Tadwai
-
ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు
సాక్షి, హైదరాబాద్: విద్యావేత్త, చర్చా మేధావి.. ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. ములుగు జిల్లా తాడ్వాయి మండల పీఎస్‌లో ఈ మేరకు ఆయనపై అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు సహయసహకారాలు అందిస్తున్నారని, బీరెల్లి కుట్రలో ఆయన భాగం అయ్యారని, పైగా నిషేధిత మావోయిస్టుల పుస్తకాల్లో ఆయన పేరు ఉందనే అభియోగాలు నమోదు అయ్యాయి. చట్ట వ్యతిరేకత కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా(UAPA యూఏపీఏ)తోపాటు ఆర్మ్ యాక్ట్, ఇంకా పలురాకల 10 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. బీరెల్లి కుట్ర కేసుకు సంబంధించి కిందటి ఏడాది ఆగస్టు 19వ తేదీనే తాడ్వాయి పీఎస్‌లో హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపై కేసు నమోదు అయ్యింది. ప్రజాప్రతినిధులను చంపడానికి కుట్ర పన్నారన్నది ప్రధాన ఆరోపణ కాగా.. నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుల పుస్తకాల్లో పేర్లు ఉన్నాయంటూ వాళ్లకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది కూడా. అయితే.. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు తెలిపారు పోలీసులు. అన్ని కేసుల వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ను ప్రస్తావించడంతో హరగోపాల్ పై దేశద్రోహం కేసు వెలుగులోకి వచ్చింది. స్పందించిన ప్రొఫెసర్ రాజద్రోహం, దేశద్రోహం లాంటి కేసులు పెట్టొద్దని సుప్రీం కోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. కాబట్టి, ప్రభుత్వం పెట్టిన ఈ కేసు నిలబడదు. మావోయిస్టులకు మా మద్దతు ఎందుకు? వాళ్లు మాలాంటి వాళ్ల మీద ఆధారపడరు.. అసలు వాళ్ల ఉద్యమం వేరు. 152 మందిపైనా ఏదో ఒక కేసు పెట్టడం విషాద పరిణామం. బాధ్యతరాహిత్యంగా కేసులు పెడుతున్నారు. నిజాయితీపరులపైనా.. ఆఖరికి చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల తరుణంలో ఇలాంటి కేసులు పెట్టడం దురదృష్టకరం. పేర్లు రాసుకోవడం కాదు.. సరైన ఆధారాలు ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చట్టాన్ని దురుపయోగం చేస్తున్నారు. ఇది ఈ వ్యవస్థలో ఉండాల్సింది కాదు. ఉపా చట్టాన్ని ఎత్తివేయాలి. ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధం. ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ వాళ్లు. ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకోవాలి. అందరిపై కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూనే.. ఉపా చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరగాలి. అందరం కలిసి మాట్లాడుకుని ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని అని ఆకాంక్షించారాయన. అలాగే.. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ అక్రమ కేసు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యా సంఘాల ఖండన ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజాషా లాంటి మేధావులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి డిమాండ్ చేశారు. మరోవైపు విద్యా మేధావులను ఇరికించడం వెనుక లోతైన కుట్ర ఉందని, కేసు వివరాలను బహిర్గత పర్చాలని విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
మహాఘట్టానికి తొలి అడుగు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతర ఘట్టానికి మండమెలిగె పండుగతో తొలి అడుగు పడింది. జాతరకు వారం రోజుల ముందు బుధవారం మండమెలిగె పండుగ ఘనంగా జరిగింది. సమ్మక్క ప్రధాన పూజా రి సిద్ధబోయిన మునీందర్ ఇంటినుంచి అచారం ప్రకారం పసుపు, కుంకుమ పూజాసామగ్రిని సమ్మక్క గుడికి తీసుకెళ్లారు. మరో పూజారి లక్ష్మణ్‌రావు ఇంటి నుంచి మామిడి తోరణాలు తీసుకువచ్చారు. ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం పూజారులు మేడారం గ్రామ శివారులోని మైసమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడినుంచి బొడ్రాయి వద్దకు వెళ్లి పవిత్రజలంతో శుద్ధి చేశారు. సమ్మక్క గుడి ముందు ఆడపడచులు ముగ్గు లు వేసి అలకరించారు. మామిడి తోరణాలకు ఉల్లిగడ్డ, కోడిపిల్లలను కట్టి (దిష్టి తగలకుండా) దొర స్తంభాన్ని నిలిపారు. కల్లు (సాక), నీళ్లు, పాలు, బెల్లం పానకం, నెయ్యి, చలి గంజితో రోడ్డుకు అడ్డంగా ఆరగింపు చేశారు. అనంతరం గ్రామ శివారులో మరో దొర స్తంభాన్ని నిలిపారు. ప్రధాన పూజారి (వడ్డె) కొక్కరి కృష్ణయ్య పసుపు, కుంకుమలతో అమ్మవారిని గద్దెలపైకి తీసుకువెళ్లారు. బు«ధవారం రాత్రి అక్కడే జాగారం చేసి గురువారం గుడి చేరుకోనున్నారు. అదేసమయంలో కన్నెపల్లిలో సారలమ్మ ఆలయంలో కాక వంశస్తుల ఆధ్వర్యంలో మండమెలిగె పండుగ, పోను గొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో గుడిమెలిగె కార్యక్రమాన్ని నిర్వహించారు. మండమెలిగె పండుగ సందర్భంగా మేడారానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సుమారు 2 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
మేడారం జాతరకు వెళ్తుండగా..
సాక్షి, తాడ్వాయి: జయశంకర్ జిల్లా తాడ్వాయి సమీపంలో విషాదం చోటుచేసుకుంది. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళుతున్న తండ్రీకొడుకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చెవిటిగూడెంకు చెందిన ఆటో డ్రైవర్ పి.అంజయ్య(50) తన కుమారుడు నవీన్(23)తో కలిసి ఆటోలో జాతరకు వెళ్తున్నాడు. తాడ్వాయి-పస్రా మధ్యలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాడ్వాయి ఎస్సై కరుణాకర్‌రావు తెలిపారు. -
తండ్రి చేతిలో కూతురు హత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): సైకోగా మారిన ఓ తండ్రి కన్న కూతురునే దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్ గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన గడ్డం చిన్న బాలరాజు, సాయవ్వలకు ఇద్దరు కూతుళ్లు శ్రీజ(16), రమ్య, కుమారుడు రణదీప్ ఉన్నారు. శ్రీజ ఎండ్రియాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చిన్న బాలరాజు ఎర్రాపహాడ్‌లో భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయంతోపాటు కూలి పనులు చేస్తున్నాడు. శ్రీజ ఎర్రాపహాడ్‌లోని అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటూ రోజూ ఎండ్రియాల్‌కు వచ్చి వెళ్లేది. దీపావళి సెలవులు కావడంతో మంగళవారం ఎండ్రియాల్‌కు వచ్చింది. ఆమె తల్లి సాయవ్వ పుట్టింటికి వెళ్లింది.ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో తండ్రి, కూతురు మాత్రమే ఉన్నారు. రాత్రి వేళలో చిన్న బాలరాజు గొడ్డలితో కూతురు మెడపై నరికి చంపాడు. సాయవ్వ బుధవారం ఉదయం తిరిగి వచ్చేసరికి శ్రీజ రక్తపు మడుగులో ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు చిన్న బాలరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు కారణాలు తెలియరాలేదు. కాగా, శ్రీజ 7, 8, 9 తరగతుల్లో చక్కటి ప్రతిభ చూపడంతో ఎస్బీఐ ఎర్రాపహాడ్ శాఖ ఏటా రూ. 5 వేల స్కాలర్షిప్ అందిస్తోంది. నిందితుడు చిన్న బాలరాజు ఎవరితో సరిగా మాట్లాడడని, సైకోగా వ్యవహరించేవాడని స్థానికులు తెలిపారు. -
డెంగీతో ఒకరి మృతి
తాడ్వాయి : తాడ్వాయి మండలంలోని భస్వన్నపల్లి గ్రామానికి చెందిన గెర్రె చిన్న రాములు (42) డెంగీ జ్వరంతో మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం తీవ్రంగా జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని జీవదాన్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు రాములుకు డెంగీ లక్షణాలు ఉన్నాయని వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. రాములును హైద్రాబాద్‌లోని ప్రవేటు హాస్పిటాల్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అదే గ్రామానికి మరికొందరు డెంగీతో బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. -
బంధాల్లేని ‘మనీ’షి!
