భవాన్స్‌ను గెలిపించిన అశ్మిత్ | ashmit make win to Bhavans | Sakshi
Sakshi News home page

భవాన్స్‌ను గెలిపించిన అశ్మిత్

Published Sun, Jul 13 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

భవాన్స్‌ను గెలిపించిన అశ్మిత్

భవాన్స్‌ను గెలిపించిన అశ్మిత్

ఎంకే క్రికెట్ టోర్నీ
 సాక్షి, హైదరాబాద్: బాతుల అశ్మిత్ (18 బంతుల్లో 39 నాటౌట్; 2 వికెట్లు) ఆల్‌రౌండ్ మెరుపులతో భవాన్స్ స్కూల్‌ను గెలిపించాడు. మల్క కొమరయ్య (ఎంకే) క్రికెట్ టోర్నమెంట్ అండర్-13 విభాగంలో భవాన్స్ స్కూల్ (సైనిక్‌పురి) 9 వికెట్ల తేడాతో ఆర్మీ పబ్లిక్ స్కూల్ (సైనిక్‌పురి)పై విజయం సాధించింది.
 
 నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్మీ పబ్లిక్ స్కూల్ నిర్ణీత 12 ఓవర్లలో 5 వికెట్లకు 93 పరుగులు చేసింది. అమన్ (59) అర్ధసెంచరీ సాధించగా, అశ్మిత్ 14 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భవాన్స్ స్కూల్ 9.1 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 95 పరుగులు చేసి గెలిచింది. అశ్మిత్ ధాటిగా ఆడగా, జయవర్ధన్ 20 బంతుల్లో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అశ్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (మల్కాజిగిరి): 102/3 (అనిరుధ్ 30); పల్లవి మోడల్ స్కూల్ (బోయిన్‌పల్లి): 49/7 (తరుణ్ 2/13)
 
 అండర్-15 విభాగం
 సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్: 65/2 (శ్రవణ్ 34, అఖిల్ 19); గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్: 66/2 (విష్ణు 26, అంకిత్ 22)
 
 నీలకంఠ విద్యాపీఠ్: 94/5 (తిలక్ రెడ్డి 23; యతిన్ 5/6); ఓక్‌వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్: 26 (చేతన్ శర్మ 3/15)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement