
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: ఇంట్లో అదృశ్యమైన ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. వివరాలు..మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసముండే 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక వైష్ణవి తప్పిపోయింది. ఎక్కడ వెతికినా జాడ లేకపోవడంతో తల్లిదండ్రులు నిన్న(ఆదివారం) స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలికను అపహరించిన దుండగులు హత్య చేసి సమీపంలోని చర్చి ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment