Ashmit
-
కస్టడీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి
కడప అర్బన్/కోటిరెడ్డి సర్కిల్/సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డిలను అనంతపురం జిల్లా పోలీసులు రెండు రోజులపాటు తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కోర్టు ఈ నెల 20 మధ్యాహ్నం 1 గంట నుంచి 22 మధ్యాహ్నం 2 గంటల వరకు రిమాండ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అనంతపురం పోలీసులు శనివారం కడప కేంద్ర కారాగారం నుంచి జేసీని, ఆయన తనయుడిని తమ వాహనాల్లో తీసుకెళ్లారు. కేసును కొట్టేయాలంటూ పిటిషన్ వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో అనంతపురం వన్‌టౌన్ పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి జేసీ ఉమ, అస్మిత్‌రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
బిగ్‌బాస్ జంట నిశ్చితార్థం రద్దు..
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు అష్మిత్ పటేల్, మహెక్ చాహల్‌ల నిశ్చితార్థం రద్దయింది. గత ఐదేళ్లుగా రిలేషన్లో ఉన్న వీరు విడిపోయారు. కొద్దికాలంగా అష్మిత్, మహెక్లు విడిపోయారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిపై అష్మిత్ గానీ, మహెక్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా వారిద్దరు తమ బంధానికి ముగింపు పలికారని వార్తలు రాగా.. అష్మిత్, మహెక్లు వాటిని ధ్రువీకరించారు. అష్మిత్తో విడిపోయినట్టు మహెక్ వెల్లడించారు. మరోవైపు దీనిపై అష్మిత్ స్పందిస్తూ.. తాము ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయామని అన్నారు. ఇది వ్యక్తిగత విషయమని.. ప్రైవసీ పాటించాలని కోరారు. కాగా, అష్మిత్, మహెక్ల మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో.. వారిద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయినట్టుగా తెలుస్తోంది. కొన్నేళ్లు ప్రేమాయణం సాగించిన అష్మిత్, మహెక్ జంట.. 2017 ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాది వివాహ బంధంతో ఒకటి కావాలనుకున్నారు. అయితే అది వాయిదా పడుతు వచ్చింది. ఈ క్రమంలోనే వారి మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో.. విడిపోవాలని నిర్ణయించుకున్నారు. -
భవాన్స్‌ను గెలిపించిన అశ్మిత్
ఎంకే క్రికెట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: బాతుల అశ్మిత్ (18 బంతుల్లో 39 నాటౌట్; 2 వికెట్లు) ఆల్‌రౌండ్ మెరుపులతో భవాన్స్ స్కూల్‌ను గెలిపించాడు. మల్క కొమరయ్య (ఎంకే) క్రికెట్ టోర్నమెంట్ అండర్-13 విభాగంలో భవాన్స్ స్కూల్ (సైనిక్‌పురి) 9 వికెట్ల తేడాతో ఆర్మీ పబ్లిక్ స్కూల్ (సైనిక్‌పురి)పై విజయం సాధించింది. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో శనివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్మీ పబ్లిక్ స్కూల్ నిర్ణీత 12 ఓవర్లలో 5 వికెట్లకు 93 పరుగులు చేసింది. అమన్ (59) అర్ధసెంచరీ సాధించగా, అశ్మిత్ 14 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భవాన్స్ స్కూల్ 9.1 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 95 పరుగులు చేసి గెలిచింది. అశ్మిత్ ధాటిగా ఆడగా, జయవర్ధన్ 20 బంతుల్లో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అశ్మిత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (మల్కాజిగిరి): 102/3 (అనిరుధ్ 30); పల్లవి మోడల్ స్కూల్ (బోయిన్పల్లి): 49/7 (తరుణ్ 2/13) అండర్-15 విభాగం సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్: 65/2 (శ్రవణ్ 34, అఖిల్ 19); గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్: 66/2 (విష్ణు 26, అంకిత్ 22) నీలకంఠ విద్యాపీఠ్: 94/5 (తిలక్ రెడ్డి 23; యతిన్ 5/6); ఓక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్: 26 (చేతన్ శర్మ 3/15)