చక్రి ఆస్తిపైన తప్ప చక్రి పైన వాళ్లెవరికీ ప్రేమ లేదు | Chakri has scored the property, except for the above, do not love | Sakshi
Sakshi News home page

చక్రి ఆస్తిపైన తప్ప చక్రి పైన వాళ్లెవరికీ ప్రేమ లేదు

Published Tue, Mar 1 2016 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

చక్రి ఆస్తిపైన తప్ప  చక్రి పైన  వాళ్లెవరికీ ప్రేమ లేదు

చక్రి ఆస్తిపైన తప్ప చక్రి పైన వాళ్లెవరికీ ప్రేమ లేదు

శ్రావణి (యు.ఎస్.నుంచి)

అందరం కలిసి ఉన్నప్పుడు మా ఆడపడుచుల్ని, మా అత్తగారిని నేను చాలా ప్రేమగా చూశాను. మాతో ఉండేందుకు వాళ్లంగీకరించలేదు. కనీసం సెటిల్ చేసుకుందామన్నా వాళ్లెప్పుడూ సిద్ధంగా లేరు. ‘మొత్తం ఆస్తంతా మాకే వస్తుంది. మా లాయర్ చాలా గట్టివాడు’ అన్నారు. సరిగ్గా పదిహేను రోజుల్లో కోర్టు జడ్జిమెంట్ ఉండగా వీళ్లకి హఠాత్తుగా ఈ ఇల్లెందుకు గుర్తొచ్చింది? ఇల్లు వాళ్ల పొసిషన్‌లో ఉంటే లీగల్‌గా లబ్ధి జరుగుతుంది వాళ్ల అడ్వొకేట్ చెప్పినట్టున్నారు.

ఇంటిపై లోన్ మొత్తం నేనే తీరుస్తున్నాను. వాళ్లు కడుతున్నామని చెపుతున్నది ఒట్టి అబద్దం. వాళ్ల బిల్లుల్లో డేట్స్ చూడండి. మీకే అర్థం అవుతుంది. చక్రి ఆస్తి మీద తప్ప చక్రి మీద వాళ్లెవ్వరికీ ప్రేమ లేదు.  చక్రికి ఉన్న అప్పులతో వాళ్లకి పనిలేదు. కానీ ఆస్తులు మొత్తం వాళ్లకే కావాలంటారు. ఇప్పటికే చాలా అప్పులు తీర్చుకుంటూ వస్తున్నాను. ఇంకా తీర్చాల్సినవి చాలా ఉన్నాయి. నేను అమెరికాలోనే ఉన్నా మా నాన్నతో మాట్లాడమని పదే పదే చెప్పాను. కానీ వాళ్లకి ఆస్తి మొత్తం తమకే రావాలని ఉంది. నా గురించి వాళ్లు ఆలోచించడం లేదు. నిజానికి నేనిప్పుడు చక్రిని కోల్పోయి రోడ్డున పడ్డాను. అలాగని వాళ్లు ఇల్లు లేకుండా ఉండాలని నేను కోరుకోవడం లేదు. వాళ్లు అదే ఇల్లు కావాలని అడుగుతున్నారు. ఇప్పటికైనా నా భర్తపేరు బజారుకీడ్చకుండా మా నాన్నతో మాట్లాడమని నేను కోరుతున్నాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement