తండ్రి చేతిలో తనయుడు హతం | Father kills son | Sakshi
Sakshi News home page

తండ్రి చేతిలో తనయుడు హతం

Published Tue, Jun 14 2016 3:30 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

Father kills son

ఆలూరు (కర్నూలు) : ఆస్తి తగాదాల నేపథ్యంలో తండ్రి, కొడుకు మధ్య జరిగిన ఘర్షణ కొడుకు ప్రాణాన్ని బలి తీసుకుంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పెర్నెకల్లులో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మస్తాన్ సాబ్కు కొడుకు బడేషావలి(38)తో గొడవ జరిగింది. ఆవేశంలో మస్తాన్ సాబ్ కొడుకు తలపై కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బడేషావలి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement