బిగ్‌బాస్‌ జంట నిశ్చితార్థం రద్దు.. | Ashmit Patel And Mahek Chahal Call Off Their Engagement | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ జంట నిశ్చితార్థం రద్దు..

Published Sun, Jan 12 2020 5:33 PM | Last Updated on Sun, Jan 12 2020 5:33 PM

Ashmit Patel And Mahek Chahal Call Off Their Engagement - Sakshi

బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్‌లు అష్మిత్‌ పటేల్‌, మహెక్ చాహల్‌ల నిశ్చితార్థం రద్దయింది. గత ఐదేళ్లుగా రిలేషన్‌లో ఉన్న వీరు విడిపోయారు. కొద్దికాలంగా అష్మిత్‌, మహెక్‌లు విడిపోయారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిపై అష్మిత్‌ గానీ, మహెక్‌ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా వారిద్దరు తమ బంధానికి ముగింపు పలికారని వార్తలు రాగా.. అష్మిత్‌, మహెక్‌లు వాటిని ధ్రువీకరించారు. అష్మిత్‌తో విడిపోయినట్టు మహెక్‌ వెల్లడించారు. మరోవైపు దీనిపై అష్మిత్‌ స్పందిస్తూ.. తాము ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయామని అన్నారు. ఇది వ్యక్తిగత విషయమని.. ప్రైవసీ పాటించాలని కోరారు. కాగా, అష్మిత్‌, మహెక్‌ల మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో.. వారిద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయినట్టుగా తెలుస్తోంది. 

కొన్నేళ్లు ప్రేమాయణం సాగించిన అష్మిత్‌, మహెక్‌ జంట.. 2017 ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాది వివాహ బంధంతో ఒకటి కావాలనుకున్నారు. అయితే అది వాయిదా పడుతు వచ్చింది. ఈ క్రమంలోనే వారి మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో.. విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement