ముగ్గురు నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన మాదాపూర్ ఏసీపీ
గచ్చిబౌలి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి మామ ఆస్తిపై కన్నేసి బావమరిదిని హత్య చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం గచ్చిబౌలి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ వెల్లడించారు. ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి పట్టణం జనతాపేటకు చెందిన మద్దసాని ప్రకాశం జ్యువెలరీ బిజినెస్ చేస్తుంటారు. ఆయనకు కుమారుడు యశ్వంత్, కూతురు అమూల్య ఉన్నారు.
కూతురు అమూల్యతో ఇదే జిల్లాలోని సత్యవోలు అగ్రహారం కొండాపురం మండలానికి చెందిన గోగుల శ్రీకాంత్ (34)తో 2017 ఆగస్టులో వివాహం జరిపించారు. శ్రీకాంత్ గచి్చ»ౌలి జయభేరి ఎన్‌క్లేవ్‌లో బాలాజీ మెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శ్రీకాంత్ బావమరిది యశ్వంత్ తన అక్కా, బావతోనే ఉండేవాడు. అయిదు నెలల క్రితం శ్రీకాంత్ భార్య అమూల్య డెలివరీ కోసం తల్లిగారింటికి వెళ్లింది. అప్పటినుంచి యశ్వంత్ గచి్చ»ౌలిలో బావకు చెందిన హాస్టల్‌లోనే ఉంటున్నాడు.
నమ్మించి.. దహన సంస్కరాలు చేయించి..
ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో శ్రీకాంత్ మామ ప్రకాశంకు ఫోన్ చేసి యశ్వంత్ ఉరి వేసుకున్నాడని ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తారని, హాస్టల్ సీజ్ చేస్తారని నమ్మించి యశ్వంత్ మృతదేహాన్ని కారులో తీసుకొని బయలుదేరాడు. ఏపీలోని వాడపల్లి సరిహద్దు వరకు అంబులెన్స్ తెప్పించుకొని మృతదేహన్ని అందులోకి మార్చి కావలికి వెళ్లాడు. కాగా.. ఆచారం ప్రకారం యశ్వంత్ మృతదేహాన్ని పూడ్చి వేయాలి. కానీ అలా చేస్తే జ్ఞాపకాలు ఉంటాయని, దహనం చేస్తే అలా జరగదని మామ ప్రకాశంను నమ్మించాడు. 3వ తేదీన దహన సంస్కారాలు చేయించాడు. ఆత్మహత్య చేసుకుంటే కేసు ఎందుకు నమోదు చేయలేదని బంధువులు పోలీసుల వద్ద అనుమానాలు లేవనెత్తారు.
తన భర్త శ్రీకాంత్ ప్రవర్తనపై అనుమానం ఉందని అమూల్య తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ప్రకాశం తన స్నేహితులతో కలిసి నగరంలోని గచి్చబౌలి లోని హాస్టల్‌కు వచ్చి యశ్వంత్ గదిని పరిశీలించాడు. అనంతరం హాస్టల్‌లో సీసీ కెమెరాలు పని చేయడం లేదని తెలుసుకున్నాడు. ఎదురుగా ఉన్న ఓ షాపులోనూ సీసీ ఫుటేజీని శ్రీకాంత్ డిలీట్ చేసినట్లు గుర్తించాడు. తన అనుమానాలకు బలం చేకూరడంతో 10న రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజీల ఆధారంగా మృతదేహం తరలించిన వారిని గుర్తించి విచారించగా హత్య విషయం వెలుగు చూసింది.
పక్కా వ్యూహంతోనే..
ఆన్‌లైన్‌లో కాక్ ఫైట్ చేసిన శ్రీకాంత్ దాదాపు రూ.4 కోట్లు నష్టపోయాడు. భారీగా అప్పులు చేయడంతో అతనిపై ఒత్తిడి పెరిగింది. దీంతో బావ మరిదిని హతమార్చితే మామ ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని పక్కా స్కెచ్ వేశాడు. బావమరిది యశ్వంత్‌ను హత్య చేయాలని ఆగస్టు 29న కుక్‌గా పని చేసే కర్ణాటకకు చెందిన పి.ఆనంద్ (35)కు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చాడు. ఆనంద్ ఏపీలోని కడప జిల్లా కాస్లపాడుకు చెందిన అంబటి వెంకటేష్ సహాయం కోరాడు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్టల్ గదిలో నిద్రిస్తున్న యశ్వంత్ మెడకు చున్నీ బిగించి హత్య చేశారు.
నిందితులు శ్రీకాంత్, ఆనంద్, వెంకటేషిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.90 వేల నగదు, 4 సెల్‌ఫోన్లు, బ్రీజా కారు, స్కూటీని స్వా«దీనం చేసుకున్నారు. సమావేశంలో గచ్చిబౌలిఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు, డీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్‌ఐ శోభన్ బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment