Engagement cancelled
-
కుమార్తె నిశ్చితార్థం రద్దు.. తండ్రి ఆత్మహత్య!
సాక్షి, అనంతపురం క్రైం: కుమార్తె నిశ్చితార్థం రద్దు కావడంతో మనస్తాపం చెందిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం శివారులోని ఎ.నారాయణపురం పంచాయతీ భువనేశ్వర నగర్‌కు చెందిన గుజ్జల సురేంద్ర (43), ప్రమీల దంపతులు. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. ఇటీవల నార్పలకు చెందిన బంధువుల అబ్బాయితో కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. ఏం జరిగిందో.. ఏమో అబ్బాయి తరఫు వారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆదివారం తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన సురేంద్ర అదేరోజు రాత్రి మద్యం సేవించి శాంతినగర్ బ్రిడ్జి వద్ద పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి అతని పరిస్థితిని గమనించేందుకు గదిలోకి వెళ్లిన కుటుంబసభ్యులకు ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని వేలాడుతూ సురేంద్ర కనిపించాడు. వెంటనే కిందికి దింపి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై నాల్గోపట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..) అవ్వ మందలించిందని.. తాడిపత్రి: అవ్వ మందలింపుతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నందలపాడుకు చెందిన సాయికుమార్ (18) బేల్దారి పనులు చేసేవాడు. పదేళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోయిన సాయికుమార్ని అవ్వ చేరదీసి పెంచి పెద్ద చేసింది. ఇటీవల సాయికుమార్ చెడు అలవాట్లకు బానిసగా మారి జులాయిగా తిరగడం మొదలు పెట్టాడు. ఈ విషయంగా సోమవారం అవ్వ మందలించింది. ఏదైనా పనిచేసుకుని బతకాలని హితవు పలికింది. ఈ విషయంగా మనస్తాపం చెందిన సాయికుమార్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సీఐ కృష్ణారెడ్డి దర్యాప్తు చేపట్టారు. -
నాలుగేళ్లుగా డేటింగ్: పెళ్లి జరగదంటున్న నటుడు
'ఫ్రెండ్స్: ద రీయూనియన్' స్టార్ మాథ్యూ పెర్రీ తన ప్రేయసి మోలీ హర్విట్జ్తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగవని, అందులో ఈ పెళ్లి కూడా ఒకటని పేర్కొన్నాడు. మోలీకి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 51 ఏళ్ల వయసున్న నటుడు ఈ మధ్యే వచ్చిన 'ఫ్రెండ్స్: ద రీయూనియన్' వెబ్‌సిరీస్‌లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇతడు 2018 నుంచి 29 ఏళ్ల మోలీతో డేటింగ్లో ఉన్నాడు. ఈ క్రమంలో 2019లో వీళ్లిద్దరూ హాలీడేస్‌ను బాగా ఎంజాయ్ చేశారు. తను మోలీని పెళ్లి చేసుకోబోతున్నానని, త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా జరగనున్నట్లు గతేడాది నవంబర్‌లో మీడియాకు వెల్లడించాడు. కానీ అంతలోనే నిశ్చితార్థం జరగడం లేదని చెప్తూ అభిమానులకు షాకిచ్చాడు. కాగా మాథ్యూ గతంలో లిజ్జీ కాప్లాన్‌తో ఆరేళ్ల పాటు ప్రేమాయణం నడిపాడు. వీరిద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో 2012లో విడిపోయారు. చదవండి: OTT: నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదిగో! -
బిగ్‌బాస్ జంట నిశ్చితార్థం రద్దు..
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు అష్మిత్ పటేల్, మహెక్ చాహల్‌ల నిశ్చితార్థం రద్దయింది. గత ఐదేళ్లుగా రిలేషన్లో ఉన్న వీరు విడిపోయారు. కొద్దికాలంగా అష్మిత్, మహెక్లు విడిపోయారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిపై అష్మిత్ గానీ, మహెక్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా వారిద్దరు తమ బంధానికి ముగింపు పలికారని వార్తలు రాగా.. అష్మిత్, మహెక్లు వాటిని ధ్రువీకరించారు. అష్మిత్తో విడిపోయినట్టు మహెక్ వెల్లడించారు. మరోవైపు దీనిపై అష్మిత్ స్పందిస్తూ.. తాము ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయామని అన్నారు. ఇది వ్యక్తిగత విషయమని.. ప్రైవసీ పాటించాలని కోరారు. కాగా, అష్మిత్, మహెక్ల మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో.. వారిద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయినట్టుగా తెలుస్తోంది. కొన్నేళ్లు ప్రేమాయణం సాగించిన అష్మిత్, మహెక్ జంట.. 2017 ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాది వివాహ బంధంతో ఒకటి కావాలనుకున్నారు. అయితే అది వాయిదా పడుతు వచ్చింది. ఈ క్రమంలోనే వారి మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో.. విడిపోవాలని నిర్ణయించుకున్నారు. -
కూతురి నిశ్చితార్థంపై రష్మిక తల్లి ప్రకటన
తమిళసినిమా: సంచలన నటి నయనతార ప్రేమ కథలాంటిదే తాజాగా శాండిల్‌వుడ్‌లో జరిగింది. సినిమా వాళ్ల ప్రేమలు చాలా వరకూ పెళ్లి అనే తీరానికి సవ్యంగా చేరడం లేదని చెప్పవచ్చు. ప్రేమలు, బ్రేకప్‌లు ఇక్కడ సర్వసాధారణం అయిపోయాయి. చాలా కాలం క్రితం నటి నయనతార ప్రభుదేవాల ప్రేమపెళ్లి అంచుల వరకూ వచ్చి ఆగిపోయింది. తాజాగా శాండిల్‌వుడ్ భామ రష్మిక మందన్న ప్రేమ నిశ్చితార్థం వరకు వచ్చి నిలిచిపోయింది. రష్మిక గురించి చెప్పాలంటే కన్నడ, తెలుగు భాషల్లో కథానాయకిగా ఎదుగుతున్న నటి. మాతృభాష కన్నడం అయినా తెలుగులో ప్రస్తుతం ఈ అమ్మడికి లక్కు బాగుంది. విజయ్‌దేవరకొండతో నటించిన గీతగోవిందం చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడంతో ఈ బ్యూటీ పేరు అక్కడ మారుమోగుతోంది. కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఇంతకు ముందు వరకు ప్రేమలో మునిగితేలింది. అక్కడ ఈ జంట ఒక చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలూ పచ్చజెండా ఊపడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. రష్మిక, రక్షిత్‌శెట్టి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక పెళ్లే తరువాయి అన్న తరుణంలో మనస్పర్థలు అనే మహమ్మారి తలపైకొచ్చి కూర్చుంది. అంతే నటి రష్మిక తనకు కాబోయే వరుడితో పెళ్లిని బ్రేకప్ చేసుకుంది. ఇది జరిగి కొద్ది రోజులైంది. అప్పుడు వీరి బ్రేకప్ వార్తను ఇద్దరూ ఖండించారు. అయితే అది వదంతి కాదని, నిజం అని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని నటి రష్మిక మిత్ర బృందం స్పష్టం చేశారు. ‘అవును రష్మిక బరువెక్కిన గుండెతోనే తన ప్రేమకు బ్రేకప్ చెప్పింది. వివాహనిశ్చితార్థం జరిగిన తరువాత నటుడు రక్షిత్, రష్మికల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో రష్మిక తన వివాహాన్ని రద్దు చేసుకుంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో చర్చించిన తరువాతే రష్మిక ఇలాంటి కఠినమై నిర్ణయాన్ని తీసుకుంద’ని ఆమె మిత్రబృందం పేర్కొన్నారు. ఆమె తల్లి సుమన్ మందన్న కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘మా కూతురికిప్పుడు సినిమాల్లో టైమ్ బాగుంది. పలు అవకాశాలు వస్తున్నాయి. కన్నడం, తెలుగు భాషల్లో రష్మిక తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి సారించాలని నిర్ణయించుకుంద’ని రష్మిక తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ బ్యూటీ తెలుగులో నటించిన గీత గోవిందం సంచలన విజయాన్ని సాధించడంతో యమ క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం నాగార్జున, నానిలతో కలిసి నటించిన దేవదాసు చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంపై రష్మిక చాలా ఆశలే పెట్టుకుంది. అదే విధంగా విజయ్‌దేవరకొండతో మరోసారి డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ఇక మాతృభాషలోనూ రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ రెండు భాషల్లోనూ నటిగా రాణించాలని ఈ అమ్మడు కలలు కంటోందట. -
ఛలో హీరోయిన్ ఎంగేజ్మెంట్ రద్దు...!
కన్నడ బ్యూటీ, ఛలో ఫేమ్ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టితో గతేడాది ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కిరిక్ పార్టీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆఫర్లు వెల్లువెత్తుండటంతో ఆమె నిశ్చితార్థం రద్దు దిశగా ఆలోచన చేస్తోందని, ఈ మేరకు ఓ నిర్ణయం కూడా తీసేసుకుందంటూ ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. దీనికితోడు ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా తలెత్తాయన్నది ఆ కథనం పేర్కొంది. గీత గోవిందం పోస్టర్లలో రష్మిక.. విజయ్ దేవరకొండల మధ్య రొమాన్స్‌పై రక్షిత్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు. దీనిపై ఆమె స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. అయితే అప్పటి నుంచి రక్షిత్-రష్మికల మధ్య మాటలు లేవన్నంట. దీంతో కెరీర్ పీక్స్‌లో ఉన్న ఈ సమయంలో ఆమె వివాహ ఆలోచనను పూర్తిగా పక్కకు పెట్టినట్లు ఆ కథనం ఉటంకించింది. అయితే ఈ వ్యవహారాన్ని ఆమె సన్నిహితులు తూచ్‌గా తేల్చేస్తున్నారు. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని, దయచేసి అలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ ఈవెంట్లో ఇద్దరూ కలిసి హాజరైన విషయాన్ని వాళ్లు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఈ గాసిప్స్‌పై రష్మిక, రక్షిత్‌లు స్పందించాల్సి ఉంది. -
నిశ్చితార్థం నిలిచిపోయిందని..
భూదాన్‌పోచంపల్లి : నిశ్చిదార్థం నిలిచిపోయిందని మనస్తాపం చెందిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని జిబ్లక్పల్లిలో శనివారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ ఈరటి నర్సింహ, వసంత దంపతులకు మమత(19) ఏకైక కుమార్తె. మమత చౌటుప్పల్‌లోని ఓ ప్రైవే ట్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో మండలంలోని ముక్తాపూర్ గ్రా మానికి చెందిన దూరపు బంధువు ముద్దం బాలరాజుతో వివాహం చేయడానికి రెండు కుటుంబాల పెద్ద మనుషులు నిశ్చయించారు. 20తులాల బంగారంతో పాటు మొత్తం రూ.12లక్షలు కట్నం కానుకలు ఇచ్చేందుకు వధువు తల్లిదండ్రులు అంగీకరించారు. గత నెల 29న నిశ్చిదార్థం, ఈ నెల 15న పెళ్లి జరిపించేందుకు నిశ్చయించారు. అందులో భాగంగానే వధూవరుల కోసం నూతన వస్త్రాలు కొనుగోలు చేశారు. పెళ్లి కోసమని పోచంపల్లిలో ఓ ఫంక్షన్హాలుకు అడ్వాన్స్ కూడా చెల్లించారు. వీడియో,ఫొటోగ్రాఫర్, ముత్యాల పందిరి డెకరేషన్ వారందరికీ సైతం అడ్వాన్స్‌లు ఇచ్చేసి పెళ్లి పనిలో నిమగ్నమయ్యారు. కట్నకానుకలు ముందుగా సమర్పిస్తేనే.... ముందుగా అంగీకరించినట్లుగా నిశ్చిదార్థం రోజునే 20తులాల బంగారం, రెండు లక్షల కట్నం ఇవ్వాలని, లేదంటే పెళ్లి జరుగదని వరుడు, అతడి తల్లిదండ్రులు పేచి పెట్టారు. పెళ్లి నాటికి పూర్తిగా కట్నకానుకలు సమర్పిస్తానని ఎలాగైనా నిశ్చిదార్థం జరిపించాలని వధువు తల్లిదండ్రులు బతిమిలాడారు. కానీ అందుకు వరుడి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో గత నెల 29న జరగాల్సిన నిశ్చిదార్థం అర్ధం తరంగా నిలిచిపోయింది. ఆ తరువాత గ్రామ కులపెద్దలు కల్పించుకుని ఈ నెల 13న ముక్తాపూర్లోని వరుడి ఇంటికి వెళ్లారు. జరిగిపోయిందేదో జరిగిందని, అంగీకారం ప్రకారం వధువు తల్లిదండ్రులు కట్నం ఇవ్వకుంటే, తాము ఇస్తామని వారికి భరో సా ఇచ్చారు. వధువు తండ్రి నర్సింహ కాళ్ల్లు పట్టుకుని బతిమిలాడారు. అయినా వారి మనుసు కరుగలేదు. అందరికీ ఏం సమాధానం చెప్పాలని.. పీటల వరకు వచ్చిన పెళ్లి నిలిచిపోవడంతో మమత తీవ్ర మనస్తాపానికి గురైంది. తన పెళ్లి ఖాయమైందని, అందరూ రావాలని తన స్నేహితులు, కాలేజ్ లెక్చరర్స్‌కు మమత ముందుగానే చెప్పింది. పెళ్లి అర్ధంతరంగా ఆగిపోవడంతో వారికి ఏమి సమాధానం చెప్పాలని లోలోన తీవ్ర మదనపడింది. శుక్రవారం మమత తల్లిదండ్రులు హయాత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చేరిన సమీప బంధువును పరామర్శించడానికి వెళ్లారు. మమత ఇంట్లో ఒక్కతే ఉంది. మధ్యా హ్న సమయంలో మమత వరుడు బాలరాజుకు చాలాసార్లు ఫోన్ చేసింది. అయినా అతడి నుంచి స్పందన లభించలేదు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆమె ఇంటి బయటి నుంచి తాళం వేసి, ఇంటి వెనుక నుంచి వెళ్లి తలుపులు బిగించుకుని చీరతో ఇంటిపైకప్పు కొక్కానికి ఉరివేసుకుంది. ఫోన్‌లిఫ్ట్ చేయకపోవడంతో.... ఊరికి వెళ్లిన తల్లిదండ్రులు మధ్యాహ్న సమయంలో మమత సెల్‌ఫోన్‌కు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆందోళన చెందిన వారు వెంటనే సాయంత్రం వరకు ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి, ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉంది. అనుమానం వచ్చి తాళాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇంటి పై కప్పు కొక్కానికి మమత చీరతో ఉరివేసి వేలాడుతూ కన్పించింది. కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు శనివారం సంఘటన స్థలానికి చేరుకొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అన్ని సవ్యంగా జరిగితే.. ముందుగా నిశ్చయించినట్లు అన్ని సవ్యంగా జరిగితే ఈ నెల 15న బాజా భజంత్రీలతో ఆ ఇంట్లో పెళ్లి ఘనంగా జరిగేది. కానీ అదే రోజు వధువు కావాల్సిన యువతి విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. కట్నం కోసం నా బిడ్డను బలితీసుకున్న బాలరాజు, అతడి తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాగా వరుడు బాలరాజు, అతడి తల్లిదండ్రులు ముందస్తుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.