తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో విషాదం చోటుచేసుకుంది. తోడబుట్టిన తమ్ముడే అన్నను కిరాతకంగా హతమార్చాడు.
తాడ్వాయి (నిజామాబాద్ జిల్లా) : తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో విషాదం చోటుచేసుకుంది. తోడబుట్టిన తమ్ముడే అన్నను కిరాతకంగా హతమార్చాడు. గ్రామానికి చెందిన అమర్(27), ప్రశాంత్‌లు అన్నదమ్ములు. కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే శనివారం రాత్రి ఇద్దరి అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది.
కోపోద్రిక్తుడైన ప్రశాంత్ తన అన్నను విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. పీక కోసి హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమర్‌కు మూడేళ్ల క్రితమే వివాహమైంది. ఒక బాబు ఉన్నాడు. సంఘట నాస్థలాన్ని డీఎస్పీ భాస్కర్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.