
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, అనంతపురం క్రైం: కుమార్తె నిశ్చితార్థం రద్దు కావడంతో మనస్తాపం చెందిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం శివారులోని ఎ.నారాయణపురం పంచాయతీ భువనేశ్వర నగర్‌కు చెందిన గుజ్జల సురేంద్ర (43), ప్రమీల దంపతులు. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. ఇటీవల నార్పలకు చెందిన బంధువుల అబ్బాయితో కుమార్తెకు వివాహం నిశ్చయమైంది.
ఏం జరిగిందో.. ఏమో అబ్బాయి తరఫు వారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆదివారం తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన సురేంద్ర అదేరోజు రాత్రి మద్యం సేవించి శాంతినగర్ బ్రిడ్జి వద్ద పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి అతని పరిస్థితిని గమనించేందుకు గదిలోకి వెళ్లిన కుటుంబసభ్యులకు ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని వేలాడుతూ సురేంద్ర కనిపించాడు. వెంటనే కిందికి దింపి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై నాల్గోపట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: (ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..)
అవ్వ మందలించిందని..
తాడిపత్రి: అవ్వ మందలింపుతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నందలపాడుకు చెందిన సాయికుమార్ (18) బేల్దారి పనులు చేసేవాడు. పదేళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోయిన సాయికుమార్‌ని అవ్వ చేరదీసి పెంచి పెద్ద చేసింది. ఇటీవల సాయికుమార్ చెడు అలవాట్లకు బానిసగా మారి జులాయిగా తిరగడం మొదలు పెట్టాడు. ఈ విషయంగా సోమవారం అవ్వ మందలించింది. ఏదైనా పనిచేసుకుని బతకాలని హితవు పలికింది. ఈ విషయంగా మనస్తాపం చెందిన సాయికుమార్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సీఐ కృష్ణారెడ్డి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment