కుటుంబసభ్యులు, బంధువులు పట్టించుకోవటం లేదని మనస్తాపం చెందిన తండ్రి, కూతురు బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాడ్వాయి (నిజామాబాద్ జిల్లా) : కుటుంబసభ్యులు, బంధువులు పట్టించుకోవటం లేదని మనస్తాపం చెందిన తండ్రి, కూతురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం గుండారం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కె.నరహరి(55) భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి కుమార్తె సౌజన్య(14)తో కలసి గ్రామంలో జీవనం సాగిస్తున్నాడు.
అయితే బంధువులెవరూ పట్టించుకోవటం లేదని, తమను ఒంటరివారిగా మార్చారని వారిద్దరూ కొంతకాలంగా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు గురువారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకున్నారు. శుక్రవారం ఉదయం చుట్టుపక్కలవారు గమనించే సరికే విగతజీవులై ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.