ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు | Man kills elder brother over Property dispute | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు

Published Thu, May 28 2015 6:42 PM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM

Man kills elder brother over Property dispute

హైదరాబాద్ : ఆస్తి తగాదాలతో సొంత తమ్ముడే అన్నను నరికి చంపిన సంఘటన హైదరాబాద్ షాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కాల్వగూడలో పెయింటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఎం.దాసు శంకర్(35)కు ఆస్తి విషయంలో తమ్ముడు అనిల్తో బేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ క్రమంలో  కోపోద్రిక్తుడైన అనిల్ అన్నను దారుణంగా హత్య చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement