Bhavans school
-
భవాన్స్‌ను గెలిపించిన అశ్మిత్
ఎంకే క్రికెట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: బాతుల అశ్మిత్ (18 బంతుల్లో 39 నాటౌట్; 2 వికెట్లు) ఆల్‌రౌండ్ మెరుపులతో భవాన్స్ స్కూల్‌ను గెలిపించాడు. మల్క కొమరయ్య (ఎంకే) క్రికెట్ టోర్నమెంట్ అండర్-13 విభాగంలో భవాన్స్ స్కూల్ (సైనిక్‌పురి) 9 వికెట్ల తేడాతో ఆర్మీ పబ్లిక్ స్కూల్ (సైనిక్‌పురి)పై విజయం సాధించింది. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో శనివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్మీ పబ్లిక్ స్కూల్ నిర్ణీత 12 ఓవర్లలో 5 వికెట్లకు 93 పరుగులు చేసింది. అమన్ (59) అర్ధసెంచరీ సాధించగా, అశ్మిత్ 14 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భవాన్స్ స్కూల్ 9.1 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 95 పరుగులు చేసి గెలిచింది. అశ్మిత్ ధాటిగా ఆడగా, జయవర్ధన్ 20 బంతుల్లో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అశ్మిత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (మల్కాజిగిరి): 102/3 (అనిరుధ్ 30); పల్లవి మోడల్ స్కూల్ (బోయిన్పల్లి): 49/7 (తరుణ్ 2/13) అండర్-15 విభాగం సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్: 65/2 (శ్రవణ్ 34, అఖిల్ 19); గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్: 66/2 (విష్ణు 26, అంకిత్ 22) నీలకంఠ విద్యాపీఠ్: 94/5 (తిలక్ రెడ్డి 23; యతిన్ 5/6); ఓక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్: 26 (చేతన్ శర్మ 3/15) -
ఫైనల్లో భవాన్స్, సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్
సెయింట్ పాల్స్ ఇంటర్ స్కూల్ టీటీ టోర్నీ ఎల్బీ స్టేడియం: సెయింట్ పాల్స్ స్టాగ్ ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ బాలికల విభాగంలో భవాన్స్ స్కూల్(ఏ), సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. హైదర్‌గూడలోని సెయింట్ హైస్కూల్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన బాలికల స్కూల్ టీమ్ చాంపియన్‌షిప్ విభాగంలో తొలి సెమీఫైనల్లో భవాన్స్ స్కూల్(ఏ) జట్టు 3-0 స్కోరుతో గీతాంజలి స్కూల్ జట్టుపై విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్ జట్టు 3-0తో రోజారీ కాన్వెంట్ స్కూల్ (ఏ)పై గెలిచింది. అంతకు ముందు జరిగిన ఈ పోటీల ప్రారంభ వేడుకలకు బ్రదర్ ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంఘం అడ్హాక్ కమిటీ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి, టెక్నికల్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సెయింట్ పాల్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ సుధాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇబ్రహీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
విజేత ఆర్మీ పబ్లిక్ స్కూల్
నేరేడ్మెట్, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో రామకృష్ణాపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ విజేతగా నిలిచింది. సైనిక్‌పురిలోని భవాన్స్ శ్రీరామ కృష్ణా విద్యాలయంలో శనివారం జరిగిన ఫైనల్లో 2-1 స్కోరుతో భవాన్స్ స్కూల్‌పై నెగ్గింది. భారత జట్టు స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ముఖ్య అతిథిగా హాజరై విజేతకు మెమెంటోను అందించాడు. తాను ఇదే పాఠశాలలో చదువుకున్నానని, చదువుతో పాటు క్రీడలకు కూడా పాఠశాల యాజమాన్యం అధిక ప్రాధాన్యమివ్వడం వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్టు ఓజా చెప్పాడు.