు శ్రీనివాసులు భార్య ప్రమీలమ్మపై శనివారం రాత్రి దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ విషయమై ఆదివారం మదనపల్లి పోలీసులకు శ్రీనివాసులు ఫిర్యాదు చేశాడు. దీంతో శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు నాగప్పపై నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కోసం తమ్ముడి హత్య
దోమ (రంగారెడ్డి జిల్లా) : ఆస్తి కోసం ఓ యువకుడు అక్క, బావతో కలిసి సొంత తమ్ముడిని హత్య చేశాడు. అడ్డువచ్చిన తండ్రిని కూడా తీవ్రంగా గాయపర్చాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నారాయణపూర్ గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దోమ మండలం బొంపల్లి గ్రామానికి చెందిన ముద్దం శ్రీనివాస్(25)కు ఆస్తి విషయంలో అన్న, సోదరితో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తన పొలంలో పని చేస్తున్న శ్రీనివాస్‌పై అన్న కృష్ణయ్య, అక్క నర్సమ్మ, బావ అంజలయ్యలు కలిసి దాడి చేశారు. ట్రాక్టర్ సహాయంతో పొలం దున్నుతున్న తమ్ముడిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా సంఘటనా స్థలంలోనే పొలం పనులు చేస్తున్న తండ్రి ముద్దం రామయ్య(55) వారిని అడ్డుకోవడంతో అతనిపై కూడా దాడి చేశారు. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉండటంతో గ్రామస్తులు పరిగిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా నిందితులు ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
తల్లిదండ్రులను గెంటేసిన ఎస్సై
పెన్‌పహాడ్ (నల్లగొండ జిల్లా) : ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే కొట్టి ఇంట్లో నుంచి గెంటివేసి ఇంటికి తాళం వేశాడు ఒక ఎస్సై. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం దూపాడు గ్రామంలో వెలుగుచూసింది. దూపాడు గ్రామానికి చెందిన మేకల ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇంటికి వెళ్లిన అతను ఆస్తిని పంచాలంటూ తల్లిదండ్రులతో గొడవపడి, వారిని కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. మనస్తాపం చెందిన తల్లిదండ్రులు మండల కేంద్రంలోని పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదు. దీంతో తెలిసిన వారి ద్వారా సుర్యాపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని ఎస్సై తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు. -
ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు
హైదరాబాద్ : ఆస్తి తగాదాలతో సొంత తమ్ముడే అన్నను నరికి చంపిన సంఘటన హైదరాబాద్ షాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కాల్వగూడలో పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఎం.దాసు శంకర్(35)కు ఆస్తి విషయంలో తమ్ముడు అనిల్‌తో బేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన అనిల్ అన్నను దారుణంగా హత్య చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ఆస్తి కోసం కొట్లాట
కర్నూలు(కృష్ణగిరి): ఆస్తి కోసం సొంత అన్నదమ్ములే కొట్లాటకు దిగిన సంఘటన కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం బోయపొంతిరాళ్లలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగన్న, లక్ష్మణ్ అనే అన్నదమ్ముల మధ్య గత కొంత కాలంగా ఆస్తికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ విషయంలో పలుమార్లు తాగాదాలు పెట్టుకున్న అన్నదమ్ములు ఈ రోజు కొట్లాటకు దిగారు. కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో రాజన్న కుమారులు భాస్కర్, రామంజికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని డోన్ ఆస్పత్రి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆస్తి తగాదాపై కార్తీక్ ఫిర్యాదు
టీనగర్: ఆస్తి తగాదాకు సంబంధించి నటుడు కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెరైక్టర్ భారతీరాజా ‘అలైగళ్ ఓయ్వదిల్లై’ అనే తమిళ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమైన నటుడు కార్తీక్ అనేక చిత్రాల్లో నటించారు. ఈయన కుమారుడు గౌతం కార్తీక్ కూడా ప్రస్తుతం చిత్ర నటుడిగా కొనసాగుతున్నారు. కార్తీక్‌కు అతని కుటుంబీకులకు మధ్య ఆళ్వారుపేటలోగల ఇల్లు, ఇతర స్థలాలకు సంబంధించి కొంతకాలంగా తగాదాలు వున్నాయి. ఈ కారణంగా కొన్ని రోజుల క్రితం కార్తీక్ హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు. ప్రస్తుతం ఆయన విడిగా వుంటున్నట్లు సమాచారం. ఈ క్రమం లో కార్తీక్ మంగళవారం రాత్రి తేనాంపేట పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఒక ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఇందులో ఆస్తి తగాదా గురించిన వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ ఆస్తి తగాదాకు సంబంధించి కార్తీక్ అందజేసిన ఫిర్యాదుపై విచారణ జరుపనున్నట్లు తెలిపారు. -
ఆస్తి కోసం కూతురిని చంపిన తల్లి
ఆస్తిపాస్తుల కోసం తల్లిదండ్రులను గెంటేసే పిల్లలను ఇంతకుముందు చూశాం. కానీ, కన్నతల్లే.. తన పేగు తెంచుకుని పుట్టిన కూతురిని కత్తితో నరికి చంపిన సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ సంఘటన యూసుఫ్‌గూడ లక్ష్మీనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే కళ్యాణి (25)ను ఆమె కన్నతల్లి లక్ష్మి (50) కత్తితో నరికి చంపడమే కాక.. శవం పక్కనే కత్తిపట్టుకుని నిలబడింది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. లక్ష్మికి ముగ్గురు కూతుళ్లు. అంతా కలిసి లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటారు. తల్లీ కూతుళ్ల మధ్య కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. వీటి కారణంగా మిగిలిన ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు అన్నింటినీ ధ్వంసం చేసి.. ఆ తర్వాత ఆమె ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
ఆస్తి కోసం తమ్ముడి హత్య
రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముడిని ఆస్తి కోసం ఓ వ్యక్తి హతమార్చాడు. ఈ సంఘటన కాన్పూర్ సమీపంలోని బిల్హౌర్ ప్రాంతంలో జరిగింది. వినీత్ కుమార్ (40) అనే వ్యక్తికి, అతడి తమ్ముడు సునీల్‌కు ఆస్తి విషయంలో ఆదివారం నాడు గొడవ జరిగింది. దాంతో తర్వాత కొద్ది సేపటికి బాగా తాగి ఉన్న సునీల్‌ను వినీత్ గట్టిగా తోసి, తలను గోడకేసి కొట్టాడు. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. సోదరులిద్దరికి కలిపి దాదాపు మూడు కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాన్ని ఇప్పటికే పంచుకున్నారు కూడా. అయితే, సునీల్ తాగుబోతు కావడంతో అతడి ఆస్తి మీద కూడా వినీత్ కన్నేశాడు. అనంతరం వినీత్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి సునీల్ శవాన్ని కాక్వాన్ సమీపంలోని ఓ కాలువ వద్దకు తీసుకెళ్లి, అందులో పారేశాడు. అయితే ఇంటికి తిరిగి వచ్చేసరికే నలుగురినీ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వినీత్‌ను విచారించగా, నేరం చేసినట్లు అంగీకరించాడు. -
షర్మిలా టాగోర్, సైఫ్ ఖాన్ల ఆస్తి తగాదా
తమ రాచకోటలోని కళాఖండాలను పంచుకునేందుకు భోపాల్ రాచకుటుంబానికి చెందిన నటుడు సైఫ్ అలీ ఖాన్, ఆయన తల్లి, అలనాటి నటి షర్మిలా టాగోర్ చేస్తున్న ప్రయత్నాలకు భోపాల్ పౌరులనుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. మాజీ భారత క్రికెట్ క్యాప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ భార్యగా షర్మిలా టాగోర్ ఈ కళాఖండాలను బంధువుల మధ్య పంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆమె ప్రస్తుతం భోపాల్ లోని కోహె ఫిజా పర్వతంపై ఉన్న అహ్మదాబాద్ పాలెస్ లో మకాం వేశారు. అయితే మెహ్రాజ్ ఖాన్ మస్తాన్ అనే స్థానిక నేత, భోపాల్ లోని పలువురు ముస్లింలు రాచకుటుంబం జ్ఞాపకాలను చెరపవద్దని డిమాండ్ చేస్తున్నారు. వీరు ధర్నా చేయడంతో చివరికి పోలీసుల సాయంతో షర్మిలా టాగోర్ ఎలాగోలా భవనం నుంచి బయటకు రాగలిగారు. పటౌడీ చనిపోయిన తరువాత నుంచీ స్థానికులకు, పటౌడీ కుటుంబీకులైన షర్మిలా, సైఫ్ ఖాన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. -
కిరోసిన్ పోసి నిప్పంటించాడు..
ఆస్తి తగాదా నేపథ్యంలో వృద్ధురాలిపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పట్టపగలు వృద్ధురాలి ఇంటికొచ్చి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. చందర్లపాడులోని పాత ఇండియన్ బ్యాంకు వీధిలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసముంటున్న పాపచర్ల సుశీల (85)కు ఓ స్థలానికి సంబంధించి అదే ప్రాంతానికి చెందిన నెట్టెం జానకిరామయ్యతో వివాదం ఉంది. ఈ నేపథ్యంలో వృద్ధురాలు మంగళవారం ఉదయం ఇంట్లో ఉండగా జానకిరామయ్య వచ్చి కిరోసిన్ పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. ఎదురింట్లో ఉన్న మహిళ ఈ ఘటన చూసి హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పింది. వెంటనే 108 అంబులెన్సుకు, క్షతగాత్రురాలి మనవడికి ఫోన్ చేసింది. అంబులెన్స్ సిబ్బంది వచ్చి ఆమెను వెంటనే నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సుశీల తనకు స్థలం అమ్మినట్లు జానకిరామయ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తీర్పు సుశీలకు అనుకూలంగా వచ్చింది. దీనిని సవాలు చేస్తూ అతడు జిల్లా కోర్టులో అప్పీల్ చేశాడు. ఈ నేపథ్యంలో ఉదయం అతడు తనపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని సుశీల పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొంది. ఈ మేరకు జానకిరామయ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై ఎల్.రమేష్ తెలిపారు. సుశీలకు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారంతా పెళ్లిళ్లయి వేర్వేరు గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త 30 ఏళ్ల కిందట మరణించాడు.