ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో భయంకరమైన ఘటన జరిగింది. తేజస్(21) అలియాస్ సిద్దూను అనే యువకుడిని కొంత మంది యువకులు అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. చంపడమే కాకుండా ఆ ఘటనను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం కలకలం రేపింది.
బాచుపల్లి పోలీసు స్టేషన్‌లో పరిధిలోని ప్రగతి నగర్‌లో తేజస్ అద్దె ఇంట్లో తన తల్లితో కలిసి ఉంటున్నాడు. తన తల్లి ఊరు వెళ్లటంతో.. ఆదివారం రాత్రి తేజస్ తన మిత్రులైన మహేశ్, శివస్ప, సమీర్‌లతో కసిలి మద్యం తాగాడు. సోమవారం తెల్లవారుజూమున ప్రగతి నగర్‌లోని బతుకమ్మ ఘాట్ వద్ద ఉన్న తేజస్‌ను గతంలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు బైక్‌లపై వచ్చి దారుణంగా పొడిడి చంపారు. హత్య చేసిన తర్వాత యువకులు రీల్ చేసి ఇస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రతీకారంగానే తాము హత్య చేసినట్లు ఆ పోస్టులో వాళ్లు పేర్కొన్నారు.
ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గత ఏడాది తరుణ్ అనే వ్యక్తి హత్య కేసులో సిద్దూ ఏ3గా ఉన్నట్లు తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో.. ఆ హత్యకు ప్రతీకారంగానే తేజస్‌ను హతమార్చినట్లు స్పష్టత వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment