ఉప్పల్: ఉప్పల్‌లో శుక్రవారం జరిగిన తండ్రి కొడుకుల దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థిరాస్థి విషయంలో కుటుంబ తగాదాలు, కోర్టు కేసులు, విచారణలు వెరిసి ఒకే కుటుంబంలో ఇద్దరి హత్యకు దారితీసిన విషయం విదితమే. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆస్థి తగాదాలతో పాటు మరేదైన కోణం ఉందా అనే విషయంలో సైతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అనుమానితుల విచారణ
కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. ఇప్పటికే దాదపుగా 40 మంది అనుమానితులను విచారించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీల ఆధారంగా, నిందితుల చాయ చిత్రాలతో అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ నంబర్లు, సెల్ టవర్లు లోకేషన్లతో కేసును చేధించే పనిలో నిమగ్నమయ్యారు.
పోలీసుల అదుపులో మరో నలుగురు
శనివారం మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం అనుమానితులైన కొందరిని అదుపులోకి విచారించిన సంగతి విదితమే. దుండగులు అదే గల్లీలో బాధితుల ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్‌లో ఉంటూ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణంలో వెల్లడైంది. హాస్టల్‌లోని సీసీ ఫుటేజీలతో పాటు డీవీఆర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
(చదవండి: తండ్రీ కొడుకుల దారుణ హత్య)
Comments
Please login to add a commentAdd a comment