* ఆస్తి కోసం అఘాయిత్యాలు * అయిన వారినే హతమారుస్తున్న వైనం * భూముల ధరల వెంటే పెరుగుతున్న వివాదాలు * ఆందోళన కలిగిస్తున్న నేరాలు కామారెడ్డి: పేగుబంధం పరిహాసమవుతోంది.. మానవత్వం మంట గలుస్తోంది.. మనిషి చుట్టూ తిరగాల్సిన బంధాలు, అనుబంధాలు.. ప్రస్తుతం ‘మనీ’ చుట్టూ తిరుగుతున్నాయి. ఆస్తి కోసం అయిన వారినే చంపే పరిస్థితులు దాపురించాయి. రక్తం పంచిన వారు, తోడ బుట్టిన వారే పొట్టన బెట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. భూమి, ఆస్తి, డబ్బు వంటి ఆర్థిక పరమైన వ్యవహారాలు ప్రాణాలు బలిగొంటున్నాయి. భూముల విలువలు పెరిగిన కొద్దీ అదే స్థాయిలో వివాదాలు పెరుగుతున్నాయి. పదుల సంఖ్యలో హత్యలకు దారి తీస్తున్నాయి. రెండ్రోజుల క్రితం తాడ్వాయి మండలం ఎర్రపహడ్లో చోటు చేసుకున్న ఉదంతమే అందుకు నిదర్శనం. ఆస్తి విషయంలో తాగాదాతో అన్నపై కక్ష పెంచుకున్న తమ్ముడు, కిరాతకంగా సోదరుడి గొంతు కోసి హతమార్చడం సంచలనం సృష్టించింది. మాయమవుతున్న బంధాలకు ‘మచ్చ’తునకగా నిలిచింది. భూములు, ఆస్తుల విషయంలో తలెత్తుతున్న గొడవలను సామరస్యంగా కూర్చుండి పరిష్కరించుకోవడమో, లేదా కోర్టుల ద్వారా పరిష్కారానికి ప్రయత్నించుకుండా కక్షలు పెంచుకుని దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. ఆవేశంతో హత్యలకు పాల్పడి జైలు పాలవుతున్నారు. ఫలితంగా అటు హతుల కుటుంబాలు, ఇటు హంతకుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. విలువలతో పాటే పెరుగుతున్న వివాదాలు పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా భూముల ధరలు అమాంతం పెరుగుతుండడంతో వివాదాలూ పెరుగుతున్నాయి. గెట్టు విషయంలో, వాటా విషయంలో తలెత్తుతున్న విభేదాలు, ఆస్తి పంపకాల్లో తేడాలు దాడు లు, ప్రతిదాడులకు దారి తీస్తున్నాయి. హంతకులుగా మారుస్తున్నాయి. ఆస్తి పంచుకున్నపుడు అందరూ ఇష్టంగానే పంచుకున్నా, తరువాత పెరిగిన ధరలతో విభేదాలు ఏర్పడి వివాదాలకు కారణమవుతున్నాయి. బంధాలకు విలువేది..? ఆస్తి కోసం అయిన వారినే హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మానవత్వాన్ని మరిచి తన వారినే మట్టుబెట్టడం మంట గలుస్తున్న అనుబంధాలకు మచ్చగా మిగులున్నాయి. అన్నదమ్ములు, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ, అనురాగాలు ఉండాల్సింది పోయి పగలు, ప్రతీకారాలు పెరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులకు దిగడం, హత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. మనిషిలో పెరిగిన స్వార్థం, అత్యాశ, డబ్బు వ్యామోహమే వివాదాలు, ఘర్షణలు, హత్యలకు కారణమవుతున్నాయి. మాయని ‘మచ్చ’లెన్నో ♦ తాడ్వాయి మండలం ఎర్రాపహడ్ గ్రామం వద్ద శనివారం రాత్రి కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన శెట్కూరి అమర్ (26)ను సొంత తమ్ముడే కర్కశంగా గొంతుకోసి హతమార్చాడు. ఈ సంఘటనకు ప్రధాన కారణం భూ తగాదాలేనని స్పష్టమైంది. వారసత్వంగా సంక్రమించిన ఆస్తి పంపకం విషయంలో తలెత్తిన విబేధాలతో అన్నను హతమార్చిన తమ్ముడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ♦ కామారెడ్డిలో గతేడాది ఏప్రిల్ 30న నాగరాజు (34) తన తండ్రి చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఆస్తి విషయంలో విభేదాలు తలెత్తడంతో తండ్రి సిద్దరాములు పథకం ప్రకారం మరొకరితో కలిసి నాగరాజును హతమార్చాడు. ♦ తాడ్వాయి మండల కేంద్రంలో ఆరు నెలల క్రితం అన్నదమ్ముల మధ్య మరుగుదొడ్డి నిర్మాణానికి సంబంధించి కొద్దిపాటి డబ్బు కోసం జరిగిన గొడవలో నామాల శ్రీనివాస్ (26)ను అతని అన్న రమేశ్ హతమార్చాడు. తమ్ముడు కటకటాల పాలయ్యాడు. -
అన్నను కడతేర్చిన తమ్ముడు
తాడ్వాయి (నిజామాబాద్ జిల్లా) : తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో విషాదం చోటుచేసుకుంది. తోడబుట్టిన తమ్ముడే అన్నను కిరాతకంగా హతమార్చాడు. గ్రామానికి చెందిన అమర్(27), ప్రశాంత్‌లు అన్నదమ్ములు. కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే శనివారం రాత్రి ఇద్దరి అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన ప్రశాంత్ తన అన్నను విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. పీక కోసి హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమర్‌కు మూడేళ్ల క్రితమే వివాహమైంది. ఒక బాబు ఉన్నాడు. సంఘట నాస్థలాన్ని డీఎస్పీ భాస్కర్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాడ్వాయిలో మావోయిస్టుల దుశ్చర్య
తాడ్వాయి: వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం వనకుటీరాలో మావోయిస్టులు దుశ్చర్యకు దిగారు. వైల్డ్ లైఫ్ విభాగానికి చెందిన ఓ వాహనాన్ని , మరో ఇంటిని శుక్రవారం రాత్రి మావోయిస్టులు తగలబెట్టారు. హరితహారం పేరుతో పీడిత వర్గాల భూములను లాక్కోవాలని టీఎస్ ప్రభుత్వం చూస్తోందని, ఆదివాసీల పోడుభూములను స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి తగిన విధంగా బుద్దిచెబుతామని హెచ్చరించారు. గ్రీన్‌హంట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని సంఘటనాస్థలంలో వదిలి వెళ్లిన లేఖలో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
బంధువులు పట్టించుకోవటం లేదని..
తాడ్వాయి (నిజామాబాద్ జిల్లా) : కుటుంబసభ్యులు, బంధువులు పట్టించుకోవటం లేదని మనస్తాపం చెందిన తండ్రి, కూతురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం గుండారం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కె.నరహరి(55) భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి కుమార్తె సౌజన్య(14)తో కలసి గ్రామంలో జీవనం సాగిస్తున్నాడు. అయితే బంధువులెవరూ పట్టించుకోవటం లేదని, తమను ఒంటరివారిగా మార్చారని వారిద్దరూ కొంతకాలంగా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు గురువారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకున్నారు. శుక్రవారం ఉదయం చుట్టుపక్కలవారు గమనించే సరికే విగతజీవులై ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లలు కలగలేదని ఆత్మహత్య
తాడ్వాయి (నిజామాబాద్) : పిల్లలు పుట్టడం లేదని మనస్తాపం చెందిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం సంతాయపేటలో శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనిత(38)కు పెళ్లై పదిహేనేళ్లైనా పిల్లలు కలగకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.