అక్కడి ఆనందాపూర్ పరిధిలో బడా వ్యాపారి హత్య
జూలైలో ఘాతుకానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులు
ఆపై నగరానికి వచ్చి చార్మినార్ ప్రాంతంలో ఆశ్రయం
కేసు దర్యాప్తులో గుర్తించినపశ్చిమ బెంగాల్ పోలీసులు
చార్జ్‌షిట్‌లో నగరానికి చెందిన ఎండీ షేక్ నౌషాద్ పేరు
అరెస్టు కోసం హైదరాబాద్ చేరుకున్న ప్రత్యేక బృందం
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో సంచలనం సృష్టించిన బడా వ్యాపారి ఆరిఫ్ ఖాన్ హత్య కేసు లింకులు నగరంలో వెలుగు చూశాయి. అతడిని హతమార్చిన నిందితులు నేరుగా సిటీకి వచ్చి చారి్మనార్ ప్రాంతంలో ఆశ్రయం పొందినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. ఈ కేసులో శుక్రవారం ఆనందాపూర్ కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రాల్లో ఈ విషయం పొందుపరిచారు. ఈ నేపథ్యంలోనే నిందితుల జాబితాలో నగరానికి చెందిన మహ్మద్ షేక్ నౌషాద్ పేరునూ చేర్చారు. అతడి కోసం గాలిస్తూ ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం...
మరో ఇద్దరు స్నేహితులతో కలిసి...
తాను ఎంతగా డిమాండ్ చేస్తున్నా, బెదిరిస్తున్నా ఆరిఫ్ ఖాన్ డబ్బులు ఇవ్వకపోవడాన్ని అబ్బాస్ జీర్ణించుకోలేకపోయారు. ఓ సందర్భంలో ఆరిఫ్ బహిరంగంగా తనను మందలించడంతో అబ్బాస్ కోపంతో రగిలిపోయాడు. ఒకప్పుడు తనతో పాటు చిన్న ఉద్యోగం చేసిన ఆరిఫ్ ఇప్పుడు బడా వ్యాపారిగా మారడంతో అప్పటికే ఈర‡్ష్యతో రగిలిపోతున్న అబ్బాస్ కోపానికి ఇది ఆజ్యం పోయినట్లయ్యింది. ఆరిఫ్‌ను వదిలేస్తే అతడి మాదిరిగానే మరికొందరు వ్యాపారులూ హఫ్తా ఇవ్వడం మానేస్తారని, ఆ ప్రాంతంలో తన ఆ«ధిపత్యం దెబ్బతింటుందని అబ్బాస్ భావించాడు. దీనికి ఆరిఫ్‌ను బహిరంగంగా, నడిరోడ్డుపై హత్య చేయడమే పరిష్కారమని నిర్ణయించుకున్నాడు. దీనికోసం తన స్నేహితులైన మహ్మద్ జహీర్ ఖాన్, అమీర్‌బకర్‌లతో కలిసి రంగంలోకి దిగాడు.
హత్య తర్వాత నగరానికి వచి్చ...
ఆరిఫ్‌ను హత్య చేయడం కోసం దాదాపు రెండు నెలల పాటు వేచి చూసిన ఈ త్రయం... ఈ ఏడాది జూలై 26న సాయంత్రం ఆనందాపూర్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆరిఫ్‌ను అడ్డగించిన వీరు ముగ్గురూ ఘర్షణకు దిగారు. ఆపై అతడిని వెంటాడి దారుణంగా హత్య చేశారు. హత్యానంతరం ముగ్గురిలో ఇద్దరు ముంబై పారిపోగా.. అబ్బాస్ మాత్రం చారి్మనార్ ప్రాంతంలో నివసించే తన సమీప బంధువు మహ్మద్ షేక్ నౌషాద్‌ను సంప్రదించాడు. హత్య విషయం అతడికి చెప్పి... తనకు ఆశ్రయం ఇవ్వాలని కోరారు. నౌషాద్ అంగీకరించడంతో సిటీకి వచి్చన అబ్బాస్ అతడి వద్ద ఆశ్రయం పొందాడు. హత్య జరిగిన మూడో రోజు నగరానికి వచి్చన కోల్‌కతా పోలీసులు అబ్బాస్‌ను, ముంబైలో మిగిలిన ఇద్దరినీ అరెస్టు చేసి తీసుకువెళ్లారు.
స్నేహితుడే పగబట్టి..
కోల్‌కతా శివారులోని పంచన్నగ్రామ్ ప్రాంతానికి చెందిన ఆరిఫ్ ఖాన్, మోయిన్ అబ్బాస్ స్నేహితులు. గతంలో ఇద్దరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికారు. ఇరు కుటుంబాల మధ్యా మంచి సంబంధాలు ఉండేవి. కొన్నేళ్ల క్రితం ఆరిఫ్ ఖాన్ రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ వ్యాపారం ప్రారంభించి కోల్‌కతాలోనే ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అబ్బాస్ మాత్రం ఆనందాపూర్ ప్రాంతంలో రౌడీగా మారి హఫ్తాలు వసూలు చేయడం మొదలెట్టాడు. ఇందులో భాగంగా తరచూ ఆరిఫ్ ఖాన్ నుంచి డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేసేవాడు. నగదు ఇచ్చే ప్రతి సందర్భంలోనూ ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా అబ్బాస్‌కు ఆరిఫ్ ఖాన్ హితబోధ చేస్తూ వచ్చాడు. ఇతడి ప్రవర్తనతో విసిగిపోయిన అబ్బాస్ డబ్బులు ఇవ్వడం మానేశాడు.
అభియోగపత్రాల్లో నౌషాద్ పేరు...
అప్పట్లో కోల్‌కతా పోలీసులు నౌషాద్‌ను అరెస్టు చేయలేదు. హత్య విషయం తెలియకపోవడతంతో అబ్బాస్‌కు ఆశ్రయం ఇచ్చి ఉంటాడని భావించారు. అయితే అబ్బాస్‌ను కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించగా అన్నీ తెలిసే నౌషాద్ ఇతడికి ఆశ్రయం ఇచి్చనట్లు వెలుగులోకి వచి్చంది. దీంతో అక్కడి కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రాల్లో నౌషాద్‌ను నాలుగో నిందితుడిగా చేర్చారు. 100 పేజీల ఈ చార్జ్ïÙట్‌లో 48 మందిని సాక్షులుగానూ చేర్చారు. నౌషాద్‌ను అరెస్టు చేయడానికి ఓ ప్రత్యేక బృందం ఆదివారం నగరానికి చేరుకుంది. అతడి ఆచూకీ లేకపోవడంతో ముమ్మరంగా గాలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment