వైరల్‌ వీడియో: అందరూ చూస్తుండగానే రోడ్డుపై కర్రలతో హల్‌చల్‌ | Viral Video: Family Attacks Relatives With Sticks Over Property Dispute in Delhi | Sakshi
Sakshi News home page

Viral Video: అందరూ చూస్తుండగా రోడ్డుపై కర్రలతో హల్‌చల్‌

Published Sat, Feb 12 2022 9:09 PM | Last Updated on Sat, Feb 12 2022 9:58 PM

Viral Video: Family Attacks Relatives With Sticks Over Property Dispute in Delhi - Sakshi

న్యూఢిల్లీ: జనమంతా చూస్తుండగా రోడ్డు మీద కొంతమంది వ్యక్తులు బంధువులపై కర్రలతో దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆస్తి పంపకాల విషయంలో రెండు కుటుంబాల మధ్య ఈ కొట్లాట జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఆస్తి వివాదంపై కొంతమంది వ్యక్తులు తమ బంధువులపై కర్రలు, క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేశారు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. పట్టపగలు నడిరోడుపై కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అల్లర్ల నుంచి పరిస్థితిని నియంత్రించి. గాయపడిన వారిని స్థానికి ఆసుపత్రికి తరలించారు. దాడులకు పాల్పడిన నలుగురిని జగత్ (62), హరేందర్ (41), సుమిత్ (29), అమిత్ (24)గా గుర్తించారు. పోలీసులు ఇప్పటి వరకు జగత్‌ను మాత్రమే అరెస్టు చేశారు. అయితే శ్యామ్, జగత్, అతని పిల్లలకు మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. శ్యామ్‌, అతని బంధువులపై జగత్‌ తన కొడుకులు దాడి చేశారని పేర్కొన్నారు. ఇరు కుటుంబాలు ఈ ప్రాంతంలో గతంలో కూడా కొట్టుకున్నాయని, వారిపై పాత కేసులు కూడా ఉన్నాయని డీసీపీ సంజయ్‌ తెలిపారు. 
చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్‌.. ఎలాగో తెలుసా!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement