కూతురి నిశ్చితార్థంపై రష్మిక తల్లి ప్రకటన | Rashmika Mandanna Engagement Called Off | Sakshi
Sakshi News home page

Sep 11 2018 8:37 PM | Updated on Sep 11 2018 8:46 PM

Rashmika Mandanna Engagement Called Off - Sakshi

‘మా కూతురికిప్పుడు సినిమాల్లో టైమ్‌ బాగుంది. పలు అవకాశాలు వస్తున్నాయి. కన్నడం, తెలుగు భాషల్లో రష్మిక తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి సారించాలని నిర్ణయించుకుంద’ని రష్మిక తల్లిదండ్రులు పేర్కొన్నారు.

తమిళసినిమా: సంచలన నటి నయనతార ప్రేమ కథలాంటిదే తాజాగా శాండిల్‌వుడ్‌లో జరిగింది. సినిమా వాళ్ల ప్రేమలు చాలా వరకూ పెళ్లి అనే తీరానికి సవ్యంగా చేరడం లేదని చెప్పవచ్చు. ప్రేమలు, బ్రేకప్‌లు ఇక్కడ సర్వసాధారణం అయిపోయాయి. చాలా కాలం క్రితం నటి నయనతార ప్రభుదేవాల ప్రేమపెళ్లి అంచుల వరకూ వచ్చి ఆగిపోయింది. తాజాగా శాండిల్‌వుడ్‌ భామ రష్మిక మందన్న ప్రేమ నిశ్చితార్థం వరకు వచ్చి నిలిచిపోయింది. రష్మిక గురించి చెప్పాలంటే కన్నడ, తెలుగు భాషల్లో కథానాయకిగా ఎదుగుతున్న నటి. మాతృభాష కన్నడం అయినా తెలుగులో ప్రస్తుతం ఈ అమ్మడికి లక్కు బాగుంది. విజయ్‌దేవరకొండతో నటించిన గీతగోవిందం చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడంతో ఈ బ్యూటీ పేరు అక్కడ మారుమోగుతోంది. కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టితో ఇంతకు ముందు వరకు ప్రేమలో మునిగితేలింది. అక్కడ ఈ జంట ఒక చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలూ పచ్చజెండా ఊపడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. రష్మిక, రక్షిత్‌శెట్టి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక పెళ్లే తరువాయి అన్న తరుణంలో మనస్పర్థలు అనే మహమ్మారి తలపైకొచ్చి కూర్చుంది. అంతే నటి రష్మిక తనకు కాబోయే వరుడితో పెళ్లిని బ్రేకప్‌ చేసుకుంది. ఇది జరిగి కొద్ది రోజులైంది. అప్పుడు వీరి బ్రేకప్‌ వార్తను ఇద్దరూ ఖండించారు.

అయితే అది వదంతి కాదని, నిజం అని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని నటి రష్మిక మిత్ర బృందం స్పష్టం చేశారు. ‘అవును రష్మిక బరువెక్కిన గుండెతోనే తన ప్రేమకు బ్రేకప్‌ చెప్పింది. వివాహనిశ్చితార్థం జరిగిన తరువాత నటుడు రక్షిత్, రష్మికల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో రష్మిక తన వివాహాన్ని రద్దు చేసుకుంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో చర్చించిన తరువాతే రష్మిక ఇలాంటి కఠినమై నిర్ణయాన్ని తీసుకుంద’ని ఆమె మిత్రబృందం పేర్కొన్నారు. ఆమె తల్లి సుమన్‌ మందన్న కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘మా కూతురికిప్పుడు సినిమాల్లో టైమ్‌ బాగుంది. పలు అవకాశాలు వస్తున్నాయి. కన్నడం, తెలుగు భాషల్లో రష్మిక తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి సారించాలని నిర్ణయించుకుంద’ని రష్మిక తల్లిదండ్రులు పేర్కొన్నారు.

ఈ బ్యూటీ తెలుగులో నటించిన గీత గోవిందం సంచలన విజయాన్ని సాధించడంతో యమ క్రేజ్‌ వచ్చేసింది. ప్రస్తుతం నాగార్జున, నానిలతో కలిసి నటించిన దేవదాసు చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంపై రష్మిక చాలా ఆశలే పెట్టుకుంది. అదే విధంగా విజయ్‌దేవరకొండతో మరోసారి డియర్‌ కామ్రేడ్‌ అనే చిత్రంలో రొమాన్స్‌ చేస్తోంది. ఇక మాతృభాషలోనూ రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ రెండు భాషల్లోనూ నటిగా రాణించాలని ఈ అమ్మడు కలలు కంటోందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement